కథా సోపానములు-17,18

0
9

[box type=’note’ fontsize=’16’] డా. బి.వి.ఎన్. స్వామి ‘కథా సోపానములు’ అనే శీర్షికతో అందిస్తున్న వ్యాస పరంపరలోనిది ఈ వ్యాసం. కథల గురించి ప్రముఖుల అభిప్రాయాలు, ఈ వ్యాస పరంపరకి ఉపకరించిన పుస్తకాల వివరాలు ఇందులో ఉన్నాయి. [/box]

17. ప్రముఖుల అభిప్రాయాలు

[dropcap]“క[/dropcap]థ ఏక రస ప్రతిపాదకం. కథకుడు ఏదో ఒక రసాన్ని ఎన్నుకొని తన ప్రాగల్భ్యం చేత కథలో ఆ రసాన్ని పోషించి ప్రకాశింప చేస్తాడు. కథలోని సంఘటనలు ఈ దృష్టి తోనే కల్పించబడతాయి. ఈ సంఘటనలు ఉత్పన్నం చేసే భావాలు, ఒకే రసత్వాన్ని పొందేవిగా ఉండటం వల్ల భావైక్యత సిద్ధించి రసస్ఫూర్తి కలుగుతుంది.” – హితశ్రీ

“రచయిత తనకు నచ్చిన కథాలక్షణాల్ని మాత్రమే యిరికించి చిన్నకథను నిర్వచిస్తున్నాడు. అంతే గాని ఏ విధంగా రాసి పాఠకుల్ని ఆకర్షిస్తే, ఆ విధానం మంచిదని మనం గుర్తించాలి.” – సోమర్ సెట్ మామ్

“అందుకనే కథలు ఇలా రాయాలి, అని గిరిగీసి చెప్పడం భావ్యం కాదను కుంటాను. నా విషయానికొస్తే నా జీవితానికొక స్థిరత్వం లేనట్లే నా రచనా పద్దతికి, స్థిరత్వం లేదు. నేననేక విధాలుగా కథలు రాసాను. అందుకే ముఖ్యంగా కథా రచయితకు ప్రజలతోటి, వారి జీవనవిధానం తోటి దగ్గర సంబంధం ఉండడం అవసరమను కొంటాను.” – రావూరి భరద్వాజ

“కథకి ఒక వాతావరణం, గాలి, వెలుగు నీడలు కల్పించడానికి ప్రయత్నిస్తాను. అందులో వ్యక్తులు ఒక్కరైనా ఇద్దరైనా ఒక సమాజం, సంప్రదాయం, నాగరికత వున్నాయన్న ధ్వని, ఒక నాదం, ఒక హోరు-కథ వెనుక శ్రుతిలా శైలి ద్వారా మ్రోగుతూ వుండాలి.” – బుచ్చిబాబు

“అసలు కథకి గాని దేనికిగాని నిర్వచనమనేది లేదు.” – చలం

“చిన్నకథ యొక్క స్వభావమూ, స్వరూపము, శిల్పము, ప్రయోజనము, ప్రజాస్వామ్యం వెంట ఏర్పడి ప్రజాస్వామ్యంతో బాటు పరిణామం చెందింది. కనుకనే సంఘం లోని ఎంత నికృష్టుడైనా కథకు ప్రధాన పాత్ర కాగలడు. జీవితంలోని ఏ అందం గురించి అయినా చిన్న కథ రాయవచ్చు.” – కొడవటిగంటి కుటుంబరావు

“ఎదుటి మనిషి జీవితం మనకు నేపథ్యం. మన బతుకు పక్కవాడికి నేపథ్యం” – జాన్ ఆల్పెలోస్

“రోడ్డు మీద శబ్దాలకూ, ఆర్కెస్ట్రా వాయిద్యాలకు తేడా ఉంటుంది. జీవితానికీ, కథకు ఉన్న తేడా కూడా అదే.” – ముక్తవరం పార్థసారథి

“కథ అనేది మొదట్లో కుతూహలాన్నీ చివర ఆలోచనల్నీ కలిగించాలి. మధ్యలో చెప్పేది రక్తి కట్టిస్తూ చెప్పుకు పోవాలి.” – ఆరుద్ర

“రచనలో వాస్తవమూ, కల్పన అనేవి రెండుంటాయి. వాటిని ఏయే పాళ్ళల్లో కలపడమన్నది రచయిత ప్రతిభపైన ఆధారపడి ఉంటది.” – వల్లంపాటి వెంకటసుబ్బయ్య

“మనకు బాగా తెలిసిన ప్రతి విషయంలోనూ తెలియనితనముంటుంది. ఆ అసాధారణతత్వాన్ని పట్టుకోవటమే కధ.” – ఫ్లోబేర్

“కథానాయకుడన్నవాడు సామాన్యులకు అసాధ్యమైన పనులన్నీ చేయగలగాలి. రాక్షసులతో యుద్ధాలు చెయ్యాలి. రహస్యాలు ఛేదించాలి. అన్ని అడ్డంకులను అధిగమించి విజేతగా నిలవాలి. పంచేంద్రియాలతో గ్రహించగలిగిన జ్ఞానమంతా కథా గమనంలో పాఠకులకు చేరాలి.” – జోసెఫ్ క్రోనాడ్

“జీవితం బంగారం లాంటిదైతే అందులో కావలసినంత మాత్రమే తీసికొని రమణీయంగా తయారుచేసుకునే ఆభరణంలాంటిది కథ.” – మధురాంతకం రాజారాం

“కథానిక ఎంత క్లుప్తంగా ఉంటే అంతమంచిది. అంటే రచయిత తలచిన ప్రయోజనం దాటి ఏ విధంగాను బలిసి పోగూడదన్నమాట. ఇందులో నవలలాగ, నాటకంలాగ జీవిత ప్రపంచం అంతా ఇమిడ్చి లాభం లేదు. ఒకే ఒక్క ఉద్దేశంలో ఇది తారాజువ్వలా ఎగసి, పగిలి పువ్వులు రాల్చి ఊరుకోవాలి. పాఠకుడికి స్పురింపజెయ్యడం దీనిపని గాని నాలుగు వైపులా చిత్రించి చూపడం దీని పనిగాదు.” – ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి

 “ఒక స్వంత ముద్ర లేని రచయితల్ని పాఠకులు తొందరగా మర్చిపోతారు, అలాంటి వారికి గుర్తింపు ఉండదు. ఒకరి నీడలో ఎదగడానికి ప్రయత్నించినా అంతే. అందుకే అసంఖ్యాకంగా వస్తోన్న రచయితల్లో పాఠకులు గుర్తుంచుకునేవాళ్ళు అంతంత మాత్రం గానే ఉన్నారు. చక్కగా కథలు చెప్పేవారు తెలుగులో చాలా మంది ఉన్నారు కానీ ఒక స్వంత గొంతుతో పలికేవాళ్ళు తక్కువే.” – శీలా వీర్రాజు

“అసలు రచయిత కాదలచుకున్నవారు ఎవరూ తన కథను ఒకరికి చూపి విమర్శించమనటం సరికాదు. మీ సలహాలు చెప్పండి. నా రచనలు సవరించుకుంటాను అనటం వెర్రితనం. తన పైన తనకే నమ్మకం లేకపోవటం. ఇన్ని వందల కథలు, గొప్ప వారివి, గొప్పవి చదివినవారు తన కథ, తను రాసిన కథ, వాటి ప్రక్కనే పెట్టి, వాటి స్థాయిలో ఉన్నారో లేదో పరీక్షించుకోలేరా! లేకుంటే ఎన్నటికి రాయలేనటువంటి వారు. రాయగలగినవారు ఎవరి రచనను వారు విలువ కట్టుకోగలరు మరి” – శార్వరి

“కథకు ఒక ప్రారంభం కానీ, ముగింపు కానీ ఉండదు. ముందు తెలుగు అభిప్రాయాలు పెట్టి, తర్వాత ఇంగ్లీషు అభిప్రాయాలు పెట్టాలి. ఒకానొక క్షణంలో మనకు కలిగిన అనుభవం నుంచి గతంలోకో, భవిష్యత్తులోకో తొంగిచూడటమే కథ అంటే” – గ్రాహంగ్రీన్

“The Short story is essentially a product of modern age. It is perfected by great masters from Edgar Allen Poe onwards. It is peculiarly a modern growth” – Sri Sri

“We may say that a short story is a story that can be easily read at a single sitting” – W.H.HUDSON

“A prose narrative briefer than the short novel, more restricted in characters and situations and usually concerned with single effect” – KARL BECKSON

“Short story is a literary form, a prose fiction in which mood, characters, plot and setting are perfectly harmonized” – EDGAR ALLAN POE

“A Short story deals with a single character, or a single event, or a single emotion” – BRANDE MATTHEWS

“Short story represents first a theme, then a point of view, a certain knowledge of human nature and strong feeling about it and style” – KATHERIN ANNEPORTER

“In every moment, we are part of the infinite stories that the Universe is telling us and that we are telling the universe” – BENOKRI

18. పనికొచ్చిన పుస్తకములు

1) కథానిక-పాఠాలు (కథారచనలో మెలకువలు) – ‘అరసం’ గుంటూరు జిల్లా శాఖ ప్రచురణ

2) కథలు ఇలా కూడా రాస్తారు – మహమ్మద్ ఖదీర్ బాబు

3) కథలు రాయడమెలా – శొంఠి కృష్ణమూర్తి

4) కథాశిల్పం – వల్లంపాటి వెంకటసుబ్బయ్య

5) కథా కథనం – కాళీపట్నం రామారావు

6) విశ్వకథా శతకం (అనువాద కథలు) – ముక్తవరం పార్థసారథి

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here