కైంకర్యము-7

0
11

[box type=’note’ fontsize=’16’] ఒక మామూలు మనిషి, ఒక ఆధ్యాత్మిక శక్తిగా ఎదిగే ప్రక్రియను ప్రదర్శించే ఆధ్యాత్మిక నవల సంధ్య యల్లాప్రగడ రచించిన కైంకర్యము. చదవండి. [/box]

[dropcap]దో[/dropcap]స్తులు చాలా సార్లు పిలిచారు, కంబైండ్ స్టడీస్‌కి రమ్మని.

కానీ రాఘవ మిత్రులతో కలసి ద్రాక్ష తోటకు వెళ్ళలేదు, పరీక్షలని తప్పించుకున్నాడు అప్పటికి. ఇంటరు పరీక్షలు అయ్యాయి. ఇక మిత్రులతో కలిసి తిరగాలని, జల్సా చెయ్యాలని అనుకున్నాడు.

కానీ పరీక్షల తరువాత, రెండు నెలలు ఉండి రమ్మని ఢిల్లీలోని అన్న ఇంటికి పంపాడు తండ్రి. నాలుగు చోట్లు తిరిగితే రాఘవకు ప్రపంచం తెలుస్తుందని ఆయన ఆలోచన.

చాలా తెలివైనవాడైనా, తిరుగుడు వల్ల రాఘవ ఇంటరు బొటాబొటీ మార్కులతో పాసైనందుకు ఇంజనీరింగులో సీటు రాలేదు. ఆ రోజులలో ప్రైవేటు కాలేజీలు లేవు. సుదర్శనాచారికి చాలా నిరాశ కలిగింది. రాఘవ మాత్రం మనస్సులో సంతోషించాడు.

ఆయన మిత్రులు ఆయనకు కొడుకును ‘లా’ చదివించి, తన ప్రాక్టీసు ఇవ్వవచ్చని సలహా ఇచ్చారు. ఆయనా అదే ఆలోచించుకొని, కొడుకును డిగ్రీ కాలేజీలో చేర్చాడు.

రాఘవ మిత్రబృందం దాదాపుగా అందరూ అందులోనే చేరారు. అది ఉస్మానియా క్యాంపసు దగ్గరగా ఉండే ఒక చిన్న కాలేజీ. అందులో పిల్లలకు చదువు కన్నా మిగిలిన విషయాలపై ఆపేక్ష అధికం. అల్లరిగా తిరిగే వయస్సు. ఆడపిల్లల కాలేజీ దగ్గర బీటు వెయ్యటము, వాళ్ళను ఏదో ఒక కామెంటు చెయ్యటము, వారి పనిగా ఉండేది. చిరుతిండ్లు, బీరు తాగటం, సిగరెట్లు పంచుకోవటం ఇదే పని.

రాఘవకు ఇవన్నీ నచ్చేవి కావు. కానీ మిత్రులతో తిరగటం మాత్రము మానలేకపోయేవాడు.

“ఈ గురువారం తోటకెడుతున్నాము…” చెప్పాడు స్వామి.

“ఎవరెవరురా?” అడిగాడు రాఘవ.

“మనోళ్ళేరా..”

“వస్తా కానీ రాత్రికుండనురా… ఇంట్ల మా నానమ్మ పట్టేస్తుంది…”

“అరె ఏందది..చిన్నపోరడివా…నానమ్మకు కూడా భయపడతారారా? ఇది వింటే మనోళ్ళు నిన్ను వదలరురా. చెప్పకెవ్వరికీ. ఏం కాదు పటు… పోదాంరా… వాళ్ళకు అలవాటైతది…” బలవంత పెట్టాడు స్వామి.

అలా డిగ్రీలో మళ్ళీ మిత్రులతో మందు, పేకాటకి వెళ్ళాడు. ఇంటికొచ్చాక పెద్దావిడ గుచ్చి గుచ్చి అడగటమే కాక… ఇదే అలవాటైతే పిల్లాడు చేజారిపోతాడని గొడవ పెట్టుకుంది. ఆవిడ గొడవకు సుదర్శనాచారి, ఆండాళ్ళు కూడా రాత్రులు ఎక్కడకు వెళ్ళవద్దని గొడవ చెయ్యటం, రాఘవకు మనశ్శాంతి లేకుండా పోయింది.

రాత్రుళ్ళు వచ్చేయ్యాలనుకున్నా… పీర్ ఫ్రెజరుతో రాలేక, ఇంట్లో ముసలమ్మను అవాయిడ్ చెయటం మొదలెట్టాడు రాఘవ.

అలా కుమారస్వామి తోట చుట్టూ నెలకొకసారి తిరుగుతూ, త్రాగుతూ కాలక్షేపము చేసేవారు.

డిగ్రీ మొత్తం ఇలాగే సాగిపోయింది. రాఘవ బాగా మందు, పేకాట మరిగాడు.

బాగా డబ్బున వారింట మాత్రమే ఫోను ఉండే రోజులవి. సుదర్శనాచార్యులు ఇంట్లో ఒకటి, ఆఫీసులో ఒకటి ఉన్నాయి.

పరీక్షా ఫలితాల రోజు, ఫ్రెండు ఫోనులో పిలిచాడు.

“రాఘవా, నా పరీక్ష తన్నింది. నీవు చూసుకున్నావా నీది?” అడిగాడు స్వామి.

“నాదీ పోయింది!”

“ఎందులో పోయిందో రేపు కాలేజీకి రా చూసుకుందాము…”

“ఇప్పుడే వద్దురా! వారం తరువాత వెడదాము…”

“ఇంట్లో వుంటే అమ్మ బేజ తింటది. కాలేజీరారా!”

“రేపు వద్దురా… వారం రోజులాగి పోదాము”.

“వారం ఎందుకురా?”

“ఇప్పుడే పోతే మా నాన్న ఫ్రెండ్సు ఉంటారు…మళ్ళీ క్లాసు.. వారం తరువాత అంతా కామ్. అందుకేలే…”

“సరే పటు”.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here