కన్నీళ్ల మధ్య ఖైదీగా..

0
10

[శ్రీ చందలూరి నారాయణరావు రచించిన ‘కన్నీళ్ల మధ్య ఖైదీగా..’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]కొ[/dropcap]న్ని కన్నీళ్లకు
ఆరడం తెలియదు..
కొన్ని రోజుల పాటు కురుస్తూ గుచ్చుకుంటాయి.

రక్తం మరిగి
మనిషి కంపనానికి మనసు చిట్లి
రాలే కన్నీటి చుక్కలు

మనసు చరిత్రలో
కొన్ని పేజీల మడుగులో
కనిపించని ఓ కలగా దాగి,

కళ్ళు తడిమినప్పుడల్లా
గుండెలో సుడిగాలికి
ముఖంలో ముసురు గాలులతో

ఎన్ని రోజులైనా అక్కడే చిక్కి
కేవలం బతికుంటాడు
కన్నీళ్ల మధ్య ఖైదీగా..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here