కొరియానం – A Journey Through Korean Cinema-54

2
8

ప్రేమా పిచ్చీ..

Chapter 47

[dropcap]S[/dropcap]hadows of Forgotten Ancestors అని చాలా గొప్ప సినిమా ఉంది. అలాగే మన Oldboy చోయ్ మిన్-సిక్ దే Himalaya – Where the Wind Dwells అనే సినిమా ఇంకోటి ఉంది. రెండు వాటి వాటి స్థాయిలలో క్లాసిక్కులుగా ముద్ర వేయించుతున్నాయి (నాకు ‘క’ పలకలేదు ఈ పదం దగ్గరకు వచ్చేసరికి).

కాకపోతే హిమాలయా గురించి ఎక్కువ మందికి తెలియదు. ప్రత్యేకించి వెతికేవాళ్ళకు తప్ప. Shadows of Forgotten Ancestors గురించి చాలామందికి తెలుసు. ప్రపంచ సినిమా ఇష్టంగా చూసే వాళ్ళలో మాత్రమే. మిగిలిన వారికి కాదు.

ఆర్మేనియా దిగ్దర్శకుడు సెర్జీయ్ పరజనొవ్ సృష్టించిన రంగుల కల లాంటి సినిమా ఇది. ఉక్రెయిన్ భాషలో వచ్చిన ఈ సినిమా కూడా నవలాధారితమే. ఉక్రెయిన్ రచయిత మిహాయిలో కొత్సియుబిన్స్కీ ఇదే పేరుతో రచించిన కార్పాతియన్ పర్వత శ్రేణులకు ఇరు వైపులా ఉన్న హుత్సుల్ తెగలకు చెందిన యువ ప్రేమ జంట కథ. రోమియో జూలియట్ తరహా. హిమాలయా వచ్చేసి ఒరిజినల్ కథ. ఇందులోనూ ప్రేమ ప్రధాన పాత్ర వహిస్తుంది. కాకపోతే ఇక్కడది విశ్వజనీనమైనది.

దక్షిణ కొరియాకు పొట్ట చేతపట్టుకుని వెళ్ళిన నేపాలీ వ్యక్తి అక్కడ జరిగిన యాక్సిడెంటులో మరణిస్తాడు. అతనికి అందాల్సిన పరిహారాన్ని అతని పై అధికారి స్వయంగా ఇవ్వాలని వెతుక్కుంటూ వెళతాడు. హిమాలయాలలో మారుమూల ఉన్న పల్లెకు. అక్కడ అతని భార్యా కొడుకులను చూసి చలించి పోయి నిజం చెప్పడు. కొంతకాలం వారికి సహాయం చేస్తుంటాడు. ఆ సమయంలో జీవితం గురించి అతనికి కలిగిన ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి.

చివరికి ఇక కొరియా తిరిగి వెళ్ళాల్సిన సమయం వస్తుంది. జరిగిన విషయం చెప్తాడు. అప్పుడు ఆ పిల్లాడు, ఆ యువతి ఎలా స్పందిస్తారు అనేది కథ.

పరజనొవ్ కథకు నీడలు అని పెట్టినా కథ చూపిస్తూ/చెపుతూ తెర మొత్తాన్నీ రంగులతో నింపుతాడు. హిమాలయాలో దర్శకుడు barren colours వాడతాడు. షాడోస్‌లో ప్రేమ జంట అనుబంధానిది ప్రధానమైన కథ అయితే ఇక్కడ చోయ్ మిన్-సిక్ కు ఆ వర్కర్ కొడుకుకు మధ్య డెవలప్ అయ్యే అనుబంధం ప్రధానం. ఆ పిల్లాడు పిల్లనగ్రోవి ఊదుతుంటే చోయ్ విజిలింగ్ హమ్మింగ్ చేస్తుంటాడు. భలే ఉంటాయి ఆ దృశ్యాలు.

ఒక మనిషి హృదయంతో మరో మనిషి హృదయం నెరిపే బాంధవ్యమే ప్రేమ. దాన్ని ఒక్కొక్కరూ ఒక్కొక్క రకంగా వ్యక్తం చేస్తారు. చేశారు. ఆ ప్రేమకు ఇంద్రధనసులో రంగులలాగా ఎన్నెన్నెన్నో వర్ణాలుంటాయి. ఆ వర్ణాల permutations combinations వేసుకుంటే అనంత భావనలు. అవన్నీ ఎందరో కళాకారులు explore చేశారు. చేస్తూనే ఉంటారు.

మన పార్క్ చాన్-వుక్ కూడా I’m a Cyborg But That’s OK లో అదే చేశాడు. ప్రేమ వల్ల ఉన్మత్తుడయి తన ప్రాణాన్ని తీసుకుంటాడు Shadows లో కథానాయకుడు ఇవాన్. అదే ప్రేమ (పిల్లవాడి రూపంలో) అందించిన సాంత్వన వల్ల దెబ్బతిన్న ఆత్మను కోలుకునేలా చేసుకుంటాడు చోయ్ హిమాలయాలో.

కానీ, ఉన్మత్తులైన ఇద్దరు వ్యక్తులు కూడా మా మధ్య ప్రేమ ఉంటుంది. అది కూడా హృదయపు భాష అని నిరూపించే కథే పార్క్ తీసిన సైబోర్గ్ కథ.

Wild imagination తో, ఎల్లలు లేని క్రియేటివిటీకి హద్దులు చెరిపేసిన వ్యంగ్యాన్ని జోడించి సంఘజీవులుగా చెలామణీ అయ్యే మామూలు మనుషుల హిపోక్రిసీ మీద పార్క్ సంధించిన అస్త్రమే I’m A Cyborg But That’s OK. Okay?

సైబోర్గ్ లో రెండు విషయాల మీద పార్క్ గట్టిగా దృష్టి సారించాడు. మనిషికి అసలు కావలసినదేమిటి? అసలు నిజమైన ప్రేమ అన్నది ప్రపంచంలో ఉన్నదా? లేక అది కూడా చిత్త భ్రాంతేనా అని.

రౌడీ పిల్ల మొదట్లో అందరిలాంటి పసి పిల్లే. ఒక చిన్న పిల్లకు ఎలాంటి జీవితం ఉండాలో అలాంటి జీవితాన్నే కోరుకునేది. లేదా అందుకు హక్కు కలిగి ఉంది. కానీ తల్లికి కూతురు కన్నా వేరే ఇతరాల మీద ధ్యాస ఎక్కువ. అంతే కదా. కన్నాం కదా అని ఎంత సేపూ పిల్లల పనేనా? ఎంజాయ్ చేయటానికి మాకంటూ పర్సనల్ స్పేస్ ఉండొద్దూ? జీవితం ఒక్కటే. పిల్లలైతే కాండోమ్ వాడకుంటే సంవత్సరానికి ఒకళ్ళను కనొచ్చు. అంతేనా? అంత తేలికా? (రావు గోపాల రావు స్వరంలో: యనకటి తరాలు కనలేదేఠి?)

ఈ విషయాన్ని సెటైరికల్‌గా రౌడీ పిల్ల తల్లిని ఎసైలమ్ డాక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు మనం గమనించివచ్చు. ఒకరకమైన నిర్లక్ష్యం, చిరాకు చూపిస్తుంది. పార్క్ తన సినిమాలో వీలైనంత bright లైటింగ్ వాడాడు.

ఇక్కడ రౌడీ పిల్ల విషయంలో ఆమె తల్లి ఒకరకమైన నిర్లక్ష్యాన్ని చూపిస్తే, ..Ing సినిమాలో మన మిన్-ఆ విషయంలో ఆమె తల్లి ఈ మి-సుక్ (Lee Mi-sook) సరైన కన్సర్న్ చూపి ఆ పిల్ల బతికినన్నాళ్ళు సంతోషంగా ఉండేలా చూసింది. కానీ, తన పట్ల తాను నిర్లక్ష్యం వహించింది. ఈ విషయంలో బేలెన్స్ కుదరదా? ఆలోచించాల్సిన విషయమే. విచిత్రంగా ..ఇంగ్ లో కూడా స్క్రీన్ మీద బ్రైట్ లైటింగ్ ఉండి వీలైనంత upbeat mood క్రియేట్ చేసేందుకు సినిమాటోగ్రఫీ సహకరిస్తుంది.

ఈ నాలుగు సినిమాలు కూడా ఏదో ఒక రకంగా మరణాన్ని గురించి చర్చిస్తాయి.

..ఇంగ్ లో కథానాయిక మిన్-ఆ మరణమే కేంద్ర స్థానం వహిస్తుంది. అదే కథను ముందుకు నడుపుతుంది. షాడోస్ లో తన పెళ్ళికి అవసరమైన సరంజామా, కాపురం పెట్టేందుకు అవసరమైన సంపద తెచ్చేందుకు కథానాయకుడు ఊరికి దూరంగా వెళ్ళినప్పుడు కథానాయిక మరీచ్కా పొరబాటున కాలు జారి (అబ్బే మన Netflix progressive కాలు జారుడు కాదు) నదిలో పడిపోయి మరణిస్తుంది.

Her death devastates Ivan in such a way that Ivan as himself loses himself and becomes a pale shadow of his real self. He also becomes one of the shadow of our forgotten ancestor alongside his forgotten ancestors.

ఎలా అంటే ఇవాన్ మనకన్నా ముందు తరాల వాడే కదా. అసలు ఇవాన్ ఒక జ్ఞాపకంలాగా, ఒక నీడలా మారిపోతాడు. విషాదంలో ఉండి self-destructive mode లో ఉన్న ఇవాన్ అసలు ఇవాన్‌కు ఒక forgotten shadow of an ancestor యే కదా.

హిమాలయా లో నేపాలీ వర్కర్ మృత్యువే మన చోయ్‌ను అంత పెద్ద ప్రయాణం పెట్టుకునేలా చేస్తుంది. By the Way, until In Our Prime, this character of Choi remains his last completely positive role. సైబోర్గ్ లో మరణం ఉండదు కానీ, రెండు యాక్షన్ సీక్వెన్స్ లలో కనబడే బాడీ కౌంట్ కథను సరిగ్గా అంచనా వేసేందుకు ఆయువుపట్టుగా నిలుస్తాయి.

ఈ నాలుగు సినిమాలలో రెంటిలో ప్రధాన పాత్రలు ఉన్మత్తత కలిగినవి లేదా మధ్యలో మారేవి. మిగిలిన రెండింటిలో పాత్రలు డీప్ గా ఉంటాయి, నిర్లిప్తోద్వేగాలు ప్రదర్శిస్తాయి కానీ, ఉన్మత్తత కలిగినవి కావు. కానీ, నాలుగు చోట్లా ప్రేమే వీరి పాత్రలు వాటి నడతను తీర్చిదిద్దుతుంది.

వీటిలో ఏ ప్రేమ గొప్పది?

ఈ సంగతి సరే! మూడు కొరియన్ సినిమాల మధ్య ఉక్రెయిన్ సినిమా ఎందుకు?

అదెందుకో తరువాత చూద్దాం.

అనుకోవటానికి షాడోస్ ఆఫ్ ద ఫర్గాటెన్ ఏన్సెస్టర్స్ ఒక ప్రేమ కథ అనుకుంటారు కానీ, అది ఒక తాత్విక గాధ. అన్నీ అనుకూలించినా అనుకూలించకపోయినా, జరిగేది ఎప్పుడూ నీ చేతుల్లో ఉంటుంది. భవిష్యత్ నీ చేతుల్లో ఉండదు. ఆ జరిగే దానిలో కూడా there are a few things that are controllable. Rest are out of your purview. So, all you have to do is to control the controllables and leave the rest to the machinations of the world. Or the universe. Or some form of energy.

..Ing చెప్పేదీ అదే.

హిమాలయా లో చివరకు మన చోయ్ నేర్చుకునేదీ అదే.

I’m A Cyborg But That’s Okay చూస్తే మనకు అర్థమయ్యేదీ అదే.

వరుసగా నాలుగు సినిమాల్లో ఈ విషయాన్ని దరిశకులు (ఇక్కడ నాకు అలాగే పలికింది. మంచినీళ్ళు తాగుతున్నా) తెలిసి కానీ, తెలియక కానీ ఏ విధంగా తమ తమ సినిమాల్లో ఇమిడ్చారో చూద్దాం.

Shadows of Forgotten Ancestors

ఉక్రెయిన్లోని కార్పాతియన్ పర్వతాల్లోని ఒక చిన్న హుత్సుల్ గ్రామంలో, ఇవాన్ అనే యువకుడు తన తండ్రిని చంపిన వ్యక్తి కుమార్తెతో ప్రేమలో పడతాడు. అంతే కదా. లేకపోతే కథలో కాంప్లికేషన్ ఎలాగా?

వారి కుటుంబాలు తీవ్రమైన శత్రుత్వాన్ని నెరపుతున్నప్పటికీ, ఇవాన్, మరీచ్కా లు చిన్నతనం నుంచి సన్నిహితులు. క్రమంగా వయసుతో పాటూ స్నేహం ముదిరి, ప్రేమగా మారుతుంది.

అంతే తప్ప మన స్నేహ-ప్రేమ సినిమాల్లో లాగా ప్రేమ స్నేహం వేరని చెప్పుకుంటూ వాళ్ళ ప్రవర్తనలో మాత్రం all but a man and his woman except (censor cut) తప్ప అన్న అతి రీతిని చూపించరు. They loved each other like any human opposite genders that grow in proximity of each other with all humanly feelings. And that’s all. ఈ సినిమా తీసే నాటికి జనం మరీ woke కాలేదు కాబట్టి కథా నాయకుడు కథా నాయికనే ప్రేమించెన్. ఇతర టెన్డెన్సీలు చూపలేద్.

వారి వివాహానికి సన్నాహకంగా, ఇవాన్ కాపురం పెట్టటానికవసరమయ్యే డబ్బు సంపాదించడానికి గ్రామాన్ని విడిచి వెళతాడు. అతను వెళ్ళినప్పుడు, మరీచ్కా తప్పిపోయిన గొర్రెపిల్లను రక్షించే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నదిలోకి జారిపోయి మునిగిపోతుంది. ఆ తప్పిపోయిన గొర్రె పిల్ల కాదు.

ఇవాన్ తిరిగి వచ్చే సరికి మరీచ్కా మృతదేహం మాత్రమే మిగులుతుంది. సృష్ట్యాది నుంచీ వారు సృజించిన పాత్రలు సుఖ పడటం చూడలేరనుకుంటా కళాకారులు. ప్రేయసిని విగత జీవిగా చూసిన ఇవాన్ గతాన్నే తల్చుకుంటూ క్రమంగా డిప్రషన్లోకి వెళ్ళిపోతాడు.

చాలా కాలం అలా గడుస్తుంది. ఇవాన్ క్రిస్ నోలాన్ హీరో లాగా డిప్రషన్లోనే ఉంటాడు. ఎంతైనా మరీచ్కా తన తొలి ప్రేమ ఆయే. ఒకరోజున తన గుర్రాన్ని అదిలిస్తుండగా ఫలానా అనే స్త్రీ కనిపిస్తుంది. (ఆమె పేరు నిజంగా ఫలానా. నేను కల్పించింది కాదు అని మనవి. మనవి doesn’t mean ours. విన్నపం లాంటి మాట). క్రమంగా ఇవాన్ కు ఎందుకో హార్మోన్లు పని చేసి ఫలానాను వివాహమాడాలనుకుంటాడు.

మరీచ్కా మరణం తరువాత డిప్రషన్ లో ఉండి విపరీతంగా పని చేయటం వల్ల బాగనే కూడబెట్టాడు.

It is a truth universally acknowledged, that a single man in possession of a good fortune, must be in want of a wife. అలా ఇవాన్ మరియు ఫలానా సంప్రదాయ హుత్సుల్ సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నారు. దీనిలో వారు కళ్లకు గంతలు కట్టి, యోక్ చేస్తారు.

ఇలా భౌతికంగా సంతోషంగా ఉండాలని చూసినా, ఇవాన్‌ను గతం వదలదు. Marichika who is ingrained deeply in his subconscious comes back alive as a mental projection and doesn’t keep him still. (Hello, Chris Nolan and Inception).

దాంతో ఇవాన్ ఫలానాకు మానసికంగా దగ్గర కాలేడు. దాంతో వయసు ప్రకంపనలు, హార్మోన్ల వత్తిడి తట్టుకోలేని ఫలానా స్థానిక మంత్రగాడైన మోల్ఫార్ తో సెక్షన్ నంబర్ 498A పెడుతుంది.

కథ క్లైమాక్సుకు రావాలి కాబట్టి ఒకానొక శుభ ముహుర్తంలో ఒక చావడి వద్ద, ఇవాన్ మోల్ఫార్ ఫలానాను కౌగిలించుకుని తన స్నేహితుల్లో ఒకరిని కొట్టడాన్ని చూస్తాడు. విపరీతమైన క్రోధంతో ఇవాన్ తన గొడ్డలితో మోల్ఫార్ ను కొట్టబోతాడు. కానీ, మోల్ఫార్ తన మంత్రశక్తితో (???) తనే ఇవాన్ కు మోక్షం కలిగిస్తాడు.

చావుదెబ్బ తిన్న ఇవాన్ సమీపంలోని అడవుల్లోకి పరిగెడతాడు. అక్కడ మరిచ్కా ఆత్మ తనతో ఉన్నట్లు గ్రహిస్తాడు. నీటిలో, ఆకాశంలో, చెట్లలో, పుట్టలలో ఎక్కడ చూసినా మరీచ్కానే. నిజం అబద్ధం, కల వాస్తవం, భ్రమ, సత్యం ఒక్కటిగా మారిపోయి అతన్ని వేధిస్తాయి. మారిచ్కా రంగులేని నీడలా మారి ఒక గొప్ప శూన్యంలో చేరుతుంది. ఇవాన్ చేయి చాచి ఆమె చేతిని అందుకుంటాడు. ఆనందోద్వేగాలతే పెద్దగా అరుస్తూ ఉండగా అతని కథ ముగుస్తుంది.

సంప్రదాయ పద్ధతిలో అతన్ని ఖననం చేస్తారు.

ప్రేమ ఇవాన్ ను ఉన్మత్తుడిని చేసింది.

ఇక మన చోయ్… గురించి వచ్చేవారం చూద్దాం.

సరే! ఈ లోగా రోహిణీ సింధూరి ఐఏఎస్, రూపా మౌద్గిల్ ఐపీఎస్ వివాదంలో ఫొటోల కోసం చాలా మంది వెదుకుతున్నారట! మనవాళ్ళు మాంఛి!

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here