కొరియానం – A Journey Through Korean Cinema-40

4
9

Be Go पल – 2

Chapter 36

[dropcap]ప్ర[/dropcap]శాంత వాతావరణం. అందమైన ఇల్లు, చుట్టూ తోట. ఒక ముసలాయన (erect గానే ఉంటాడు. Upright posture తో) గార్డెనింగ్ చేస్తుంటాడు. అతని కళ్ళలో తేజస్సు. దయ కురుస్తుంటుంది. ఇంతలో ఫోన్ మోగిన శబ్దం. మనవరాలు వయసున్న అమ్మాయి వచ్చి ఆర్మీ నుంచీ అని చెప్తుంది. ఇప్పుడు తనకు ఆర్మీ నుంచీ ఫోన్ కాల్ ఏమిటా అని ఆశ్చర్యపోతూ ఫోన్ అందుకుంటాడు.

ఆ ఆశ్చర్యం స్థానంలో షాక్ వచ్చి చేరుతుంది. వారు చెప్పింది విన్నాక.

1950లలో జరిగిన కొరియన్ వార్‌కు సంబంధించిన తవ్వకాలలో కొన్ని వస్తువులు బైట పడ్డాయి. వాటి వివరాలు తీస్తుంటే. మీరు ఈ జిన్-స్యుక్ (Lee Jim-seok) ఏనా అని అడుగుతారు.

అవునంటాడు మన మసలాయన.

అయితే ఇవి మీవే, కానీ, రికార్డులలో మీకు మరణించినట్లుగా ఉందని చెప్తాడు లైన్ అవతల ఉన్న వ్యక్తి.

కాదు. అవి ఈ జిన్-టే కు సంబంధించినవా అని ఓపెన్‌గా ఆశ్చర్యపోతాడు.

మీ అన్నయ్య గురించా అని మనవరాలు అడుగుతుంది.

మదిలో ఎన్నో ఙ్ఞాపకాల సుడులు రేగుతుండగా ఈ జిన్-స్యుక్ ప్రయాణానికి సన్నద్ధమవుతాడు.

నీకు ఓపిక ఉందా అని అడుగుతుంది మనవరాలు. ఆయాసమొస్తోంది వెళ్ళలేవు అని హాస్యమాడతుంది ఆ ముద్దరాలు (రీడర్స్: మధ్యలో నీ improvisations ఏంట్రా? వ్రైటర్: షా! సీరియస్!).

గట్టిగా, కాదు. అదేమీ లేదని చెప్తాడు ఈ జిన్-స్యుక్. పైగా తాను హుషారుగా ఉన్నానని, కేవలం గత ఙ్ఞాపకాల భారం వల్ల కాస్త మానసికంగా బలహీన పడ్డట్లు కనుపిస్తున్నానని అంటూ ఆమె సహాయం లేకుండానే రెడీ అవుతాడు. అమ్మా, నాన్న ఇంట్లో ఉండరా సమయానికి. అదే ఈ జిన్-స్యుక్ పిల్లలు.

Breaking The Third Wall

15 నవంబరు 2022.

ఉదయం: 4:30

$$$$$NULL$$$$$

18 నవంబరు 2022.

ఉదయం.

<<నాకు దీని గురించి చెప్పు అంటారే తప్ప మీ సినిమాల గురించెక్కువ మాట్లాడరెందుకు? అనడిగాడు. అప్పటి వరకూ మా మధ్య జరిగిన సంభాషణలు గుర్తుకు తెచ్చుకుంటే నేను ఫలానా సినిమా గురించి చెప్పు, ఈ సినిమా ఎలా చూడాలి? ఇదెక్కడ దొరుకుతుందని అడగటమే తప్ప మన సినిమాల గురించి అతనితో మాట్లాడింది లేదు. రికమెండ్ కూడా చేయలేదు.

అలాంటిదేమీ లేదు. నేను నా తుత్తుర వల్ల ఏదో సోర్స్‌లా ఉన్నారని అడుగుతున్నాను తప్ప అంత ఆలోచించలేదు. చెప్పండి. Now I am in a position where I too can spend a bit to gift my friends. I’ll send a few good films. అన్నాను. ఆశ్చర్యకరంగా అల్లూరి సీతారామరాజు డీవీడీ ఉంటే పంపమన్నాడు. అతని రిసెర్చిలో మనదేశం నుంచీ mainstream style of cinema లో అత్యున్నత బయోపిక్ అల్లూరి సీతారామరాజు ట.>>

Chapter 37

ఎందుకు? ఏమిటి? ఎలా?

అన్న విషయాలు మా మధ్య డిస్కషన్‌కు వచ్చాయి.

అల్లూరి సీతారామరాజు సినిమా గురించి లెక్కలేనన్ని సార్లు లెక్కవేయలేనంత మంది రాశారు. వారిలో ఎన్నదగిన వ్యాసం సికందర్ గారు రాసింది. మొదట సాక్షి సన్డే మేగజీన్ ఫన్డేలో, తరువాత వారి బ్లాగ్‌లో చేరింది. దర్శకుడు కృష్ణవంశీ superstar Krishna నట జీవితం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆంధ్రజ్యోతి వేసిన స్పెషల్ ఎడిషన్‌లో రాసిన వ్యాసం.. లిస్టనంతం.

కానీ, మన దేశాన్ని చూడని, మన గురించి అంతగా తెలియని ఒక కొరియన్ దేశస్థుడు తెలుగు సినిమా గురించి ఇచ్చిన ఆ గొప్ప కాంప్లిమెంట్‌కు కాస్త గుండెలు ఉప్పొంగాయి ఆ రోజున.

సినిమా చూశాక ఏమని అంటాడో అని ఆసక్తిగా ఎదురుచూశాను. చాలా రోజులకు మెసేజ్ వచ్చింది.

Many youngsters and gen-z think Kim Han-min is a genius and nobody can better film the historical Battle of Myeongnyang than Kim did. But I firmly think he could have watched this movie (అల్లూరి సీతారామరాజు) to learn the way to write the script for a war/biopic. He did a spectacular job of filming the war. But left the task of picking up the brains of Korean naval commander Yi Sun-sin in thin air. Is the film historically accurate?

కాదు. సినిమాలో చాలా dramatisation ఉంది. అసలు సీత అన్న స్త్రీయే ఆయన జీవితంలో లేదు. ఇదే కాక మరిన్ని కల్పిత సన్నివేశాలున్నాయి.

సినిమాలన్నవి అన్ని సందర్భాలలోనూ చరిత్ర పాఠాలు కావు. ఆ పని డాక్యుమెంటరీలు చేస్తాయి. Films need dramatisation of facts and fiction. Tell me if this film brought him (Rama Raju) into popular imagination?

Yes certainly.

Then purpose served.

అల్లూరి గురించి తెలిసిన తరానికే కాదు, ఈ తరం వారికి కూడా ఆ సినిమా మరోసారి గుర్తు చేస్తుంది. ఈరోజుకూ అల్లూరి అంటే కృష్ణ రూపమే చాలామంది కళ్ళముందు మెదలుతుంది.

Oh! Idolisation. In one way it’s a bad thing. On the other hand, even when there is no special context, people remember that great man courtesy this actor by association. But Mr. Krishna had done a terrific job as an actor. నాకు సంబంధించని కథ. మా దేశానికి చెందిన కథ కాదు. మా శతృత్వాలు ఎక్కువ జాపనీయులతో. కానీ, కృష్ణ చివరలో ఆ డైలాగ్స్ చెప్తున్నప్పుడు చూపిన ఎమోషన్స్.. really genuine. I felt like I should take a gun and shoot down the other person who’s shooting Alluri (or Krishna the actor). Loved it. Very rarely an actor owns a character in such a way. Just like Robert Downey Jr. has become the definitive Tony Stark of the generation. ఆ డైలాగ్స్ రాసిన వారు ఎంత గొప్పగా రాసినా ఇలాంటి సినిమాల్లో వాటిని పలికే విధానం సరిగ్గా ఉండాలి. నాకు తెలుగు గురించి అంతగా తెలియక పోయినా, ఆ ఉచ్చారణలో స్పష్టత బాగా కనిపించింది.

కృష్ణ నటనలో గొప్ప అని అతని అభిమానులు కూడా అనలేరు కానీ, ఆ ఉచ్చారణ చాలా బాగుంటుంది. చాలా రేర్‌గా ఉంటాయి కరక్షన్ అవసరమైన సందర్భాలు. But I don’t think so. ఆవేశపూరితమైన డైలాగ్స్ చాలా బాగా కనక్ట్ అయ్యేలా చేప్తాడు. ఒక స్టైల్ కోసమన్నట్లు కాకుండా జనరిక్‌గా. ఆర్గానిక్‌గా.

I felt the same. దాని వల్ల సీన్ క్లిక్ అయ్యేటప్పుడు నటుడు కన్నా పాత్ర కనిపిస్తుంది. That may be the reason for his success despite what you say (that Krishna is not a great actor).

ఇక మిగతాదంతో మిత్రుని మాటల్లో. ఎప్పుడో జరిగిన సంభాషణలు. అప్పటికి స్కైప్ విరివిగా రావటంతో మెయిల్స్ రికార్డులు దొరకలేదు.

  1. సినిమాలో ఈరోజు నుంచి నేను సీతారామరాజును అనే డైలాగ్.. వరకు ప్రోలోగ్. పాత్రను బాగా establish చేశారు. Krishna has shown a positive curve in upping the intensity in his performance. The prologue went a long way in making the entire film tick.
  2. సీత పాత్ర వృథానా, అనవసరపు కల్పననా అన్న విషయం పక్కన పెడితే ఆమె మీద వచ్చిన పాట irony బాగా పండటానికి ఉపయోగ పడింది.
  3. ఆమె వస్తాడు అన్నది (we discussed the matter in detail) తన కోసం అయినా, దేశం కోసం అని కూడా imply అయింది. సీత అర్థాంతరపు మరణం రామరాజు అర్థాంతరపు మరణాన్ని సూచిస్తుంది. Like a foreshadowing. Great creativity.
  4. సీత పేరును తన పేరుకు కలుపుకున్నాడు అంటే దేశాన్నే తన ఇంటిగా భావించాడు అనే సింబాలిజమ్. Whether it’s done consciously or not, it’s another great moment in the film.
  5. తరువాత జనాలు పడుతున్న కష్టాలు, బ్రిటిషర్ల దౌష్ట్యాలు మొదలైనవి చాలా బాగా చూపారు. అల్లూరి తిరిగి తెర మీద కనిపించే సన్నివేశం సరైన టైమింగ్‌తో సరైన background తో వచ్చింది.
  6. This gave more cerebral heft to the film apart from a great hero elevation.
  7. రామరాజులో ఒకరకమైన దైవత్వం బాగా కనపడింది. ఆ నటుడు చుట్టూ చాలా పవర్ఫుల్ aura కనిపిస్తుంది. అది సినిమాను గొప్పస్థాయికి చేర్చింది.
  8. తన సహజ తేజస్సుకు, సీత త్యాగం వల్ల వచ్చిన శక్తి కూడా కలిసి రామరాజులో మిగిలిన విప్లవకారుల కన్నా unusual empathy వచ్చి చేరిందని చెప్పవచ్చు.
  9. Even in the few other films I have seen, that actor Krishna oozed on-screen intelligence very organically. Anyone who sees him on the screen can believe he’s an agent or a detective or a person of wisdom. అది రామరాజు పాత్రకు బాగా ఉపయోగ పడింది.
  10. That Rama Raju didn’t dominate other characters unnecessarily gave the film a magical naturalness. మన కళ్ళ ముందు నడుస్తున్నట్లు అనిపించింది దాని వల్ల. The actor too should be credited for underplaying wherever necessary than getting carried away.
  11. పాటలు కథలో అంతర్భాగంగా అనిపించాయి. But only song I completely watched was: the one we discussed extensively on that fateful Friday night (8 years ago – తెలుగు వీర లేవరా). The singers have done a fantastic job carrying the same intensity of the actor.
  12. The final encounter scene! Goosebumps. Everyone who appeared on the screen involved in their respective roles.
  13. The diction and the emotions shown by Krishna in that scene are a reference for anyone who play historical roles.

ఈ సినిమా కృష్ణ వందవ సినిమా అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అంత తక్కువ time span లోనా అని. ఆటోమేటిగ్గా 200వ సినిమా ఈనాడు మీదకు డిస్కషన్ మళ్ళింది. He said Krishna gave only 1/3 of his performance when compared to Rama Raju (Alluri may be divine intervention అన్నాడు).

Ram Charan looked confident in the role but it’s not Rama Raju. His appearance in the finale is exhilarating but lacked the soul of Rama Raju. (అందుకే కాబోలు సినిమాలో అల్లూరి కన్నా జై శ్రీరామ్ effect North ప్రేక్షకులలో ఎక్కువ కనబడింది. రాజమౌళికి సినిమాటిక్ ఇంటిగ్రిటీ కన్నా రిజల్ట్ ముఖ్యం అనుకున్నాను).

Breaking The Third Wall

Kim Han-min ఈ తరం కొరియన్ దర్శకులలో grandstand filmmaking కి ప్రసిద్ధుడు. ఇప్పటి వరకూ కొరియన్ సినిమా చరిత్రలో అతి పెద్ద కమర్షియల్ హిట్ అయిన The Admiral: Roaring Currents అనే సినిమా తీశాడు. దానికి ముందు, తరువాత ఎన్నదగిన సినిమాలే తీశాడు. వాటి గురించి తరువాత చూద్దాం. కొరియాలో గొప్ప సైన్యాధ్యక్షులలో ఒకడైన Yi Sun-sin సాధించిన అతి గొప్ప నౌకా యుద్ధ విజయం గురించి తీసిన సినిమాలో యుద్ధం మీద పెట్టిన శ్రద్ధ ఆ సైన్యాధ్యక్షుడి ఆలోచనలు ఎలా సాగాయి అనేదాని మీద పెట్టలేదని మిత్రుడి ఫిర్యాదు. అల్లూరి సీతారామరాజు సినిమాలో అల్లూరి చేతలతో పాటూ ఆలోచనలు కూడా బాగా చూపారని ప్రశంసించాడు.

Finally a few more things about our Evergreen Superstar Krishna.

Strip him of all the image building and other stuff courtesy cinema Bhajanaks.

నా మాటలలో

  1. నాలుగేళ్ళ వయసులో మొదటిసారి కృష్ణ సినిమా చూశాను. నాగాస్త్రం. చాలా నచ్చింది. కృష్ణ కూడా బాగున్నాడనిపించాడు.
  2. The Good The Bad The Ugly ని మోసగాళ్ళకు మోసగాళ్ళుగా Indianise చేయటం ఎంత రచయిత గొప్పతనమైనా, ఆ సినిమా తీయటం కృష్ణ చేసిన సాహసమే. అంత సాహసం చేసిన కృష్ణ ఛత్రపతి శివాజీ సినిమా తీసి ఉండాల్సింది. రామరాజు పాత్రలో కృష్ణ చుట్టూ ఉన్న aura ఈ పాత్రలో కూడా ఉండేది. ఒక రిఫరెన్స్ లాంటి సినిమా అయ్యేదేమో.
  3. వారసులను తీసుకు రావటం అన్న మాట, నెపోటిజమ్ పక్కన పెడితే, అల్లూరి సీతారామరాజు, సింహాసనం, మోసగాళ్ళకు మోసగాడు కాకుండా కృష్ణ తెలుగు సినిమాకు ఇచ్చిన మరో గొప్ప కంట్రిబ్యూషన్ మహేశ్ బాబు.
  4. చిన్నతనంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా, పెద్దయ్యాక లీడ్ యాక్టర్ గా superstardom అనుభవించటం మరెక్కడా లేదు. కృష్ణ మహేశ్ కోసం చేసిన image building work చాలా బాగా పని చేసింది. పైగా cringe feel అవకుండా విదేశీ మిత్రులకు మన హీరోల సినిమాలు రికమెండ్ చేయాలంటే మహేశ్ సినిమాలే చాలా వరకూ గతి.
  5. కురుక్షేత్రం గురించి సినిమా జనాలు మాస్ ఆడియన్స్ ఎలా అనుకున్నా ఒక లేండ్మార్క్ సినిమా.
  6. మహా నటుడు కాకపోయినా, కొన్ని పాత్రలు ఇతను మాత్రమే చేయాలని ఇతర భాష వారు అనుకోవటం అన్నది ఒక నటుడికి గొప్ప గౌరవం. కలైపులి ఎస్. థాను కృష్ణను మల్లన్నలో సీబీఐ డైరక్టర్ పాత్రలో తీసుకోవటం, ఇన్నేళ్ళైనా మర్చిపోకుండా హృదయపూర్వకమైన నివాళి అర్పించటం దీనికి నిదర్శనం.
  7. క్రైమ్, యాక్షన్ సినిమాలు ఎక్కువ చేసినా, కుటుంబ ప్రేక్షకుల ఆదరణ అధికంగా పొందటం కూడా ఒక గొప్ప
  8. It was superstar Krishna who popularised modern and genre specific films and genre specific roles in Telugu.
  9. సింహాసనంలో ఎడిటర్‌గా కృష్ణ చేసిన విన్యాసాలు ఇప్పటికీ చెల్లుబాటవుతాయి. ఇంద్రభవనం సినిమాలో కూడా ఎడిటింగ్ బాగుంటుంది. సినిమా ఆడిందో లేదో తరువాత సంగతి.
  10. యవ్వనంలో కష్టపడ్డాడు. ఫలితం సాధించాడు. నడివయసులో వెలిగి పోయాడు. స్టార్డమ్ తలకు ఎక్కించుకోలేదు. మలి రోజుల్లో ఒక దశాబ్దం పైన విశ్రాంత జీవనం. Great life. Or a life well spent. An inspiration and a lesson for those who procrastinate.
  11. రెండవ వివాహమైనా, విజయ నిర్మలకు అటు సమాజంలో, ఇటు కుటుంబంలో మంచి స్థాయి కల్పించాడు. గౌరవాదరాలు దక్కేలా చేయటం భర్తగా గొప్ప విజయం. అలాగే విజయ నిర్మల దర్శకురాలుగా విజయం సాధించటంలో వెనుక అండగా ఉండటమే కాదు. గిన్నిస్ బుక్‌లో ఎక్కేంత సక్సెస్ వెనుక కృష్ణ ఉండటం కూడా గొప్ప విషయమే.
  12. ఒక అభిమానిగా నాకు కృష్ణ తో Poetry remake తెలుగులో రాకపోవటం తీరని బాధే. వచ్చి ఉంటే సుడిగుండాలు మించిన గొప్ప సినిమాగా నిలిచేది.
  13. బహుశా కృష్ణకున్నంత మంది నిజమైన అభిమానులు తెలుగులో వేరెవరికీ ఉండి ఉండకపోవచ్చు.

Chapter 36 Continues

1950!

కొరియన్ యుద్ధం జరుగటానికి ముందు రోజులు. షూ పాలీష్ అంటూ ఒక యువకుడు సోల్ నగరం రోడ్ల మీద తిరుగుతుంటాడు. అతని కోరిక అల్లా, ఎలాగైనా తన తమ్ముడిని బాగా చదివించాలని, తాను అనుభవించలేని జీవితాన్ని తమ్ముడు అనుభవించేలా చేయాలని. కానీ విధి ఆలోచనలు ఇంకోలా ఉన్నాయి.

P.S.: ఈమధ్య పరిస్థితుల వల్ల చాలా చికాగ్గా, ఒత్తిడిగా, మనసంతా ఒకరకంగా ఉంటోంది. ఆ పైన superstar Krishna మరణం.

కొరియన్ మిత్రుడిని కిక్ లాంటి మాంఛి హుషారైన కొరియన్ సినిమా ఉంటే చెప్పమన్నాను.

అతని రెస్పాన్స్

మనుషులేమీ మంచోళ్ళేం కాదు. మీ తెలుగు వాళ్ళు సినిమాలలో అయినా పక్కోడు బాగుంటే చూసి ఆనందిస్తారు. ఇక్కడ కిక్ లాంటి సినిమాలు రావు. Just like everywhere else in the world, people love to watch f**ked up, lives on the big screens అన్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here