కయ్యూరు బాలసుబ్రమణ్యం నానీలు 3

0
10

[dropcap]అ[/dropcap]క్షరాలకు
అత్తరు కాదు
కవిత్వం పూస్తేనే
పరిమళం
~
పెదాలను
తాకినపుడే
పదాలకు
జీవం మొదలయ్యేది
~
అక్షరాలన్నీ
విత్తులుగా నాటాను
సాహితీ వనంలో
కవిత్వపు చెట్టు
~
కలం
పదునెక్కుతోంది
అసమానతలకిక
రంపపు కోతలే
~
గాయం
బాధ పెడుతోందా?
గేయం ఉందిగా
సేద తీర్చడానికి!
~
కవిత్వం
కలం కొనల నుండి కాదు
గుండె కొలను నుండి
పుట్టాలి

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here