కలవరపడుతున్న కలం

0
8

[dropcap]ఎం[/dropcap]దుకో కలం కలవరపెడుతోంది
నాలో భావాల్ని నిదురలేపుతోంది
మదిలోని అక్షరాలను సిరాగా చేసి
కాగితంపై గుమ్మరిస్తాను…

ఆ కలమే నేనై
కవిత్వానికి కొత్తగా రంగులద్దుతాను
అక్షరాలను మెత్తటి ఉలులతో చెక్కుతాను
పదాలను అందంగా ముస్తాబు చేస్తాను
అర్థాలను మదిలోకి దింపుతాను

అక్షరాలతో ఆటలు ఆడుతాను
అర్థవంతపు బాటలు వేస్తాను
సమాజంకై
మార్పుకై
కవిత్వమై ప్రపంచమంతా వినిపిస్తాను!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here