క్రోధిద్దాం

0
10

[2024 క్రోధి నామ సంవత్సర ఉగాది సందర్భంగా శ్రీ రోచిష్మాన్ రచించిన ‘క్రోధిద్దాం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

[dropcap]ఇ[/dropcap]దిగో వచ్చింది ఉగాది;
క్రోధి పేరుతో
ఇదిగో వచ్చింది కొత్త ఏడాది.

క్రోధి అంటే కోపిష్టి అని అర్థం;
సరైన క్రోధం లేకపోవడం పెనులోపం.
మనం సరైన క్రోధం కలవాళ్లం అవాలని
మనకు ఇకనైనా ధర్మ క్రోధం రావాలని
ఈ ఏడాది క్రోధిగా వచ్చిందని అర్థం చేసుకుందాం;
ధర్మ క్రోధం తప్పని’సరి’ అని తెలుసుకుందాం.

‘తన కోపమే తన శత్రువు’
ఈ మాట అంత సరైంది కాదు;
మనకు సరైన కోపం రాకపోతే
మనకు మనుగడ ఉండదు.

ఆహారం ఉడకాలంటే నిప్పు అవసరం;
జీవనం సాగాలంటే కోపం అత్యవసరం.

నిప్పు, కోపం
మనిషికి తప్పకుండా ఉండాలి;
కోపం నిప్పులాంటిది
అది అవసరం మేరకు రగలాలి.

మనకు క్రోధం ఉండాలి;
మనం మనకు దక్కాలి.

రౌద్రమూ రసమే
అదీ మనకు ముఖ్యమే;
శాంతం అన్న రసం పండాలంటే
మనలో ఉండాల్సింది రౌద్రమే.

రాజుకుందాం రండి;
రగులుదాం రండి.

చేతులు ముడుచుకుంటే
చెడు తగ్గిపోదు;
మంటలు రేగకపోతే
నీతి నిలబడదు;
ఊరుకుంటే
ఊరు మిగలదు.

కామ నీచుల్ని కప్పెట్టేద్దాం;
నికృష్టుల్ని నిర్మూలించేద్దాం;
అసాంఘీక, అనైతిక శక్తుల్ని
ఆగకుండా అంతం చేద్దాం;
ఇంగితం, కృతజ్ఞత లేని‌ అల్పుల్ని
పక్కకు నెట్టేద్దాం;
సభ్యత, సంస్కారం‌ లేని అధముల్ని
సమాజం‌ నుండి తొలగించేద్దాం.
దుష్టుల్ని పేల్చేద్దాం,
నిర్దయుల్ని‌ నిర్దయగా నరికేద్దాం,
దోషుల్ని తుదముట్టిద్దాం,
క్రూరుల్ని క్రూరంగా పెకిలించేద్దాం.

ఆవేశమూ‌ అవసరమే
అవసరార్థం ఆవేశపడదాం;
కోపం రావాలి
కోపంతో పాపాన్ని నాశనం చేద్దాం.

రౌద్రమూ ఒక తత్త్వమే
భద్రత కోసం‌ దాన్ని ఆవాహన చేసుకుందాం;
రౌద్రమూ ఒక సత్వమే
సంక్షేమం కోసం దాన్ని ఔపోసనపడదాం.

మొన్న నిన్నలు అంత మిన్ననైనవి కావు
మన నేడూ అంత సరిగ్గా లేదు
రేపు కోసం నీకు క్రోధం కావాలి;
మనిషీ! నువ్వు క్రోధివి కావాలి.

అవసరమైనంత క్రోధంతో
అగ్నిలా పని చేద్దాం;
రండి… రండి…
మనం రేపును తీసుకొద్దాం.

చొరబడ్డ విదేశీ సర్పాలు
మన మట్టిని కాట్లు వేస్తున్నాయి;
భారతీయతను భగ్నం చేసేందుకు
భయంకరమైన కుట్రలు ముసురుతున్నాయి…

మన దేశంలోని పెద్ద శాతం ప్రజపై దాడి జరుగుతోంది;
మన ఉనికికి మంటపెట్టే పథక రచన జరుగుతోంది…

ఎక్కడిదో సుత్తి, ఎక్కడిదో కొడవలి
అవి ఇక్కడి ప్రజను గాయపరుస్తున్నాయి;
విధ్వంసక భావజాలాలు
మన బతుకుల్ని విచ్ఛిన్నం చేస్తున్నాయి…

విద్వేషవాదులు జనంపై విషం పోస్తున్నారు;
విద్రోహులు దేశాభివృద్ధిని దెబ్బతీస్తున్నారు.

విదేశీ మతోన్మాదం తప్పని ముప్పైంది;
కులం నక్క ఉన్మాదంతో తెగబడి కరుస్తోంది…

మన కవిత్వం కకావికలమైపోయింది;
మన సాహిత్యం చచ్చుపడిపోయింది…

అందుకే మనకు క్రోధం రావాలి;
క్రోధంతో ఖేదం తీరాలి;
క్రోధంవల్ల మోదం రావాలి.

మతి పగిలిపోయినవాళ్లు
మేధావులయ్యారు;
నడత చెడ్డవాళ్లు
మేధావులయ్యారు;
ప్రజా వ్యతిరేకులు
మేధావులయ్యారు;
ప్రజాస్వామ్య వ్యతిరేకులు
మేధావులయ్యారు,
ప్రజా ప్రభుత్వ వ్యతిరేకులు
మేధావులయ్యారు;
వికృత స్వభావులు
మేధావులయ్యారు;
మానసిక రోగులు
మేధావులయ్యారు;
బానిస కొడుకులు
మేధావులయ్యారు;
దుష్టులు
మేధావులయ్యారు;
భ్రష్టులు
మేధావులయ్యారు;
వాళ్లు మనపై పడి
మనకు చేటు చేస్తున్నారు…
వాళ్లు నశించాలంటే మనకు ఉండాల్సింది క్రోధమే;
మన క్రోధానికి లక్ష్యం వాళ్లను రూపుమాపడమే.

మన క్షేమం కోసం,
మన జాతి కోసం,
జాతీయతా భావం కోసం,
మన దేశం కోసం
మన సంస్కృతి కోసం,
మన సమాజం కోసం,
ప్రజ కోసం,
ప్రగతి కోసం
మనకు క్రోధం రావాలి;
మన క్రోధం
మనకు మంగళాన్నివ్వాలి.

ఇదిగో వచ్చింది ఉగాది;
క్రోధి పేరుతో
ఇదిగో వచ్చింది కొత్త ఏడాది.

క్రోధి ద్వారా ప్రేరణ పొందుదాం;
క్రోధంతో మనం కోలుకుందాం;
కోలుకుని మానసికంగా మేలుకుని
మనకు మనం మేలు చేసుకుందాం.

ఈ క్రోధి ప్రేరణకాగా మనం క్రోధిద్ధాం;
క్షేమాన్ని, సౌఖ్యాన్ని, శాంతిని సాధిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here