[dropcap]ఆ[/dropcap]కుపచ్చ చిగుళ్లు
అందంగా అలంకరించుకొన్నది
కొమ్మ కొమ్మలో వీచే కొత్త ఊపిరిగా
వసంత గాలికి
వెన్నెల వానే కురిసింది
పూల పుప్పొడి పులకించి
నేలకు ఆమని ముగ్గులు వేసింది
ఆకులు రాలిన అడవిలో
గాలి గలగలు సుందరమై వినిపించే
లేలేత పత్రాలు కొత్త చిగుళ్లు వేసినవి
రాలిన చోటే మెరిసే లతల సోయగం
తలలో పూలై విరిసే జవరాలి కనులుగా
చల్లగాలి ఎదలో మంచు చేరినది
వసంతమే పులకించే నేల సొంతమై
తీయని రాగమేదో తీసింది ప్రకృతి కాంత
బతుకు నింపే పున్నమి వెన్నెల కాంతి