కొరియానం – A Journey Through Korean Cinema-11

0
9

నట నీరాజనం

Chapter 9

సరే! ముందుగా మొన్న ఏప్రిల్ 27, 2002 న మన Oldboy చోయ్ మిన్-సిక్ తన షష్ఠి పూర్తి జరుపుకున్నాడు. నటన పరంగా ఏ ప్రమాణాలను తీసుకున్నా ప్రస్తుత ప్రపంచంలో పది అత్యుత్తమ నటులలో ఖచ్చితంగా టాప్ 3 లో నిలుస్తాడు. ఆల్ టైమ్ లిస్టు తీసినా టాప్ 10 లో ఉండటం ఖాయం. మరీ డేనియల్ డే లూయిస్ అంత కాదు కానీ, ఇతను కూడా ఎంత వర్సటైల్ నటుడో అంత చూజీ. He’s as versatile as he’s not prolific. గత నాలుగైదేళ్ళ నుంచీ మరీ పెద్ద కమర్షియల్ హిట్‌లు కొట్టలేదు కానీ, చోయ్ నటనలో మటుకూ తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నాడు. ఏ రకమైన పాత్రలకు స్టీరియోటిపికల్ కాకుండా 30 సంవత్సరాల కెరియర్‌ను ఈ సంవత్సరం పూర్తి చేసుకోనుండటంతో ఈ రెండు సందర్భాలు పురస్కరించుకుని ఈ నటనాగ్రేసరుడి గురించి కొన్ని వివరాలు.

ఇతను మెథడ్ యాక్టర్‌లా అనిపిస్తాడు కానీ మెథడ్ యాక్టర్ కాదు. అలా అని మరీ సటుల్ కూడా కాదు. కొరియన్ standards ను బట్టీ చూసినా మిగిలిన వారంత మెలోడ్రమటికల్ కాదు. నవ్వుతూ పలకరించినప్పుడు మన పక్కింటి పెద్దాయనలా అనిపించే చోయ్, ఓ నాలుగు కండరాలు కదిలించి దగ్గరకెళ్ళటం సరే, దూరం నుంచీ చూసి కూడా తడిపేసుకునేంత భయం కలిగించగలడు.

Enigmatic in many ways. ఒక నటుడు తన జీవిత కాలంలో (సరే! మీ ముచ్చటెందుకు కాదనాలి, జీవితా రాజశేఖర్ కాదు. కాలం అంటే column కూడా కాదు) మహా అయితే మూడో లేదా నాలుగో ఆల్ టైమ్ క్లాసిక్స్‌గా గుర్తింపు పొందిన సినిమాల్లో నటించగలరు. వారు నటనా ప్రతిభ కూడా గొప్పగా చూపుతూ. అలాంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్ కూడా అవుతాయని గ్యారంటీ లేదు. కానీ చోయ్ అదృష్టమో లేదా అదృష్టానికే చోయ్ పట్టాడో తెలియదు కానీ, కేవలం గత దశాబ్దంలోనే చోయ్ ఐదు అలాంటి సినిమాలలో నటించాడు. అన్నీ కమర్షియల్ గా కూడా గొప్పగా వెళ్ళాయి.

  1. I Saw The Devil (2010)
  2. Nameless Gangster (2012)
  3. New World (2013)
  4. The Admiral: Roaring Currents (2014)
  5. The Tiger: An Old Hunter’s Tale (2015)

I Saw The Devil సీరియల్ కిల్లర్ సినిమాల్లో కొత్త వరవడి సృష్టించింది. మన బాలీవుడ్ థ్రిల్లర్ ఏక్ విలన్ ఈ సినిమాకు అనుకరణే.

Nameless Gangster ను క్రైమ్ థ్రిల్లర్లలో వేయాలా? క్రైమ్ కామెడీలలో వేయాలా అన్నది ఇప్పటికీ కన్ఫ్యూజనే. కానీ ఒక్కటి మాత్రం నిజం. ఆ పాత్రను చోయ్ మిన్-సిక్ చేసినంత గొప్పగా ప్రపంచంలో ఏ నటుడూ చేయలేడు. ఇదే కారణం వల్ల (Oldboy ను దాటిన నట ప్రతిభ ఈ సినిమాలో) Oldboy ను తను తీసిన వాటిలో తనకు బాగా నచ్చిన సినిమాగా పేర్కొన్నాడు దిగదర్శకుడు పార్క్ చాన్-వుక్. అతనికి అత్యంత నచ్చిన సినిమాల్లో ఇదొక్కటి Nameless Gangster) కాగా, తనకు బాగా నచ్చిన తను తీసిన సినిమా ఏదో ముందు ఎపిసోడ్ లలో చూద్దాం. ఈ విషయం గురించి కొరియానం ఆరవ ఎపిసోడ్ ‘పార్క్ చాన్-వుక్ అంతరంగం’లో చెప్పాను. కొరియన్ సినిమా చరిత్రలో ఫిబ్రవరి నెలలో రిలీజైన సినిమాలలో అత్యంత పెద్ద హిట్.

New World saw a new dimension in Choi Min-sik. అంతే కాదు నియో న్వార్ (Neo Noir) జాన్రాలో ఈ సినిమా ప్రపంచ క్లాసిక్. గత దశాబ్దంలో వచ్చిన top most neo noir film is New World.

మూడు ఆల్ టైమ్ క్లాసిక్ సినిమాలు. అదీ వరుసగా. ఒక్కొక్క సినిమాలో తన నటనాగ్రేసరత్వాన్ని పెంచుతూ పోయాడు. వీటి తరువాత వచ్చిన The Admiral లో అయితే శిఖరాయమానమైన నటన చూపాడు. కొరియన్ సినిమా చరిత్రలోనే అత్యంత పెద్ద కమర్షియల్ హిట్ కూడా. ఇక The Tiger: An Old Hunter’s Tale అయితే మనం సింపుల్‌గా దణ్ణం పెట్టి ఊరుకోవటమే. చెప్పనలవి కాదు. కాకపోతే Oldboy లేదా Nameless Gangster సినిమాల్లో లాగా విభిన్న వేరియేషన్లు చూపటానికి స్కోప్ ఉండని పాత్ర కనుక కాస్త underrated అనుకోవాలి. ఆర్ట్, కమర్షియల్ సినిమాల క్రాసోవర్ కూడా కావటం వల్ల తొలుత పెద్ద ఆడకపోయినా ఉన్నంతలో లాభాలు తెచ్చుకుంది.

ఈ 5 సినిమాల మధ్యలో, 2011లో వచ్చిన Leafie: A Hen In The Wild లో voice acting చేశాడు. కొరియన్ animated classic గా చెప్పబడే ఈ సినిమా అదే జాన్రాలో అత్యంత పెద్ద హిట్. తన విలక్షణమైన స్వరంతో ఆకట్టుకుంటాడు. ఆమధ్య Oldboy తెలుగు డబ్బింగ్ చూశా. చోయ్ కి ఇచ్చిన వాయ్స్ అస్సలు సెట్ కాలేదు. హిందీలో అయితే అమితాభ్ బచ్చన్ స్వరం అంత విలక్షణతో సరిపోవచ్చు.

ఇవి కాకుండా ఫర్బిడెన్ డ్రీమ్ మరో గొప్ప సినిమా. కొరియన్ సినిమాలో గత తరపు అగ్రశ్రేణి నటుడైన హన్ సుక్-క్యు ఇందులో మరో ప్రధాన పాత్ర వేశాడు. Astronomy నేపథ్యంలో నడిచే ఈ పీరియడ్ సినిమా, నిజమైన సినీ ప్రేమికులకు మృష్టాన్న భోజనమే. Han ను చూసి థియేటర్ నటనకు, సినిమా నటనకూ మధ్య ఉన్న తేడా గ్రహించానంటాడు చోయ్. చోయ్ చేస్తున్న సినిమాల వల్లే తన artistic slumber నుంచీ బైటకు వచ్చానని అంటాడు Han. చోయ్, హన్ లు మూడు గొప్ప సినిమాలలో కలిసి నటించారు. వీరిద్దరూ కలిసి నటించిన తొలి సినిమా ‘No. 3’. అప్పటికే హన్ superstar. Forbidden Dream నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. అయినా పరస్పర గౌరవాదరాలు చెక్కు చెదరలేదు.

క్లాసిక్ అనిపించుకోలేదు కానీ, చోయ్ నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ద మేయర్ ఇతన్ని మరో కోణంలో చూపించింది. 2017లో వచ్చిన ఈ సినిమా బిగినింగ్ పార్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. తరువాత తరువాత కాస్త రొటీన్ కథనంలో పడి ఇబ్బంది పెట్టినా, ఈ విభాగం (బిగినింగ్) స్క్రీన్ ప్లే నేర్చుకోవాలనుకునే వారికి ఒక గొప్ప రిఫరెన్స్. దాని గురించి ప్రముఖ సినీ విమర్శకులు, విశ్లేషకులు అయిన సికందర్ గారు వారి బ్లాగ్‌లో రాశారు.

కేవలం ఒక దశాబ్దంలోనే ఇంత గొప్ప ఫిల్మోగ్రఫీ ఉంటే మిగిలిన రెండు దశాబ్దాల సినిమాలను పరిశీలిస్తే మరిన్ని నవరత్న ఖచిత… వద్దులే మళ్ళా యమలీల బ్రహ్మానందం గుర్తొస్తాడు. మరిన్ని గొప్ప సినిమాలు దొరుకుతాయి. ఈ సినిమాల గురించి, ఇతని నటన గురించి ముందు ముందు చూడబోతున్నాం కాబట్టి ఇప్పటికి ఈ వివరాలు చాలు. ఈమధ్య ట్విట్టర్‌ను పరిశీలిస్తుంటే ఇతనికి మనదేశంలో కూడా అభిమానులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

A small tribute poem about this gem of an actor. ఇతను నటించిన గొప్ప సినిమాల లిస్టు కూడా తెలుస్తుంది.

Happy Birthday Choi Min-sik

In the Oldboy

I Saw the Devil

In the New World

A Nameless Gangster

With a Crying Fist

The Admiral

With Roaring Currents defeated

The Tiger with a

Roar For Victory

In Our Prime

With Shiri

Came the Happy End

For Our Twisted Hero

Himalaya of Asian actors

Choi Min-sik

Happy birthday to you

60 years young man

నటులు, నటన గురించి మాట్లాడుతున్నాము కాబట్టి, ప్రస్తుతం మనం పరిశీలిస్తున్న సినిమా …Ing లో నటుల గురించి చూద్దాం. సినిమాలో మొత్తం మూడు ప్రధాన పాత్రలు. అవటానికి మిన్-ఆ కథానాయిక అయినా కథను డ్రైవ్ చేసేది అమ్మ మి సుక్. మరొకరు… ఇప్పటిదాకా ఎక్కువ మాట్లాడుకోని మిన్-ఆ కాబోయే boyfriend యంగ్-జే. మి సుక్ పాత్రలో వెటరన్ నటి Lee Mi-suk జీవిస్తుంది. చాలా సటుల్ రాయబడిన… ఒకరకంగా చెప్పాలంటే – it’s a completely author backed role – వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతో అందిపుచ్చుకుంది. కథ మొత్తానికీ కర్త, కర్మ, క్రియ అయిన ఈ పాత్రలో… ఆనందం, విషాదం, నిర్వేదం సమపాళ్ళలో రంగరించి నటించింది. హావభావాల దగ్గర నుంచీ, ఆహార్యం వరకూ ప్రత్యేక శ్రద్ధతో రూపొందించిన పాత్ర. సినిమా చివరి 45 నిముషాలు కాస్త సైడ్ అయినా, ఆ పాత్ర influence on the plot and narration మనకు రెండోసారి (it deserves multiple watching anyway) చూస్తున్నప్పుడు మరింత బాగా అర్థమవుతుంది.

Young-jae పాత్రలో వేసిన కుర్రాడు (ఆ కాలానికి) Kim Rae-won ఈ సినిమాకు ముందు Plum Blossom అనే సినిమాలో చేశాడు. ఈ సినిమా తరువాత చేసిన వాటిలో క్రైమ్ Gangster డ్రామా Mr. Socrates, My Little Bride తో బాగా వెలుగులోకి వచ్చాడు. మంచి నటుడు. నిజానికి …Ing లో ఇతని పాత్ర ఏ మాత్రం కట్టు తప్పినా సిల్లీగా మారిపోతుంది. కానీ దాన్ని ఎంతలో నటించాలో అంతలో పోషించి మెప్పు పొందాడు. క్రమంగా మనకు ఎక్కేసే పాత్ర ఇది. ఎన్నో సినిమాలలో ఇలాంటి పాత్రలను చూసి ఉన్నా రే-వన్ పోషించిన తీరుతో యంగ్-జే మనకు నచ్చుతాడు. ప్రత్యేకించి సినిమా చివర్లో ఇతని నటనకు మనకు తెలియకుండానే గుండె చెమరుస్తుంది. ఇతని చాలా సినిమాలను, వాటిలో ప్లాట్ ను మన తెలుగు సినిమాలలో బాగా వాడుకున్నారు. కెరియర్ పీక్ లో mandatory military service రావటం వల్ల రావలసినంత పేరు రాలేదు. But he’s one of the brighter talents of his generation.

ఇక మిన్-ఆ పాత్రలో Im Su-jeong తన ప్రతిభను మరోసారి చాటుకుంది. కొన్ని లక్షల సార్లు చూసేసిన, beaten to death style of role ని తన నట వైదూష్యంతో, తనకే స్వంతమైన childlike inner qualities తో నిలబెట్టటమే కాకుండా ఈ జాన్రాలో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అదే సంవత్సరం (2003) లో వచ్చిన సైకలాజికల్ Horror drama A Tale of Two Sisters తో తెచ్చుకున్న పేరును స్టార్డమ్ గా మలుచుకుంది కానీ ఎందుకో 2007 తరువాత ఆమె ఫిల్మోగ్రఫీ అంత impressive గా అనిపించదు. Her talent was and is grossly underutilized by Korean Cinema … Ing లో అయితే ఒకరకమైన అమాయకత్వం నిండిన పాత్రలో చాలా ఆకట్టుకుంటుంది. ప్రత్యేకించి కొన్ని క్లోజప్స్ లో తన అంతు తెలియని విషాదపు నవ్వు కదిలించేస్తుంది.

ఈ సినిమాలో మరో రెండు పాత్రలు ఉంటాయి. ఒకటి మి సుక్ స్నేహితురాలు. చాలా నార్మల్ పాత్రను అంతే నార్మల్ గా నటిస్తుంది. ఇక రెండోది… చోయ్ డియోక్-మూన్ చేసిన ప్రేమికుడు పాత్ర. సినిమా మొదటి సీక్వెన్స్ లో పరిచయమయ్యే పాత్రలలో ఇదొకటి. మిన్-ఆ ను ట్రాఫిక్ లో కాపాడే కుర్రాడు. అతని కథ కూడా రొటీన్ గా ఉండే ప్రేమ కథే. కానీ కథలో దీన్ని మంచి ప్లాట్ డివైస్ గా వాడుకున్న తీరు గొప్పగా ఉంటుంది. దానికితోడు ఇతను కనిపించిన కొన్ని క్షణాలు గుర్తుండిపోయే నటకౌశలం చూపిస్తాడు. He has an impressive filmography with a variety of roles in a lot of different genres. సినిమాలకన్నా ఎక్కువ సీరియళ్ళలో కనిపించాడు ప్రముఖంగా. ఈ సినిమా తదనంతర కాలంలో మంచి థియేటర్ ఆర్టిస్టు గా కూడా రాణించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here