‘కులం కథ’ పుస్తకం – ‘పెంటయ్య బాబాయ్’ – కథా విశ్లేషణ

0
10

[dropcap]కా[/dropcap]వలిలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు ‘కులం కథ‘ పుస్తకం చదివి తమకి నచ్చిన కథను విశ్లేషించి, ఆ కథ తమకెందుకు నచ్చించో పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపిసి చదువుతున్న పి.లావణ్య ఈ పుస్తకంలోని ‘పెంటయ్య బాబాయ్‘ కథను విశ్లేషిస్తోంది.

***

“ఈ పుస్తకంలో నాకు ‘పెంటయ్య బాబాయ్’ అనే కథ బాగా నచ్చింది. తన జీవితంలో తను ఇతరులకు ఎలాంటి సహాయం చేసాడో, వాళ్ళు తనని ఎలా అభిమానించేవారో తెలుస్తుంది. పెంటయ్య బాబాయ్ ఒక డాక్టర్. తను తన దగ్గరకి వచ్చిన వారికి మంచి వైద్యం చేసేవాడు. తను చేసిన వైద్యం వల్ల అందరి జబ్బులు త్వరగా బాగు అయిపోయాయి.

తను తన జీవితంలో ఎటువంటి తప్పు చేసేవాడు కాదు. తన కొడుకు తిలక్ విషయంలో కూడా. ఎందుకంటే తన కొడుకు సీటు తెచ్చుకోవడానికి తప్పు దారి ఎంచుకున్నాడు. ఆ దారి తప్పు అని చెప్పినా తన కొడుకు వినలేదు. చివరికి తన తండ్రి చెప్పిన విధంగానే తనకు సీటు రాలేదు.

కానీ బాబాయ్ ప్రకాశ్‌కు చదువుకోవాలి అనే పట్టుదలను చూసి తన సొంత డబ్బులతో అతనిని చదివించి అతనిని ఒక స్థాయికి చేరుస్తాడు. తను చేసిన మంచి పనుల వల్ల తన భార్య, పిల్లలు అతనికి ఆరోగ్యం బాగోలేక, పట్టించుకోకపోయినా తను చేసిన సహాయానికి తన కోసం చాలామంది అతని దగ్గరకు వెళ్తారు.

అలాగే ఈ కథ మనకు చేతనయినంత సహాయం ఇతరులకు చేయాలి అని చెబుతుంది. అలాగే మనకు ఎవరైనా సహాయం చేస్తే వారి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి అని తెలుపుతుంది. అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని దైర్యంగా ఎదుర్కొని మన గమ్యాన్ని చేరుకోవాలని తెలుస్తుంది.

పెంటయ్య బాబాయ్ లాగా జీవితంలో పట్టుదలతో, కృషితో కష్టపడి ఒక స్థాయికి ఎదగాలని, మనకి ఉన్న దానిలో ఇతరులకు సహాయం చేయాలని అర్థమవుతుంది. కాబట్టి ఈ కథ నాకు బాగా నచ్చింది.”

పి. లావణ్య, సీనియర్ ఎంపిసి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here