కాశ్మీర్ యాత్ర -6

0
11

[box type=’note’ fontsize=’16’] హిమాలయాలకు నెలవు, ప్రకృతి అందాలకు కొలువు, భూతల స్వర్గమని కవులు అభివర్ణించిన కాశ్మీరులో తమ యాత్రానుభవాలను పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి. [/box]

ఆది శంకరాచార్య ఆలయం

[dropcap]ఆ[/dropcap]ది శంకర ఆలయం లేదా జ్యేష్టేశ్వర ఆలయం లేదా బౌద్దుల ప్రకారం పశ్ పహార్. శంకరాచార్య హిల్ లేదా హిల్ అఫ్ సోలమన్. శివునికి అంకితం చెయ్యబడిన గుడి. 1000 అడుగుల ఎత్తులో శ్రీనగర్‌కి అభిముఖంగా ఉంటుంది.

మూల ఆలయం క్రీ.పూ. 200 సంవత్సరానికి చెందినదిగా చెబుతారు. ప్రస్తుత ఆలయం 9వ శతాబ్దం నాటిది. ఆది శంకరాచార్య దర్శనం చేసుకున్నందున ఆ పేరు వచ్చిందిట. బౌద్దులకు కూడా ముఖ్యమైన ప్రదేశం. పెర్షియన్స్, యూదులు – బాగ్ ఐ సులైమాన్, గార్డెన్ అఫ్ కింగ్ సోలమన్ పిలిచేవారుట.

కాశ్మీర్‌ని క్రీ.పూ. 2629- 2564 మధ్య పాలించిన మహారాజ సాందిమాన్ ఆలయాన్ని నిర్మించగా, గోపాదిత్య, లలితదిత్య రాజులూ పునర్నిర్మించారట. కల్హణుని రచనల్లో ఈ ప్రాంతాన్ని గోపాద్రి శిఖరంగా ప్రస్తావించారు. ఆర్యావర్ష నుండి వచ్చిన విప్రులకు గోపాదిత్య రాజు పర్వత పాద ప్రాంతంలో నివాస స్థలం ఇచ్చాడట. దాన్ని గోపా అగ్రహారంగా పిలిచారట. ప్రస్తుతం గుప్కర్‌గా పిలుస్తున్నారట. కల్హణ, అబ్దుల్ ఫజల్ గోపాదిత్య మహారాజు శివ ఆలయాన్ని నిర్మించాడుట. కాలక్రమేణా శిధిలం అవుతున్న ఆలయాన్ని అనేకులు పునరుద్ధరించారు.

డోగ్రా రాజు గులాబ్ సింగ్ 1846-57లో దుర్గ నాగ్ గుడి వైపునుండి ఆలయానికి మెట్లు నిర్మించాడు. అప్పటినుండి గుడికి పూర్వ వైభవం వచ్చిందిట. అప్పటిదాకా పూజలు లేక పాడుపడిందిట. 1925లో కాశ్మీర్‌ను సందర్శించిన మహారాజ మైసూర్ ఆలయానికి విద్యుత్ సేవలు ఏర్పరచారు. 1961లో ద్వారకా శంకర పీఠ అధిపతి ఆది శంకరుని విగ్రహం పెట్టారుట.

కాశ్మీర్ శివుని శైవానికి పీఠంగా భావిస్తుంటారు. ఆది శంకరులు సౌందర్యలహరిని గోపాద్రి శిఖరం పైనుండి రచించారుట.

ఎత్తైన 240 మెట్లు ఎక్కి ఆలయం చేరవచ్చు. ఆలయానికి వెళ్లే దోవ భద్రతా దళాల పహరాలో ఉంటుంది. కొత్తవారికి, శ్రీనగర్ వర్తమానం తెలియని వారికీ, తెలిసిన వారికీ కొద్దిగా కంగారుగా ఉంటుంది. చాలా నిరాడంబరమైన గుడి. అక్కడనుండి శ్రీనగర్ పట్టణం అందంగా కనిపిస్తుంది. ఈ ఆలయంలో ప్రవేశ సమయం కొద్దిగంటలు మాత్రమే ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here