కాకి కథ

0
6

[box type=’note’ fontsize=’16’] ప్రకృతి కథలలో భాగంగా కాకుల గురించి, వాటిలోని రకాల గురించి విజ్ఞానం కలబోసి బాలలకు కథగా అందిస్తున్నారు డి. చాముండేశ్వరి. [/box]

వినాయక చవితి పండగ సందడితో ఊరంతా హడావుడిగా ఉంది. పిన్ని రమ్య పెళ్లి కోసం కొలకత్తా నుండి ఆర్యన్, ప్రకృతి పేరెంట్స్‌తో వచ్చారు. అమ్మమ్మ గారిల్లు పండగ ప్లస్ పెళ్లి ఏర్పాట్లతో మహా సందడిగా ఉంది. మామయ్యలు పిల్లలు తేజస్, మానస్, ఆవ్యాన్, అదితిలు కూడా వచ్చియున్నారు. అదితి యూకేలో ఉంటుంది. వీళ్ళే కాకుండా లోకల్‌గా ఉన్న బంధువుల పిల్లలు వీరికి ఎప్పటిలా జత అయ్యారు. పెద్ద పిల్లల గుంపు తయారయ్యింది.

పండగ రోజు పూజ, లంచ్ అయిన తరువాత పెద్దలు పెళ్లి పనులలో ఉంటే పిల్ల గుంపు వరండాలో చేరి ఏదో విషయంపై వాదులాడుకుంటూ, గోలగోలగా మాట్లాడుకుంటున్నారు. ఇంతలో వరండా ప్రక్క గదిలో విశ్రమించిన ముత్తవ్వ అదేనండి అమ్మమ్మకి పిన్ని కోపంగా బైటకి వచ్చి “పిల్లలూ ఏమిటా కాకి గోల? కాకి గుంపు. పడుకోనివ్వరా? పొండి! వేరే చోటికి వెళ్ళి ఆడుకోండి. లేదా నిద్రపోండి” అని విసుక్కున్నారు.

ఆవిడ అరుపులకి చిన్నబోయిన పిల్లల్లో మానస్ “అదికాదు ముత్తవ్వా?” అని ఏదో చెప్పబోయాడు.

“భడవా! నీ గోల ఎప్పుడూ ఎక్కువే. ఒరే! నరసింహ! యిటొచ్చి పిల్లల గుంపుని కదిలించు. వెధవ కాకి గోలతో చంపుతున్నారు. కాకి గోల! వెళ్ళండి వెళ్ళండి ! వెధవ కాకి గుంపు.”

నరసింహ తాత వచ్చి “పదండి పిల్లలు” అని మేడమీదకి తీసుకువెళ్లారు.

పిల్లలకి కాకి గోల అన్నమాట అర్థం కాలేదు. అదితి, ప్రకృతి అమ్మమ్మ దగ్గరకు పరుగెత్తారు. వారి వెనుకే మిగతా పిల్లలు వెళ్లారు.

“అమ్మమ్మ! వేర్ అర్ యూ? వాట్ అర్ యూ డూయింగ్?” అని గావుకేకలు పెట్టారు.

“అదితి! ప్రకృతి! ఏమయ్యింది?” అంటూ చేస్తున్న పని ఆపి వచ్చారు అమ్మమ్మ.

“అమ్మమ్మ మమ్మల్ని ముత్తవ్వ తిట్టారు.”

“అయ్యో! ఏమన్నారు?”

“వి డోంట్ నో. కాకి గోల, కాకి గుంపు అని ఏదో తిట్టారు” అంది ప్రకృతి

“అమ్మమ్మా ఐ థింక్ ఇట్స్ ఏ బాడ్ వర్డ్” అంది అదితి.

“నో నో నాట్ అట్ ఆల్!” అంది అమ్మమ్మ.

“ఐ వాంట్ టు నో అబౌట్ కాకి గోల! కాకి గుంపు! టెల్ అస్” అంది అదితి నడుం మీద చేతులుపెట్టుకుని.

అమ్మమ్మకి అర్థం అయ్యింది పిల్లలు హర్ట్ అయ్యారని.

“సరే రండి. స్వీట్స్ తింటూ కాకి గోల గురించి విందురుగాని” అంది.

పిల్లలకు స్వీట్స్ కన్నా కాకి గోల ఏమిటో తెలుసుకోవాలనే ఆత్రుత ఎక్కువగా ఉంది. పిల్లల్ని కూర్చోబెట్టి అమ్మమ్మ రిలాక్స్ అవుతూ చెప్పటం మొదలుపెట్టారు.

“ఎంత మంది కాకిని చూసారు?”

ఊర్లో ఉండే పిల్లలు చెయ్యి ఎత్తారు.

మిగతావాళ్ళు “అమ్మమ్మా! ఒకసారి ఇక్కడే చూసాము” అన్నారు

“సరే! వినండి. కాకులు చాల తెలివైన పక్షులు. అంటే కాదు వాటి పెద్ద కఠోరం అయిన గొంతుకు పేరు. అదే అవి కావ్! కావ్! అని పెద్దగా అరుస్తాయిగా. అంతే కాదు ఎలాంటి సమస్య వచ్చిన సాల్వ్ చేయగలవు.”

“అమ్మమ్మా! మా బామ్మ చెప్పింది కాకి ఇంటిమీద వాలి కావ్! కావ్! అని అరిస్తే చుట్టాలు వస్తున్నారని మీనింగ్ అని” అన్నాడు తేజస్.

“అవునా? కాకులు రంగు ఏమిటి?”

“బ్లాక్!” అన్నారు పిల్లలు కోరస్‌గా

“అవును. నలుపు. కాకుల ఇంటిపేరు?”

“కాకులకు ఇంటి పేరా? వావ్!” అన్నాడు మానస్.

“అవును. జీనస్ కర్వుస్. అంటే కాదు వాటిలో క్రోస్, రేవన్స్, రూక్స్ అనేవి ముఖ్యం. దాదాపుగా 40 రకాల కాకులు ఉన్నాయి. వాటిలో కొన్ని చిన్నవి, కొన్ని చాల పెద్దవి ఉన్నాయి. కాకులు దాదాపుగా ప్రపంచం మొత్తం కనిపిస్తాయి. అనేక పేర్లతో పిలుస్తారు. అమెరికన్ క్రో గ్రాస్‌ల్యాండ్స్, పొలాలలో ఉండటానికి ఇష్టపడుతుంది. ఫుడ్ ఈజీగా దొరుకుతుందిగా.

సాధారణ కాకి రేవన్ ప్రపంచంలో ఎక్కువ దేశాల్లో కనిపిస్తుంది. యూరోప్, ఆసియ, ఇండియా,ఇరాన్,ఆఫ్రికా, సెంట్రల్ అమెరికా. కాకులు ఎక్కువగా సముద్ర, నదీ తీరప్రాంతాలు, పచ్చిక మైదానాలు, కొండ శిఖరాలు, ఎడారులు మొదలైనవి ఇష్టపడుతాయి.

కాకులు ఎంత తెలివైనవి అంటే ఎలాంటి సమస్య… ప్రోబ్లమ్‌నైనా సాల్వ్ చేయగలవు. ఇంకా వాటి కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం చాలా బాగా వచ్చు. ఉదాహరణకి కాకులు ఎవరైనా మీన్ హ్యూమన్ అంటే చెడ్డ మనిషిని కలిస్తే వేరే కాకులకి అతన్ని సులువుగా గుర్తుపట్టేలా చెబుతాయిట.

కాకులు ఒక్కసారి చూస్తే ఆ ఫేస్, ముఖాన్ని మరిచిపోవుట. ఎంతమందిలో ఉన్న యిట్టే గుర్తు పడతాయిట. గ్రేట్ మెమరీ.”

“నిజంగా? ఆమ్మో! జాగ్రత్తగా ఉండాలి” అన్నాడు కిరణ్.

అమ్మమ్మ నవ్వి, కాకులు గురించి చెప్పటం మొదలుపెట్టింది. ఆపింది ఎక్కడ? ఆపలేదు.

“మానస్! కాకులు చాలావరకు ఒంటరిగా అంటే ఎలోన్‌గా ఉండటానికి ఇష్టపడతాయి. బట్ గుంపులుగా చెట్లు, తీగలు, ఎత్తైన చోట్లలో ఉంటాయి. కాకుల గుంపుని “మర్డర్” అంటారు.”

“అమ్మమ్మ మర్డర్ అంటే చంపటం కదా? మూవీలో చూసాను” అన్నాడు తేజాస్.

“వెధవ సినిమా పాండిత్యం” అని మనసులో తిట్టుకుని, “అది వేరు, ఇది వేరు. ఓకే.” అంది.

“ఓకే”

“విను. ఎప్పుడైనా బోలెడు కాకులు పెద్దగా అరవటం విన్నారా? చూసారా?”

“ఓ! ఒకసారి మా ఇంటి దగ్గర కాకి చనిపోతే బోలెడు కాకులు దాని చుట్టు ఉండి అరిచాయి. ఇంకా ఇంకా కాకులు వచ్చాయి. తాత ఉష్ ఉష్ అన్నా పోలేదు” అన్నది గీతిక.

మిగతా పిల్లలు ఆ దృశ్యం ఊహించటానికి ట్రై చేసారు.

“అవును. అలాఎందుకు వెళ్ళవంటే?”

“ఎందుకంటే? పాపం వాటి ఫ్రెండ్ చనిపోయిందిగా!” దిగాలుగా అంది ప్రకృతి.

“అవును బంగారు. అవి ఏడుస్తున్నాయి.. కాకిని ఎవరు ఎలా చంపారని తెలుకోవటానికి ట్రై చేస్తాయి. కాకులు తొందరగా ప్లేస్ మారటానికి ఇష్టపడవు. అమెరికన్ క్రోస్ పంటలకు శత్రువులు. కాకుల ఫుడ్ తెలుసా?”

“సీడ్స్, రైస్”

“ఎస్. కాకులు ఏదైనా తింటాయి, క్రిములు, స్మాల్ ఫిష్, మన ఫుడ్. ఎవ్రీథింగ్. కాకులు ఎత్తైన చోటులో ఆకులు, చిన్న పుల్లలతో ఇల్లుకట్టి అందులో 4-6 గుడ్లు పెట్టి అవి పిల్లలు అయ్యాక 60 డేస్ దాక తిండిపెట్టి పెంచుతాయి. తరవాత అవి ఎగిరిపోతాయి.”

“అమ్మమ్మ కాకుల గురించి ఇంతేనా?”

“ఇంకేమి కావాలి?”

“ఏవైనా కథలు.”

“స్టోరీ స్టోరీ!”

పిల్లలు అమ్మమ్మ స్టోరీ చెబితే బాగుందని చూస్తున్నారు.

“ఆ! ముందుగా రామాయణంలోని కథ చెబుతాను. రాముడు, సీత, లక్ష్మణ ముగ్గురు 14 యేళ్లు అడవిలో ఉండాలని వెళ్లారు.”

“ఎందుకు? పాపం కదా? ఎవరు పంపారు? హూ సెంట్?” అన్నారు పిల్లలు.

“అబ్బా! కాకి స్టోరీ వినండి. ఇంకోసారి రామ స్టోరీ. ఆలా అడవిలో తిరుగుతూ ఒకచోట చిన్న హట్ కట్టుకుని ఉంటున్నారు. ఒక రోజు రాముడు సీత ఒడిలో అదే లాప్ మీద తలపెట్టి నిద్రపోతుంటే ఒక పెద్ద కాకి వచ్చి సీతను బాగా ఇబ్బంది పెట్టింది. రాముడికి నిద్ర డిస్టర్బ్ కావద్దని పాపం సీత కాకి గోల భరించింది. నిద్ర లేచాక రామ సీతని వాట్ హాపెండ్ అని అడిగితే చెప్పింది.

ఆ కాకి పక్కనే ఉన్న చెట్టు మీద ఉండటం చూసిన రాముడు అది జస్ట్ క్రో కాదు దేవతలా రాజు ఇంద్రుడి కొడుకు జయంత్ అని తెలుసుకుని, వాడిని పిలిచి తిట్టి నిన్ను చంపనా? అంటే జయంత్ సారీ చెప్పాడు. బట్ రాముడు ‘నువ్వు తప్పుచేసావు కనుక నీకు శిక్ష అంటే పనిష్మెంట్ ఇవ్వాలి’ అని ‘ఇకనుండి నువ్వు ఒక కన్నును మాత్రమే వాడగలవు, రెండు కళ్ళు ఉన్నా. అంతేకాదు నువ్వు కాకిలా చాలా చాలా యేళ్ళు బ్రతుకుతావు. లాంగ్, మీనింగ్ లెస్ లైఫ్’ అని చెప్పాడు.”

“ఓహ్! మై గాడ్!” అంది అదితి.

“ప్రపంచం అంత కాకులు ఉంటాయి అన్నాను కదా. వేరే దేశాల్లో కథలు ఏమిటో వినండి. హీబ్రు బైబిల్‌లో మొదటగా చెప్పినది కాకి గురించేట. బుక్ అఫ్ జెనిసిస్. నోవా అఫ్ ఆర్క్ కధలో మొదటసారి వాన వరద తగ్గిందా? లేదా? అని ఒక రేవన్‌ని గాలిలోకి ఎగరవేసి చూసి రమ్మన్నారట.

గ్రీక్ రోమన్ కథలలో రేవోన్స్ అపోలో గాడ్‌కి సంబంధం ఉందంటారు. చెడుకి ప్రతీక. సింబల్.  వైకింగ్స్ రేవోన్స్‌ని వాడేవారట. రేవోన్స్ జెండాని reafan అంటారట.

ఇంగ్లాండ్ హిస్టరీ స్టోరీలో రేవోన్స్ అఫ్ ది టవర్ అఫ్ లండన్ గనక పడిపోతే ఇంగ్లాండ్ సామ్రాజ్యం పడిపోతుందని నమ్మకం. అందువల్ల అనేక వందల ఏళ్లుగా ఆ టవర్‌లో కనీసం 6 రేవన్స్ ఎప్పటికి ఉండేలా జాగ్రత్తపడతారుట. ”

“అమ్మమ్మా! ఈ స్టోరీ నాన్న చెప్పారు” అంది అదితి.

“కాకి భూటాన్ రాజ్య పక్షి. హిందూ దేవుళ్లలో శనికి వాహనం. వెహికల్. కొన్ని పురాతన రష్యన్ తెగలలో అంటే ట్రైబల్ కథల్లో కాకి గాడ్ లేదా స్పిరిట్. వీరుని తలమీద ఎగురుతున్న రెండు కాకుల్ని యుద్ధానికి, హింసకి ప్రతీక అనేవారుట. వార్, వొయిలెన్స్.

Charles Dickens novel Barnaby Rudge 1841లో కాకి గ్రిప్ ముఖ్య పాత్ర. ఇలా చెబుతూ పొతే కాకి గురించి చాల కబుర్లు ఉన్నాయ్. నాకు, మీకు టైం లేదు. పెళ్లి పనులున్నాయి. అదితి, ప్రకృతి అర్థం అయిందా? కాకి గోల, కాకి గుంపు చెడ్డ మాటలు కావు. ఎవరైనా ఎక్కువ గోలగా మాట్లాడుతుంటే అనే ఒక లోకల్ సామెత లాంటిది. పదండి. నాకు పెళ్లి పనుల్లో హెల్ప్ చేద్దురుగాని.”

“హే!” అని అరవబోయి గట్టిగా “ఉష్! నో కాకి గోల!” అని అనుకుని నవ్వుకుని అమ్మమ్మతో లోపలి వెళ్లారు ఉత్సహంగా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here