కాలచక్రం

0
5

[dropcap]ని[/dropcap]న్నలో….
నా తరిగిపోయిన ఆయుష్యుంది
అనుభవించిన ఆనందాలున్నాయి
భరించిన బాధలూ ఉన్నాయి
సుఖాలున్నాయి… వెన్నంటి దుఃఖాలూ ఉన్నాయి
కరిగిపోతున్న స్మృతులున్నాయి
కాలం మింగేసిన ఆప్తుల కథలున్నాయి

రేపులో….
కోటివెలుగుల కోర్కెలన్నాయి
కొండంత ఆశలున్నాయి
వెలుగులున్నాయ … జిలుగులున్నాయి
ఊహకందే సుఖాలున్నాయి
ఊరించేస్తున్న ఆనందాలున్నాయి
పెద్దరికాన్నిస్తున్న
పెరిగిపోతున్న వయస్సుంది
దానిచాటున …..
తరిగిపోతున్న ఆయుష్యుంది

మరి నేడులో….
నేనున్నాను…నిజంగా నేనే ఉన్నాను

నిన్నటి పేజీలోకి
కాలాన్ని
క్షణాలుగా, నిమిషాలుగా,గంటలుగా
పూటలుగా, పగలూ రాత్రుళ్ళుగా
తోసేస్తూ… బలవంతంగా నెట్టేస్తూ
నేనున్నాను

రేపటిని ఆ ఖాళీలోకి నింపేస్తూ
తీరిన కోరికలను
నిన్నటి “జమా”ఖాతాలోకి పంపేస్తూ…
దరిచేరని ఆశలను
రేపటి “బాకీ” ఖాతాలోకి వంపేస్తూ
నేనున్నాను….

నిరంతరంగా చలిస్తూ
అవిశ్రాంతంగా శ్రమిస్తూ…..
నేనే ఉన్నాను….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here