కొరియానం – A Journey Through Korean Cinema-48

0
10

పచ్చందనమే పచ్చదనమే

[dropcap]చి[/dropcap]రంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి ఈ సంక్రాంతికి (2023) విడుదలైన పెద్ద తెలుగు సినిమాలు. ఆ పైన వారసుడు లేదా వారిసు, తుణీవు లేదా తెగింపు అనే తమిళ డబ్బింగ్ సినిమాలు విడుదల అయ్యాయి. ప్రేక్షకులు మాత్రం ఈ నాలుగు సినిమాలు తప్ప వేరే ఏ అవకాశాలు లేక ఖైదు అయ్యారు. మధ్యలో కళ్యాణం కమనీయం అనే చిన్న సినిమా వచ్చింది. సినిమా ఫర్లేదనిపించేలా ఉంది. థియేటర్లలో చూడాల్సినంత స్టఫ్ లేదు. అలా పెద్ద సినిమాల యుద్ధంలో నలిగిపోయింది.

పెద్ద సినిమాలు నాలుగు కూడా అదే చూసేసిన కథలు, కథనాలు, టెంప్లేటు నటనలు, అవే fan-pleasing actings. ఆడేస్తున్నాయి. పండగ కనుక. బోరు కొట్టలేదు కనుక. ఉన్నవాటిలో కాస్త నిలిచే అవకాశాలు తమిళంలో వారసుడు (Vijay factor and family entertainer), వాల్తేరు వీరయ్య (చిరంజీవి ఆల్ రౌండ్ చిందులకు తోడు రవితేజ ఎనర్జీ కలిసి) సినిమాలకు ఉంది. మిగతావి ఓపెనింగ్స్ వచ్చినా 20 తరువాతే నిజమైన ఫేట్ తెలిసేది.

చిత్రంగా రెండు తెలుగు సినిమాలను ఆ యా హీరోల fans తీసినవే. ఆ హీరోలని ఆ యా హీరోల అభిమానులు ఎలా చూడాలని భ్రమ పడుతున్నారని ఈ మేకర్లు భ్రమ పడుతున్నారో అలాగే తీశారు.

చిరంజీవి తాగాలి. నాటు డైలాగులు వదలాలి. సిగరెట్టో బీడీనో స్టైలుగా కాల్చాలి. హీరోయిన్ తో అమ్మాయ్ అంటూ కామెడీ చేయాలి. ఒక రెండో లేదా మూడో డాన్స్ నంబర్లు, (అప్పట్లో రాజ్-కోటి. ఇప్పుడు డీఎస్పీ), ఒక flashback. Climax fight. ఒక స్పీచ్ (అన్యాయాల మీద). అంతే.

ఒకప్పుడు హీరోలంటే ఆదర్శమూర్తులు. వారిని మించి ఎదగాలని వారి అభిమానుల ఆకాంక్ష. నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం చూసి superstar Krishna తాను కూడా అలా ఎదగాలని. వచ్చినవాడు ఊరుకున్నాడా? ఎదిగి చూపించాడు. ఆ నాగేశ్వరరావును మించి. ఎన్టీఆర్‌కు పోటీగా కూడా.

జమునతో హీరోగా వేయాలనుకుని సినీ నటుడై తరువాత జమునతో హీరోగా వేసి ఆ కోరిక తీర్చుకుని, తరువాత ఒక తరంలో పెద్ద lead actors లో ఒకడిగా మిగిలి పరుగు ఎప్పుడు ఎలా ఆపాలో తెలిపిన శోభన్ బాబు.

ఇప్పుడా విజయాలు లేవని కాదు కానీ, తమ తమ హీరోల చేత నేలబారు స్టంట్లు చేయించటమే వింటేజ్ అని, ప్రేక్షకులందరూ అలాగే చూడాలనికుంటున్నారని అలాగే చూపించటం ఒక ఫినామినా. అభిమానులెప్పుడూ అంతే. తాము చేయలేనివి తమ హీరోలు చేయగలరని, చేయాలని. వారి స్థాయిని బట్టీ వారి హీరోల మీద తమ ఫేంటసీలు తీర్చుకుంటారు.

బాబీ కొల్లి వాల్తేరు వీరయ్యగా చూపాడు చిరంజీవిని, వీర సింహారెడ్డిగా బాలకృష్ణను చూపించే ప్రయత్నం చేసి జనాన్ని రక్షింపచేశాడు మిథికల్ ఫేక్షన్ సీమలో గోపీచంద్ మలినేని. తలలు తెగి పడటం, ఎవరి స్టైలుకు సరిపడే డైలాగులు వారికి, Cringe అని 60% ప్రేక్షకులకు అనిపించే కామెడీలు అదనం. ఎవరి టేస్టులు వాళ్ళవి. కాదనటానికి ఎవరంట మనం?

సరే! ఈమధ్య లోకేశ్ కనకరాజ్ కమల్ హాసన్ చేత తుపాకులు, ఇతర రకాల ఆయుధాలు పట్టించాడు. తన మనవడు పెరిగి పెద్దవాడు అయ్యే సరికి డ్రగ్ రహిత సమాజం కోరుకుంటాడు హీరో విక్రమ్. అసహ్యంగా. అదో ఆనందం. వ్యక్తిగత పగకే పరిమితం చేశాడు కార్తిక్ సుబ్బరాజు రజినీకాంత్‌ను పెట్ట లో. నిజమేగా! నాలాంటి ఎల్లయ్యలకు చిరంజీవిని ఏ జాన్ గాల్ట్ తరహా పాత్రలోనో, కనీసం డబ్బు టు ద పవరాఫ్ డబ్బు రీమేక్ లోనో చూపాలని ఉంటుంది. ఎక్కువ ఏడుపుగొట్టు పాత్రలు వేసుకునే లియనార్డో డికాప్రియోను Howard Roark గా దృష్టిలో పెట్టుకుని The Fountainhead స్క్రిప్ట్ రాసుకున్న చిత్తభ్రాంతి ఉన్న సాధారణ జీవిని.

(రవితేజ స్వరంలో): అన్నట్లు చెప్పటం మరచితిని. చిత్త భ్రాంతి అంటే గుర్తుకు వచ్చింది. సేవ్ ద గ్రీన్ ప్లేనెట్ అనే కొరియన్ సినిమా.

తన చిన్నతనం నుంచీ అనుభవించిన ట్రామా వల్ల చిత్త భ్రాంతులకు గురవుతుంటాడు Lee Byeong-gu. మనమే చిరంజీవి అనుకుని చిన్నప్పుడు (కనీసం మనసులోనైనా) ఫైట్లు చేసిన చందాన ఈ భూ గ్రహాన్ని ఇతర గ్రహ జీవులు ఆక్రమించుకోవాలని చూస్తున్నాయని, ఇక్కడి జనాభాను నాశనం చేయాలని చూస్తున్నాయని, వారి నుంచీ కేవలం తను మాత్రమే కాపాడగలడని, తను మాత్రమే ఆ The One అని ఒక ఫార్మా కంపెనీ ఎక్జిక్యూటివ్‌ను కిడ్నాప్ చేస్తాడు.

ఎంత హీరోకి అంత హీరోయిన్ అన్న లెక్క ప్రకారం మన హీరో ఈ బ్యుంగ్-గు కు చిన్న పిల్లల మనస్తత్వం ఉన్న girlfriend ఉంటుంది. ఆ పిల్ల సర్కస్ కళాకారిణి కూడా.

ఒక పెద్ద ఎగ్జిక్యూటివ్‌ను కిడ్నాప్ చేస్తే సభ్య సమాజం ఊరుకోదు కదా? పోలీసులు రంగంలోకి దిగుతారు. ఒక డిటెక్టివ్‌కు కేసు అప్పగిస్తారు. ఇంత కథ జరుగుతుంటే హీరోకు ఒక flashback ఉండి తీరాలి. ఇది కొరియన్ సినిమా కనుక ఒక హీరోయిక్ flashback కాకుండా ఒక నమ్మబుల్ వివరణ ఉన్న, నేల మీద కాళ్ళానిన వివరం మనకు తెలుస్తుంది. The lead character has a streak of violence in him since his childhood.

ఇంతకీ ఆ ఏలియన్ Pharma executive వచ్చింది ఎక్కడి నుంచీ అంటే Andromeda Galaxy. కిడ్నాప్ చేశాక హించించటం కామనే. కనుక శాస్త్రబద్ధంగా ఆ పని కూడా చేస్తాడు. కొరియన్ సినిమా కనుక ఆ టార్చర్ సీన్లు కూడా తగు మోతాదులో భరించలేనంత వైలెంట్‌గా ఉంటాయి. ఇంతకీ మన హీరో ఆరోపణ ఏమిటంటే ఆ ఫార్మా executive తన గెలాక్సీకి చెందిన Prince కు కొంత కీలక సమాచారాన్ని రాబోయే గ్రహణం రోజున అందజేస్తాడనేది.

పనిలో పనిగా పోలీస్ డిటెక్టివ్ పరిశోధనలో మన హీరో తల్లి మీద తమ ప్రయోగాలలో భాగంగా ఆ కిడ్నాపైన ఎగ్జిక్యూటివ్‌కు సంబంధించిన కంపెనీ, వివిధ రకాలైన డ్రగ్స్‌ను టెస్ట్ చేసిందని, ఆమెను ఒక Human Guinea Pig గా వాడుకుందని తెలుస్తుంది. మనకు సానుభూతి కలుగుతుంది. బాధ కలుగుతుంది. పోలీసులకు ఏ భావం కలుగదు. As usual గా. వాళ్ళ డ్యూటీ ఆ కిడ్నాపర్‌ను పట్టుకుని ఫార్మా కంపెనీ ఉద్యోగిని విడిపించటం.

ఇంతలో ఒక డిటెక్టివ్ ఈ ఫార్మా కంపెనీ ఎక్జిక్యూటివ్‌ను ఉంచిన బేస్మెంట్‌కు వస్తాడు. వెతుక్కుంటూ. దొరికిందే చాన్స్ అనుకుని ఆ సమయంలో మనోడి మీద దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు ఆ ఫార్మిస్టి. కానీ బ్యుంగ్-గు అడ్డుకుంటాడు. నానా తంటాలు పడి. ఇక ఆ డిటెక్టివ్‌కు మొదట ఏ ఆధారాలు దొరకవు. అయినా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే మన హీరో గారి చేతిలో పరలోకమునకేగిన పాపుల అవశేషాలు దొరుకుతాయి. ఇలా.. నడిచే కథ చివరకు అమాయకపు పాపడైన మన హీరోను డిటెక్టివ్ టీమ్ ఖతం చేయటంతో ముగుస్తుంది.

ఇక్కడే పెద్ద ట్విస్టు. ఆ ఫార్మా ఎగ్జిక్యూటివ్ నిజంగానే ఒక ఏలియన్. మన కీశే॥ అయిన హీరో ఊహించినట్లుకానే గ్రహణం రోజున ఏలియన్సు వచ్చి తమ రారాజైన ఆ Pharma Executive ను విడిపించుకుని పోతాయి. ఇక్కడే మనకు తెలుస్తుంది. నిజానికి భూమిని తమ పరిశోధనలో భాగంగా ఎంత సస్టెయినబులిటీకి మానవులు కృషి చేస్తున్నారో చూడాలనేది అతని plan. కానీ ఇక్కడి జనాలు కరప్టు. భూమినే కాకుండా భూమి మీద ఇతర జీవరాశిని కూడా తమ స్వార్థానికి వాడుకుని వినాశనానికి తామే కారకులవుతున్నారు. ఇది చూసి విసుగెత్తిన ఏలియన్ కింగ్ భూ గ్రహాన్ని existence లో నుంచి తొలగిస్తాడు.

ఇదీ కథ.

కామెడీగా చెప్పాననిపిస్తోంది కదా?

ఈ సినిమా వెనుక ఎంత మేథో శ్రమ దాగి ఉందో పూర్తి పరిశోధన చేశాక ఈ కథను ఇలా తప్ప వేరేలా చెప్పలేమని అనిపించింది. The filmmaker intended this film to be a black comedy. But the execution is poignant. The ending visuals of the movie recap the entire journey of Byeong-gu’s life in the form of photographs, focusing instead on the beautiful, happy moments of a young boy and man with his father and mother and girlfriend.

ఈ కథను గురించే ఒక పుస్తకం రాయవచ్చు. ఇక తీసిన విధానం అనన్య సామాన్యం. ఇది ఈ దర్శకుడి తొలి సినిమా అంటే నమ్మబుద్ధి కాదు. అతని తర్వాత సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది.

ఆ వివరాలు త్వరలోనే చూద్దాం.

మనుషులలోని కుళ్ళును ఉన్నది ఉన్నట్లుగా చూపించిన సినిమా కనుక సరిగ్గా ఆడలేదు.

ఈ సినిమా తరువాత పన్నెండేళ్ళకు వచ్చిన తమిళ సినిమా ఐ (శంకర్ దర్శకత్వం) ని ఇంకా బాగా తీసి ఉండవచ్చు. నిజమే. కానీ ఆ సినిమా విపరీతంగా ట్రోలింగ్‌కు గురి అయింది. ఒకరకంగా చెప్పాలంటే a majority of the audience hated it.

The reason is almost all of Shankar movies blamed system and questioned from the POV of commoners. But ‘I’ has shown the ugly side of the common man himself. Jealousy, insecurity of individuals. In a similar way, had Save The Green Planet concentrated on the pharma’s and their evil experiments and the hero’s fight against them, it’d have received more support. But here the filmmaker rightfully reversed it and flip-narrated the film. మనుషులదే తప్పని బలంగా చెప్పాడు. మీదే తప్పంటే ఎవరు వింటారు కనుక?

సంక్రాంతి సినిమాల మీద వచ్చే వెటకారపు రివ్యూలు చదవాలని మాంఛి తీటగా ఉంది. కానీ టైమ్ ఇల్లే!

So, కాసేపు మన తెలుగూఫుల మీద జోకులేసుకుని నా పని నేను చేసుకుంటా!

Here comes the Second Plot Point of కొరియానం. ఇక మిగిలింది క్లైమాక్సే.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here