కైంకర్యము-46

0
6

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[తలుపు తీసిన రాఘవకి ఎదురుగా కంపెనీ సెక్యూరిటీ అతను కనపడతాడు. ఎం.డి. గారు అర్జెంటుగా రమ్మంటున్నారని కబురందిస్తాడు. రాఘవ తయారై ఎం.డి. వద్దకు వెళ్తాడు. ఆయన గదిలో అప్పటికే కొందరు కార్మికులు ఉంటారు. రాఘవ లెడ్జర్‍లో పది లక్షల రూపాయలు తక్కువయ్యాయనీ, ఇలా ప్రతీ నెలా జరుగుతోందని ఎం.డి. అంటాడు. ఆఫీసు డబ్బు రాఘవ వాడుకుంటున్నాడనీ ఆరోపిస్తూ ఉద్యోగంలోంచి తొలగిస్తాడు. పోలీసు కేసు పెడతాడు. పోలీస్ స్టేషన్ నుంచి రాఘవ రామచంద్రకు ఫోన్ చేసి జరిగినది వివరిస్తాడు. రామచంద్ర సుదర్శనాచారి వద్దకు వెళ్ళి, ఒక బెయిల్ కావాలని, ఆయన వస్తే న్యాయమూర్తి త్వరగా స్పందిస్తారనీ అంటాడు. ఎవరికి బెయిల్ అని సుదర్శనాచారి అడిగితే, తన తమ్ముడికి అని చెబుతాడు. కారులో ఉండగా రామచంద్ర సుదర్శనాచారికి అసలు సంగతి వెల్లడిస్తాడు. న్యాయమూర్తి వద్ద బెయిల్ కాయితాలు తీసుకుని పోలీస్ స్టేషన్‌కి వస్తారిద్దరూ. అక్కడ్నించి రాఘవని తీసుకుని నాచారం బయలుదేరుతారు. – ఇక చదవండి.]

[dropcap]కొం[/dropcap]త మౌనం తరువాత సుదర్శనాచారి “ఇప్పుడు చెప్పు! అసలేమయ్యింది?” అడిగాడు కొడుకును.

కారులో ఆయనా, రాఘవా, రామచంద్రా నే ఉన్నారు.

రాఘవ ఆఫీసులో అవుతున్న భాగోతం మొత్తం చెప్పుకొచ్చాడు.

అంతా విన్న తరువాత “సరే! ముందు అది నీవు చెయ్యలేదని మనం నిరూపించాలి. నీ జాబ్ పోతుంది ఎలాగో. మేనేజ్మెంట్‌తో సెటిల్మెంటు చేసుకుందాం. మనం వాళ్ళ మీద డిఫర్మేషన్ కేసు కూడ వెయ్యలేము. ఎందుకంటే అది తప్పు అని ముందు ఫ్రూవ్ చెయ్యాలి. నీ మాటల బట్టి అది ఆర్గ్యుమెంట్‌లో తప్ప తెలియదు. పైగా నీకున్న బ్యాక్‌గ్రౌండ్, సర్కమ్స్టాన్స్, ఎవిడెన్స్ చూపుతారు. నీవు నీ ఫ్రెండ్స్‌ను కలుస్తున్నావని నాకు తెలుసు. అమాయకురాలు నీ భార్యకు తెలియకపోవచ్చు. కాబట్టి వాళ్ళ లాయరు నాకు తెలుసు దీని సెటిల్మెంటు చుద్దాం. ఇంట్లో ఏం చెబుతావు?” అన్నాడు.

రాఘవ ఏమీ మాట్లాడలేదు.

“అమ్మకు నేను చెబుతాను. వాడు ఇక జాబ్ చెయ్యడు. ఇంట్లో ఉంటాడని. నీవు మాత్రం ఆ అమ్మాయితో నిజాయితీగా ఉండు.” అంటూ “రామచంద్రా ఈ కేసు నీవే చూడు. ముందుకెళ్ళే కొద్ది ఇందులో ఉన్న దొంగలు బయటపడకపోరు!!” అన్నాడు.

రామచంద్ర “సరే సార్!” అన్నాడు.

ఇల్లు చేరాక రాఘవ మౌనంగా పైకి వెళ్ళిపోయాడు.

సుదర్శనాచారి ఆండాళ్లుతో “త్వరగా సాపాటు పెట్టు. చాలా ఆకలిగా ఉంది…” అంటు హడావిడి చేసాడు.

“వాడెక్కడ కలిశాడు?” ఇద్దరు కలిసి రావటం చూసి ఆమె ఆశ్చర్యపోయింది.

“అవన్నీ తరువాత. ముందు సాపాటు చేస్తాము…”

ఇక మాట్లాడక ప్రసన్నలక్ష్మిని పిలిచింది.

ఆమె వీళ్ళు రావటం చూసి వడివడిగా వచ్చేసింది.

మౌనంగా భోజనాల తరువాత సుదర్శనాచారి పడకగదిలోకి వెళ్ళాడు. ఆయనకు అలసటగా అనిపించింది. రాఘవ మనఃపరిస్థితిని బేజారు వేస్తూ విశ్రమించాడు.

***

మరుసటి రోజు పేపర్లలో మూడో పేజీలో ఈ వార్త వచ్చింది. రాఘవ పెద్ద అన్నకు తెలిసి అతను కంగారుగా తండ్రికి ఫోన్ చేశాడు.

“ఎవరికి తెలిసిన అమ్మకు మాత్రం తెలియకూడదు…” గట్టిగా చెప్పాడు సుదర్శనాచారి.

అతను ప్రసన్నలక్ష్మికి పూర్తిగా నిజం చేప్పేశాడు.

ఆమె కళ్ళ నీటి పర్యంతరమైయింది.

“మీరు ఇప్పటికన్నా నిజం చెప్పారు. మనకు పెరుమాళ్ళు ఉన్నాడు. భయంలేదు…” అని ధైర్యం చెప్పుకుంది.

ప్రమోషన్ ఇవ్వనందుకు ఉద్యోగం మానేశాడు అని ఆండాళ్లుకు చెప్పాడు సుదర్శనాచారి.

ఆండాళ్లు సంతోషపడింది కొడుకు కళ్ళ ముందు ఉంటాడని.

ఆ కేసు గురించి పదిహేను రోజులు తిరగాల్సి వచ్చింది రాఘవ.

ఈ లోగా అక్కడ అన్ని ఖాళీ చేయించేసారు.

కంపెనీకి డబ్బు కట్టి కేసు తీయించాడు సుదర్శనాచారి. అది రాఘవకు ఇష్టంలేదు. తను చెయ్యని పనికి ఎందుకు ఇలా చెయ్యాలని. కాని అలా చెయ్యటమే నయమని సముదాయించాడాయన

ఒకనెల రోజులలో రాఘవ సగమయ్యాడు.

ఆ తిరుగుళ్ళలో అలసటగా అనిపించించి. ‘ఏదీ ముట్టుకున్నను తరగని శని పట్టిందేమిటో’ అని మథన పడ్డాడు.

“ఇద్దరు ఎటైనా వెళ్ళి రండి పదిరోజులు…” సుదర్శనాచారి ఆ రోజు భోజనాల బల్ల దగ్గర కూర్చున్నప్పుడు సలహా ఇచ్చాడు.

‘అదే నయం’ అనుకున్నాడు రాఘవ

“బావకు దెబ్బ తగిలినప్పుడు శ్రీరంగం వెళ్ళాలనుకున్నా. అక్కడికి వెళ్ళిరామా మామయ్యా?” అంది ప్రసన్నలక్ష్మి.

“అదే నయం. చక్కగా దివ్యదేశాలు చూసి రండి…” అంది ఆండాళ్లు.

“నీవు కూడా రా అత్తయ్యా!”

“మీ ఇద్దరి మధ్య ఆవిడెందుకు? మీరెళ్ళి రండి…” ఆ సంభాషణ ఆపేస్తు అన్నాడు సుదర్శనాచారి.

ఇక ఎవ్వరు మాట్లాడలేదు.

“ఆ ఏర్పాట్లు చూడరా..” అంటూ ఆయన లేచి ఆఫీసు గది వైపు వెళ్ళిపోయాడు.

ద్రవిడ పాశురాలలో వర్ణించిన ఈ దివ్యక్షేత్రాలు చాలా వరకు తమిళనాడులో ఉన్నాయి. అవి కాక తమిళనాడు బయట  పది క్షేత్రాలు ఉండవచ్చు. అవి అహోబిలం – ముక్తినాథ్, నైమిశారణ్యం – మధుర – గోకుల్ –  దేవప్రయాగ – తిరుమల -బద్రీనాథ్ ఆలయం – రామజన్మభూమి –  ద్వారక.

పరమపథము, వైకుంఠం అన్న రెండు జీవుని మరణం తరువాత అని పాశురాలు చెబుతాయి.

శ్రీవైష్ణవంలో జీవుడు, దేవుడు రెండు వేరు వేరు. జీవుడు తన జీవితంలో వైష్ణవ సాంప్రదాయంలో జీవించి, మరణించిన తరువాత పరమాత్మలో ఐక్యమవటం లక్ష్యం.

అన్నింటికన్నా సర్వస్యశరణాగతి ఉత్తమమని వైష్ణవం చెబుతుంది.

శ్రీవైష్ణవులలో విష్ణువు ఒక్కడే దైవం. అందుకే ఏకో నారాయణః అన్న మాట మనం వింటూ ఉంటాం.

వైష్ణవుల ఆచారాల మీద మమకారం మంకు పట్టుగా పరిణమించి అది దురాచారంగా పరిణమించింది. బౌధ్ధ జైన మతాల ప్రాబల్యం పెరిగింది. వైష్ణవంలో ఒక మార్పు అవసరమైయింది. ఆ సమయంలో రామానుజులు ఉద్భవించి వైష్ణవ మతాన్ని ఉద్ధరించాడు. ఆయన విశిష్టాద్వైతం వలన వైష్ణవులలో కొంత మార్పును తేగలిగాడు. సమాజం హితువు కోసం నిజమైన ఆచార్యులు పాటుపడాలని ఉద్భోదించాడు. దేవుడిని పూజించటం, మోక్షాన్ని సాధించటం, మానవుడిగా జన్మించిన ప్రతి ఒక్కరి హక్కు. ఆ హక్కును ధిక్కరించే అధికారం ఎవ్వరికి లేదు. దేవుని దృష్టిలో అందరూ సమానమే. కుల మత తారతమ్యాలను పరిశీలించి అర్థం చేసుకోవటం మహత్యం. వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం.

మునుపు గురువులు చెప్పినదంతా నిజమేనని గుడ్డిగా నమ్మవలసిన అవసరం లేదు. వారు చెప్పినదాన్ని తర్కానికి గురిచేసి అది ఒప్పో, తప్పో నిర్ణయించుకోవటం పాపం కాదు. ఈ విషయంలో అధైర్యపడవలసిన పనిలేదు.

ఒక పనివల్ల పదిమందికి మేలు జరుగుతున్నప్పుడు, తమకు కీడు జరిగినా, పదిమందికి జరిగే మేలుకై, తమ కీడును లెక్కచేయవలసిన అవసరం లేదు. సమాజ శ్రేయస్సు ముఖ్యం కాని వ్యక్తిగత శ్రేయస్సు కాదని నిరూపించిన మహిమాన్వితుడు రామానుజులు.

ఆయన అడుగుజాడలే నేటి వైష్ణవులకు శిరోధార్యాలు.

వైష్ణవుల ముఖ్య దర్శనీయ ప్రదేశాలకు ప్రతి ఒక్క శ్రీవైష్ణవుడు వెళ్ళాలనుకుంటాడు. ఈ ప్రదేశాల గురించి వివరణ ద్రవిడ వేదంలో కనపడుతుంది.

రాఘవకు వీటి గురించి పెద్దగా నమ్మకం లేదు. పైగా ఆ విషయజ్ఞానం లేదు. కాని శ్రీరంగం వరకు వెళ్ళాలని అనుకున్నాడు.

అందుకని ఆ ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రసన్నలక్ష్మి, రాఘవ వివాహం అయిన నాలుగు సంవత్సరాలకు శ్రీరంగం బయలుదేరారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here