కృత్రిమ మేధ

0
8

[dropcap]2[/dropcap]025 నాటికి కృత్రిమ మేధ 19000 కోట్ల డాలర్ల అంతర్జాతీయ పరిశ్రమగా రూపొందనున్నదని అంచనా. ప్రతి రంగంలోనూ కృత్రిమ మేధ ప్రవేశిస్తోంది. రానున్న 5 సంవత్సరాలలో ఉద్యోగాల కల్పనలో కృత్రిమ మేధ 9% ఆక్రమించగలదని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ రంగాలు విపరీతమైన వేగంతో విస్తరిస్తున్నాయి.

సెకను 125 పైగా పరికరాలు అంతర్జాలానికి అనుసందానితమౌతున్నాయి. ఆగత్యా సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ‘జీరో’ ట్రస్ట్ సెక్యూరిటీ, ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ వంటి వాటికి అవకాశాలు ఇబ్బడి ముబ్బడి కానున్నాయి. ‘సైబర్ సెక్యూరిటీ’కి సంబంధించిన ఖర్చు 2025 నాటికి 6 లక్షల కోట్ల డాలర్లని అంచనా.

భారత్‌లో – 2018 లోనే దేశంలో అంతర్జాల వియోగదారుల సంఖ్య 56 కోట్లు. ఇది చైనా తరువాత స్థానం. మొబైల్ వినియోగదారుల నెలసరి సగటు వాడకం 8 G.B పైమాటే. చైనాలో అది 5.5G.B. ఇప్పుడు ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య మన దేశంలోనే 70 కోట్లకు మించిపోయింది. మొబైల్ వాడకందారుల సంఖ్య 120 కోట్లకు పై మాటే. భారతదేశం 2018 లోనే జాతీయ కృత్రిమ మేధ స్ట్రాటజీని ప్రకటించింది. తగిన వాతావరణాన్ని కల్పించటానికి అనుగుణమైన చర్యలు చేపట్టింది. ‘సెడా’ను (సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఇన్ డేటా ఎనలిటిక్స్) నెలకొల్పింది. నాలుగా లక్షలకు పైగా ఉద్యోగాలకు సంబంధించిన శిక్షణకై ఆన్‌లైన్‌లో ‘జాతీయ కృత్రిమ మేధ’ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త సాంకేతిక విజ్ఞానాన్ని ఎప్పటి కప్పుడు పంచుకుంటూ పరిస్పరం సహకరించుకోవటానికి ఈ పోర్టల్‌ ఉపయోగపడతుంది.

ఐ.టి రంగంలో కొత్త టెక్నాలజీకి కొత్త ఉద్యోగాలకు యువతను సన్నద్ధం చేయడానికై ‘ఫ్యూచర్ స్కిల్స్’ కార్యక్రమం మొదలుపెట్టింది. ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న సిబ్బందికి ఆధునిక శిక్షణనిచ్చి వారిని అప్‌డేట్ చేయడానికే ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది.

వైద్యరంగంలో:

ఆసుపత్రుల నిర్మాహణ, వ్యాధి నిర్ధారణ, వైద్యపరికరాల వినియోగం వంటి అంశాలలో కృత్రిమ మేధ బాగా వినియోగంలోకి వచ్చింది. ఆటోమెటిక్ టెస్టింగ్, డయాగ్నొసిస్, రోగిని నిరంతరం పరిశీలిస్తూ ఉండే పరికరాలు/ ఉపకరణాలు వంటి వాటి పాత్ర క్రీయాశీలకమైపోయింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో రోగనిర్ధారణ, చికిత్సలలో తప్పిదాలు కృత్రిమ మేధ వినియోగంలోకి వచ్చాక 15% తగ్గిపోయాయి. యంత్రాలకు మనిషి మెదడు సామర్థ్యాలను జతచేయడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలను రాబట్టే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెషిన్ లెర్నింగ్‌లో రోగనిర్ధారణ నూరు శాతం ఖచ్చితత్వతో జరుగుతుంది. వివిధ రకాల ట్యూమర్లు, కేన్సర్లు, వంటివాటిని కనుగొనడంలో 5 మి.మి.కు తక్కువ ఉన్న పాలిప్స్ కూడా కనబడేలా పరికరాలను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఇదొక నిరంతర ప్రక్రియ. ‘మరింత మెరుగు’ కోసం జరుగుతున్న ఈ ప్రయత్నాలు, పరిశోధనలతో 2021 నాటికే వైద్యసేవలు 40% అభివృద్ధి చెందుతాయన్నది ఒక అంచనా. అంతకాకపోయినా ఏ మేరకు సేవలు అభివృద్ధి చెందితే ఆ మేరకు ఆయా సేవలు అందించే వారి ఉద్యోగాలకు ఉద్వాసన తప్పదు. క్రొత్త సాంకేతికతలను అందిపుచ్చుకుంటూ ఎప్పటికప్పుడు నైపుణ్యాలను ఆధునీకరంచుకోగలిగినవారికి కొంత వరకు ఉద్వాసన ప్రమాదం తగ్గవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here