కలవల కబుర్లు-17

0
10

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]ఈ[/dropcap] రోజు నవ్వుల దినోత్సవం..

ఔనట.. మే నెలలో మొదటి ఆదివారం నవ్వుల రోజట.

ఇదేంటండీ బాబూ!

సంవత్సరంలో ఒక రోజేనా?

నేనైతే అలా ఒప్పుకోను సుమీ!

నన్ను అడిగితే ప్రతిరోజూ నవ్వుల రోజు అని ప్రకటించేస్తాను

నవ్వు నాలుగు విధాల చేటు..

అది పాత నానుడి..

నవ్వు ఎన్నో విధాల గ్రేటు..

ఇది కొత్త నానుడి..

నవ్వడం ఒక భోగం

నవ్వించడం ఒక యోగం

నవ్వలేకపోవడం ఒక రోగం

నవ్వుల గురించి చెప్పాలంటే నవ్వుల ప్రేమికులు.. ముందు ఈ మాట తప్పకుండా అని తీరతారు..

ఏ పరిచయాలకైనా తొలి అడుగు చిరునవ్వే..

నవ్వు.. కృత్రిమంగా.. కృతకంగా.. పెదాల మీద అంటించినట్లు కాకుండా.. మనస్ఫూర్తిగా.. మనసారా నవ్వితే.. ఆ నవ్వు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో కదూ!

శత్రువునైనా కూడా.. చిరునవ్వు తోనే దగ్గర చేసుకోవచ్చు

బోసి నోరేసుకుని పసివారి నవ్వు చూస్తే ఎంతటి పాషాణులైనా.. నవ్వు అనే పదం వారి డిక్షనరీలో లేని వారైనా.. తిరిగి నవ్వలేకుండా ఉండరు. అంతగా మనసుకి హత్తుకుపోతుంది ఆ పసినవ్వు.

అసలు నవ్వులు బోలెడు రకాలు.. హాసం.. దరహాసం, మందహాసం, చిరునవ్వు.. వికట్టాటహాసం, పలకరింపు నవ్వు, మొహమాటపు నవ్వు, సిగ్గుతో కూడిన నవ్వు, ఆనందబాష్పాలతో కూడిన నవ్వు, ఊరికే పెదాలు ఎలాస్టిక్ లాగా కొంచెం సాగదీసి మళ్లీ ముడిచేసే నవ్వు, తప్పించుకునే నవ్వు,

ఇటు ఆనందంగా.. అటు ఆరోగ్యంగా ఉండడానికి ఈ నవ్వు ఎంతబాగా ఉపయోగపడుతుందో.

వస్తాయి కష్టాలూ.. బాధలూ.. ఎన్నెన్నో.. కానీ చిన్న చిరునవ్వు మాటున వాటిని దాచపెట్టగలిగితే.. ఎంతటి భవసాగరాలనైనా అవలీలగా దాటేయవచ్చు.

ఈ నవ్వులతో ఆరోగ్యం పెంపొందుతుందని ఎందరో సహేతుకంగా కూడా నిరూపించారు.. ఇందుకోసమే లాఫింగ్ క్లబ్బులు కూడా ఏర్పడ్డాయి.

మన ఫేస్‌బుక్‌లో కూడా ఎన్నో నవ్వుల ఎమోజీలు.. కొన్నిటిని చూస్తే చాలు ఫక్కున నవ్వు వచ్చేస్తుంది.

ఒక మంచి హాస్యకధ చదివినా, హాస్య సన్నివేశం చూసినా.. కొన్ని కార్టూన్లు చూసినా.. అసంకల్పిత ప్రతీకారచర్యలా.. నవ్వు పుట్టుకుని వచ్చేస్తుంది.. అసలు కొంతమందిని చూస్తూంటేనే చాలు, వారి కబుర్లు వినకుండానే నవ్వు వచ్చేస్తుంది.

మన రచనలలో కూడా హాస్యానికి పెద్ద పీటే వేసారు.. సదరు రచయిత (త్రు)లు.. పాఠకులు కూడా..

మరి మిత్రులందరికీ ‘నవ్వుల దినోత్సవం శుభాకాంక్షలు’

నేడే నవ్వుల రోజు! నవ్వేవాడే రాజు!!

వివిధ దేశాల్లో పాఠశాలలు, ఉద్యానవనాల్లో నవ్వడం వల్ల కలిగే బోలెడు ఉపయోగాల గురించి చెబుతూ అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటారు. కొన్ని స్వచ్ఛంద సంస్థలు విరాళాలు సేకరించి అనాథ పిల్లలకు సాయం చేస్తూ వారి ముఖాల్లో నవ్వులు పూయించే ప్రయత్నం చేస్తుంటాయి.

అసలు నవ్వితే ఎన్ని లాభాలో!

నవ్వుల్లో పలకరింపుగా, మర్యాదగా, గట్టిగా, ప్రేమపూర్వకంగా నవ్వడం వంటి 19 రకాలుంటాయట.

చిన్నపిల్లలు పుట్టుకతోనే నవ్వడం నేర్చుకుంటారు.

నవ్వడం వల్ల ముఖంలోని 53 కండరాలు కదిలి మంచి వ్యాయామం అవుతుందిట.

ఎన్నో పరిశోధనల్లో ఒకరి నవ్వు ఎదుటివారి ముఖంలో నవ్వులు పూయిస్తుందని తేలింది.

ఎప్పుడూ నవ్వేవారు నవ్వని వారికంటే ఏడేళ్లు ఎక్కువకాలం బతుకుతారట.

సాధారణ వ్యక్తి రోజులో 13 సార్లు నవ్వుతాడు.

చిన్నపిల్లలు పెద్దల కన్నా మూడు రెట్లు ఎక్కువగా నవ్వుతారు.

పదిహేను నిమిషాలు నవ్వితే 40 కేలరీలు ఖర్చవుతాయిట.

ఎక్కువగా నవ్వేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం తక్కువ. పైగా ఒత్తిడి తగ్గుతుంది.

రోగనిరోధక శక్తి నవ్వే వారికి ఎక్కువగా పెరుగుతుంది.

స్మైల్ డే కోట్స్.. ప్రముఖులు చెప్పిన కొన్నింటిని సేకరించాను. ఇవన్నీ నిజమే కదా అనిపించింది.

“సరళమైన చిరునవ్వుతో కష్టతరమైన హృదయాలను మృదువుగా చేయడాన్ని నేను చూశాను.” – గోల్డీ హాన్

“వెచ్చని చిరునవ్వు దయ యొక్క సార్వత్రిక భాష.” – విలియం ఆర్థర్ వార్డ్

“చిరునవ్వు అనేది అన్నింటినీ సూటిగా సెట్ చేసే వక్రరేఖ.” – ఫిలిస్ డిల్లర్

“సాధారణ చిరునవ్వు చేయగల మంచిని మనం ఎప్పటికీ తెలుసుకోలేము.” – మదర్ థెరిస్సా

“చిరునవ్వు అంటే మీ ముక్కు కింద మీరు కనుగొనే ఆనందం.” – టామ్ విల్సన్

“స్వయంచాలకంగా నవ్వే ఎవరైనా బాగా కనిపిస్తారని నేను అనుకుంటున్నాను.” – డయాన్ లేన్

“చిరునవ్వు, ఇది ఉచిత చికిత్స.” – డగ్లస్ హోర్టన్

“చిరునవ్వు అనేది మీ కిటికీలోని కాంతి, ఇది లోపల శ్రద్ధగల, పంచుకునే వ్యక్తి ఉందని ఇతరులకు తెలియజేస్తుంది.” – డెనిస్ వైట్లీ

“గుర్తుంచుకోండి, బయటి ప్రపంచం వర్షం పడుతున్నప్పటికీ, మీరు నవ్వుతూ ఉంటే, సూర్యుడు త్వరలో తన ముఖాన్ని చూపిస్తాడు మరియు మిమ్మల్ని చూసి నవ్వుతాడు.” – అన్నా లీ

“ఎవరూ లేనప్పుడు మీరు నవ్వితే, మీరు నిజంగా అర్థం చేసుకుంటారు.” – ఆండీ రూనీ

“అద్దంలో చిరునవ్వు. ప్రతిరోజూ ఉదయం అలా చేయండి మరియు మీరు మీ జీవితంలో పెద్ద వ్యత్యాసాన్ని చూడటం ప్రారంభిస్తారు.” – యోకో ఒనో

ఎల్లప్పుడూ మీ చిరునవ్వును ఉంచండి. నా సుదీర్ఘ జీవితాన్ని నేను వివరించాను.” – జీన్ కాల్మెంట్

ప్రపంచ చిరునవ్వు దిన శుభాకాంక్షలు

మీ కష్టతరమైన యుద్ధాలలో విజయవంతం కావడానికి చిరునవ్వు మాత్రమే అవసరం.

చిరునవ్వు, ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని చూస్తున్నారు మరియు మీ నుండి ప్రేరణ పొందుతున్నారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి.

మీ చిరునవ్వుతో మీరు ఈ ప్రపంచాన్ని జయించవచ్చు, ఎందుకంటే జీవితంలో అనేక విషయాలను సరిగ్గా సెట్ చేసే శక్తి చిరునవ్వు.

మీ రోజును ఒక అందమైన చిరునవ్వుతో ప్రారంభించండి మరియు ప్రతి రోజు మీకు అద్భుతమైన రోజుగా ఉంటుంది ఎందుకంటే సమస్యలు నవ్వుతున్న ముఖాలకు దూరంగా ఉంటాయి.

చిరునవ్వు మీ హృదయంలో సంతోషాన్ని ప్రతిబింబిస్తుంది.

స్మైల్ అనేది మీ శత్రువులను ఆశ్చర్యపరిచే ఔషధం. చిరునవ్వు అనేది మీ అందరి హృదయాలను గెలుచుకునే ఉపాయం.

వెచ్చని చిరునవ్వుకు ఏ భాష అవసరం లేదు.

చిరునవ్వు అనేక హృదయాలను తాకడానికి, కరగడానికి మరియు గెలవడానికి మీకు సహాయపడుతుంది.

ఒంటరిగా కూర్చున్నపుడైనా.. నలుగురినీ కలుసుకున్నపుడైనా, మన గతంలోని నవ్వుల సంఘటనలు తలచుకుంటే.. మీ పెదాలపై నవ్వుల పూవులు విరబూస్తాయి కదూ!

ఈరోజే కాదు ప్రతిరోజునీ చిరునవ్వుతో ఆహ్వానిద్దాం..

సరేనని చిరునవ్వుతో చెప్పండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here