‘కులం కథ’ పుస్తకం – ‘ఏమిట్లు’ – కథా విశ్లేషణ

0
11

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న జె. శివప్రియ ఈ పుస్తకంలోని ‘ఏమిట్లు’ కథను విశ్లేషిస్తోంది.

***

బొమ్మదేవర నాగకుమారిగారు వ్రాసిన ‘ఏమిట్లు’ అనే ఈ కథ నాకు ఎంతో నచ్చింది.

ఈ కథ చాలా బాగుంది. ఈ కథ యొక్క ముగింపు కూడా చాలా బాగుంది. రచయిత్రి కులం గురించి అందరికి మంచి సమాచారం ఈ కథలో మోహన ద్వారా వివరించారు. దివాకరం బాబుకి మోహనని భార్యను చేసి తన కులమే ఎక్కువ స్థాయి అనే ఆలోచనలో వున్న దివాకరం బాబుకి స్నేహితుడి విషయంలో ఏ కులమైన సమానమే; ఏడు సముద్రాలు దాటి వచ్చిన మాదే పెద్ద కులం, మదే పై కులం అంటు విర్రవీగుతున్న దివాకరం మరియు అతని స్నేహితుల బంధానికి ఏ కులమైన సమానమేనని సాటి చెప్పినది.

మోహన ఇండియాలో ఫస్ట్ రిజర్వేషన్ వల్ల తనకు స్నేహితుల్లా ఉద్యోగం రాలేదని బాధపడుతున్న దివాకరాన్ని అమెరికా తీసుకొనివెళ్తుంది. తను స్నేహితుడు ప్రతాప్ కులం గురించి, మనదే పై కులం అనీ అంటారు; మన దివాకరం మనసు పడ్డ అమ్మాయి లావణ్య విషయంలో కూడా కులం పేరుతో వాళ్ళని దూరం చేసాడు ప్రతాప్.

ఆఖరికి ప్రతాప్ కుమారుడి విషయంలో ఏ కులమైన సమానమేనని మన దేశమే గొప్పదని ప్రతాప్ పశ్చాత్తాపం పడేటట్టు చేస్తుంది మోహన. ఇది కథ యొక్క సమాచారం.

ఈ కథ పేరు ఏవిట్లు అనేది బాగోలేదు. ఎందుకంటే ఒక పక్క అన్ని కులాలు సమానమే అంటూ చెబుతున్న ఈ కథ పేరు బాగోలేదు. కులం పట్ల మిత్రుని మార్పు పేరు బాగుంటది అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఈ కథలో దివాకరం మిత్రుడు ప్రతాప్ కులం పేరుతో – మనసు అనేవి మన పెట్టకున్న పేర్లు, కాలం మారుతున్నా, కులంలో బతుకుతున్న వాళ్ళకి దేశం గొప్పతనం; మన ఆలోచన యొక్క వాళ్ళ యొక్క మనసులు వెలుగు చూపేలా చేసింది.

ఈ కథని బాగా అర్థమయ్యే పదాలు మరియు వాక్యాలలో బొమ్మదేవర గారు చక్కగా వివరించారు.

జె. శివప్రియ

సీనియర్ ఎంపిసి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here