కొత్త పదసంచిక-13

0
7

‘కొత్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. నిన్న కోసాను. ఇలా తగలడింది!(4).
04. అరణ్య పర్వం కొంత తెనిగించి పోయినతను.(4).
07. వారల పలుకులు వినండి కానీ, కుల ప్రసక్తి తేకండి. బోలెడు శబ్దాలు వినవలసి వస్తుంది. (5).
08. ఆ సంతోషానికి తలాతోకా లేదు!(2).
10. ఆమె నడవడికలో స్పీడు గమనించారా? (2).
11. ఇతరులుది కాని excitement మనం సొంతం చేసుకుందాం. (3).
13. ఆడ పిల్ల! వయసు చెప్పడంలో తడబాటు సహజమే! (3).
14. గుడ్డ ముక్కే కదా! వెనుక నుండి కలియబెట్టీ. (3).
15. శనిగ్రహం లో సంయమనము గమనించండి. (3).
16. నేను తెలంగాణా అమ్మాయిని. (3).
18. నేను ఎవరు? (2).
21. ముగ్గురు మూర్తులు! (2).
22. భగణము అంటే అమ్మ!! (5).
24. పదిగురాడు మాట! (4).
25. తోక-చుక్కలు కాదు, ఈగలు! (4).

నిలువు:

01. అంగరక్షణ సరిగ్గా ధరించలేదు. (4).
02. చిలుక పలుకు నడుమ గమనించండి.(2).
03. రావిశాస్త్రి గారి నాయిక తడబడింది. (3).
04. ఆవకాయ ముడి పదార్థాలలో ఇవి కూడా! (3).
05. హిందీ హృదయం తెలుగులో చెప్పండి.(2).
06. 24 సెకన్ల కాలం వింగడించండి. (4).
09. అల్లుడు గారు! (5).
10. రామరాజు భూషణుని భూషణం. (5).
12. ఈ యుగంలో అందమైన స్త్రీ! (3).
15. సిగరెట్లలో ఉన్న మత్తు పదార్ధం టిను తోనా? (4).
17. హిట్లరూ, సద్దాం హుస్సేనూ…(4).
19. సుందరమైన ఆలయం. (3).
20. ప్రాగ్దిశ క్రింద నుండి చూడండి. (3).
22. షేప్ లేకుండా అయింది చివరకు. (2).
23. మనిద్దరి లో నన్నొదిలేసి చూడు ఉల్టాగా. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 నవంబరు 01 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 13 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 నవంబరు 07 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-11 జవాబులు:

అడ్డం:   

1.నుర్ధనిడు 4.దాశరథి 7.మిథునరాశి 8.నవా 10.కారి 11.మువిత్త 13.టలిప 14.వసువు 15.సరుకు 16.కడవ 18.దాస 21.కసు 22.పరుసవేది 24.వనాటము 25.లీలావతి

నిలువు:

1.నుతనము 2.నిమి 3.డుథుపాం 4.దారాలు 5.శశి 6.థిపంరిప 9.వావివరుస 10.కాలినడక 12.ఉసురు 15.సదాశివ 17.వసుమతి 19.పౌరుము 20.హవేలీ 22.పట 23.దిలా

కొత్త పదసంచిక-11 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • భాగవతుల కృష్ణారావు
  • కిరణ్మయి గోళ్ళమూడి

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here