కందుకూరి వీరేశలింగం

0
8

పల్లవి:
[dropcap]కం[/dropcap]దుకూరి వీరేశలింగం
అంధయుగాన విస్ఫులింగం ॥ 2॥
కోరస్:
వారి ప్రగతి బాటలో పయనిద్దాం
వారి అడుగు జాడల్లో మనసు వెలిగిద్దాం ॥ కందుకూరి ॥
చరణం:
వితంతువుల బ్రతుకును చిగురించిన వీరుడు
బాల్య వివాహాలను అరికట్టిన ధీరుడు
కోరస్:
అరికట్టిన ధీరుడు
విగ్రహారాధనను వలదన్న మాన్యుడు
దేవుడొక్కడే యని భావించిన ధన్యుడు ॥ కందుకూరి ॥
చరణం:
కలం పట్టి కల్మషాన్ని కడిగిన పావనుడు
మూఢ నమ్మకాల మాడు పగల గొట్టినాడు
కోరస్:
మాడు పగల గొట్టినాడు
తెలుగు జాతి గర్వించే మహిమాన్వితుడు
నవయుగ వైతాళికుడై వెలుగులురలినాడు ॥ కందుకూరి ॥

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here