కొత్త పదసంచిక-15

0
8

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. తలపోయిన జంధ్యాల సినిమా మాయాబజార్ తలపిస్తుంది. (4).
04. కుదరదంటే కుదరదు! నేనొప్పుకోను.(4).
07. ఆమనిలో లభించే దానిలో ఆమని ఉంది చూశారా? (5).
08. అట్నుంచి చూడండి కొస పోయింది కొసకి. (2).
10. చెవి కొరుక్కోడాల్లో టూత్ పేస్ట్ ప్రసక్తి లా ఉంది. (2).
11. మువ్వన్నెల జెండా! (3).
13. చూపు చంద్రబాబుదా? (3).
14. అయ్యప్పను అందరూ కోరేది. (3).
15. తాగడానికీ, వసించడానికీ పనికి రాని క్వార్టర్లు. (3).
16. నోముకు ఫలం! సరే, ముందేదో ఉంది.(3).
18. షాజహాన్ పాదుషా వారిలో ఉన్నవి రెండు! (2).
21. వెనుక నిలబడి ఎక్కడంటున్నారు. (2).
22. పన్నెండు లో పెద్దది. కొంచెం సాగదీయండి ఫర్వాలేదు. (5).
24. హిందీ ప్రయాణకుడిలో కాస్త తెలుగుదనం తీసుకుని రండి. (4).
25. బైట పాసులు కిక బై చెప్పేయండి. భరించ లేకపోతున్నాం. (4).

నిలువు:

01. పార్వతీ దేవి అయినా, గంగా నది అయినా ఎత్తునుంచే ప్రారంభం. (4).
02. క్రింద నుంచి చూస్తే అంతా మిథ్య సుమండీ. (2).
03. విజయలక్ష్మి గారు ఈ పాటి రచయిత్రి అని అందరికీ తెలుసు. (3).
04. తలాతోకా లేని చెవుల కొరుక్కోడాలు. (3).
05. ఒసే, రుక్కూ! ఏమిటా మిడిసిపాటు? మధ్యలో దానితో బియ్యం కొలిచి ఎసట్లో పొయ్యి. (2).
06. ఏమిటి? రాజు నే కొనేస్తావు? తగులబడు అయితే. (4).
09. యన్టీఆర్, జమున మెగాస్టార్లు! (5).
10. అలనాటి నటి ఉన్న అలనాటి సినీ పత్రిక! (5).
12. క బాషలో యుద్ధం ప్రకటించండి. ఈ గ్రామాధికారిని పంపుతాం ! (3).
15. పాము తల తోక లోపల విషము!! (4).
17. తండ్రులు తడబడడం కాదు గానీ చూడడానికి పనికొచ్చాయి. (4).
19. ప్రభుత్వం! ప్రాంతం కూడా ఉంది. (3).
20. ఈ స్థితిలో ఉన్నాడంటే ఇబ్బందులలో ఉన్నట్టే! (3).
22. ఒక ఫిగర్ లో అధికం హ్రస్వమైంది. (2).
23. క్రింద నుంచి వస్తోంది కాటెయ్యడానికి. (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 నవంబరు 15 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 15 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 నవంబరు 21 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-13 జవాబులు:

అడ్డం:   

1.కలకత్తా 4.ఆదికవి 7.పలురవాలు 8.ముద 10.వడి 11.వశము 13.వసుయ 14.పీలిక 15.నిగ్రహం 16.పోరిని 18.కోహం 21.త్రయం 22.ఆదిగురువు 24.నుడికారం 25.తూనీగలు

నిలువు:

1.కచమువ 2.కప 3.త్తాలుర 4.ఆవాలు 5.దిలు 6.విగడియ 9.దశమగ్రహం 10.వసుచరిత్ర 12.కలికి 15.నికోటిను 17.నియంతలు 19.మందిరం 20.పురుతూ 22.ఆకా 23.వునీ

కొత్త పదసంచిక-13 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • అపర్ణాదేవి
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • యం. అన్నపూర్ణ
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here