కవి సమ్మేళనాలు – గాలి దుమారాలు – వాసంత సమీరాలు 2

0
7

[box type=’note’ fontsize=’16’] హిందీలో ‘నీరజ్ ఏక్ మస్త్ ఫకీర్’ అనే శీర్షికతో ప్రేమ్‍కుమార్ రచించిన వ్యాసాన్ని తెలుగులో అనువదించి అందిస్తున్నారు డా. టి.సి. వసంత. [/box]

[dropcap]గో[/dropcap]రఖపూర్‌లో మరో సంఘటన జరిగింది. అక్కడ నగరనిగమ్ ద్వారా రెండు రోజులు అఖండ కవి సమ్మేళనం జరిగింది. శంభూనాథ్ సింగ్‌గారు నీరజ్‌ని చదవనీయకుండా అల్లరి చేయమని ముందే తన శిష్యులకి చెప్పి ఉంచారు. నేను కవితని చదువుదామని లేచాను. ఇంతలో కొందరు అరుస్తూ అల్లరి చేయడం మొదలు పెట్టారు. “అసలు నేను కవితను చదవడం మొదట పెట్టకుండానే ఈ అరుపులు ఈ గోలలు ఎందుకు?” అని అడిగాను. “నేను నాలుగైదు పంక్తులు చదువుతాను, ఆ తరువాత అల్లరి చేయండి ఐదో పంక్తి చదవుకుండా ఆపండి” అని అన్నాను. “చదవండి సార్” అని వాళ్ళు అన్నారు. “నేను చదువుతున్నప్పుడు గొడవ చేయకండి” అని చెప్పాను. వాళ్ళు సరేనని అన్నారు. నేను ఒక ‘ముక్తక్’ (నాలుగు పంక్తుల పద్యం)ని చదివాను. అసలు నా ముక్తక్ అంటే ఆటమ్ బాంబ్ లాంటిది. కవితలు చదివే ముందు ముక్తక్ చదివే ఆచారం నేను మొట్టమొదట మొదలు పెట్టాను. నేను ముక్తక్ చదవగానే అందరు వన్స్ మోర్, వన్స్ మోర్ అని అరవడం మొదలు పెట్టారు. “నేను నాలుగు పంక్తులే చదువుతానని చెప్పాను. చేసాను. మీరు అల్లరి చేద్దాం అనుకున్నారు కదా, మీరు పూర్తి చేయలేదు. అందుకని ఇక నేను కవితను చదవను” అని అన్నాను. కూర్చున్నాను. అందరు వన్స్ మోర్, వన్స్ మోర్ అని అంటూనే ఉన్నారు. ఈ లోపల ఇంతకు ముందు అల్లరి చేసిన కుర్రాళ్ళు వేదికకి వెనక వచ్చారు. కవితలు చదవమని పదే పదే అడిగారు. బతిమాలాడారు. “మిమ్మల్ని గొడవ చేయమని చెప్పిందెవరు? ముందు నాకు చెప్పండి.” అని నేను అడిగాను. “ఇక్కడ శంభూనాథ్ సింగ్ ప్రభావం ఎక్కువగా ఉంది. నీరజ్‌గారు చదివితే ఆయన ప్రభావం ఎక్కువగా పడుతుంది, అందువలన అల్లరి చేయండి అని ఆయన చెప్పారు” అని వాళ్ళు చెప్పారు. నేను కవితలు చదివే ముందు శంభూనాథ్‌గారి వైపు చూస్తూ చెప్పాను – “ఆయన నాకు పెద్దన్నయ్యలాంటి వారు. నేను వారిని ఎంతో గౌరవిస్తాను. నేను వారి కవితా పంక్తులను ఎప్పుడు గుర్తు చేసుకుంటు ఉంటాను.” ఎవరు ఏం చేసారో నేను ఏదీ చెప్పలేదు. మరునాడు పగలు పదింటికి కార్యక్రమం మొదలయింది. నేను చాలా సేపు కవితలు చదివాను. శ్రోతలు కోరిక మేర చాలా సేపే చదివాను. ఇంతలో శ్రోతలలో ఎవరో “ఇంగ్లీషు కవిత చదివి వినిపించండి” అని అన్నారు. నాది ఇంగ్లీషులో ఒక ప్రోజ్ పోయమ్ ఉంది – “ట్రైయిన్ ఆప్ ఎ పోయెట్”. లక్నో యూనివర్శిటిలో దీన్ని ఒకసారి చదివాను. అందరు ఎంతో ప్రశంసించారు. అక్కడ ఇంతకు ముందు దీనిని విన్న వాళ్ళెవరో దీనిని చదవాలని కోరారు. అక్కడ శంభూనాథ్ గారి కొందరు శిష్యులు ఉన్నరు. హిందీ సమ్మేళనంలో ఇంగ్లీషు ఎందుకు? అప్పుడు మధురలో ఉండే నా మిత్రుడు రాజేష్ దీక్షిత్ లేచి నిల్చున్నాడు. ఆయన భుజాన ఒక పిస్తోలు వేలాడుతోంది. దాన్ని చూపిస్తూ “నీరజ్ ఈ కవితను చదవకుండా ఎవరు అడ్డుకుంటారో చూస్తాను”  నేను ఇంగ్లీషు కవిత చదివాను. అందరు ఎంతగానో పొగిడారు.

నీరజ్ చిరునవ్వు నవ్వారు. ఆ నవ్వు వెనక ఏదో రహస్యం ఉంది. కళ్ళల్లో మెరుపు వచ్చింది – “ఒకసారి రాయ్‌పూర్‌లో ఒక కవిసమ్మేళనం జరిగింది. నేను స్టేషన్‌లో దిగగానే ఒక కవి అక్కడ నాకు వంగి వంగి దండాలు పెడుతున్నాడు. “గురుజీ!  మీరు ఇవాళ మా ఇంట్లో భోజనం చేయాలి. మీకు కావలసింది కూడా ఏర్పాటు చేస్తున్నాను.” అన్నాడు. “ఇప్పుడు కాదు నన్ను క్షమించు” అని నేనన్నాను. నన్ను చాలా బలవంతం చేసాడు. వాళ్ళింటికి వెళ్ళి టీ తాగాల్సి వచ్చింది. నేను దేని కోసం అయితే బద్‌నామ్ అయ్యానో దాని ఏర్పాటు కూడా చేశాడు. రాత్రి రాఠోడ్ చౌక్‌లో ఒక పెద్ద కవి సమ్మేళనాన్ని నా స్నేహితుడు శ్రీ రవి రాఠోడ్ ఏర్పాటు చేసాడు. పెద్ద వేదికను తయారు చేసారు. ఎదురుకుండా చాలా మంది శ్రోతలు కూర్చుని ఉన్నారు. నన్ను తన ఇంటికి తీసుకువెళ్ళిన వ్యక్తి కూడా అక్కడే కూర్చుని ఉన్నాడు. నేను ఒక కవిత చదువుతానని అతడు సైగ చైసాడు. నేను నిర్వాహకుడికి చెప్పి అతడికి సైగ చేసాను. తప్పకుండా చదివిస్తానని అతడికి అర్థం అయింది. నలుగురైదుగురు కవులు చదినాక మళ్ళీ సైగ చేసాడు. ఈ సారి అతడు చేయి ఊపుతూ అర చేయి చూపించాడు. అతడు బెదిరిస్తున్నాడని శైల్ అన్నాడు. మరో ఇద్దరు ముగ్గురు కవులు కావ్య-పఠనం చేసారు. ఈ సారి అతడు పిడికిలి చూపించాడు. ఈసారి అతడు కొడతాడని బెదిరిస్తున్నడని ఆయన అన్నారు. అతడికి కూడా అవకాశం ఇవ్వండి అని నేనన్నాను. చివరికి అతడిని వేదిక మీదకి పిలిచారు. కొంచెమే చదవాలి అని చెప్పారు. అతడు కావ్య-పఠనం మొదలు పెట్టాడు – “బాగోం మే ఫూలే – ఫూల్” అనే బదులు అతడు ఫుల్ అని అంటున్నాడు. అందరు నవ్వుతున్నారు. చాలా సేపయింది. ఎంత ఆపుతున్నా అతడు చదువుతూనే ఉన్నాడు. శైల్ గారు వెనక నుండి అతడి కుర్తా పట్టుకులాగుతున్నారు. “నా కుర్తాను చింపారు” అంటూ అతడు తోస్తూ ఇంకొంచెం ముందుకు జరిగాడు. అక్కడ సేఫ్టీ పిన్ ఒకటి పడి ఉంది. శైత్‌గారు మెల్లిగా అతడి పాదాల్లో గుచ్చడం మొదలు పెట్టాడు. కొంచెం రక్తం వచ్చింది. ఒక లయ ఏర్పడ్డది. పిన్ను గుచ్చుకోవడం, అతడు చదవడం, ఒక రిథమ్ ఏర్పడది. ఫుల్ అని అనగానే పిన్ గుచ్చుకునేది. పిన్ను గుచ్చుడం ఆపినప్పుడు లయ ఆగిపోతుంది. అతడు వెనక్కి తిరిగి చూసాడు. గుచ్చినప్పుడల్లా కవితలో ఒక లయ వచ్చేది. నిర్వాహకులు అతడిని వేదిక నుండి దింపేసారు.

స్వతంత్రం వచ్చాక రిపబ్లిక్ డే రోజు ఎర్రకోటలో కవి సమ్మేళనాన్ని ఏర్పాటు చేసారు. ‘తాల్ కటోరా’లో ఏర్పాటైన కవి సమ్మేళనంలో హిందీ ఉర్దూ కవులు ఇద్దరు పాల్గొన్నారు. ఆ తరువాత ప్రతీ రిపబ్లిక్ డే రోజు కవిసమ్మేళనం ఏర్పాటు చేసే ఆచారం మొదలయింది. ఆ కవి సమ్మేళనంలో పండిత్ నెహ్రూగారు, లాల్ బహదూర్‌శాస్త్రిగారు దినకర్‌గారు, బచ్చన్‌గారు, పంత్‌గారు మొదలైన పెద్ద రాజకీయ నేతలు, కవులు పాల్గొన్నారు. ఈ పెద్దలు మధ్య కావ్య పఠనం చేసే అవకాశం నాకు కలిగింది. ఇది నా అదృష్టం. జవహర్ లాల్ నెహ్రు గారిని మైథిలీ శరణ్ గుప్త వేదిక పై తీసుకు వస్తున్నారు. మెట్లు ఎక్కుతుంటే  నెహ్రుగారు కాళ్ళు ఒణకడం వలన తడబడ్డారు. గుప్తాగారు ఆయనను సంబాళించారు. నెహ్రూగారు నవ్వుతూ అన్నారు – “ఇదేమిటి? గుప్తాగారు, రాజనీతి తొట్రుపడి నప్పుడల్లా కవులు సాహిత్యకారులే చేయూత నిచ్చారు”. నేను అప్పుడు “మూడో ప్రపంచ యుద్ధం” వ్యతిరేకంగా కవిత చదివాను. చదవగానే నెహ్రుగారు నా వీపు తట్టారు. తరువాత మరొక సారి కవి సమ్మేళనంలో బచ్చన్‌గారు అధ్యక్షత వహించారు. నేను ఒక గీతాన్ని చదివాను – “మత్ కరో ప్రియ్ రూప్ కా అభిమాన్, కబ్రహై ధరతీ, కఫన్ హై ఆస్‌మాన్” (ప్రియా! రూపం చూసుకుని గర్వపడకు, నేల ఒక సమాధి, ఆకాశం  ప్రేత వస్త్రం) వినగానే “అసలు దీనికన్నా గొప్ప గీతం ఇంకొకటి ఉండదు” అని బచ్చన్‌గారు అన్నారు. బహుశ ఇక సమాప్తం చేయాలని అనుకుని ఉంటారు. నేను నిల్చుని వ్యతిరేకించాను.

నీరజ్‌గారి ముఖంలో తేజస్సు ఉంది. కంఠంలో ఉత్సాహం, ఆహ్లాదం, సంతోషం వ్యక్తం అవుతున్నాయి. మళ్ళీ చెప్పడం మొదలు పెట్టారు -1962లో ఇంకా చైనా ఆక్రమణ కాలేదు. అప్పటి దాకా నాకు కాదు, గోపాల్ ప్రసాద్ వ్యాస్‌కి పెద్ద పీట వేసారు. ఎర్రకోటలో వేదిక పైన కాకా హథ్‌రసీ, కవి బైరాగీలు కవితలు చదివారు. ప్రభాకర్ ముచ్‌వే గారు – ఈ యుగం ముగ్గురు గోపాలుల యుగం. గోపాల్ సింహ్ ‘నేపాలీ’, గోపాల్ దాస్ ‘నీరజ్’, గోపాల్ ప్రసాద్ వ్యాస్ – అని అన్నారు.

ఢిల్లీలో ఒకసారి రామ్‌లీలా మైదానంలో కవి సమ్మేళనం జరిగింది. నిరాలా గారు దీని అధ్యక్షత వహించారు. నేను ఆ రోజు కవిత చదివినప్పుడు ఎదురుకుండా కూర్చున్న డా.  నర్రేంద్ర. నాకు ఇకన్నీ (ఒక అణా) బహుమతిగా ఇచ్చారు. నిరాలా గారు కోపగించుకున్నారు. ఆయన జేబులో ఉన్న చిల్లర అంతా నా చేతిలో పెట్టారు. ఆ సమయంలో నరేంద్రగారు, దరయుగంజ్‌లోని కామర్స్ కాలేజీలో లెక్చరర్‌గా పని చేసేవారు. జైనేంద్రగారి ఇంట్లో శనివార సమాజం సమావేశాలు జరిగేవి. నరేంద్రగారు ఒక సమీక్షని చదివారు. స్వతంత్రం వచ్చాక అన్నయ్య మైధిలీశరణ్‌గుప్తాగారి దయ వలన ఆయనకి ఢిల్లీ యూనివర్శిటిలో విభాగాధ్యక్షుడిగా పదవి లభించింది. ఆయన నాకు ఇకన్నీ బహుమతిగా ఇచ్చారే కాని అవమానం చేయడానికి కాదు. నిరాలా గారు అర్థం చేసుకోలేదు. అందుకే వారికి కోపం వచ్చింది. వారు తరువాత నాతో షాహ్‌దరా నివాసానికి వచ్చారు. అక్కడ నులక మంచం మీద పడుకున్నాను. మంచం సరిగా లేదు. “నీవు ఏం రాసావో వినిపించు” అని ఆయన అన్నారు. నేను నా కవితలను వినిపించాను. “నీవు ఉపయోగించే భాష చాలా బాగుంది. అసలు వేరే కవులెవ్వరూ ఇట్లా రాయలేరు” అని అంటూ క్లాసికల్ రీతిలో ఒక గీతం గానం చేసారు. ఇట్లు గీతాలని చదవాలి అని చెప్పారు. ఆయన ఢిల్లీలో దులారీలాల్‌ భార్గవ్‌గారి ఇంట్లో ఉన్నారు. అక్కడి వాళ్ళు నీరాలా గారిని వెతుక్కుంటూ వచ్చారు. అక్కడి నుండి తీసుకు వెళ్ళిపోయారు. అప్పటికే నిరాలా గారి మతి స్తిమితంగా లేదు.

అలహాబాద్ యూనివర్శిటీలో స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షడు నన్ను కవి సమ్మేళనంలో అధ్యక్షత వహించాలని ఆహ్వనించారు. నేను సాయంత్రం ఫిరాక్ సాహెబ్‌ని కలవడానికి వెళ్ళాను. ఆయన హిందీ కవిత, ఉర్దూ షాయరీ, ఇంగ్లీషు పోయిట్రీ మీద చాలా సేపు మాట్లాడారు. వారు ఎంతో ప్రతిభావంతులు. ప్రతి భాషపైన వారు చర్చించేవారు. వారి ఉద్దేశంలో ఆధునిక హిందీ కవులకు అంతగా భాషా జ్ఞానం లేదు. కొంత వరకు ఇది నిజమే. ఉర్దూ కావ్య క్షేత్రంలో దాదాపు 700 సంవత్సరాలు భాషపైన అమూల్యమైన అధ్యయనం జరిగింది. వారు రాసిన గజళ్ళు భాషలో ఎంతో శక్తి ఉంది. వినంగానే అందరికి నోటికి వచ్చేస్తాయి. మన సంస్కృత పండితులు అలంకార్, రీతి, గుణ్, నాయికా బేధాల గురించి ఎంతో చర్చ జరిపారు. కాని హిందీ సమీక్షకులు, కవులు భాష గురించి ఏ మాత్రం పట్టించుకోలేదు. ఈ లోపం వలన హిందీ రాష్ట్రీయ భాష అయినా, ఎక్కవ మంది కవులు గాయకులు భజనలు, దోషాలు, సినిమా పాటలు మాత్రమే పాడారు. ఇప్పుడు కూడా ఎక్కువ మంది గజళ్ళనే పాడుతున్నారు. నీరాలా గారి సరస్వతీ వందన తప్పితే మరే గీతాలు ప్రసిద్ధి పొందలేదు. ఈనాడు కూడా కవులు ఎక్కువగా ఉర్దూ గజల్స్ పాడతారు. కావ్య ప్రియులు కూడా వీటినే ఇష్టపడుతున్నారు. ఆ సాయంత్రం ఫిరాక్ సాహెబ్‌తో మాట్లాడుతూ కూర్చున్నాను. ఆయన టేబుల్ పైన మెహువా (ఇప్పపూల సారా), వేయించిన చేపలను పెట్టారు. ఇంతలో కొందరు నన్ను కవి సమ్మేళనానికి తీసుకు వెళ్ళడానికి వచ్చారు. ఆయనను చూసాక ఒకతను ఈయనని నాతో తీసుకురావద్దని చెవిలో చెప్పాడు. వెళ్దామని నేను బయలుదేరాను. ఇంతలో ఆయన అడిగారు “ఎక్కడికి వెళ్ళాలి?”. స్టూడెంట్స్ యూనియన్ కవి సమ్మేళనానికి వెళ్ళాలని చెప్పాను. “నేను వస్తాను. చదువుతాను” అని ఆయన అన్నారు “నేను అధ్యక్షత వహిస్తున్నాను. నా అధ్యక్షతన మీరు చదవడం సమజంసం కాదు. క్షమించండి” అన్నాను. “మీరు హిందీ కవి నేను ఉర్దూ కవిని”  అంటూ వెంటనే తయారై వచ్చారు. ఆయనని వద్దనే ధైర్యం ఎవరికి ఉంది. కారులో వచ్చి కూర్చున్నారు. నేను అధ్యక్షత వహిస్తున్నాను. “మీకు తెలుసుగా నేను భోజనం చేయకుండా వచ్చాను. నన్ను ముందు చదవనీయండి” అని ఆయన అన్నారు. “మీరు బాగా సీనియర్ మొదట ఎట్లా చదవగలరు” అని నేనన్నాను. “సీనియర్ – గీనియర్ అంటూ ఏమీ లేదు.” అని ఆయన అన్నారు. నేను ఆయనను చదవడానికి ఆహ్వనించాను. ఆయన హిందీ కవిత వినిపిస్తానంటూ, స్వయంగా చేసిన కీట్స్ కవిత హిందీ అనువాదాన్ని చదివారు. కవిత చాలా బాగుంది. విద్యార్ధులకు ఏ మాత్రం అర్థం కాలేదు. ఇంతలో వహవా! వహవా! వహవా అంటూ పిల్లలు అరిచారు. ఫిరాక్ సాహెబ్ ఆపమని అరిచారు. అయినా వాళ్ళు  ఆపలేదు. పైగా ఇంకా పెద్దగా అరవడం మొదలు పెట్టారు చాలా కోపం వచ్చంది. “మీ బుర్ర నా చెప్పులతో సమానం కూడా కాదు”  అని అన్నారు. వాళ్ళ అల్లరి ఇంకా ఎక్కువ అయింది. ఫిరాక్ సాహెబ్ వేదిక నుండి వచ్చేస్తూ నా చేయి పట్టుకుని “రండి, మీరు వచ్చేయండి” అని అన్నారు. వెంటనే యూనియన్ లీడరు నా రెండో చేయిని పట్టకున్నాడు. ఇద్దరు చేతులను చెరొక వైపు లాగడం మొదలు పెట్టారు. “మీకు చప్పట్లు కావాలి. నేను వెళ్తాను. పొద్దున నన్ను కలవండి” అంటూ ఆయన కోపంగా వెళ్ళిపోయారు. నేను పొద్దున్న ఆయనని కలిసాను. – “వాళ్ళు నన్ను ఎంతో ప్రేమిస్తారు. ఆ నషాలో ఏదేదో మాట్లాడేస్తాను. వాళ్ళు ఏదన్నా నేను పట్టించుకోను” అని ఆయన అన్నారు. ఫిరాక్‌ సాహెబ్‌తో సంబంధించిన మరో సంఘటన గుర్తుకు వస్తోంది. అలహాబాద్‌లో ఒకసారి పీస్ కాన్ఫరెన్స్ అయింది. వాళ్ళు ఒక ముషాయిరాని ఏర్పాటు చేసారు. నన్ను కూడా పిలిచారు. సరదార్ జాఫరీ గారు అధ్యక్షత వహించారు. జాఫరీ గారు ఫిరాక్ గారి ఇంట్లో ఉన్నారు. ఈ ముషాయిరాలో జాఫరీ గారు ఒక షేర్ చదివారు “ఉన్ కా క్యా ఫర్జ్ హై యహ్ అహుతే సిమాసత్ జానేం, అపనా పైగామ్ ముహబ్బత్ హై జహాం తక్ పహుంచే” (వాళ్ళ కర్తవ్యం ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి, నా సందేశం, ప్రేమ, ప్రపంచం దాకా చేరాలి) ఈ షేర్ విని ముగ్ధులైపోయారు. మరునాడు జాఫరీగారిని కలవడానికి ఫిరాక్‌గారి ఇంటికి వెళ్ళాను. జాఫరీగారు తన పక్కని ఫిరాక్‌గారి ఇంట్లో పెడుతున్నరు. ఫిరాక్ గారు దాన్ని బయట పడేస్తున్నారు. చాలా సార్లు ఇట్లా జరిగింది. “ఇదంతా ఏమిటి?” అని నేను ఫిరాక్‌గారిని అడిగాను “ఈయన ఒక పుస్తకం రాసారు. ఉర్దూ షాయిరీ పుస్తకం అది. అందులో అందరి పేర్లు ఉన్నయి కాని వామిక్ జానపురీని వదిలేసారు. నేను సహించలేకపోయాను.” అని ఆయన అన్నారు. కొంచెం సేపయ్యాక అంతా సర్దుమణిగింది. తరువాత జాఫరీ సాహెబ్ గదిలోకి వెళ్ళిపోయారు. దీనిని పొట్లాట అంటామా!  కాదు ఇదంతా ప్రేమ ప్రదర్శనే.

ఏటాలో జరిగిన ఒక సంఘటన గుర్తుకు వస్తోంది. నేను అప్పటికే బొంబాయి వచ్చేసాను. బహుశ 1970 సంవత్సరంలో అయి ఉండాలి. అక్కడ ఒక కవి సమ్మేళనంలో కావ్య పఠనం చేస్తున్నాను. నేను మూడు కవితలు చదివాను. అక్కడ ఒక ఠాకురు ఉన్నారు. ఆయన ఇంకా ఇంకా చదవండి అని అన్నారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి “ఈయన మూడు కవితలు చదివారు. ఇక చదవడానికి వీలు లేదు” అని అన్నాడు. “ఆయనే చదువుతారు. ఇక మరెవరు చదవరు” అని ఠాకుర్ అన్నారు. “చూస్తాను, ఎట్లా చదవుతారో?” అని మరో వ్యక్తి అన్నాడు. అంతే మరుక్షణంలో తుపాకీ పేల్చాడు. గుండు అతడి కాలికి తగిలింది. అతడు పడిపోయాడు. ఇక అంతే గోల మొదలయింది. కవి సమ్మేళనం ముగిసింది. తరువాత నేను బొంబాయి వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరు పెద్దనాన్న-మేనల్లుడు అని తెలిసింది. నేను బొంబాయి వెళ్ళిపోయాను. పదిహేను ఇరవై రోజుల అయ్యాక కోర్టుకి రమ్మనమని సమన్స్ వచ్చాయి. నేను, సోమ్‌ ఠాకుర్, భారత్ భుషన్‌ కోర్టుకి వెళ్ళాము. నేను కోర్టుకి వెళ్తున్నాను. ఇంతలో ఆ ఠాకుర్ వచ్చారు. “వాడు నా మేనల్లుడు. మేం ఇద్దరం తాగి ఉన్నాం. మత్తులో ఉన్నాం. మీరు ఏదీ చెప్పకండి. మేం కామ్‌ప్రమైజ్ అయిపోతాం. గురూ! సాయంత్రం భోజనం ఏర్పాటు చేసాను” అంటూ చేతులు జోడించాడు. నేను సరేనన్నాను. అక్కడ వకీలు అడిగాడు –  “పిస్తోలు మీ ముందే పేల్చారుగా?” “నేను సౌండ్ విన్నాను. నేను పారిపోయాను. ఎవరు పేల్చారో, అసలు ఆ గుండు ఎవరికి తగిలిందో నాకు తెలియదు. ఇది తప్పితే నాకు మరేదీ తెలియదు” అని నేనన్నాను. నేను 1400 రూపాయలు బిల్లుని నాకు ఖర్చు అయిందని జడ్జీగారికి అందించాను. “ఇంత బిల్లు ఇప్పటిదాగా ఎవరికీ ఇవ్వలేదు. అని ఆయన చిరునవ్వు నవ్వారు. మీరు ఎప్పుడైనా రండి. రాత్రి మా ఇంట్లో గోష్ఠి జరుగుతుంది. రేపు పేమెంట్ అవుతుంది” అని మళ్ళీ అన్నారు. “మామూలుగా అయితే పది ఇరవై రూపాయలు ఇస్తారు. నేను బొంబాయి నుండి వచ్చాను అందుకే అంత బిల్ ఇచ్చాను.” అన్నాను. ఆ ఠాకూర్ పేరు జంగ్ బహదుర్. ఐ విట్నెస్ ఇచ్చాను కాబట్టి ఇక కేసు కొట్టేసారు. అది ఆయనకి తెలుసు. నాకు ఆయన మంచి భోజనం పెట్టారు….” చెప్పారు నీరజ్.

~

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here