కొత్త పదసంచిక-25

0
9

[dropcap]‘కొ[/dropcap]త్త పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు ఎమ్మెస్వీ గంగరాజు గారు ‘కొత్త పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

01. ఇంకా పక్వానికి రాని బుర్ర! (4).
04. కొడుకుని రాజు గారు రమ్మని ప్రేమతో  పిలుస్తున్నారు.(4).
07. చురుక్కుమంటుందిట. చల్లగా ఉంటుందట! (5).
08. తోక లేని కోతులొచ్చి దుర్వాసన రాకుండా చేశాయి. (2).
10. అదిగో, మహర్షి దర్శకుడు ముందర వెళ్తున్నాడు. పిలవండి ఓసారి. (2).
11. జబ్బు తిరగబడ లేదు. తడబడింది. అంతే. (3).
13. దేవవ్రతుని తండ్రి. ___మహరాజు అట్నుంచి. (3).
14. విన్నపము మన వాటి గూర్చేనండీ. ఇతరుల ఊసు మనకెందుకు? (3).
15. తునాతునకలైపోయినా, సరిగా చూడండి. లోపల స్త్రీ పదిలంగా ఉంది! (3).
16. ఏం చేస్తాం చెప్పండి! అనుకున్నవి జరగడం లేదు. సమయము రివర్స్ గేర్ లో ఉంది! (3).
18. డబ్బుగలోడు వెనుక బరువు ఉంచుకుంటాడు ఎప్పుడూ. (2).
21. ప్రాపర్టీ సంగతేమో కానీ, పాపర్తి లేకుండా  చేసుకున్నారు మాజీ ప్రధాని తన ఇంటిని.(2).
22. పూర్వం భార్యనిలా అనేవారు! ఎంత అణిగి మణిగి ఉంటే మాత్రం? తప్పు కాదూ?! (5).
24. ఆహా! పలుకులు ప్రథమా విభక్తుల్లా ఉన్నాయ్! (4).
25. ప్రేమ్ చంద్ నటనా స్థలమా ఇది! (4).

నిలువు:

01. టాము కత సెరువు కాడ ముగిసిపోనాది! శాన బాద కలిగినాది!! (4).
02. నేల విడిచి సాము చేసి కాముకుడు అయ్యాడు ఈ రాక్షసుడు! (2).
03. ఆది మధ్యాంతర లఘువులు! (3).
04. కొన్ని కళాశాలలో కొనసాగుతోంది. (3).
05. ఇది కమ్యూనిస్టుల గ్రహం కాబోలు!(2).
06. దిలీపాది చక్రవర్తుల దీపించిన చరిత్ర.(4).
09. ఊరికి ఉపకారి! (5).
10. పెద్దన గారి హిమాలయము. (5).
12. ఖ్యాతి నొందిన తల్లి! ఆమెకు చెందినవి అని పైకి అనడం సబబే కదా మరి! (3).
15. భానుమతి తనలో తాను కూడబలుక్కుని వ్రాశారు. (4).
17. రెండు లోని రాక్షసుడు. (4).
19. మూడొంతులు అలలు కోపగించుకున్నట్టున్నాయి. (3).
20. సూత్రం తో అంతమయ్యే కామిత ప్రదాయిని. (3).
22. చలపతిరావు మధ్యలోని వన్నీ వదిలేసి శుష్కించిపోయాడు. (2).
23. ఆశ్చర్యం ప్రకటించడానికి దీనిని తరగాలా? (2).

ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2022 జనవరి 23 తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్‌లో ‘కొత్త పదసంచిక 25 పూరణ’ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2022 జనవరి 30 తేదీన వెలువడతాయి.

కొత్త పదసంచిక-23 జవాబులు:

అడ్డం:   

1.మేనమామ 4. ఓదార్పులు 7. తల్లిదండ్రులు 8. కసిం 10. భాయి 11. ముహఅ 13. ఇషారా 14. కలుగు 15. కాలువ 16. చెంగావి 18. దండు 21. లువా 22. అహర్నిశలు 24  రివటలు 25. మరాళము

నిలువు:

1.మేచకము 2. మాత  3. మల్లిక  4. ఓడ్రులు 5. దాలు  6. లుగాయిరా 9. సింహబలుడు 10. భాషాభాగాలు 12. పులుపు  15. కాదంబరి 17. వివాదము 19. మహలు 20. కంశమ  22. అట 23. లురా

కొత్త పదసంచిక-23 కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనూరాధ సాయి జొన్నలగడ్డ
  • బయన కన్యాకుమారి
  • భాగవతుల కృష్ణారావు
  • సిహెచ్.వి.బృందావన రావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి.
  • ద్రోణంరాజు మోహనరావు
  • ద్రోణంరాజు వెంకట నరసింహారావు
  • ఈమని రమామణి
  • ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • కిరణ్మయి గోళ్ళమూడి
  • కోట శ్రీనివాసరావు
  • కృష్ణ విరజ
  • లలిత మల్లాది
  • మధుసూదనరావు తల్లాప్రగడ
  • మత్స్యరాజ విజయలక్ష్మి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పార్వతి వేదుల
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పి.వి.ఎన్.కృష్ణశర్మ
  • పి.వి.ఆర్.మూర్తి
  • పొన్నాడ సరస్వతి
  • ప్రలీన వీణ
  • రంగావఝల శారద
  • రామలింగయ్య టి
  • రామిగాని ఉమాదేవి
  • సీతామహాలక్ష్మి పెయ్యేటి
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • శ్రీధర్ ముప్పిరాల
  • శ్రీనివాసరావు సొంసాళె
  • శ్రీవాణి హరిణ్మయి సోమయాజుల
  • శ్రీవిద్య మనస్విని సోమయాజుల
  • తాతిరాజు జగం
  • వనమాల రామలింగాచారి
  • వెంకట్ శాస్త్రి సోమయాజుల
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

గమనిక:

ఒక క్లూ/ఆధారానికి నిర్వాహకులు ఇచ్చిన జవాబు కాకుండా, ఆ యా గళ్ళకు నప్పే సమానార్థక పదాలు ఉన్న సందర్భంలో, నిర్వాహకులు ఇచ్చిన జవాబునే తుది జవాబుగా పరిగణనలోకి తీసుకోవడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here