Site icon Sanchika

కలం

[dropcap]ఆ[/dropcap]కాశంలో
ఎన్ని తారలు
నాలో..
అన్ని ఊహలు
ఊహలకు
ఊపిరవ్వాలని
తారల్ని
చుట్టి రావాలని
కలగన్న
కాలం కదిలింది
కల ముదిరింది
కలం తీసుకున్న
తారలోని కాంతిని
‘సిరా’లా వాడుకున్నా
తారలు దిగి వచ్చాయి
కవితా దారాలు
జాలువారాయి.

Exit mobile version