జీవాయుధాల ప్రయోగం ప్రమాదం ఈనాటిది కాదు

0
5

[box type=’note’ fontsize=’16’] జీవాయుధాల ప్రయోగం జరిగితే సంభవించగల దుష్పరిణామాలు గురించి వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో. [/box]

[dropcap]గ[/dropcap]ల్ఫ్ యుద్ధంలో పాల్గొన్న దాదాపు 7 లక్షల మంది సైనికులు తరువాతి కాలంలో నిద్రలేమి, జ్ఞాపకశక్తి తగ్గడం, అలసట వంటి కారణాలతో బాధ పడ్డారు. ‘గల్ఫ్ వార్ సిండ్రోమ్’గా వ్యవహరించబడిన ఆ రుగ్మతకు కారణం యుద్ధంలో ఇరాక్ రసాయనిక ఆయుధాలను ప్రయోగించడమేనని చాలా కాలం వరకు నమ్మడం జరిగింది. యుద్ధంలో ఇరాక్ ‘నెర్వ్ గ్యాస్’ను ప్రయోగించగలదన్న అనుమానంతో దానికి ఏంటిడోట్‌గా ‘పెరిడోస్టిగ్మెన్ బ్రోమైడ్’ను సైనికులకు యుద్ధభూమిలోకి వెళ్ళకముందే ఇచ్చినట్టు, అది కూడా సమస్యకు కారణం కావచ్చని పరిశోధనలలో తేలింది.

అయితే ఇరాక్ కుర్దులపై రసాయనిక ఆయుధాలను ప్రయోగించి వాటి ప్రభావాన్ని నిర్ధారించుకొన్నదని గల్ఫ్ వార్‍లో వాటిని ప్రయోగించిందనీ ఆరోపణలున్నాయి. అప్పట్లో వినియోగిస్తే బీభత్సం సృష్టించగల ‘ఆంత్రాక్స్’ బ్యాక్టీరియాను స్కడ్ క్షిపణుల వార్ హెడ్స్‌లో లోడ్ చేసి ఉంచినట్లు అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌పై సమితి ఆరోపణలున్నాయి. ఇరాక్‍పై అమెరికా సైతం ప్రయోగించిందనీ ఆరోపణలు ఉన్నాయి.

1942 ఆగస్టులో జపాన్ విమానం ఒకటి ఘుజియాంగ్‍లోని పొలాలపై చాలా తక్కువ ఎత్తులో తిరుగుతూ ఒక రకం పొగను వదిలి పెట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పినప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. 15 రోజుల తిరక్కుండా అక్కడ ఎలుకల మూకుమ్మడి మరణాలు, తరువాత, మానవ మరణాలు కొనసాగాయి. మధ్య యుగాలలో యూరప్‌ను వణికించిన బుబోనిక్ ప్లేగే ఆ మరణాలకు కారణం అని గుర్తించే లోపునే స్థానికులలో పాతిక శాతం ప్రజలు బలైపోయారు. రెండు నెలల బాటు అక్కడ ప్లేగు తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. నవంబరులో రోజుకు 20 మంది తక్కువ కాకుండా బలి తీసుకుంది. నవంబరు నెలాఖరులో జపాను సైన్యాలు వచ్చి ప్లేగు సోకిన వారి ఇండ్లను తగులబెట్టడం మొదలుపెట్టాయి.

జీవాయుధాల పోరాటానికి చైనాలోని షాంగ్‌షాన్, మరి కొన్ని గ్రామాలే కేంద్ర బిందువులని చరిత్ర చెప్తోంది.

1930 నుంచి 40 వరకు మంచూరియాలో పలు రసాయనాలు ప్రాణాంతకమైన బ్యాక్టీరియా తయాదు చేయబడ్డాయి. ఆ వ్యవస్థల నిర్మూలనా తరువాతి కాలంలో పెద్ద సమస్యగా మారింది. 1996 డిసెంబరులో రెండవ ప్రపంచయుద్ధం తరువాత వదిలి వేయబడిన జీవ, రసాయనిక ఆయుధ వ్యవస్థలను, అవశేషాలను సంస్కరించడానికై ఒక కార్యక్రమాన్ని చేపట్టడానికి చైనా, జపాన్‌లు ఒక అవగాహనకు వచ్చాయి.

ప్రమాదకర పరిస్థితులలో ఉన్న సుమారు 2 లక్షల బాంబులను హాని లేకుండా నిర్మూలించ వలసిన బాధ్యత జపానే వహించవలసి ఉంటుందని అప్పట్లో చైనా ఖరాఖండిగా చెప్పింది.

జీవాయుధాల పోరాటాన్ని నివారించడానికి పూనుకున్న దేశాల ప్రతినిధులతో కూడిన కార్యనిర్వాహక వర్గం తనిఖీ విధానాలు, పరిశీలనకు సంబంధించి కొన్ని నిర్దుష్టమైన సూచనలు చేసింది.

అమెరికా 1969లోనే తన జీవాయుధాల తయారీని నిలిపివేసింది. కొత్త కార్యక్రమాలను రద్దు చేసింది. అయినప్పటికీ రష్యా శక్తి సామర్థ్యాల దృష్ట్యా తన శక్తి సామర్థ్యాలను పెంచుకోవడంలో అనౌచిత్యం ఏమీ లేదని లియోనార్డ్ కోల్ వంటి రాజనీతిజ్ఞులు అప్పట్లో అభిప్రాయపడ్డారు. అమెరికా వెలువరించిన యుద్ధ నేరస్థుల జాబితా జపాన్‍కు మినహాయింపు లభించడమూ అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఆరోపణలు, అనుమానాలలో నిజానిజాల సంగతి ఎలా ఉన్నా, ప్రమాదం పొంచి ఉందన్న సంగతి మాత్రం అసత్యం కాదు. ఒక తెగ, లేదా జాతి వారిని మాత్రమే తుడిచిపెట్టగల పరిజ్ఞానం అందుబాటులో ఉంటే మనిషి పైశాచికత్వానికి హద్దులే ఉండవు. అణ్వస్తాల కంటే ఖర్చు తక్కువ, శ్రమ తక్కువతో రూపొందించబడగల జీవాయుధాలు ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద సవాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here