[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]
ఆది శంకరాచార్య ఆలయం
[dropcap]ఆ[/dropcap]ది శంకర ఆలయం లేదా జ్యేష్టేశ్వర ఆలయం లేదా బౌద్దుల ప్రకారం పశ్ పహార్. శంకరాచార్య హిల్ లేదా హిల్ అఫ్ సోలమన్. శివునికి అంకితం చెయ్యబడిన గుడి. 1000 అడుగుల ఎత్తులో శ్రీనగర్‌కి అభిముఖంగా ఉంటుంది.
కాశ్మీర్‌ని క్రీ.పూ. 2629- 2564 మధ్య పాలించిన మహారాజ సాందిమాన్ ఆలయాన్ని నిర్మించగా, గోపాదిత్య, లలితదిత్య రాజులూ పునర్నిర్మించారట. కల్హణుని రచనల్లో ఈ ప్రాంతాన్ని గోపాద్రి శిఖరంగా ప్రస్తావించారు. ఆర్యావర్ష నుండి వచ్చిన విప్రులకు గోపాదిత్య రాజు పర్వత పాద ప్రాంతంలో నివాస స్థలం ఇచ్చాడట. దాన్ని గోపా అగ్రహారంగా పిలిచారట. ప్రస్తుతం గుప్కర్‌గా పిలుస్తున్నారట. కల్హణ, అబ్దుల్ ఫజల్ గోపాదిత్య మహారాజు శివ ఆలయాన్ని నిర్మించాడుట. కాలక్రమేణా శిధిలం అవుతున్న ఆలయాన్ని అనేకులు పునరుద్ధరించారు.
కాశ్మీర్ శివుని శైవానికి పీఠంగా భావిస్తుంటారు. ఆది శంకరులు సౌందర్యలహరిని గోపాద్రి శిఖరం పైనుండి రచించారుట.