కొరియానం – A Journey Through Korean Cinema-24

0
7

వెన్నులో మొదలైంది చలి

Chapter 23

[dropcap]కొ[/dropcap]రియన్ వేవ్ మొదలయ్యాక ముగ్గురు దర్శకులు మిగిలిన వారి నుంచీ వేరయి తనదైన ప్రత్యేక శైలిని చాటుకున్నారు. అతి త్వరలోనే మాస్టర్స్‌గా ముద్రను వేయించుకుని, చట్రాలలో ఇరుక్కోకుండా, లిమిటేషన్లు లేకుండా తమదైన కళా సృష్టిని చేశారు.

Like Ayn Rand said,

Art is a selective recreation of reality according to the artist’s metaphysical value judgements.

ఆ విధంగా తమదైన శైలిలో తమ కలను విశ్వవ్యాప్తం చేసుకున్నారు. (కల బదులు కళ వాడినా అర్థంలో మార్పు ఉండదు. కావాలంటే try చేయండి).

వారే…

ఈ చాంగ్ డాంగ్ (Lee Chong-dong).

కిమ్ కి డుక్ (Kim Ki-duk)

పార్క్ చాన్-వుక్ (Park Chan-wook).

ఈ ముగ్గురివీ మూడు విభిన్నమైన శైలులు. వారిలో కిమ్‌ది ఒక రకమైన extreme style. కొంత మందైతే అతని కథలు body horror genre కిందకు వస్తాయి అని అంటారు.

ఈ లేదా లీ అనుకుందాం కాసేపు. ఈ చాంగ్-డాంగ్‌ది అత్యున్నతమైన శైలిగా అతని సినిమాలు చూసేవారు అభివర్ణిస్తారు. ఎందుకంటే అతని కథలు, కథనాలు, దర్శకత్వం వీలైనంత గంభీరోదాత్తతలు నింపుకుని ఉంటాయి. చాలా cerebral గా ఉంటాయి ఇతని సినిమాలు.

గతంలో పోయెట్రీ సినిమా టైమ్‌లో చెప్పుకున్నట్లు ఇతను ఒక ప్రత్యేకమైన శైలిని చూపుతాడు. అది పైకి సంపూర్ణంగా కనపడదు. సరిగ్గా ఇతని సినిమాలు సంపూర్ణంగా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక్కటే మార్గం. అతని శైలి గురించి అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఈయన తీసిన సినిమాలు Strombolian films, శుద్ధ ఆర్టు సినిమాలు అని మనం పొరబడే అవకాశం ఉంది. అలా అనుకుంటే కనీసం ఒక అరడజను గొప్ప సినిమాలను మనం అనుభవించలేము.

దర్శకుడు ఈ మనకు తెరమీద చూపించే దృశ్యానికి మన ఆలోచనను జోడించాలి. ఆ దృశ్యం మన మదిలో ఎలాంటి ఆలోచన కలిగించిందో దానిని నేరేషన్‌లో భాగంగా స్వీకరించి ఆ రెంటినీ కలిపితే మనకు సంపూర్ణ దృశ్యం ఆవిష్కృతం అవుతుంది. అర్థం చేసుకోవటం కష్టంగా ఉంది కదా. కానీ, ఒకసారి అతని శైలి, ఆ టెక్నిక్ అర్థమయితే మనకు peak of Satyajit Ray and Yasujiro Ozu స్థాయి సినిమాలు చూసిన అనుభవం కలుగుతుంది. వారిది విభిన్నమైన శైలి అనుకోండీ. దర్శకుడు ఈ మటుకూ ప్రేక్షకులను గౌరవిస్తాడు. తన స్థాయి వాళ్ళు అనుకుంటాడు. ఒకవేళ తనను అందుకోలేని వాళ్ళైనా వాళ్ళకు తన చేయిని అందించి ఒక అడుగైనా పైకి లేపటానికి ప్రయత్నిస్తాడు కానీ, తన స్థాయిని తగ్గించుకోడు. తన తీతను (తీత = (here) filmmaking) దిగజార్చడు.

ఇక మిగిలింది మన పార్క్.

కొరియాలో కూడా మన లాగానే (అంటే తెలుగు వారి లాగానే) ఇంటి పేరు, ఒంటి పేరు ఉంటాయి. వాటిలో ఇంటి పేరు ముందు, అసలు పేరు తరువాతా రాసే పద్ధతే. ఇప్పుడు మనం దర్శకుడు పార్క్ అంటున్నామంటే ప్రస్తుతానికి పార్క్ చాన్-వుక్ అనే. కానీ, అసలు ఆ వ్యక్తి పేరు చాన్-వుక్. కొరియాలో 276కు పైగా ఇంటి పేర్లున్నాయి ప్రధానమైనవి, వాటిలో బాగా పాప్యులర్ అయినవి పార్క్, చోయ్. ఇవన్నీ దాదాపు వంశ నామాల్లాంటివి.

ఇలాంటి పార్కులు కొన్ని డజన్ల మంది తగిలినా, మన కొరియానం వరకూ ప్రత్యేకించి చెప్పకపోతే అది పార్క్ చాన్-వుక్ అనే.

అసలు విషయానికి వద్దాం.

పార్క్ చాన్-వుక్‌ది అందీ అందని శైలి. అసలు ఇతని సినిమాల పేర్లు, కొన్ని దృశ్యాలు తల్చుకుంటే వెన్నులో మొదలౌతుంది చలి. అంత భయానకంగా ఉంటాయి ఆ దృశ్యాలు.

నిజానికి ఇతని సినిమాలు వైలెన్స్‌ని నిరసిస్తాయి. దృశ్యం కూడా ఎంత వైలెంట్‌గా ఉందని అనిపించినా, అంతకన్నా వైలెన్స్ మనం చూసే ఉంటాము. కిమ్ కి-డుక్ సినిమాలు పార్క్ సినిమాలకన్నా దృశ్య పరంగా వైలెంట్‌గా ఉంటాయి. అసలు ఇంత వైలెన్స్ అవసరమా? అని కూడా మనకు అనిపిస్తుంది.

కానీ, సినిమా చూస్తున్నంత సేపూ పార్క్ సినిమాలే ఎక్కువ వైలెంట్ అనిపిస్తాయి. మనను భయపెట్టేస్తాయి ఆ దృశ్యాలు. ఒక పట్టాన వదలవు కూడా.

కారణం ఏమిటంటే, కిమ్ సినిమాలలో వైలెన్స్ ఒక స్థాయి దాటాక కేరికేచర్‌గా మారిపోతుంది. కానీ, పార్క్ దృశ్యాలు మన మనసు, మస్తిష్కం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తాయి.

Decision To Leave లో కూడా అంతే. తొలిసారి కథానాయిక స్యో-రే ను చూసినప్పుడు మన వెన్ను జలదరిస్తుంది. అంత అద్భుతమైన సౌందర్యరాశిని చూసినందు వల్ల కలిగిన చలింపు వల్ల కావచ్చు. లేదా ఆమెలో ఆ అందం వెనుక, ఆకర్షణ వెనుక దాగి ఉన్న చీకటి లోతుల వల్ల కావచ్చు.

ఒకచోట కథానాయకుడు హే-జూన్ ఇంటరాగేషన్‌లో అడుగుతాడు, “నీ భర్త మరణించినందుకు నీక బాధ లేదా?” అని. అప్పుడు లేదని చెప్తూ మనవైపు (ఆడియన్స్ – breaking the 4th wall without doing so. సినిమా చూస్తే బాగా అర్థమవుతుంది ఇది) చూస్తూ నవ్వీనవ్వనట్లు నవ్వుతుంది. ఆ శబ్దం మన వెన్నెముక, నాడీవ్యవస్థ (వెన్నెముక పై భాగం, పుర్రె కింద) కలగలిసే చోట ప్రతిధ్వనిస్తుంది. అంత ఎఫెక్ట్ చేస్తుంది ఆ విజువల్.

ఇంతలో ఎవరో అంటారు, “చూడు చూడు ఆమె నవ్వుతోంది.” అని. ఠక్మని ఆపేస్తుంది.

మరో చోట నీ భర్త మరణం నీకు పెద్ద షాక్ కలిగించి ఉంటుంది అనుకుంటా అంటారు. కేవలం తల అడ్డంగా ఊపుతుంది. కానీ, ఆమె కన్నుల అంచులు మనం గమనిస్తే ఒళ్ళు జలదరిస్తుంది.

ఇదంతా నటన పరంగా. దానికి విజువల్ డిటేల్ (detail) కలుపుతాడు పార్క్. ఆ పైన ఆడియో (మ్యూజిక్). ఇక చూడండి మన పరిస్థితి.

స్టీవ్ జాబ్స్ చెప్పే Reality Distortion Field ను మించిన గ్రిప్ సాధించే టెక్నిక్‌ను ప్రేక్షకుల మీద ప్రయోగిస్తాడు పార్క్.

ఇక అసలు సన్నివేశం!

నేనంత వెధవని అనుకున్నావా? అంటాడు హే-జూన్. ఒక సందర్భంలో చివర చివరకొచ్చేసరికి.

ఇంత వరకూ జరిగిందేంటి? అని చాలా casual గా అనిపించేలా విపరీతమైన intensity తో స్యోరే చెప్పే జవాబు, మొహంలో ఏ expression కనబడకుండా గుచ్చి చూసే తీరు… పగలు పూట కూడా మనని వెంటాడుతుంది.

నటుల దగ్గర నుంచీ హేర్ పిన్ వరకూ, లైటింగ్ నుంచీ శ్వాస శబ్దం వరకూ తనకు అందుబాటులో ఉన్న ప్రతి వనరునూ ప్రయోగించి ప్రేక్షకులను తన గ్రిప్ లోకి తీసుకుని తను సృష్టించిన లోకంలో బందీని చేస్తాడు.

అందుకే నేను పార్క్ చాన్-వుక్ శైలి సినిమాను Total Cinema అంటాను.

మీరు టోటల్ ఫుట్బాల్ అనే మాట బాగా వినే ఉంటారు. లేకపోతే మీకు చదువు రాదనే అంటాను. ఎందుకంటే దాదాపు 30 ఏళ్ళుగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ సాకర్ ప్రపంచ కప్ జరుగబోయే ముందు ప్రధాన పత్రికలన్నీ సాకర్ ప్రపంచ కప్ విశేషాలు రాస్తూనే ఉన్నాయి. ఆ యా సందర్భాలలో మనం ఎక్కడో ఒక చోట 1974 లో డచ్చి ఆటగాడు Johan Cryuff పేరు, డచ్చి జట్టు ఆడిన శైలి గురించి చెప్తూ వాడిన మాట… టోటల్ ఫుట్బాల్ ను గురించి వినకుండానో చదవకుండానో ఉండము.

Total football involves a tactical system in world soccer in which any outfield player can take over the role of any other player in the team. Forward or striker, mid-fielder, defender అన్న తేడా లేకుండా ప్రతి ఆటగాడూ జరుగుతున్న ఆటలో ఎదురయ్యే ఆ యా సందర్భాలను బట్టీ ఏ పాత్ర అయినా పోషించటానికి సిద్దంగా ఉండాలి.

ఇక్కడ పార్క్ చాన్-వుక్ దగ్గరకు వస్తే అందుబాటులో ఉన్న ఏ రిసోర్స్ అయినా తెరపై తాను ఆవిష్కరించే దృశ్యాన్ని enhance చేయటానికి వాడతాడు. ఆడియో, విజువల్, physical prop అన్న తేడా లేదు.

అందుకే పార్క్ లాంటి దర్శకులు ప్రపంచంలో చాలా అరుదు.

అతను తీస్తోంది పల్ప్ ఫిక్షనా (పల్ప్ సినిమాలు), ఉదాత్తమైన కథాంశాలా అన్న తేడా ఉండదు. శంఖంలో పడ్డదంతా తీర్థమే అన్నట్లు అతను ఏ సబ్జక్ట్ తీసినా, కళాత్మకంగా అది అత్యున్నత స్థాయిలోనే ఉంటుంది.

కానీ, అతని కథల్ ఎక్కువ భాగం క్రైమ్, వైలెన్స్, సెక్స్‌కు సంబంధించినవే ఉంటాయి. ఎందుకంటే… అతను తీసే ప్రతి సినిమా ఆ యా సబ్జక్టుల మీద సెటైరే. కనిపించే దృశ్యం ఒక కథ చెపితే, దాని నీడ మరో విషయం చెప్తుంది.

Park Chan-work himself is a satire on the frailties of the behavioural traits of human beings. అలాంటి వాడి కళ ఇంకెంత వ్యంగం ప్రదర్శిస్తుంది మనిషి మనుగడ మీద?

వచ్చే వారం కలుద్దాం.

అప్పటి దాకా ఎండలు మళ్ళా ప్రతాపం చూపుతున్నట్లున్నాయి… మంచినీళ్ళు ఎక్కువ తాగుదాం. By the way, చెప్పటం మరచితిని, మరీ ఎక్కువ మినరల్ వాటర్ వాడకండి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here