లడ్డూ బోధ!!(సరదాగా కాస్సేపు)

0
11

[dropcap]ల[/dropcap]డ్డు నీ ముందర పెట్టారు.

దానిదేముంది, అని తినకుండా ఉంటే మంచిదే!

కానీ తినకుండా ఉన్నా, దాని గురించి ఆలోచించ కూడదు. ఎట్లా చేశారో, ఏం పదార్థాలు వేశారో, అందరూ హాయిగా తింటున్నారు, మనమూ తినాల్సింది, ఇట్లాంటి ఆలోచనలు అస్సలు ఉండకూడదు. ఈ regretful గా వదలడం కంటే, హాయిగా, తృప్తిగా తిని, మంచి నీళ్ళు తాగి, చక్కా పోవటం మంచిది!

ఈ మార్గం better, మొదటి దాని కంటే! మొదటి రకంగా, అంటే, బొత్తిగా మానేయటం, సామాన్య స్థాయిలో సాధ్యమే కాదు!

ఇంక, తిన్నా, తినకపోయినా, నేను కాబట్టి, ఇంత బాగా చేయించాను, జీడి పప్పు, కిస్మిస్, ఏలాకాయి, అన్నీ వేసి, కాబట్టి నా అంత మొనగాడు భూ ప్రపంచంలో లేడు,అని విర్రవీగే వేషాలు వేయవద్దు.

అందరినీ పిలిచి పెట్టాను,ఎంత ఉదారుణ్ణి అనీ అనవద్దు!

లేదూ,అంతా చేయించాను, అందరికీ పెట్టాను,కానీ నిగ్రహంతో తినకుండా ఉన్నాను,అనీ కాలర్ ఎగరేయద్దు!

తింటావా నీ ఇష్టం, మానేస్తావా, నువ్వే decide చేసుకో! రెండిట్లో ఏది చేసినా, హాయిగా చింత లేకుండా ఉండు. తింటే తిన్న తరువాత ఆ ఆనందాన్ని తలచుకొని మురిసిపోవడం, మానేస్తే, అయ్యో తినలేదే అనే regret రెండూ వదిలేయి!

ఏ ఏడుపూ వద్దు నీకు, అదీ అస్సలు చెప్పొచ్చేది!

చేశాననీ,చేయలేదనీ,ఉందనీ,లేదనీ,ఇచ్చారనీ, ఇవ్వలేదనీ, ఇట్లా ఏ ఏడుపులు లేకుండా,హాయిగా ఉండమని,పిండితార్ధం!!

ఏదో చేతనైన పని చేశాను.డబ్బు వచ్చింది,చేయించాను. అంతే, అంతా అట్లా జరిగిపోయింది! నా నిర్వాకం హేమీ లేదు, అని నిర్లిప్తంగా కూచో!

***

నిర్లిప్తంగా అంటే ఆనందంగా!

బాగుంది,ఈ తిరకాసు ఏమిటి మధ్యలో!?

ఈ కృష్ణుడితో బలే కష్టమే! చేయి ఎట్లా పెట్టుకోవాలో కొందరు నటులకు ఎంత కాలానికీ తెలియదుట!

అట్లా ఉంటుంది ఈ వరస!!

ఏమనుకొని బతకాలో,కృష్ణుడి ప్రకారం,అర్థం కావటం అంత వీజి కాదు.

అన్నీ చేయాలి అంటాడు,ఏదీ అంటించుకోవద్దు అని హెచ్చరిస్తాడు!

పని చేయి కానీ ఫలం మీద ఆశ మాత్రం పెట్టుకోవాకు అని caveat!

ఆనందం వద్దు,దుఃఖం కూడా వద్దు,”Just Be”, అంటాడు!!

ఇష్టమూ వద్దు,అనిష్టమూ వద్దు,అట్లా బుద్ధికి తర్ఫీదు ఇయ్యి అని ఉపదేశం!!!

చలి అయినా వేడి అయినా,గుట్టుగా సర్దుకొమ్మంటాడు!

హుహు హూ లు వద్దు, అబ్బబ్బ అని చిరాకులు, రెండూ నిషేధాలే అని ఇంకో పాఠం!!

లడ్డూ పళ్ళెంలో పెట్టి తిన వద్దని అంటే ఎంత ఈజీయో మానటం, ఈ పైవన్నీ కూడా అంతే!!

ఆయనకేం,ఆనంద మూర్తి,చెప్పేశాడు. ఘటనాఘటన సమర్థుడు!

మన బోంట్ల సంగతి ఏమిటి?!!

అర్జునా, అభ్యాస వైరాగ్యాలను పట్టుకోవోయ్, సాధ్య పడుతుంది,అని చిన్న క్లూ ఇచ్చాడుగా,శిష్య వాత్సల్యంతో!

అర్జునుడి దారే పడదాము మనం కూడా!

ఏదో ఒక రోజు అంతటి నిబ్బరం రాక మానుతుందా?!!

“ఆ ఆ వచ్చి తీరుతుంది”, అంటోంది ఎదురుగా గుండ్రంగా, అందంగా,తీయగా కనువిందు చేస్తూన్న లడ్డూ!!

అది నిఝంగా అన్నదో, వ్యంగ్య మర్యాద పాటించిందో,చెప్పటం కొంచెం కష్టమే మరి!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here