కాళోజీ జయంతి వేడుకలు – ప్రెస్ నోట్‌

0
12

[dropcap]పా[/dropcap]లమూరు సాహితి ఆధ్వర్యంలో తెలంగాణ ధిక్కార స్వరం కాళోజీ నారాయణరావు 108వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సెప్టెంబర్ 9 న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని లుంబిని పాఠశాలలో కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన ప్రముఖ కవి కె.లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ కాళోజీతో పాలమూరు జిల్లాకు అవినాభావ సంబంధముందన్నారు. కాళోజీ రాసిన నా గొడవ కవితాసంపుటిని అలంపూర్‌లో మహాకవి శ్రీశ్రీ ఆవిష్కరించారన్నారు. జిల్లాకు చెందిన ప్రముఖ కవులైన జలజం సత్యనారాయణతో పాటు అనేకమందికి కాళోజీకి సన్నిహిత సంబంధాలున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాళోజీ పురస్కార గ్రహీత కోట్ల వేంకటేశ్వరరెడ్డి, జిల్లా విశ్రాంత విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.విజయకుమార్, రాష్ట్ర బి.సి.టి.ఎ. అధ్యక్షులు కృష్ణుడు, పాలమూరు సాహితి అధ్యక్షులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, సృజామి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here