కొరియానం – A Journey Through Korean Cinema-47

0
10

ఏం కూర్చోను రాయి కూర్చోను దిబ్బ కూర్చోను?

Chapter 41, Part 2

[dropcap]కా[/dropcap]మరాన్ పనైపోయింది (అదేమన్నా గవర్నమెంటుద్యోగమా సాములు?).

అవతార్ 2 లో కథ లేదు (అంత మంచి కుటుంబ విలువలున్న కథ చెప్తేనూ! ఓహో! డ్రగ్సూ, సెక్సూ లేవనా మీ బాధ?).

ఉత్త గ్రాఫిక్సున్నమ్ముకుని ఎల్లవేళలా హిట్ కొట్టలేరు (ఆ విషయం చెప్పాల్సింది మనిండియన్ డవిరట్టర్లకు కదా?).

అవతార్ హిట్ కాదంట

ఫట్ అంటా

పోయిందంటా, పీడా పోయింది

ఇట్స్ గాన్ బావ, ఇట్స్ గాన్ (ఓహో ఇలా కూడా భ్రమ కలుగుతోందా?)

ఆ రంగేంటీ? ఆ తోకలేసుకుని లిప్ కిస్‌లు ఏంటి? (మా extended family లో విన్న కొన్ని కామెంట్లు. మళ్ళీ వీళ్ళే వర్ణ వివక్ష, జాతి వివక్ష గురించి పుంఖలాలు పుంఖాలుగా రాస్తారు).

చైనాలో వంద మిలియన్లు కూడా రావు (ఇప్పుడు రెండొందలకు దగ్గరలో ఉంది).

అమెరికాలోనే ఎవరూ చూడటం లేదు (అందుకనే చరిత్రలో గాన్ విత్ ద విండ్, టైటనిక్ తరువాత నాలుగవ వారంలో థియేటర్ల సంఖ్య పెంచబడిన మూడవ సినిమాగా రికార్డులకెక్కింది). పాపం చూడటం లేదు కనుకనే థియేటర్ల సంఖ్య పెరిగింది.

అన్నన్ని గంటలు సినిమాలు చూసే రోజులు పోయాయి. ఇంకా అవతార్ ఎవరికి గుర్తుంటుంది? ఎంత అహంకారం కాకపోతే 2 బిలియన్ల కలక్షన్లు వస్తే తప్ప బ్రేకీవెన్ కాని సినిమా తీస్తాడు కామరాన్?

ఇలా వివిధ దేశాల్లో ఈ సినిమా గురించి రకరకాల వ్యాఖ్యలు, వ్యాఖ్యానాలు వినపడ్డాయి. ఇక మన తెలుగునాట.. లేని కలక్షన్లు ఉన్నట్లు చూపించుకుని డప్పేసుకుని, ఎవరోకరికి వంతపాడే వెబ్సైట్లు, అసలు బాక్సాఫీసు డేటాను ఎలా చదవాలో సరిగ్గా తెలీని వారు కూడా ఆ సినిమాను గురించి విమర్శలే. Lyaag అని రాసే వాళ్ళుకూడా ఇంగ్లీషులో ఈ సినిమా గురించి వ్యాఖ్యానాలు రాసే వారే. ముప్పాతిక వెబ్సైట్లలో రెండు వాక్యాలు రాయటం రాని మొహాలు స్క్రీన్ ప్లే లో ల్యాగ్ అంటూ…

కానీ ఇవన్నీ

ఒడ్డు పొడుగు గలిగి గడ్డంబు పొడుగైన

దాన గుణము లేక దాత యగునె

ఎనుము గొప్పదైన ఏనుగు బోలునా

విశ్వదాభిరామ వినురవేమ.

పద్యం సరిపోలేదా ఈ context కి? అదేదో తరువాత వెతుక్కుందాం. అసలు విషయం అయితే రీచ్ అయింది కదా.

ఎన్ని గంటలు సినిమా అన్నది కాదు. సినిమాలో విషయం ఉంటే ఎన్ని గంటలైనా కూర్చుంటామని, అభిరుచి కలిగిన ప్రేక్షకులు, మంచి ఎంటర్టెయిన్మెంట్ ఇవ్వండి చాలు, మా డబ్బులు పెట్టి మీకు హిట్టిస్తాం అని కళాకారులకు ప్రోత్సాహంగా ఉండే సామాన్య ప్రజ సినిమాను నెత్తిన పెట్టుకున్నారు.

సూర్య ప్రకాశ్ జోశ్యుల ఒక మాదిరి ఫర్వాలేదనిపించే రివ్యూ, చేతిలో ఉన్న సమాచారాన్ని బట్టీ సికందర్ గారు ఇచ్చిన mixed రివ్యూలు (really it’s a great review, though it’s a negative one) తప్పిస్తే అవతార్ గురించి మెయిన్ స్ట్రీమ్ వెబ్సైట్లలో సరైన రివ్యూ అన్న మాటే లేదు. This, including positive reviews from the likes of ఈనాడు ఎట్సెటరాదులు.

ఇకపోతే మన కొరియాలో సినిమా మొదట కాస్త ఫ్లక్చుయేట్ అయినా క్రమంగా పుంజుకుని బ్లాక్బస్టర్‌గా నిలిచింది. దాదాపు 90 మిలియన్ల టికెట్లు తెగాయి. ఐదున్నర మిలియన్ల యునిక్ ఆడియన్స్ సినిమాను చూసారు. 81 మిలియన్ డాలర్లు సంపాదించి 100 మిలియన్ డాలర్ల ల్యాండ్మార్క్ వైపు అడుగులేస్తోంది. ఇంకా పేండమిక్ నుంచి పూర్తిగా తేరుకోని కొరియాలో థియేటర్లకు జనాన్ని భారీ సంఖ్యలో రప్పించిన టాప్ 5 సినిమాల్లో అవతార్ 2 నిలిచింది. 10 మిలియన్ టికెట్ల లేండ్మార్క్ అతి త్వరలో చేరుతుందీ జేమ్స్ కామరాన్ సినిమా.

మొత్తానికీ, టైటానిక్ సమయానికి పుట్టని వారూ, అవతార్ టైమ్‌కు డైపర్లలో ఉన్న ఇప్పటి కుర్రకారు కూడా అన్ని దేశాలతో పాటూ మన కొరియాలో కూడా కామరాన్ సినిమాకు దాసోహం అని wallets ఖాళీ చేసుకుంటున్నారు. Thinking brain never drains అని ఊరికే అనలేదు పెద్దలు. ఎక్కడోక్కడ డబ్బులు పుచ్చుకునే చెప్పి ఉంటారు.

అందుకే జేమ్స్ కామరాన్ గురించి మరో దిగ్దర్శకుడు క్వెంటిన్ టారన్టినో ఈ కథ చెప్పాడు.

On The Howard Stern Show:

This Hollywood guy dies and goes to heaven. Peering through the Pearly Gates, he glimpses someone riding overhead in a crane with a movie camera and says,

“I didn’t know James Cameron was dead.”

Saint Peter replies, “No, that’s God. He only thinks he’s James Cameron.

(To be continued in Chapter 41, Part 3)

Chapter 43

సైన్సు ఫిక్షన్ సినిమాల మీద పడుతున్నారు మన తెలుగూఫు కుర్ర డైరెక్టర్లు ఈమధ్య. యథావిథిగా కథలను చాలా వరకూ కొరియన్ సినిమాల నుంచే లేపేస్తున్నారు. అఫీషియల్ రీమేక్‌ల దారి వేరే. వచ్చిన చాలా సినిమాలు అయితే టైమ్ ట్రావెల్ లేదా Ditto అనే సినిమా నుంచీ సంగ్రహించిన కథావస్తువు బేస్ చేసుకుని వచ్చినవే.

Ditto రెండుసార్లు వచ్చింది కొరియన్‌లో. 2000 సం॥లో మన Oldboy విలన్ ఈ వు-జిన్ పాత్రలో జీవించిన Yoo-Ji-tae దీనిలో ప్రధాన పాత్రధారి. క్లాసిక్‌గా నిలిచిందీ సినిమా. ఈమధ్య 2022లో దీని రీమేక్‌గా వచ్చింది రెండవది. సినిమా పెద్ద నడవలేదు మొన్న నవంబర్‌లో విడుదలైనప్పుడు. ఈ సినిమాల బేస్ మీద వచ్చినవి, టైమ్ ట్రావెల్ మీద వచ్చినవి తెలుగులో పెద్దగా నడవలేదు. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన మాస్ సినిమా బింబిసార 2022 సంవత్సరపు అతిపెద్ద surprise hit గా నిలిచింది.

కొరియన్ సినిమాల్లో ఉండేంత నిగూఢమైన ఎమోషన్లు మన దర్శకులు కానీ, నటీనటులు కానీ పట్టుకోలేక పోయారు. కథ కథనాలు సరిగ్గా వాడితే బాగా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నవే. కాకపోతే అలాంటి సినిమాలకు తగిన క్రియేటివ్ సరుకు మెదళ్ళలో ఉండాలిగా. అందుకే అధికభాగం ఓటీటీలలో సానుభూతి హిట్లో, ఎవరో శంఖంలో తీర్థం లాటివారో రాసిన రివ్యూలవల్ల అక్కడక్కడా కొంతమంది చూసారు.

ఇలాంటి సినిమాలు చూడాలంటే ముందు కూర్చోవటానికి గొప్ప ఓపిక కావాలి. 90 నిముషాల సినిమాలను కూడా భరించలేము. ఒకవేళ నిజంగా బాగా తీశారని కామెంట్లొచ్చినా, అవి కూడా మొదలెత్తుకోవటం బాగా జరిగినా, సెకండ్ హాఫ్‌లో దెబ్బతినేశాయి. అసలు రీమేక్ అయినా, ఫ్రీమేక్ అయినా చేయాల్సిన సినిమా ఇంకొకటి ఉంది. ఈ సైఫి సినిమాను తీయాలంటే గుండెల్లో దమ్ము, బుర్రల్లో గుజ్జు ఉండాలి.

ఆ సినిమా…

Save the Green Planet!

అలా కాదు మేము రొమాన్స్ లేని రొమాన్స్ సినిమాలను, కెమిస్ట్రీ ఉండని లవ్ స్టోరీలను తీసుకుంటాం అంటే కనుక…

ప్రేక్షకులు థియేటర్లలో: ఏం కూర్చోము, రాయి కూర్చోము, దిబ్బ కూర్చోము. మా చీమ తలకాయంత వాలెట్లు అవతార్ లాంటి మహత్తర చిత్రరాజాల కోసం ఖాళీ చేశాము. ఓటీటీల్లో సానుభూతి హిట్ చేస్తాము అంటారు.

వీళ్ళేమో ప్రేక్షకులకు అభిరుచి లేదు అని గోల గోల చేస్తారు. వీళ్ళ క్రియేటివిటీ ఏమో అభిరుచి అని టైటిల్ పెట్టి అభి అనే అబ్బాయికి, రుచి అనే అమ్మాయికి మధ్య పుట్టే ప్రేమ కథగా తీసే రోజుల దగ్గరే ఆగిపోయింది.

ఆకుపచ్చ గ్రహాన్ని కాపాడండి అనేది ఈ శతాబ్దంలో most underrated sci-fi black comedies లో ఒకటి.

విఖ్యాత అమెరికన్ హారర్ రచయిత Stephen King రాసిన మిజరీ అనే నవల ఆధారంగా తీసిన సినిమా చూస్తున్నప్పుడు వచ్చిన ఆలోచనకు, ఒక విచిత్రమైన సందర్భాన్ని జోడించాడు ఈ సినిమా దర్శకుడు.

టైటనిక్ విడుదలైన తరువాత లియోమేనియా నడిచిన విషయం తెలిసిందే. మా బొంద మాకేం తెలుసు అంటారా? నిజమే కదా. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు కూడా. కాకపోతే పత్రికలలో అందరికీ తెలిసిందే అని రాస్తారు కదా. అలా ఫ్లోలో పడిపోయింది.

సరే! ఆ లియోమేనియా దాదాపు 2002 వరకూ నడిచింది. లియనార్డో డికాప్రియో మాయలో అంతలా పడిపోయారు అమ్మాయిలు. దానివల్ల అతనికి విపరీతమైన రొమాన్టిక్ ఇమేజ్. అతని హెయర్ స్టైల్ కూడా బాగా అనుకరించారనుకుంటా అప్పట్లో మగ పిలకాయలు. ప్రేమికుల రోజు లేదా కాధలర్ దినమ్ సినిమాలో హీరో కునాల్ హెయర్ స్టైల్ దాదాపు అలాగే ఉంచారు. ఆ సినిమాలో ఒక లెక్చరర్/ప్రొఫెసర్ పాత్రకు జాక్ అని టైటనిక్ లో లియనార్డో డికాప్రియో పాత్ర పేరు పెట్టారు. అదే హెయర్ స్టైల్‌తో. The references were spelled out in the movie too. ఆ లెక్చరర్ పాత్రను తమిళంలో/తెలుగులో గౌండమణి వేశాడు.

అంత పాప్యులర్ అయిన లియనార్డో మీద ద్వేషం పెంచుకున్న అసూయాపరులైన మగపిలకాయలు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఒకరు లేదా కొందరు ఒక తింగరబుచ్చి వెబ్సైట్ చేశారు. దానిలో లియొనార్డో డికాప్రియో ఒక ఏలియన్ అని, భూమి మీద ఉన్న ఆడపిల్లలను వశపరచుకుని అల్లకల్లోలం సృష్టించడమే అతని లక్ష్యమని రాసేవాళ్ళు. ఇలాంటి కాన్స్పిరసిక థియరీలను, మరొకవైపు మిజరీ చూస్తున్నప్పుడు కలిగిన ఆలోచనను కలిపి దర్శకుడు Jang Joon-hwan Save The Green Planet ని తీశాడు. చూసిన కొద్దిమందీ డంగైపోయారు. సినిమా కల్ట్ హిట్ ఏయింది.

One of the most original South Korean films and world cinema in general గా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఆకుపచ్చని గ్రహమే మన తరువాత మజిలీ. Don’t bring Samantha! విచిత్రమేమిటంటే లియనార్డో డికాప్రియో 25 సంవత్సరాలుకు పైబడినా అమ్మాయిలని తన ప్రేయసి, girlfriend గా అంగీకరించడని ఒక ఆరోపణ కూడా ఉంది. అది నిజమై కూర్చుందిప్పుడు. అతను నిజంగానే ఏలియనా?

గత నెల రోజులుగా పనుల బిజీలో బైట న్యూస్ ఎక్కువ చూడటం లేదు. ఏమిటి సంగతులు? ఎవరన్నా కొట్టుకుంటున్నారా? నాగ బాబు ఎవరినన్నా హెచ్చరించాడా? ఉత్తర, దక్షిణ తెలుగూఫ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడ్డాయా?

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here