కొరియానం – A Journey Through Korean Cinema-60

1
8

గుండెలు మండేలా

Chapter 55

[dropcap]న[/dropcap]వంబర్ 18, 1993. కపిల్ దేవ్ తొలిసారిగా ఓపెనింగ్ బౌలర్, strike bowler గా తన స్థానాన్ని మనోజ్ ప్రభాకర్‌కు అందించేశాడు. ఆ సందర్భాన్ని ప్రభాకర్ 126 బంతుల్లో 91 పరుగులు చేసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఆ మ్యాచ్ మనవాళ్ళు (మా కొరియన్లు కాదు) జింబాబ్వేతో ఆడారు. హీరో కప్. గుర్తొచ్చిందా?

అనిల్ కుంబ్లే వెస్టిండీస్ వెన్ను విరిచి 6/12 కొట్టింది ఈ టోర్నీలోనే. సచిన్ టెండూల్కర్ తన బౌలింగ్ మాయాజాలంతో దక్షిణాఫ్రికా మీద ఆఖరి ఓవర్‌లో గెలిపించింది కూడా ఈ చాంపియన్షిప్స్ లోనే. ఈ పైన చెప్పిన జింబాబ్వే మ్యాచ్ లో కూడా చివరి ఓవర్‌ను సచిన్ వేశాడని చాలామంది గుర్తుపెట్టుకుంటారు.

కానీ ఆ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ను వేసింది మనోజ్ ప్రభాకర్. అలాగే టెన్నిస్ అభిమానుల విషయానికి వస్తే 1995 వింబుల్డన్ ఫైనల్‌లో పీట్ సాంప్రాస్ మూడు సెట్లలోనే గెలిచాడని చాలామంది అనుకుంటారు. నిజానికి తొలి సెట్ ను 6-7 స్కోరుతో బోరిస్ బెకర్ గెలిచాడని గుర్తుండదు. ఇంకా తేలికైన విషయం చెప్తాను.

సచిన్ ఫేమస్ చివరి ఓవర్ మ్యాచ్‌లో అతను మూడు వికెట్లు తీశాడనుకుంటారు. కానీ అది నిజం కాదు. పడిన వికెట్లలో రనౌట్ (Kangana Ranaut కాదు. ఆమె పేరు కంగనా రనావుత్) లు కూడా ఉన్నాయి.

ఇలా మనకు తెలియకండానే ఒక జరుగని ఈవెంట్‌ను నిజమని నమ్మేస్తుంటాం. ఎవరి ప్రమేయం లేకుండానే. ఇది ఏ ఒక్కరి కేస్ లోనే కాదు. కొన్ని సార్లు చాలామందికి ఒకేసారి జరుగుతుంది. అందరూ ఒకే చోట ఉన్నా, దూరదూరంగా ఉన్నా.

ఉదాహరణకు డియాగో మారడోనా Hand of the God goal అతని చేతికి తగల లేదని ప్రేక్షకులంతా అనుకోవటం. లేదా తగిలిందని అనుకోవటం.

దీన్నే మండేలా ఎఫెక్ట్ అంటారు. అంటే..

The Mandela Effect is a phenomenon in which a large group of people or some-times a group of few unrelated individuals collectively (or individually) remember an event or fact differently than how it actually occurred or is currently remembered by the majority.

చారిత్రక కథనాల ప్రకారం ఆ పేరు ఎలా వచ్చిందంటే..

The term “Mandela Effect” was coined by paranormal enthusiast Fiona Broome in 2010, after she discovered that a large number of people believed that Nelson Mandela had died in prison in the 1980s. In reality, he was released from the prison in 1990 and served South Africa as the first black/native president. He died in 2013.

యథా మాదిరిగా శాస్త్రవేత్తలు సైకాలజిస్టులు దీనికి రకరకాల కారణాలు చెప్తారు. Collective brain fade అని, faulty memory అని. పరిశోధనలు ఇంకా జరగుతూనే ఉన్నాయి. వందల సంవత్సరాల నుంచి కేన్సర్ తగ్గించటానికి మందు కనిపెట్టే ప్రయత్నంలా.

ఇక కాన్స్పిరసికులైతే alternate realities, parallel universe effect, time travel అని రకరకాల థియరీలు ప్రతిపాదిస్తారు.

ఏది ఏమైనా ఇది చాలా సబ్జక్టివ్ మేటర్. వితిన్ సినీ అనే యూట్యూబ్ చానల్‌లో దీని గురించి విన్నాక నేను నా స్టైల్‌లో పరిశోధన చేశాను. విచిత్రంగా ఎవరూ గమనించలేదు కానీ, ఒకరకమైన మండేలా ఎఫెక్ట్ వేరియేషనే Oldboy సినిమాలోనూ కనిపిస్తుందని గమనించాను. ఇలాగే individualised effect ని బాగా వాడుకుని మన హే-జూన్ ను తన గ్రిప్ లోకి తెచ్చుకుంటుంది స్యో-రే. చాలా confusion గా ఉంది కదా. Yes. It’s more like a con fusion.

Oldboy లో ఓ డే-సు తన గతాన్ని తవ్వుకుంటూ వెళ్తాడు, ఈ వు-జిన్ చాలెంజ్ గెలవటానికి. తన హైస్కూల్ రోజులలో జరిగిన సంఘటనల వల్ల ఏమన్నా తనకు క్లూ దొరుకుతుందని. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. ఈ వు-జిన్, ఓ డే-సు ఇద్దరూ ఒకే హైస్కూల్‌లో చదివారు. మన మెట్ల సుబ్బారావుగా రూపాంతరం చెందబోతున్న ఓ డే-సు కు నోటి దూల ఎక్కువ. తనకన్నా బలమైన వారిని ఏమీ పీకలేడు కానీ, తనకన్నా ఏమాత్రం బలహీనంగా ఉన్నవాళ్ళతో ఆడుకుంటాడు.

ఒకరోజు స్కూల్ ఇంటర్వెల్ సమయంలో ఓ డే-సు.. ఈ వు-జిన్ అతని సోదరితో కలిగి ఉన్న incestuous relationship ను చూస్తాడు. చూసిన వాడు ఊరుకోడుగా. పక్కింటి అన్నయ్య గారి లాంటి మనిషిగా ఎదగబోతున్న తన మిత్రుడు జూ-హ్వాన్ కు చెప్తాడు ఇది రహస్యం. ఎవరికీ చెప్పద్దు అని. సంసారపక్షంగా అన్ని రహస్యాల మాదిరిగానే క్రమంగా అది కాస్తా అందరికీ పాకిపోయి ఈ వు-జిన్ సోదరికి మనోవేదన కలుగుతుంది. There’s a lot of issues in higher class families. Should we take these things in a sympathetic way? At least we shouldn’t violate the privacy.

ఆమెకు ఫాంటమ్ ప్రెగ్నెన్సీ వస్తుంది. దాంతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది.

కానీ, ఓ డే-సు ఇదంతా జరుగక ముందే ఆ ఊరు వదిలి వెళ్ళిపోతాడు. సరిగ్గా జూ-హ్వాన్‌కు చెప్పిన మర్నాడే. దాంతో అతనికి ఈ విషయం గుర్తుండదు. తనకు గుర్తుండేది కేవలం జూ హ్వాన్‌తో చివరి రోజు చేసే అల్లరి పనులు మాత్రమే. మండేలా ఎఫెక్ట్ వేరియేషన్.

Chapter 56

ఏ రకంగా చూసినా ఓ డే-సు జీవితం ఆదర్శప్రాయం కాదు. కానీ, main timeline గడుస్తున్న కొద్దీ అతని వ్యక్తిత్వంలో మార్పు గమనిస్తాం.

మొదట జైలులో పెట్టబడినప్పుడు భయస్తుడౌతాడు. దాదాపు పిచ్చెత్తినంత పని అవుతుంది. క్రమంగా రియలైజ్ అవుతాడు. మొదట తన భయాన్ని జయిస్తాడు. ముందు మెంటలెక్కకుండా బతికి బైట పడాలంటే తనకో లక్ష్యం కావాలని రియలైజ్ అవుతాడు. ఇదంతా జరుగటానికి ముందు తానొక అమాయకుడినని, తనే తప్పు చేయలేదని, తనని వదిలేయమని బతిమిలాడుతాడు. అవకాశం ఉంటే అవతల వ్యక్తి కాలు నాకేందుకు కూడా సిద్ధపడుతాడు.

ఇదే కాలు నాకే స్థితి ఐరనికల్‌గా జరుగుతుంది కథ కంచికి చేరబోయే ముందు.

తనను బంధింపజేసిన వ్యక్తి మీద వైలెంట్‌గా ప్రతీకారం తీర్చుకునేందుకు మానసికంగా సిద్ధపడతాడు.

ఇక చివరికి తనను ఇప్పుడప్పుడే వదలరని అర్థమయ్యాక గదిలో మాడ్చబడిన పిల్లి చందాన అతనిలో వెర్రి ధైర్యం వస్తుంది. ఇది మొదటి మార్పు.

మెట్ల సుబ్బారావు మనస్తత్వం క్రమంగా అంతరిస్తుంది. అది ఎక్కడంటే తను తనకు చెప్పుకునేంత అమాయకుడిని కాదు అని అర్థం చేసుకున్నాక. వరుస పెట్టి తను అఫెండ్ చేసిన వ్యక్తుల పేర్ల లిస్టు రాస్తాడు.

అదో పెద్ద గ్రంథమే అవుతుంది. ఇంతమందిని తాను బాధించాడా అని ఆశ్చర్యపోతాడు. గోడకు కంత పెట్టి బైటకు వెళ్దామని చూసే ప్రయత్నంలో petrichor ను ఆస్వాదించే సన్నివేశంలో పూర్తిగా తనలో ఉన్న మెట్ల సుబ్బారావు చావటం మనం గమనిస్తాం. ప్రకృతిని ఓ డే-సు ఆస్వాదిస్తాడు అన్నదానిని మనం అసలు నమ్మలేం.

తరువాత మార్పు matter of fact. ముందు తన అవసరం ముఖ్యం. తరువాత అవతల వారి సంగతి. తనను బైటకు వదిలేస్తారు. అప్పటికే చాలాకాలం గడిచింది. ఇక సమయం లేదు. చాలా కాలానికి మనిషిని చూసిన ఆనందాన్ని కుక్క మనిషి ద్వారా అందుకున్నాక, అతని కథను విననిరాకరిస్తాడు. అసలు తను ఎవరినైనా భయపెట్టగలడా అన్న దానిని లిఫ్ట్‌లో ఉన్న మహిళను బెదరగొట్టటం ద్వారా తేల్చుకుంటాడు. ఇక్కడ sexual feels కూడా ఉండటం అతను Alpha Male in a negative sense గా తయారౌతున్నాడని తెలుస్తుంది.

కానీ అసలైన మార్పు తాను అసలు ఏ మాత్రం మనిషిని అని చెప్పుకునేందుకు అర్హత లేకపోయినా కనీసం ఒక బీస్ట్‌గా అయినా జీవించే హక్కు ఉంటుందా అని ఆ హిప్నటిస్ట్‌ను అడుగుతున్నప్పుడు మనం తెలుసుకుంటాము.

దానికి కారణం ప్రేమ. ఎంత నీచమైన జీవినైనా, పశుప్రాయమైన వ్యక్తినైనా ఒక అనుబంధం మనిషిగా మార్చవచ్చు. ఏ క్షణంలో ఈ వు-జిన్ మిడు తన కూతురని చెప్తాడో ఆ క్షణమే ఓ డే-సు ను కమ్ముతున్న మబ్బు తెరలన్నీ వీడిపోతాయి.

ఇక అక్కడ మిగిలేది కేవలం ఒక జీవుడు మాత్రమే. ఇక వేరేది ఏమీ లేదు. తన పగ, ప్రతీకారం, విజయం.. ఇవన్నీ గాలిలో కలిసిపోతాయి. ఇక తనకు ముఖ్యమైనదల్లా నిజం తెలిసి తన కూతురు సర్వనాశనం కాకుండా చూసుకోవటమే.

అక్కడే ఓ డే-సులో అసలు మనిషి బైటకు వచ్చాడు. వాడెప్పుడూ మంచి వాడే.

అందరిలోనూ అలాంటి వాడొకడుంటాడు. అందువల్లే ప్రపంచం ఇంకా సర్వనాశనం కాకుండా మిగిలి ఉంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here