కొత్త పదసంచిక-16

0
9

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. తెలుగు సాహిత్యానికి సినారె నజరానా.(4).
04. గుంట తోనే అంతమైన పావడ.(4).
07. ఏదీ వదలక! అన్నీ తీసుకో. (5).
08. సారము చవి చూడాలంటే పనస మధ్యలో కోసి తీసేయండి.(2).
10. చిచ్చు పెట్టే శబ్దంలో సగం అనుకోండి.(2).
11. ఇస్లాం ప్రార్ధన ఉర్దూలో కాదు; తెలుగులో చేయండి. (3).
13. ఈ సోదరులు అడవుల్లో ఉంటారు.(3).
14. మీ రటువైపు వెళ్తున్నారు కనుక 1857లో సిపాయి తిరుగుబాటు స్థలంలో నెలకొన్న ఈ నగరం దర్శించండి తెలుగు లో. (3).
15. ప్రేయసీ ప్రియుల వేదనా హేతువు.(3).
16. తన వారికి మంచి, ఇతరులకు చెడు చేసిన వారికి ఈ నరకంలో చోటు రిజర్వ్ చేయబడి ఉంటుందట! (3).
18. నేనో ముఖ్యమైన వ్రతం తలపెట్టేను. (2).
21. ఈ తరహా సంతోషాన్ని దీని ద్వారా వ్యక్తపరచవచ్చు. (2).
22. చాతుర్వర్ణ వ్యవస్థలో చతుర్థుడు. (5).
24. తమ్ముణ్ణి పొట్టలో దాచుకున్న స్త్రీ. (4).
25. ప్రథమా విభక్తులు వ్రాయడంలో తడబడ్డారు. (4).

నిలువు:

01. సైంటిఫిక్ విన్నపము కాబోలు. (4).
02. రంభ తుమ్ములోంచి పుట్టిన సగం కైక సుతుడు. (2).
03. మూత పడిన సాహితీ మాసపత్రిక.(3).
04. కప్పుకోవడానికి వాడేది. ముఖ్యంగా ఈ కాలంలో. (3).
05. కేకను పోలిన గర్జనలా ఉంది. (2).
06. ముద్దు తర్వాత వెల్లువెత్తే మురిపాలు.(4).
09. కొంత సంప్రదాయం కలుస్తే చాలు! అదో వార్త అయిపోతుంది. (5).
10. ఈ పరిశ్రమలకి అండగా ఉండాలనే ప్రభుత్వ సంకల్పం. (5).
12. మర్త్యులకు తప్పనిసరి!(3).
15. ఆద్యంతాలలో చెవులకు పని చెప్పిన అలనాటి నవ్వుల మాస పత్రిక. (4).
17. లోపల అంగడితో ఆమని. (4).
19. వేరుని’సంస్కృతిం’చండి! (3).
20. ధైర్యంగా త్రేన్పులు! (3).
22. క లేని కపర్ది భార్య! (2).
23. తెల్ల దొర రెండు సార్లు చెప్పేడు చెయ్యమని! (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2021 నవంబరు 22 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 16 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2021 నవంబరు 28 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-14 జవాబులు:

అడ్డం:   

1.తెరచాప 4.కవాటము 7.చావుకబురు 8.వానే 10.చాక 11.రుడేఈ 13.రాణులు 14.విమల 15.కోడందం 16.తేనీరు 18.మడి 21.తిచి 22.నాతిచరామి 24.గిరిరాజ 25.కుటిలము

నిలువు:

1.తెలవారు 2.చాచా 3.పవులు 4.కబురు 5.వారు 6.మునకలు 9.నేడేచూడండి 10.చాణుక్యనీతి 12.కమతం 15.కోమలాంగి 17.రుచిరము 19.గతిజ 20.పరాకు 22.నారా 23.మిటి

కొత్త పదసంచిక-14 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అన్నపూర్ణ భవాని
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావనరావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ద్రోణంరాజు మోహన్ రావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహా రావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయ
  • పి.వి.ఆర్. మూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పార్వతి వేదుల
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంబర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీదేవి తనికెళ్ళ
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వర్ధని మాదిరాజు
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here