కొరియానం – A Journey Through Korean Cinema-32

0
10

తిరక్కథ 2

[dropcap]O[/dropcap]ldboy సినిమా 2003లో వచ్చింది. అప్పటి కాలానికే కాదు, విజువల్స్, సౌండ్ డిజైన్, ఎడిటింగ్, టేకింగ్, స్టోరీ నేరేషన్, ఇలా ఏ విధంగా చూసినా సినిమా చాలా ఉన్నతంగా ఉంటుంది. సినిమాలో ఉన్న ఒకే ఒక లోపం కథ. ఒక హై కాన్సెప్ట్. అలా నిజ జీవితంలో జరిగే అవకాశాలు ఉండవచ్చు కానీ, అవి చాలా చాలా తక్కువ. కానీ, చూసిన వాళ్లు ఆ కథకు ఎందుకు అంత కనక్ట్ అయ్యారు?

అనొచ్చు, సినిమా అంటేనే పెద్ద ఫేంటసీ. అంతా నిజమవ్వాలని ఏముమటుంది అని. నిజమే కదా. అందుకేగా Larger than Life హీరోలు, విలన్లు మన సినిమాల్లో ఉండేది. అలాంటి సినిమాలో ఎక్కువ ఆడుతున్నాయి. అంటే ఎక్కడో చోట ఏదో ఎమోషనల్ కనక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి, అక్కడి నుండీ మనం సినిమాకు హుక్ అవుతాము. అంత ఎమోషనల్ కనక్ట్ మనకు, తన సినిమాలోని ఏ పాత్రకూ కలుగకుండా దర్శకుడు పార్క్ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు.

అయినా ఆ సినిమా ఎందుకంత కదిలించిందంటే, అందులో పాత్రలకన్నా మనం అందులో ఉన్న inherent human emotions కు కనక్ట్ అవుతాం. అంటే పాత్రలతో సంబంధం లేదు. ఆ ఎమోషన్లలో పడి మనం ఆ పాత్రల ఆనంద విషాదాలు, కోప శాంతాలు (దుష్ట సమాసమా? – let’s leave it), తపనలు, అన్నీ అనుభవిస్తాం. కానీ, ఆ పాత్రలతో మమేకం కాము.

మనకు కావలసినది ఆ సినిమా. అందులో కథ. అది ఎలా నడుస్తుంది? అది ఎలా ముగుస్తుంది. ఇంతే!

బలవంతంగా అయినా సరే, దర్శకుడు పార్క్ మన దృష్టి వీటి మీదే ఉండేలా అన్ని చర్యలు తీసుకున్నాడు. మనల్ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు.

A wide screen iPod with touch controls, a revolutionary mobile phone, a breakthrough internet communicator. So, three things.

A wide screen iPod with touch controls, a revolutionary mobile phone, a breakthrough internet communicator.

A WIDE SCREEN IPOD WITH TOUCH CONTROLS. A REVOLUTIONARY MOBILE PHONE. A BREAKTHROUGH INTERNET COMMUNICATOR.

2007లో స్టీవ్ జాబ్స్ చెప్తున్నప్పుడు ఎవరికీ చిరాకు కలుగు లేదు. వీడేంట్రా Oldboy అని మొదలు పెట్టి, నిజానికి సుఖీ గురించి కొనసాగించాలి, హఠాత్తుగా ఏవో tech announcement గురించి చెపుతున్నాడు అని ఇది చదువుతున్న వాళ్ళు చిరాకు పడుతున్నట్లు. పైగా స్టీవ్ జాబ్స్ మాటలకు శృతిలో నవ్వుతూ, కేరింతలు కొట్టారు.

అక్కడ చెప్పిన విషయంలో పస ఉండటమే కాదు. స్టీవ్ జాబ్స్ మాటలు ఒక మంత్రంలా పని చేశాయి అక్కడి ప్రేక్షకుల మీద. అతని నాద ‘స్వరం’కు అందరూ లొంగిపోయారు. ఎలా నడిపిస్తే అలా నడిచారు.

తొట్టతొలి ఐఫోన్ కన్నా ఆ కాలంలో గొప్ప స్మార్ట్ ఫోన్లు లేవా? ఎందుకు లేవు? బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ, ఇలా జనంలోకి ఎలా ఎక్కించి పేకేజ్ చేసి వదలాలో స్టీవ్ జాబ్స్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. దాన్నే Reality Distortion Field అనరు.

మీరు సరిగ్గానే చదివారు. అనరు.

వశీకరణం చేసుకోవటం అంటారు. మాటే మంత్రము కదా.

అలాగే మన పార్క్ కేవలం విజువల్స్ ద్వారానే కాకుండా సినిమాలో వాడే శబ్దాలు, నిశ్శబ్దాలు, వాడే రంగులు.. ఇలా ఒకటేమిటి మనం గమనించేవి, గమనించనివి అన్ని వనరులను వాడుకుని మన్ను తన సినిమా ప్రపంచంలో బందీని చేస్తాడు. మన్ని ట్రోల్ చేస్తాడు. మన మేథను చాలెంజ్ చేస్తాడు. మనం మనకు పెట్టుకున్న లిమిటేషన్లను వదిలించుకుని God Sees Truth But Waits అన్నట్లు మనల్ని కేవలం నిమిత్తమాత్రమైన సాక్షులుగా ఉండి సినిమా చూడమని చెప్తాడు.

అలా చూస్తేనే తన సినిమాల అసలు అంతరార్థం బోధపడుతుందని అంటాడు.

అందుకే ఈనాటికీ Oldboy అంత గొప్ప సినిమాగా నిలిచింది. మరి అప్పటికి పదమూడేళ్ళ తరువాత వచ్చిన The Handmaiden ఇంకెంత గొప్పగా ఉండాలి? దీన్నే నిజమైన ప్రగతి అంటారు. ఈరోజుకన్నా రేపు, రేపటికన్నా ఎల్లుండి, ఇలా కాలం గడుస్తున్నా కొద్దీ మనలో improvement లేకపోతే అది కళ అయినా, జీవితం అయినా ఎందుకూ కొరగాని సరుకే.

అందుకే పార్క్ సినిమాల్లో మొదటి సన్నివేశం, సీక్వెన్స్, సంపూర్ణంగా విశ్లేషించుకోవాలి.

The Handmaiden లో మొదట జపాన్ కొరియానం ఆక్రమించుకున్నాడు సమయం అని సరిగ్గా ఎస్టాబ్లిష్ చేస్తాడు. అయ్యాక మన్ని క్రమక్రమంగా సుఖీ ప్రపంచంలోకి తీసుకువెళ్తాడు.

సుఖీ అనాథ. ఆమెను పెంచిన వ్యక్తిని కౌంట్ అనే వ్యక్తి వచ్చి కలుస్తాడు. తను ఒక పెద్ద ఆస్తికి వారసురాలైన అమ్మాయిని పెళ్ళి చేసుకుని, ఆమె ఆస్తిని స్వంతం చేసుకునేందుకు ఒక పన్నాగం పన్నానని, ఆ పన్నాగం పారాలంటే తనకు ఒక సహాయకురాలు కావాలని అడుగుతాడు. ఇది నవలలో అజంటిల్మన్ పాత్రకు equivalent అని మనకు ముందే తెలుస్తుంది.

కానీ అజంటిల్మన్ పాత్రకు, ఈ కౌంట్‌కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. దాన్ని మనకు కేవలం మూడు షాట్లలో రిజిస్టర్ చేస్తాడు. ఇది చాలా గొప్ప టెక్నిక్. అలా చేసే క్రమంలో సుఖీని ఆ భవంతికి పంపటం, అక్కడ క్రమంగా సుఖీ హిడేకో కు దగ్గర కావటం జరుగుతుంది. కానీ, నవలలో అజంటిల్మన్‌కు మాడ్ అంకుల్ Christopher Lilly మధ్య పెద్ద లావాదేవీలు ఉండవు. కానీ ఇక్కడ, హిడేకో అంకుల్ మాత్రమే కాదు, సుఖీని పెంచిన దొంగల రాణి పాత్ర కూడా తన కష్టాలు గట్టెక్కాలంటే కౌంట్ మీద ఆధారపడి తప్పదు.

దీనివల్ల మనకు ఈ తిరోగమన అధో జగత్ పాత్రల మీద సానుభూతి కలుగుతుంది. నవలలో వీరు protagonists కనుక ఈ ఎమోషన్ కలగాలి, antagonist కనుక ఈ ఎమోషన్ కలగాలని ట్యూన్ అవుతాము. ఇక్కడ ఆ మేనిపులేషన్ లేకుండానే మనం పాత్రల సమస్యలను మన సమస్యలుగా భావిస్తాం.

కానీ పార్క్ ఉద్దేశం అది కాదు. పాత్రలకన్నా కథ మీద మన దృష్టి నిలవాలి. దాని కోసమే ముందు మనని detract చేయటానికి వైలెన్స్ వాడతాడు. రొమాన్స్ డోస్ పెంచుతాడు. కానీ, ఆల్రెడీ మనం ట్యూన్ అయి ఉన్నాం కనుక ఆ వైలెన్స్ కానీ, డోస్ పెరిగిన రొమాన్స్ ఇబ్బంది పెట్టవు.

మరో విషయం అక్కడ కథలో ప్రధానంగా అందరూ అజంటిల్మన్ గేమ్‌లో పాత్రలే. ఇక్కడ ఒకరి మీద ఒకరు ఎత్తులు, పైయ్యెత్తులు (pun certainly intended) వేసుకుంటారు. అంటే అన్నీ యాక్చివ్ పాత్రలు. So, in this way, Park slowly but steadily drives us away from emotionally investing on characters after having a proper grip on us. Instead we shift our focus on to who will and how will they win instead of rooting for someone or others.

మొత్తం మీద మూడు ముక్కల్లో చెప్పాలంటే, మొదటి అంకంలో కౌంట్ తన గేమ్ మొదలుపెట్టి సుఖీని పాత్రగా తీసుకుంటాడు. పావులాగా హిడేకో కనిపిస్తుంది.

రెండవ అంకంలో అది నిజానికి హిడేకో, కౌంట్‌ల గేమ్ అనిపిస్తుంది. పావు/విక్టిమ్ సుఖీ.

మూడవ అంకంలో మధ్యలో ఎవరికీ తెలియకుండా గేమ్ హిడేకో చేతుల మీదుగా సుఖీకి transfer అవుతుంది. సానుభూతి దక్కని విక్టిమ్స్‌గా కౌంట్, హిడేకో అంకుల్ మిగులుతారు.

వీటి తరువాత పుస్తకంలో లేని విధంగా స్టన్నింగ్ ఎపిలోగ్ వస్తుంది. ఇలా ఈ సినిమా సోర్స్ మెటీరియల్ కన్నా గొప్పగా వచ్చింది. అందుకే one of the greatest modern classics గా నిలిచి పెద్ద భాక్సాఫీస్ సక్సెస్ అయింది.

పుస్తకం గురించి చూసినప్పుడు మొదటి రెండు అంకాలు లోతుగా చూశాను కాబట్టి, మూడవ అంకం, ఎపిలోగ్‌ల గురించి తిరక్కథ 3 లో చూద్దాం.

బై ద వే ఏంటి దసరాకు ప్లాన్లు?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here