కొరియానం – A Journey Through Korean Cinema-61

0
14

సావిత్రివిక్రమం

[dropcap]మం[/dropcap]చుపూల వర్షం.

ఓ డే-సు లో మనిషి ఉదయించిన వేళ.

హిప్నటిస్ట్ తను ఎందుకు ఓ డే-సు కు సహాయం చేయటానికి ఒప్పుకుంటోందో చెప్తుంది.

నిజానికి ఆమె ఈ వు-జిన్ నియోగించిన వ్యక్తి. Lee Woo-jin might even be her master. కచ్చితంగా తన కథను ఆమెకు చెప్పే ఉంటాడు. ఆమెను బెదిరించి లొంగదీసి ఉండడు. ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్స్ వేరే లెవెల్.

Either he should have convinced her Oh Dae-su is a real monster and deserves such punishment or bought her outright. But him convincing her is very apt assumption.

ఎందుకంటే చివరి సన్నివేశంలో ఆమె కళ్ళు చూస్తే అర్థమవుతుంది. She disdains Oh Dae-su. సహజంగానే ఆమెకు మెట్ల సుబ్బారావులు పడకపోవచ్చు. లేదా ఈ వు-జిన్ నోటివెంట విన్న మాటలు ఆమెను అలా ప్రభావితం చేసి ఉండవచ్చు. చెప్తాడు కదా నీ నాలుకను అదుపులో పెట్టుకోకుండా చేసిన తప్పు అని. నాలుక పవర్. మాట మంత్రం. అది శిష్టాచారమైనా, వామాచారమైనా.

కానీ, ఓ డే-సు ఆమెను కూడా కదిలించాడు. తనకు సహాయం చేయమని అభ్యర్థించాడు. చేసింది. తనలో మిగిలి ఉన్న beast అవశేషాలను తెగ్గొట్టి (literally), leaves him in peace.

మంచు కురుస్తూనే ఉంటుంది.

ఓ డే-సు అక్కడ పడి ఉంటాడు. మెలకువ వస్తుంది. తనకు ఆ హిప్నటిస్ట్ చేసిన సహాయం నిజమా? తన ఊహా?

కన్ఫ్యూజన్.

ఎదురుగా కుర్చీలు ఉంటాయి.

“Even though I’m no more than a monster – don’t I, too, have the right to live?”

సరిగ్గా ఈ మాటలతోనే తన పరివర్తనను చూపాడు, ముసుగులను, అన్నిటినీ తీసిపారేశాడు ఓ డే-సు. మిగిలింది కేవలం ఒక మనిషి మాత్రమే. ఇంకేమీ లేదు. ఆ మనిషి మంచివాడా చెడ్డవాడా అన్న ప్రశ్న లేదు. మనిషి. అంతే. ఎలా మలుస్తే అలా అవుతాడు.

అక్కడే హిప్నటిస్ట్ అతనికో పుష్ ఇచ్చింది.

అది సరైనదేనా?

నువ్వు మంచివాడివే. పరిస్థితులు నిన్నలా మార్చాయి. అని చెప్పవచ్చు. కానీ చెప్పలేదు. అలా చెప్తే సానుభూతి కోరుకుంటాడు.

నువ్వు చెడ్డవాడివి. కనుక నేను నీకు సహాయం చేయను అనలేదు. పరిస్థితి చేయిదాటిపోయేది. లేదా తన మొరాలిటీ దెబ్బ తినేది. సినిమా అసలుకే ఎసరు పెట్టుకునేది.

నువ్వు చెడ్డవాడివి. అయినా నేను నీకు సహాయం చేస్తున్నా. ఇలా చెప్పి మోరల్ హైగ్రౌండ్ తీసుకోలేదు. తీసుకున్నా తప్పలేదు. కాకపోతే ఓ డే-సు కుమిలిపోయేవాడు. కుంగిపోయేవాడు. పైగా ఆమెకు అనవసరపు కృతఙ్ఞత చూపుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అదంతా మరో బరువు అయ్యేది. He’s already a highly volatile soul. That volatility should be eased.

అనవసరపు ప్రేమ కూడా కురిపించలేదు.

కేవలం.. కేవలం.. అతనికి ఏమి కావాలో అది ఇచ్చింది. అతను ఒక జీవి అన్న విషయాన్ని గుర్తించింది. హిప్నటిజమ్ సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఇవ్వలేను అని చెప్పింది. అడిగింది చేసింది.

ఓ డే-సు లో బీస్ట్‌ను, మనిషితనం ఉన్న వ్యక్తిని విడదీసి చూపింది. మనిషితనం ఉన్న వ్యక్తికి మిడు తన కూతురు అన్న విషయం తెలియదు. అది తెలిసిన బీస్ట్‌కు ఒక ఆప్షన్ చూపింది.

ఒక్కొక్క అడుగూ వేసుకుంటూ దూరం జరగాలి. ఒక్కొక్క అడుగుకూ ఆ బీస్ట్ వయసు ఒక సంవత్సరం పెరుగుతుంది. అలా డెబ్బై అడుగులు వేసేసరికి ఆ బీస్ట్ కథ ముగుస్తుంది.

Chapter 57

14 ఏప్రిల్ 2023 నాడు విడుదలైన Killing Romance చాలా విచిత్రమైన సినిమా (రాస్తున్న సమయం 15 ఏప్రిల్ 2023). మన టేబ్లాయిడుల్లో వచ్చే న్యూస్ ఐటమ్స్ లాంటిది.

Hwang Yeo-Rae ఒక popular actress. కాసేపు కొరియన్ నేషనల్ క్రష్ అనుకోండి. ఆ స్థాయి హీరోయిన్‌కు తగిన రీతిలో ఆ పిల్లకు కూడా నటన రాదు. కేవలం అందంతో నెట్టుకుని వస్తుంటుంది.

నేను ఒక మాట మాట్లాడితే రెండు కాంట్రవర్సీలు అవుతున్నాయి. నేను ఒక సీన్‌లో కనిపిస్తే నాలుగు ట్రోల్ మీమ్స్ వస్తున్నాయి అని వాపోతుంటుంది.

గమనిక: అనగా నోట్. మదనిక లాగా అమ్మాయి పేరు కాదు.

ఈ పైన చెప్పిన ఉదంతం అంతా కల్పితం. Yours truly has nothing to do with it. ఎవరినన్నా గుర్తుచేస్తే అది యాదృచ్ఛికం మాత్రమే (స్పెలింగ్ కరక్టేనా?). అనగా తెలుగూఫుల మాతృభాషలో చెప్పాలంటే coincidence.

ఒకసారి ఉప్పు కారం తినే అందరు నటీమణుల్లాగానే ఆమె కూడా ఒక ద్వీపానికి హాలిడే ఎంజాయ్ చేయటానికి వెళ్తుంది. అంటే మిగతావన్నీ మీకు తెలుసు కాబట్టి తెలుగు సినిమా వెబ్సైట్ల మాదిరి రాతలను మీరే ఊహించుకోండి. ఎలాంటి ఫొటోలు బైటకు వస్తాయ్.. అలాంటివన్నమాట.

సరే అక్కడ మన హీరోయిన్ కు ఒక రిచ్చి బిజినెస్మాన్ Jonathanan Na పరిచయం అవుతాడు. మన్మథుడు తన పని తాను చేసేయటంతో వారి ప్రేమ పెళ్ళికి దారితీస్తుంది. ఇందులో డబ్బు ప్రమేయం లేదు. ఒట్టు. కావాలంటే Hwang Yeo-Rae మీద.

ముందు మంచివాడుగా కనిపించిన Jonathan Na తరువాత తన అసలు స్వరూపం బైట పెట్టి సినిమాలు చేయొద్దంటాడు.

వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంటుంటాడు సోల్ యూనివర్సిటీలో (Seoul University) సీటు సంపాదించాలని కంకణం కట్టుకున్న హైస్కూల్ స్టూడెంట్ Kim Beom-Woo. అతను మన హీరోయిన్‌కు వీరాభిమాని. తన అభిమాన నటి తన ఇంటికి దగ్గరలో ఉందని తెలిసి ప్పులకించిపోతాడు (ఎవరైనా గుర్తొస్తే నా బాధ్యత లేదు – కొనా aka కొరియానం నారేటర్). వెళ్ళి కలుస్తాడు. తరువాత ఏమి జరుగుతుందో మనకు తెలిసిందే.

ఇటువైపు మన హీరోయిన్ సినిమాలను మిస్ అవుతుంటుంది. అటు సంసారమూ.. మనకు తెలిసిందేగా ఇలాంటి సినిమాల్లో ఏమి జరుగుతుందో. పైగా ఒక మంచి బ్సాక్బస్టర్ అయ్యే చాన్స్ ఉన్న సినిమాలో ఆఫర్ వస్తుంది.

ఇంకేముంది?

అటువైపు మనసు పాకుతుంటుంది. భర్త Jonathan Na ఆ సినిమా చేయటానికి ఒప్పుకోడు. చూడటానికి మాంఛి గ్లామరస్ లైఫ్ అనుభవిస్తోంది అనుకుంటారు అంతా. కానీ, Hwang Yeo-Rae తన ఇంట్లోనే తాను ఒక బందీ.

తప్పనిసరి పరిస్థితులలో సంప్రదాయానికి కట్టుబడి ఆ కుర్ర అభిమానిని పరిష్కారం కోసం ఆశ్రయిస్తుంది. కుర్రాడు కూడా సంసారపక్షంగా ఆమె భర్తను లేపేద్దామంటాడు.

మిగతాది వెండి తెర మీద చూడాలి.

మొదలుగా వచ్చిన రివ్యూలు బాగున్నై. సినిమాను ఒక బ్లాక్ కామెడీ మాదిరి తీశారని టాక్. కానీ ఆడే అవకాశం తక్కువ.

కొరియన్ సినిమాలో Oldboy, Peppermint Candy, Snowpiercer లాంటి గొప్ప సినిమాలే కాదు. ఇలాంటి tabloid సినిమాలు కూడా వస్తుంటాయి. ఈమధ్య కాలంలో మలయాళంలో చతురమ్ అనే సినిమా వచ్చింది. మల్లూ సోదరులు మాలికాపురమ్ లాంటి సినిమాలతో పాటూ నాసిరకం సినిమాలు కూడా తీస్తారు. అది మహా మహా ఆలీవుడ్డులో కూడా జరుగుతుంటుంది కాబట్టి.. I know I drove the point well.

మన సాంగ్ కాంగ్-హో చేస్తున్న సినిమా CobWeb. May 27 విడుదల అవుతుంది.

ఇందులో మన కొరియన్ నట వీరుడు ఒక దర్శకుడి పాత్ర పోషిస్తున్నాడు. అతని పేరు కిమ్. 1970లలో వచ్చిన CobWeb అనే సినిమా క్లైమాక్స్ సరిగా లేదనేది అతని అభిప్రాయం. దాన్ని ఎలాగైనా సరిచేసి ఆ సినిమాను క్లాసిక్ గా మార్చాలనేది అతని పట్టుదల. అందుకోసం అతను పడే తపన, సినిమా తీయటంలో వచ్చే సమస్యలు.. ఇవన్నీ ఈ సినిమా ఇతివృత్తం. సినిమాలో సినిమా.

దీన్ని కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) లో ప్రదర్శిస్తారు. కాంగ్ దర్శకుడు కిమ్ పాత్రలో ఇరగదీశాడనేది internal talk.

పెద్ద హిట్ కోసం ఈ సంవత్సరం చూస్తున్న ఎదురుచూపులు ఈ సినిమాతో తీరతాయని పరిశ్రమ ఆశలు పెట్టుకుంది.

Chapter 56 (Continues)

మిడు వస్తుంది. మంచులో అలా నించుని ఉన్న ఓ డే-సు ను చూసి సంతోషంతో ఆలింగనం చేసుకుంటుంది.

ఇక మనం కలిసే ఉంటామా అని అడుగుతుంది. ఓ డే-సు కూడా మిడును వాటేసుకుంటాడు.

అతని మోములో సంతోషం.

ఇంతలోనే విషాదపు నవ్వు. అందులో వేల వేల భావాలు.

అతను తను మర్చిపోవాలనుకున్న దానిని మర్చిపోయాడా? లేదా జీవితాంతం అది మర్చిపోలేక తను అనుభవించబోయే నరకాన్ని గురించిన ఆలోచనా?

ఏదైనా కానీ, మిడు కు మాత్రం ఆ గుండెలు పగిలే నిజం తెలియదు. చెప్పేవాళ్ళు లేరు. ఓ డే-సు చెప్పలేడు.

విషయం గుర్తున్నా, లేకపోయినా, ఓ డే-సు కు ఇక లాభం లేదా నష్టం లేదు. ఆ స్థాయి దాటిన దెబ్బలు తగిలాయి. చేసిన కర్మకు ఫలితమా అన్నట్లు అతని జీవితాన్ని ఈ వు-జిన్ నాశనం చేశాడు. 50 ఏళ్ళు దాటేసిన ఓ డే-సు జీవితం ఇంకెంతో కాలం ఉండదు. తనకు కూతురని గుర్తున్నా లేదా ప్రియురాలిగా మాత్రమే గుర్తున్నా, మిడు కు రక్షణగా ఉండటమే అతని పని.

That kid had lost everything for no fault of hers. ఓ డే-సు కు కూతురుగా పుట్టటమే ఆమె నేరమా? అందుకే అతని ప్రాణం ఉన్నంత వరకూ ఓ డే-సు ఆమెకు జీవితంలో అప్పటి వరకూ దక్కని తోడుగా ఉంటాడు.

It is she who needs and deserves a happy ending. That she’ll live with Oh Dae-su forever. Now, there’s nobody to keep them apart.

ఆ తోడు తండ్రిగా అయినా, ప్రేమికుడిగా అయినా, మరోరకంగా అయినా.

అలా ఆమెకు తోడుగా ఉండటానికి అర్హత కావాలి. దాన్ని సంపాదించేందుకు ఓ డే-సు పెద్ద మూల్యమే చెల్లించాడు. ఒక బీస్ట్ లాంటి వ్యక్తి మనిషిగా మారాడు. త్యాగం చేశాడు. చేస్తాడు. లేదా చేయబోతున్నాడు. దీనికంతటికీ కారణం ప్రేమ. లేదా ప్రేగుబంధం. ఈ రెండూ చాలా బలమైనవి. మృగాలను కూడా మార్చగలవు.

అదే పార్క్ చెప్పదల్చుకున్నది.

సరిగ్గా ఇరవై సంవత్సరాలైంది Oldboy సినిమా కథ ముగిసి. అప్పటికి ఓ డే-సుకు 50-52 సంవత్సరాలు అనుకుందాం. మిడు కు 20.

ఇప్పుడు ఓ డే-సు ఉండి ఉండవచ్చు. లేదా మరణించి ఉండవచ్చు. మిడు మాత్రం అతని తోడు వల్ల తన భయాలను జయించి జీవితాన్ని బలంగా నిలబెట్టుకోగలిగే ఉంటుంది. She’s now into her forties. Let’s hope for the best.

ఇంతకీ మిడు ఓ డే-సుకు జీవితాన్ని ఇచ్చిందా? ఓ డే-సు నే మిడుకు తోడుగా నిలిచాడా?

Chapter 57

The Joint Security Area (JSA) is a small strip of land located in the Korean Demilitarized Zone (DMZ) that separates North and South Korea in the Korean Peninsula. It was established in 1953, following the signing of the armistice agreement that ended the Korean War. The JSA is the only place along the DMZ where North and South Korean forces stand face-to-face.

The JSA is jointly controlled by both North and South Korea, and is used as a venue for diplomatic meetings and negotiations between the two countries. It is also a popular tourist destination, with visitors allowed to enter the area under the supervision of both North and South Korean soldiers.

Despite the symbolic importance of the JSA, tensions between North and South Korea have occasionally spilled over into the area. In 1976, North Korean soldiers killed two US Army officers who were conducting a tree-trimming operation in the JSA. In 1984, North Korean soldiers attempted to assassinate South Korean President Chun Doo-hwan during a visit to the JSA. In 2018, North and South Korean soldiers briefly exchanged gunfire in the JSA, although no one was injured.

ఇలాంటి ప్రదేశంలో అసలు ఈ సైనికులు నిజంగా శత్రుత్వం కలిగి ఉంటారా? కేవలం దేశభక్తేనా? మనుషులు, వారి మధ్య ఏర్పడే అనుబంధాలు.. వీటిని విశ్లేషిస్తూ మన పార్క్ చాన్-వుక్ తీసిన సినిమానే JSA – Joint Security Area.

చాలా వరకూ యుద్ధానికి దిగరు. కొట్లాటలు కాల్పులు ఇవన్నీ anomalies తప్పు regular events కావు. పైగా ఎదురెదురుగా నిలుచుని మొహామొహాలు చూసుకునే వాళ్ళే. ఎవరైనా టూరిస్టులు వస్తే వారిని కనిపెట్టి ఉండాల్సిన పని ఉత్తర దక్షిణ కొరియన్ సైనికుల ఉమ్మడి బాధ్యత. ఎంతకాలం అని మొహాలు గంటుగా పెట్టుకుని ఉండగలరు?

నవ్వుతూ పలకరించుకోరా? అలాగా పలకరించుకున్నారు Lee Soo-hyuk, Oh Kyeong-pil లు. అది చివరికి మాటల్లో చెప్పలేనంత విషాదానికి దారి తీసింది. దేశాల మధ్య సరిహద్దులుంటాయి కానీ, మనుషుల మధ్య కాదు. ఇలా దేశాల మధ్య శతృత్వాలు మనుష్యుల మధ్య ఆప్యాయతలను చంపేయటం. అసలు స్నేహాలనే బలికొనేలా మార్చటం మానవజాతి చరిత్రలో అతి పెద్ద విషాదం.

Maj. Sophie E. Jean is summoned to the DMZ of Koreas in order to conduct a neutral investigation of the skirmishes and the deaths that resulted in the Joint Security Area. ఈ మేజర్ సోఫీ పాత్రను పోషించింది

కొరియన్ సావిత్రి ఈ యూంగ్-ఏ Lee Young-ae.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here