కవితలు, కథల పోటీ 2018

1
10

‘సంచిక’ అక్టోబరు నెలలో దసరా సందర్భంగా ‘పద్య కవిత’, ‘వచన కవిత’ పోటీ, నవంబర్ నెలలో దీపావళి సందర్బంగా ‘కథల పోటీ’ నిర్వహిస్తోంది. ప్రతి పోటీలో మూడు బహుమతులు – ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. అయితే ఈ బహుమతులు ‘సంచిక’ న్యాయనిర్ణేతలు ఎంపిక చేసిన కథలతో పాటు, పాఠకులు ఎంపిక చేసిన కథలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రతి పోటీకి ఆరుగురు రచయితలు బహుమతులు పొందే వీలుందన్న మాట. క్రిటిక్స్ అందించే ఈ మూడు బహుమతులు, పాఠకులు ఎంపిక చేసిన మూడు బహుమతులు!

ఇవేకాక ప్రతి పోటీలో అయిదు ప్రోత్సాహక బహుమతులుంటాయి. అయితే, ఈ ప్రోత్సాహక బహుమతులకు వోటింగ్ వుండదు. వీటిని సంచిక సంపాదక వర్గం నిర్ణయిస్తుంది.

అన్ని పోటీలలో

ప్రథమ బహుమతి      రూ.5000/-
ద్వితీయ బహుమతి   రూ.3000/-
తృతీయ బహుమతి   రూ 2000/-
ప్రోత్సహక బహుమతి  రూ.1000/-

పద్యాలు, కవితలను 31 ఆగస్టు 2018 తేదీ లోగా పంపించాలి. అలాగే దీపావళి కథల పోటీకీ కథలు 30 సెప్టెంబరు 2018 తేదీ లోగా అందేట్టు పంపించాలి. కథలు, పద్యాలు, కవితల నిడివి విషయంలో కానీ, అంశం విషయంలో కాని ఎలాంటి పరిమితులు లేవు. ఒకటే నియమం ఏమిటంటే భాష విషయంలో కాని, భావన విషయంలో గాని రచనలు ఆమోదించిన సభ్యసమాజపు పరిధులలోనే ఉండడం వాంఛనీయం.

రచనలను ఈమెయిల్ ద్వారా పంపదలచుకున్నవారు kmkp2025@gmail.com కు పంపించవచ్చు. సబ్జెక్ట్ లైన్లో ఏ పోటీ కోసం పంపుతున్నారో స్పష్టంగా రాయాలి. రాతప్రతిని పంపాలనుకున్నవారు ఈ క్రింది అడ్రసుకు పోస్టులో గానీ కొరియర్లో గాని నిర్ణీత గడువులోగా అందేట్లు పంపించవచ్చు.

Kasturi Muralikrishna
Plot no.32, H.No 8-48
Raghuram nagar colony, Aditya hospital lane
Dammaiguda, Hyderabad-83
Ph: +919849617392

కవరుపై ఏ పోటీ కోసం పంపుతున్నారో స్పష్టంగా రాయాలి. ఒక రచయిత ఒకే రచన పంపాలన్న నియమం లేదు. వాట్స్అప్ ద్వారా రచనలు పంపాలనుకున్నవారు 9849617392 నంబరుకు తమ రచనలను వాట్స్‌అప్ చేయవచ్చు.

అయితే, పోటీకి రచనలు పంపేవారు విధిగా పోటీ రచన అన్నది స్పష్టంగా రాయాల్సివుంటుంది. లేకపోతే ఆ రచనను సాధారణ సంచికకు పంపిన రచనగా భావించే అవకాశం వుంది.

కవులు, కథకులు ఈ పోటీలలో పాల్గొనగలరని ఆశిస్తున్నాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here