‘కిష్టడి కతలు’ ఆవిష్కరణ సభకు ఆహ్వానం – ప్రెస్ నోట్

0
12

[dropcap]’ఆం[/dropcap]ధ్రప్రదేశ్‌ రచయితల సంఘం’ ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేది ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఆర్‌.సి.కృష్ణస్వామిరాజు రచన ‘కిష్టడి కతలు’ ఆవిష్కరణ సభ జరుగనున్నది.

ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకట సుబ్బయ్య అధ్యక్షతన జరిగే ఈ సభలో ప్రముఖ రచయిత కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌ ‘కిష్టడి కతలు’ను ఆవిష్కరిస్తారు.

ప్రముఖ కథారచయిత శ్రీకంఠస్ఫూర్తి గౌరవ అతిథిగా పాల్గొంటారు. ప్రముఖ రచయిత్రి వైష్ణవిశ్రీ పుస్తక సమీక్ష చేస్తారు. కనుక ఈ సభకు సాహితీప్రియులు, కథాప్రియులందరూ పాల్గొనవల్సిందిగా ఆహ్వానిస్తున్నాము.

చలపాక ప్రకాష్‌, ప్రధాన కార్యదర్శి
ఆంధ్రప్రదేశ్‌ రచయితల సంఘం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here