కొరియానం – A Journey Through Korean Cinema-18

0
7

కిమహమ్

Chapter 16

ఎలా?

[dropcap]మీ[/dropcap]డియమ్ లేదా రాంగ్జాంగ్ సినిమా కథను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది ఒక ఎపిక్ స్కోప్ ఉన్న సబ్జక్ట్ అనిపిస్తుంది. ఏ రాజమౌళి లాంటి వాళ్ళైతే ఒళ్ళు గగుర్పొడిచే action sequences తో action thriller గా తీయగలరు. బాలా లాంటి వాళ్ళు ఇదే తరహాలో (ప్రస్తుతం ఉన్న హారర్ జాన్రాలోనే) రియలిస్టిక్ డ్రామాగా మల్చేవాళ్ళు. ఇక్కడ మన దర్శక ద్వయం పిశాంతనకున్, న హాంగ్-జిన్ లు ఈ సినిమాను ఎలా తీయాలి అన్న దాని మీదనే ఎక్కువ టైమ్ గడిపారు. ఏ సినిమాటిక్ టెక్నిక్ వాడాలి? ఏ జాన్రాకు అంకితమవ్వాలి? ఎలాంటి ప్లాట్ డివైసులు వాడాలి అన్నది స్పష్టంగా నిర్ణయించుకుని రంగంలోకి దిగటానికి పట్టిన సమయం సినిమా షూటింగ్‌కు, కథ తయారు చేసుకుని స్క్రిప్టు పని చేసుకోవటానికి కూడా పట్టలేదు.

వారి ఆలోచన ఒక real culture-based fictitious story ని వీలైనంత వాస్తవానికి దగ్గరగా చూపిస్తూ, ముందు జనం మెదళ్ళలో ఇంకించాలి. తరువాత అదే ఊపులో ఆలోచన రేకెత్తించాలి.

అందుకు ఎన్నుకున్న మార్గం mockumentary style. The Blair Witch Project, Paranormal Activity తరహాలో దీన్నీ Found Footage సినిమాగా తీయాలి. మన కళ్ళ ముందు ఒక రికార్డెడ్ ఈవెంట్‌గా చిత్రించాలి.

నిమ్ వ్యథ

ఈ సినిమాలో ప్రధాన పాత్ర నిమ్. ఆమె ఒక షమన్. ప్రస్తుత కథా కాలంలో ఆ కుటుంబంలో తరతరాలుగా బాయన్ దేవత ఆవహించటానికి ఒక మీడియమ్‌లా ఉపయోగపడే వ్యక్తులలో ఈ తరానికి చెందిన వ్యక్తి. కానీ ఆమె నిజానికి ఇలా రాంగ్జాంగ్ అవాల్సిన మనిషి కాదు. ఆమె సోదరి బదులు ఈమె ఇలా మారవలసి వచ్చింది. ఆ సోదరి క్రిస్టియానిటీలోకి మారి, తన దారిన తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతుంది. తన కుటుంబం కోసం నిమ్ మాత్రం షమన్‌గా మారుతుంది.

ఎన్నో అనుభవాలు. మరెన్నో కష్టాలు. చేస్తున్న పనిని మాత్రం చాలా ఇష్టపడి చేస్తుంది నిమ్. కాలం గడుస్తుంది. నిమ్ శరీరంలో సత్తువ హరించుకుని పోతుంది. క్రమంగా వయసు మీద పడుతుంది. ఇప్పుడు తన కుటుంబంలో మరో కొత్త మీడియమ్ రావాల్సిన సమయం.

మరో వైపు నిమ్ అక్క నోయ్ వెళ్ళిన కుటుంబంలో ఎన్నో ఉత్పాతాలు. ఆమె మామగారి ఫాక్టరీ దివాళా తీస్తుంది. దానికి నిప్పు పెట్టి బీమా పొందాలని చూస్తే ఆ ప్లాన్ బైటపడి ఆత్మహత్య చేసుకోవలసి వస్తుంది. కొడుకు మ్యాక్ బైక్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు కానీ, దాని వెనకాల ఇంకా ఏదో మిస్టరీ ఉందని నోయ్‌ను మనసు హెచ్చరిస్తుంది. ఇంట్లో మగ పురుగంటూ మిగలదు, జంతువులలో సహా. ఏదో రూపంలో వారిని చావో, మరో ఘోరమైన దురదృష్టమో వెతుక్కుంటూ వస్తుంది. ఆ కుటుంబాన్ని స్థిమితంగా ఉండనివ్వదు.

ఈ సినిమాను సరిగ్గా ఇలాంటి మూమెంట్ లోనే మొదలు పెడతారు. ఒక డాక్యుమెంటరీ టీమ్ థాయిలాండ్ ఈశాన్యపు భాగంలో ఉన్న షమనిజమ్ గురించి ప్రపంచానికి తెలియజెప్పాలని అక్కడికి వెళ్తారు. వారు మన నిమ్‌ను కలసి ఆమె రోజువారీ జీవితం ఎలా ఉంటుందో కొన్నాళ్ళు చిత్రిస్తాము అని అడుగుతారు. వారు తీసిన ఫుటేజే ఈ సినిమా. నిమ్ అప్పుడు నోయ్ భర్త విరోజ్ అంతిమక్రియలకు హాజరవటానికి బయలుదేరబోతోంది. పై వివరాలన్నీ నిమ్ వారికి చెప్తుండగా వారు ఆమెని ప్రశ్నిస్తుంటారు. నిమ్ వారికి తగిన సమాధానాలిస్తుంటుంది.

తన ధర్మాన్ని కుటుంబం కోసం నిర్వర్తిస్తున్న నిమ్ జీవితం మామూలుగా ఆలోచిస్తే బాగనే సాగుతుంది. ఆ ప్రాంతం వారు మనుషులలోనే కాదు, ప్రతి చేతనాచేతన వస్తువులలో కూడా ఆత్మశక్తి ఉంటుందని, అవన్నీ మనను గమనిస్తుంటాయని, మనతో సంభాషిస్తుంటాయని నమ్ముతారు. చెట్టూ చేమలే కాదు, రాళ్ళూ రప్పలు కూడా దైవ సృష్టిలో భాగమే.

తోటివారికి సహాయం చేస్తూ, తన భుక్తిని సంపాదించుకుంటూ ఉంటుంది నిమ్. ఆమెకున్న వ్యథ అల్లా తన తరువాత ఎవరు అనేదే. దానికి తోడు తన సోదరి కుటుంబంలో అరిష్టాలు.

శప్త మింక్

అలా ఆ డాక్యుమెంటరీ టీమ్‌తో వెళ్తుంది నిమ్. ఆ సందర్భంలో, నోయ్, నోయ్ extended family, నిమ్ మాత్రమే కాకుండా ఆ డాక్యుమెంటరీ బృందం కూడా నోయ్ కూతురు మింక్ వింతగా ప్రవర్తించటం గమనిస్తారు. మింక్ సినిమా ప్రారంభం కావటానికి ముందరి కథా కాలంలో సాధారణమైన 20 ఏళ్ళ యువతి. అందరి లాగనే ఆడుతూ పాడుతూ కాలం గడిపేది. తన తోటి వారి లాగానే. తల్లితో చర్చ్‌కు వెళ్ళేది. సరదాగా ఉండేది. కుటుంబ ప్రస్తుత పరిస్థితి వల్ల ఉద్యోగం చేస్తోంది.

కానీ ఇప్పుడు నిమ్ గమనిస్తుంటే తనలో ఎందరో వ్యక్తులు ఉన్నట్లుగా ప్రవర్తిస్తుంటుంది. ఒక వేశ్య. ఒక బాలుడు. ఒక తాగుబోతు ముసలాడు, ఇంకొక తెలియని తీవ్రమైన దుష్ట శక్తి.

బాయన్ దేవతకు ఆవాహనా మార్గం కాకుండా ఆమె తల్లి నోయ్ తప్పించుకున్నందుకు ఈమెకు శిక్ష పడిందా? ఈ కోణంలో ఆలోచిస్తుంది నిమ్. ఇప్పుడు బాయన్ దేవత మింక్‌ను తన తరువాత మీడియమ్‌గా తనకు తెలుపుతోందా అని భావిస్తుంది. అదే విషయాన్ని నోయ్‌కు చెప్తుంది. ఇన్ని జరిగినా నోయ్ తను చేసిన పని వల్లే విరోజ్ కుటుంబానికి ఇన్ని ముప్పులొస్తున్నాయని, తన కుటుంబం ఛిన్నాభిన్నమైందని, మిగిలిన ఒక్క కూతురు జీవితం కూడా నాశనం కాబోతోందని ఒప్పుకోదు (నమ్మకపోవటం కాదు. Remember this point). అహం అడ్డు వస్తుంది.

ఒక్కసారి ఆవాహనా కార్యక్రమం నిర్వహిద్దామని అడుగుతుంది నిమ్. వినదు నోయ్. మింక్ పరిస్థితి అంతకంతకూ దిగజారుతుంటుంది. చెవులలో ఏవేవో శబ్దాలు. మెదడులో ఏవో శక్తులు దూరి తనను నియంత్రించే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపించటం. తెరలు తెరలుగా కడుపులోను, యోనిలోను నెప్పులు. తేరుకునే సమయం చిక్కదు. శక్తి హరించుకుని పోతుంటుంది పిల్లకు.

నిమ్ అన్వేషణ

నిమ్ ప్రార్థిస్తుంది. ఆలోచిస్తుంది. తనకు తెలిసిన మార్గాలన్నీ అన్వేషిస్తుంది. ఒకానొక క్షణంలో ఇదంతా బాయన్ దేవత వల్ల కాదేమో అని భావిస్తుంది. ఒకసారి ఆ కోణంలో అన్వేషిద్దాం అని నిర్ణయించుకుని, తరచి చూస్తే నమ్మలేని కాదు. తట్టుకోలేని నిజాలు బయట పడతాయి.

Nim discovers that there’s an incestuous relationship involved in the case of Mink. మింక్ సోదరుడు Mac అందరూ అనుకునేట్లు మోటర్ బైక్ ప్రమాదంలో చావలేదు. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం?

The unbearable pressure from the incestuous relationship with his sister Mink. అంటే… ఇప్పుడు Mac ఆత్మ మింక్ మీద ప్రతీకారం కోసం తహతహలాడుతూ ఆమెను వేధిస్తోందా?

నిమ్ ఆలోచనలో పడుతుంది. ఒకటి మాత్రం ఖచ్చితం. తను గట్టిగా ప్రయత్నించి ఆపకపోతే Mac వల్ల మింక్‌కు ప్రాణ నష్టం జరగటం ఖాయం. మింక్‌కు తన సహాయం అవసరం. కానీ నోయ్ నిమ్‌ను దరిదాపులకు రానీయదు. ఇంతలో ఒక సందర్భంలో మణికట్టు దగ్గరకి నరాలను కోసుకుని అపస్మారక స్థితిలో మింక్ కనిపిస్తుంది. అంతా ముగిసినట్లేనా? ఆశ లేదా?

నోయ్ ఘోర తప్పిదం

ఇప్పటికైనా బాయన్ దేవత ఆగ్రహాన్నో, అనుగ్రహాన్నో నిజమని నమ్మిందో లేక డెస్పరేషనో తెలియదు కానీ, నోయ్ తన కూతురును బాయన్‌కు మీడియమ్‌గా చేద్దామని అనుకుంటుంది. దానికి నిమ్ సహాయం తీసుకునేందుకు అహం అడ్డు వస్తుంది. అందుకే ఆ షమనిజమ్ సెరిమనీని నిమ్‌కు తెలియకుండా చేయటానికి తెగబడుతుంది. నిజానికి నిమ్ ఆ పని చేయాలి. కేవలం తన నుంచీ బాయన్ దేవతను భరాయించగలిగే శక్తిని మింక్‌కు ధారపోయటం మాత్రమే. మిగతాది దేవతా శక్తి చూసుకుంటుంది. కుటుంబానికి చెందని వేరొక వ్యక్తి చేత ఆ పని చేయించటం పెద్ద తప్పు.

నోయ్ చేసిన ఈ పొరబాటు వల్ల జరుగబోయే అనర్థాలు చాలా ఘోరంగా ఉంటాయి.

శ్రేయాన్స్వధర్మో విగుణః పరధర్మాత్స్వనుష్ఠితాత్।

స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః॥

<<శ్రేయాన్ – స్వధర్మః – విగుణః – పరధర్మాత్ – స్వనుష్ఠితాత్ – స్వధర్మే – నిధనం – శ్రేయః – పరధర్మః – భయావహః>>

స్వనుష్ఠితాత్ = చక్కగా ఆచరింపబడిన

పరధర్మాత్ = ఇతరుల ధర్మం కన్నా

విగుణః = గుణరహితమైనప్పటికీ

స్వధర్మః = స్వీయ ధర్మం

శ్రేయాన్ = అత్యుత్తమమైనది

స్వధర్మే = తన ధర్మంలో

నిధనం = చనిపోవడం

శ్రేయః = ఉత్తమమైనది

పరధర్మః = ఇతరుల ధర్మం

భయావహః = భయంకరమైనది.

సెరిమనీ చేయబూనటం వల్ల ఫలితం ఊహకందని రీతిలో ఉంటుంది. మింక్ ఒకానొక సందర్భంలో ఆ డాక్యుమెంటరీ బృందం దగ్గర ఉన్న కెమేరా లాక్కుని తల్లి నోయ్‌ను చితక్కొడుతుంది. ఇక్కడే ఒక విషయం స్పష్టమవుతుంది. రాబోయే పరిస్థితులకు ఈ సన్నివేశం ఒక చిన్న ట్రైలర్ మాత్రమే.

ఈ సెరిమనీ అయ్యిందనిపించాక మింక్ పరిస్థితి రోజు రోజుకూ దిగజారటం మొదలౌతుంది. ఇప్పటిదాకా తన కుటుంబానికే పరిమితం చేసిన తన ఆగ్రహాన్ని తన extended family మీదకూ మళ్ళిస్తుంది.

దేవతకు ఎందుకు అంత కోపం?

పిల్లల్ని భయపెట్టటం, వెంటాడటం, తినబోవటం, ప్రేమగా పెంచుకున్న కుక్కపిల్లను బతికుండగానే ఉడికించి పీక్కుతినటం, రాత్రిళ్ళు తల్లిని వేధించటం (can’t spell it out)… అంతూ పొంతూ ఉండదు ఈ రాక్షస చేష్టలకు.

ఈలోగా నిమ్ దిక్కుతోచక ప్రార్థించటం కోసం బాయన్ దేవత విగ్రహం ఉన్న చోటుకు వెళ్తుంది. అక్కడ ఎవరో దేవత విగ్రహాన్ని నాశనం చేస్తారు. నిమ్ బిగుసుకు పోతుంది!!!

పై శ్లోకాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చేవారం కలుద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here