కేదారనాథ్

0
7

[box type=’note’ fontsize=’16’] “కొత్త నటి కోసం, కేదారనాథ్‌లో అందమైన కొండలూ లోయలూ చూడటానికి వెళ్ళొచ్చు” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘కేదారనాథ్‘ చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]R[/dropcap]ock On, కైపోఛే లాంటి చిత్రాలు మనకందించిన అభిషేక్ కపూర్ తాజా చిత్రం కేదారనాథ్. ఈ చిత్రంతో కొత్తగా పరిశ్రమలోకి అడుగుపెడుతున్నది సైఫ్ అలీ ఖాన్-అమృతా సింఘ్ ల అమ్మాయి సారా అలీ ఖాన్. తన మొదటి చిత్రంలోనే చక్కటి నటన అందించింది.

ఉత్తరాఖండ్‌లోని కేదారనాథ్ లో పండిత బ్రిజరాజ్ (నితిష్ భారద్వాజ్) కుటుంబం లాడ్జీలు, దుకాణమూ నడుపుతుంటారు. ఇద్దరు కూతుళ్ళు బృందా ( పూజా గోర్), మందాకిని క్లుప్తంగా ముక్కు (సారా అలీ ఖాన్), భార్య లత (సోనాలి సచదేవ్) తో. ఇదివరకు బృందాతో సంబంధం కుదిరి, తెగిపోయిన అబ్బాయి కుల్లు (నిశాంత్ దహియా) తోనే ఇప్పుడు ముక్కు నిశ్చితార్థం అయ్యింది. అయితే ముక్కు కి ఇది ఇష్టం లేదు, పైకి చెప్పుకోదు కాని బృందాకు కూడా మనసు కష్టంగా వుంది. ఇంట్లో యెదిరించలేక, యెదిరించినా ఉపయోగం లేక తరచుగా తన మిత్రులనే పెళ్ళి ప్రస్తావనతో పిలిపించుకుంటుంది ముక్కు. కాని వచ్చిన వాళ్ళను తన్ని తరిమేస్తారు తప్ప పట్టించుకోరు కుటుంబ సభ్యులు. మరో పక్క మన్సూర్ (సుశాంత్ సింఘ్ రాజపూత్) వొక ముస్లిం పిఠ్ఠూ. యాత్రికులకు పొట్టి గుర్రాలమీదా, వెదురు తడికల్లాంటిదాంట్లో కూర్చోబెట్టుకుని వీపున మోస్తూ (అందుకే పిఠ్ఠూ పేరు) కొండమీది గుడికి తీసుకెళుంటాడు. అతని తండ్రి ఇదే పనిలో వో land-slide ప్రమాదంలో చనిపోయాడు. అందుకే అతని తల్లి (అల్కా అమీన్) కు యెప్పుడు కొడుకు గురించే బెంగ. కావటానికి ముస్లిం అయినా తన షుక్రానాలు (చెల్లింపులు, దేవుడి పట్ల కృతజ్ఞతతో సమర్పణలు) ఆ శివుని మందిరంలోనే జేగంటలు మోగించడం ద్వారా చెల్లిస్తాడు. ఇలాంటి నేపథ్యంలో మన్సూర్-ముక్కుల మధ్య ప్రేమ చిగురిస్తుంది. ముక్కు నిర్భయస్తురాలు. మన్సూర్ మాత్రం కాస్త low-profile లో కనపడతాడు. తండ్రి అకాల మరణం, తల్లి బెంగ, అక్కడ ముస్లింల పట్ల మిగతావారి వైఖరి ఇవన్నీ కారణాలుగా. వీళ్ళ ప్రేమ కథ మధ్య మధ్యలో పర్యావరణం గురించిన చిట్టి కథలు అల్లాడు దర్శకుడు. లోయల్లో అందం చూడటానికి వచ్చే యాత్రికులకి అడుగడుగునా వ్యాపార ప్రకటనల బోర్డులెక్కువ, ప్రకృతి తక్కువ కనబడుతుందని చెప్పి ముక్కు వాటిని మాయం చేసేస్తూ వుంటుంది. మరో పక్క పెద్దలు కేదారనాథ్‌లో పెద్ద హోటెళ్ళ నిర్మాణం చేపట్టడం ద్వారా యెక్కువమంది యాత్రికులకు సేవ చేయవచ్చని ప్రతిపాదిస్తారు. యెప్పుడూ మౌనంగా వుండే మన్సూర్ గళం విప్పి కేదారనాథ్ లోయలని, అక్కడి పర్యావరణాన్ని రక్షించే ప్రయత్నాలు చేయాలిగాని, హాని తలపెట్టే పని కాదంటాడు. ఆ విధంగా వారి కళ్ళల్లో శత్రువవుతాడు. ఇక ఈ చిత్రం క్లైమాక్సులో 2013 లో వచ్చిన వరద చూపబడుతుంది.

హిందూ ముస్లింల ప్రేమకథలు కొత్త కాదు. ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే ఈ చిత్రం బాగా నటించిన కొత్త నటి సారా కోసం, కేదారనాథ్ అందాల కోసం చూడొచ్చు. సారా కు రూపంలోనే కాకుండా కాస్త నటనలోనూ తల్లిని గుర్తు చేసే గుణం వుంది. ఆ పాత్ర స్వభావం కారణంగానో, మరో కారణంగానో సుశాంత్ యెప్పటిలా గొప్ప నటన కనబరచలేదు, డల్‌గా కనిపించాడు. పూజా గోర్ బాగా చేసింది. మిగతా పాత్రలూ అంతంత మాత్రం. తుషార్ కాంతి రాయ్ కేదారనాథ్ అందాలను బాగా కేప్చర్ చేశాడు. హితేష్ సోనిక్ నేపథ్య సంగీతమూ, అమిత్ త్రివేది పాటల్లో సంగీతమూ బాగున్నాయి. సినెమా చివరి గ్రాఫిక్స్ బాగున్నాయి. కాస్త రాజ్ కపూర్ చిత్రం “సత్యం శివం సుందరం” గుర్తుకొస్తుంది. ప్రేమ, సౌందర్యం, భక్తి/సత్యం వీటిని తాత్త్వికంగా పరిశీలిస్తూ సాగే ఆ చిత్రం కూడా చివర్న వరదలతో ముగుస్తుంది. ఇందులో వొక ఆపద (ఇది కూడా నిజంగా జరిగినదే) తో ముగిసినా అలాంటి ప్రశ్నలు మనసులో లేవనెత్తదు. ముందే చెప్పుకున్నట్టు కొత్త నటి కోసం, కేదారనాథ్ లో అందమైన కొండలూ లోయలూ చూడటానికి వెళ్ళొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here