‘కులం కథ’ పుస్తకం – ‘పాలేరు తమ్ముడు’ – కథా విశ్లేషణ-2

0
9

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ’ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చిందో  పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న జి. రమ్య ఈ పుస్తకంలోని ‘పాలేరు తమ్ముడు’ కథను విశ్లేషిస్తోంది.

***

నేను వ్రాసేది కథ ‘కులం కథ’ పుస్తకంలోని పాలేరు తమ్ముడు అనే కథ గురించి. ఈ కథ మానేపల్లి తాతాచార్య రచించారు.

ఈ కథ గురించి నా అభిప్రాయము

  1. ఈ కథలో ఒక పాలేరు ఉన్నాడు. ఆ పాలేరు పేరు వెంకడు. అతడి తండ్రి చిన్న వయస్సులోనే తన మీద ఇన్ని బాధ్యాతలు వేయడం చాలా అన్యాయం అని నా అభిప్రాయము.
  2. అతడు ఒకరి ఇంట్లో పాలేరుగా ఉంటాడు. అతడి ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు. అతడి పేరు బుల్లెయ్య.
  3. ఒక సారి బుల్లెయ్య బయటకు వచ్చి చూడగా అందరూ పిల్లలు ఆట ఆడుతుండగా చూసి ‘నేను ఆటకు వెళ్తాను’ అని మారం చేసాడు.
  4. కాని తన తల్లి ‘వద్దు వద్దు’ అని చెప్పగా అతడు మారం చేసాడు. అప్పుడు అతడికి ముఖం కడిగి, తెల్లగుడ్డలు వేసి పాలేరుచే పంపించింది.
  5. అప్పుడు పాలేరుతో కలిసి బుల్లెయ్య అడుకోవడానికి వెళ్ళాడు.
  6. పొట్టకి జరగక తండ్రి వాడిని పాలేరును చేసి, నెత్తి మీద యంత బాధ్యత వేశాడు. పాలేరుతనం చేస్తున్న దొరగారి ఇంట్లో పెద్ద పని, చిన్న పని అనేది లేకుండా చెప్పినవన్నీ చేయడం ఎంత కష్టం. కాని ఆ వయసులో ఆ చిన్నవాడు అంత కష్టం చేయడం ఎంత మెచ్చుకోదగిన విషయం.
  7. బుల్లెయ్య మరియు అతడి స్నేహితులు ఆడడం చూసి వాడి కళ్ళల్లో నీళ్ళు తిరగడం ఎంత బాధాకరం.
  8. అప్పుడు పాలేరు నేను వస్తానని వెళ్తుండగా అప్పుడు బుల్లయ్య నీవు ఎందుకురా కుదురుగా కూర్చుని ఉండు అనుట నాకు చాలా కోపం వచ్చింది.
  9. ఎందుకంటే అతడు కూడా తన వయసు వాడే కదా అతనికి కూడా ఆడుకోవాలని ఉంటుంది కదా.
  10. అప్పుడు ఆ స్నేహితులు నీవు ఎందుకురా అలా అంటావు గమ్మునుండు అని అన్నారు.
  11. అప్పుడు ఆ స్నేహితుల జాలి మరియు ఎదుటి వారి పట్ల ఉన్న మనోభావము నాకు చాలా నచ్చింది.
  12. ఆ తరువాత అప్పుడు ఆ పాలేరు కూడా వారందరితో కలిసి ఆడుతూ వున్నాడు. అప్పుడు పాలేరు ముఖం కళకళలాడుతుంది. ఆటలో కలిశాడు.
  13. కానీ వాడితో ఆడుతంటే బుల్లెయ్యకు ఒళ్లు జిలపడించింది. అక్కడ ఆ పిల్లవాడు అలా చీదరించుకోవడం నాకు అస్సలు నచ్చలేదు.
  14. అప్పుడు ఆ పాలేరును తాకినప్పుడు గొంగళి పురుగును తాకినట్లు ఉన్నది. ఎప్పుడూ అలవాటు లేదయే.
  15. మూడు రోజుల వరకూ పాలేరు వెంకడితో ఆడుకోవడం కొత్త అని అనిపించిన ఆ తరువాత అలవాటైపోవడం ఎంత సంతోషం.
  16. కొంత కాలం వెంకడు అని పిలవబడినవాడు వెంకి అని పలుకబడుతున్నాడు.
  17. అప్పుడు వెంకయ్య ఆ బుల్లెయ్యతో ఆటాడుతుంటే తన చిన్న తమ్ముడుతో ఆడుకున్నట్లు అనిపించడం ఎంత సంతోషం.
  18. అప్పుడు బుల్లెయ్య తల్లికి ఏ మాత్రం నచ్చడం లేదు. అది నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఆడుకోవడానికి కులంతో పని లేదు కాబట్టి.
  19. అప్పుడు ఆ తల్లికి బుల్లెయ్యను మందలించి ఎందుకురా నువ్వు వీడితో ఆడుతున్నావు. వాడు అసలు చిరిగిన చొక్కా, మురికి మురికిగా ఉన్న వాడిని ఎందుకు తాకుతున్నావు రా అని అడుగడం నాకు నచ్చలేదు.
  20. వాడ్ని ముట్టుకోవడం చూస్తే మీ నాన్న కొప్పడతారు తెలుసా అదీ కాక అలాంటి వాళ్ళతో ఆడడం మనకి చాలా చులకన కదా అని చెప్పడం నాకు నచ్చలేదు.
  21. అప్పుడు బుల్లెయ్య ఎందుకు తప్పు అని అడిగాడు. కులంతో ఇప్పుడు సంబంధం లేదు అని చెప్పాడు. కులం అనే మాట నా దగ్గర ఎత్తకు అని అన్నాడు.
  22. నిజానికి ఆమె పెద్ద అబద్ధమాడింది. మొన్న బుల్లెయ్య నాన్న పట్నం వెళుతున్నప్పుడు ఊరుదాటగానే, తన గుడ్డల సంచి పాలేరు వీరయ్యనే పట్టుకోమని యివ్వడం బుల్లయ్య స్వయంగా చూసాడు.
  23. కాని తండ్రికి కులం అంటే పట్టింపు లేదు. కాని పాలేరుతో ఆడుకోటం అంటే కొద్దిగా సంశయిస్తాడేమో.
  24. బుల్లెయ్య అమ్మమాట వినకుండా వెంకయ్యతో ఆడుకుంటున్నాడు. అప్పుడు ఆ తల్లి బుల్లెయ్య, నీకు అసయ్యం లేదట్రా చింకి గుడ్డతో కంపుగా ఉండే వాడితో ఆడుకుంటావు. సిగ్గులేదురా అని అనడం నాకు నచ్చలేదు.
  25. అప్పుడు వాడు వాడికి గుడ్డలు లేనిది యేంచేస్తాడమ్మా నా చొక్కాలాగూ వాడి కొకటివ్వరాదూ వాడే చక్కగా ఉంటాడు. అని అనుట తనలో ఉన్న స్నేహం నాకు నచ్చింది.
  26. అప్పుడు తల్లికి వీడికి ఎంత చెప్పినా లాభం లేదనుకున్నది. కొత్త పన్నాగం వేసింది.
  27. అప్పుడు వెంకా నీవు వెళ్ళి బర్రెల దగ్గర పేడ తీయు అని చెప్పి వారిద్దరిని విడదీసింది.

కానీ బుల్లెయ్య గట్టి పట్టు పట్టి వెంకయ్యతో ఆడుకునేలా అమ్మని ఒప్పిస్తాడు.

జి. రమ్య, సీనియర్ ఎంపిసి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here