‘మా కథలు – 2020’ – పుస్తక పరిచయం

0
5

[dropcap]’మా[/dropcap] కథలు – 2020′ సంకలనంలో 49 మంది రచయితల కథలున్నాయి. నేను ప్రతీ కథలోని సారాంశాన్ని పేర్కొనకుండా కేవలం కథల్లోని విశేషంగా తోచిన కొన్ని వాక్యాలను గానీ, కొన్ని పంక్తులను గానీ, కొన్ని పేరాలను గానీ మాత్రమే యథాతథంగా పేర్కొంటాను – నల్ల భూమయ్య.

~

అనుబంధం – ఆలూరి పార్థసారధి

ఐసరు బొజ్జ, అయిసా, పైసా.

రాయబారానికి కాదు, నా గాయభారాన్ని దించుకోవడానికి.

విశ్వాసం చూపించేవి జంతువులు. వాళ్ళు జంతువులు కారని నిరూపించుకున్నారు.

ఏదైనా వదులుకోవడంలో వున్నంత సుఖం, ఆనందం అంతా యింతా కాదు.

అన్యోన్యానుబంధం ఎలా అవుతుంది? అన్యాయానుబంధం గానీ!

~

అంతా మనమంచికే – కూతురు రాంరెడ్డి

లొట పెద పెదవులకు నక్కాశవడ్డట్టు.

(తగరు వెంట నక్క తగిలిన చందంబు… వంటిది)

కల్లు దొరికితే లల్లాయి పదాలు పాడుకుంటా యింటి దారి పడుదామనుకున్న నాకు నిరాశే మిగిలింది (కరోనా లాక్‍డౌన్‍తో)

మండే ఎండలో వివిధ వ్యాపారుల ఆశల్లో చల్లబడే చిరుజల్లులు కురిసినట్లైంది. (వైన్ షాపుల ఓపెనింగ్ కాబోతున్నందున లాక్‍డౌన్ ఎత్తివేసింతర్వాత)

~

అదో తియ్యటి అనుభూతి – అంగరవెంకట శివప్రసాదరావు

ఆమె నడివయసులో వుంది. ఆమె కట్టిన బెనారస్ సిల్కుచీర ఒంటిమీద నిలువనంటున్నట్లు జారిపోతోంది.

అది చలికాలం. బయట వెన్నెల పుచ్చపువ్వులా వుంది.

“అంతలా చలికి వణక్కపోతే నా శాలువాలోకి రాకూడదూ” నవ్వుతూ అంది శ్యామలాంబదేవి. తన శాలువలో నన్ను కూడా కప్పింది. ఆమె పూర్తిగా నామీదకు వాలిపోయింది. ఆమె ఎద నా ఛాతీకి అతుక్కుపోయింది. నా మొహానికి ఆమె వూపిరి వెచ్చగా తగులుతోంది. ఆమె పెదాలు నా పెదాలకు తగులుతున్నాయి. నేను నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కున్నాను. అరగంట తర్వాత మెల్లగా వాన తగ్గుముఖం పట్టింది.

ఫ్రెండ్ అన్నమాట కనిపెట్టిన ఇంగ్లీషువాడ్ని మెచ్చుకోకతప్పదు. ఆడైనా మగైనా అదేమాట.

“…పాతికేళ్ళ నాటి మాట అది. ఇంకా నీ చేతివేళ్ళు నా నడుంచుట్టూ బిగుసుకొనే వున్నట్లుంది” అంది శ్యామలాంబదేవి. శ్యామూ మంచి రంగు తేలివుంది.

సెల్‍ఫోన్‍లో ఆమెను ఏ పేరుతో సేవ్ చేయాలా అని ఆలోచించాను. శ్యామల్రావని నోట్ చేశాను. అప్పుడప్పుడూ నా ఫోన్‍ను నా భార్య చూస్తూంటుంది.

“…. ఆ రోజు కూడా ఇలాగే వెన్నెల విరగబూసింది. మంచి అవకాశం జారిపోయింది కదూ!” అంది నన్ను కవ్విస్తూ. ఆమె గొంతులో ఏదో తెలియని మార్దవం. పక్క కంపార్టుమెంటులో మొగుడ్ని పెట్టుకుని ఇలా నాతో రహస్యంగా మాట్లాడ్డం, అదీ అర్ధరాత్రీ….

~

అబద్దం – లలితావర్మ

“…అమ్మో! అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా… రంభా వూర్వశికైనా యింత అందం సాధ్యమా!….” (క్లాస్‌మేట్స్ ఎగతాళి మాటలు) జన్యుపరమైన లోపాలవల్ల తనకు అందవికార రూపం సంభవించింది. అందుకు స్వాతి ఎనాడూ బాధపడలేదు. “….అందం ముఖంలో లేదు. నీ వ్యక్తిత్వంలో వుంది” అన్న కలాం మాటలను గౌరవించే విల్సన్‍కి స్వాతిలోని మానసిక సౌందర్యమే కనబడింది.

~

అంతానీవే అనుకున్నా – అభిమన్యు

అత్తలందరిదీ ఒక్కటే పంథా. దానికి తోడు ముదనష్టపు సీరియల్స్.

~

అద్దం – పి.ఎస్.ఎన్. మూర్తి

“…..మా ముదనష్టపోడు నన్ను సావశితకతన్ని డబ్బులు అట్టుకెళ్ళి పోయాడు ఎవర్తితో కులకతానికో” అంటూ మొటికలు విరిచి దెబ్బల్ని కొంగుతీసి చూపించింది సావిత్రి.

“….సగానికి సగం డబ్బు ఆడి కళ్ళుపడని సోట దాసే వుంచాను లెండి” సావిత్రి రాగిణితో అంది.

“అమ్మా…” అని పొలికేక వేసింది రాగిణి. కళ్ళు తెరవగానే ఎదురుగా రాజీవ్. తనను కాలితో పొట్టలో తన్నాడు. ఖాళీగా వున్న కడుపు దెబ్బ నషాళానికంటింది.

…. ఏనుగుపిల్లల వడితాడును ఇనుపగొలుసని అనుకోవడమే నా తప్పు. అద్దం ఆమె అందమైన నవ్వుకి ధైర్యమనే రంగును అద్దింది. అప్పటివరకు రాజీవ్ ఎక్కడ వచ్చేస్తాడో అని భయపడే రాగిణి – మారిన తనని తన భర్తకు పరిచయం చేసుకునే ఆతృతతో అతని కోసం చూడసాగింది….

~

ఆహ్వానం – డా. కె. జె. రావు

భక్తురాలి డ్రెస్‍లో మా ఆవిడ ప్రత్యక్షమైంది. భక్తి బ్రాండ్ వారి సువాసనలు.

పూజా పునస్కారాలు ముగిశాయా, మారీచుల్లా, మధ్యలో ఎంట్రీ యిచ్చానా?

షూ విప్పేసి బాల్కనీలో బాసింపట్టు వేసుకు కూర్చున్నాను.

“బావా! నేనిక్కడే వున్నాను. పెళ్ళాన్ని పక్కన పెట్టుకుని పేపర్లోకి తలదూర్చేసుకుంటే ఏమనుకోవాలి?” అప్పలనర్సమ్మ.

మా ఆవిడ పేరు అప్పలనర్సమ్మ. నాకు చేస్తోన్న సేవలను గుర్తించి ఆమె పేరులోని నరసను సేవలకు మారుపేరైన నర్స్ అంటూ ముద్దుగా పిలుచుకుంటుంటాను.

‘ఉడిపీ ఉప్మారవ్వ, మహారాష్ట్ర ఉల్లి, పెనుగొండ పెసరపప్పుతో పెసరట్టు వేసి అస్సాం అల్లం, పలాసా జీడిపప్పులు అద్ది పలమనేరు వేరుగల్లు ధూళిపాళ్ళ మిరప కాంబినేషన్‍తో చట్నీలు వేసి అందిస్తాను బావా!”

‘బావా’ గొంతులో మార్దవం. “భామా! ఏమిటే ఆ పిలుపు. రాత్రంతా ఏమైంది? బాబు వచ్చే టైమయిందే, ఇప్పుడా పిలిచేది!”

“ఛ! ఊరుకో… అటు చూడు ముత్తుగారి మామీ బాల్కనీలో కూర్చుంది. తెలుగు బాగా అర్థమౌతుంది.”

“నేను కల్సిన వారందరూ బాధితులు కారు (మేనరికపు పెళ్ళిళ్ళతో) తల్లీ పిల్లలు సంతోషంగా వున్నవాళ్ళూ వున్నారు. కాకపోతే వీరిశాతం నలభైలోపే”

బాధితులమే బోధకులం కాబట్టి జనాల్లో నమ్మకం కలిగి విషయాన్ని పట్టుకుంటున్నారు.

దూరదర్శన్ అనగానే అది ప్రజలకు చాలా దూరంగా వుంటుందని ఆ పేరును పోగొట్టాలని వీడి పట్టుదల.

~

ఆనందార్ణవం – సింహప్రసాద్

సభికుల్లో తనాశించిన మార్పు కన్పించలేదు. ఈ ప్రవచనాలు ఉత్తదండగ అన్పించింది.

కాలం వేసవిలోని నదిలా మెల్లగా కదుల్తోంది.

“…నది నడకా, మనిషి నడకా ఎప్పుడూ ఒకే తీరుగా ఉంటాయేమిటి? ఆటుపోటులుండవూ?”

“…. ఎంచేతో మనస్సే మసకబారింది. మెల్లిగా కూడదీసుకుని తుడిస్తే మళ్ళీ అద్దంలా మెరుస్తుంది….”

“…బట్టలకంటిన దుమ్ముతో బాటు నేను చెప్పిన ప్రవచనాలు దులుపుకుని చక్కాపోతున్నారు.”

“…..అజ్ఞానిని నేనే, నేనే పిపీలికాన్ని. నా కర్మ నేను చేయాలన్నది మర్చి సత్వర ఫలితం కోసం వెర్రిగా వెతికాను. కొందరైనా వింటున్నారని, కొంతైనా ఒంట బట్టించుకుంటారని, ఆచరిస్తుంటారని గ్రహించలేకపోయాను…”

~

ఆదిగురువు – డా. తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం

75 ఏళ్ళు దాటిన రాధమ్మ వేపు తిరస్కారంగా చూసిన విశాల (రాధమ్మ రెండో కోడలు) చూపుల్ని ముసలావిడ పట్టించుకోలేదు.

“అబ్బా, అన్ని విషయాలు నీకే కావాలి. అవన్నీ మేము చూసుకుంటాముగా. మాట్లాడకుండా కూర్చోలేవూ?” కసురుగ అనేసి విసవిసా నడుస్తూ వెళ్ళాడు రాఘవ. (రాధమ్మ పెద్దకొడుకు) ముఖం చిన్నబుచ్చుకోలేదు రాధమ్మ. ‘పిచ్చితండ్రి అలిసిపోయాడు’ అనుకుంది.

“ముసలిదానివి ఓ మూలన వుండక అన్ని విషయాలు నీకే కావాలంటావు. అవన్నీ నీ కోడళ్ళు చూసుకుంటారులే” అనేసి మాధవ (రాధమ్మ రెండో కొడుకు) వెళ్ళిపోయాడు.

మామగారు బ్రతికున్నంతవరకు అత్తచాటు కోడళ్ళుగా వున్నవాళ్ళు ఆయన పోయింతర్వాత ఇంటి పెత్తనం అంది పుచ్చుకున్నారు. అత్తను (రాధమ్మను) మూలన కూర్చోబెట్టారు. వాళ్ళ పడకగదిని పూజామందిరంగా చేసుకుని రాధమ్మకు ఒక మూలగది కేటాయించారు.

“నీకెందుకు నాయనమ్మా? గమ్మునుండు” అని విసురుగా వెళ్ళిపోయింది, పెళ్ళికూతురు కావడానికున్న మనవరాలు. ఆ సమయం ఆమె పెళ్ళి సంరంభాల సందర్భమే.

వచ్చినవారికి ముసలామె కనబడకుండా గుమ్మానికున్న తెరను పూర్తిగా లాగి వెళ్ళింది ఆ మనవరాలు.

“…అమ్మ ప్రేమంటే ఇదే. ఆమెను మీరు పట్టించుకోకపోయినా ఆమె మీ ఆకలి గురించి తపన పడుతోంది” అన్నారు స్వామీజీ రాఘవ వేపు చిరునవ్వుతో చూస్తూ. “వంశానికి మూలవేరు అమ్మ వుండవల్సింది మూలగదిలో కాదు. మీ గుండె గదిలో” అన్నాడు స్వామీజి.

~

ఆటగదరా శివా! – పేరూరు బాలసుబ్రహ్మణ్యం

చేతినిండా డబ్బులుండడంతో మధ్యలో వచ్చిన కొత్త కొత్త స్నేహితులు, కొత్త కొత్త హాబీలు…. వారాంతపు సెలవులు (USAలో) ఇంకోరకంగా ఖర్చయిపోయేవి. దాంతో నేను నా భార్యాపిల్లల్ని బయటకు తీసికెళ్ళిందే లేదు.

మంత్రాలతో, తాయెత్తులతో చింతకాయలు రాలవని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. రాలివుంటే మనదేశంలోనే వుండేవాళ్ళు ఇంతదూరం అమెరికాకు ఎందుకు వస్తారు.

మా అమ్మ ఈ ఊరు కోడలుగా వచ్చేటప్పుడు ఒంటినిండా బంగారంతో, ఇంటినిండా ఇత్తడి పాత్రలతో వచ్చిందట.

మా అమ్మ ఒంటిపైవున్న గోల్డ్ కుదువంగట్లో చదువుకుంటూ మునిగిపోతే నేను పుస్తకాలు, ఫీజులు కట్టి యూనివర్శిటీలో గోల్డ్ మెడల్స్ తెచ్చుకున్నాను. మా నాన్న మాసినగెడ్డం, చిరిగిన బట్టలకే మాసికలేసుకున్నాడు. కానీ, నేను చేసిందేమిటి? అమెరికాకు ఎగిరిపోవడం, క్రమేణా వాళ్ళను మర్చిపోవడం. పెద్ద తప్పుచేశాను.

వెంటనే నేను భార్యాపిల్లల్తో ఇండియా బయల్దేరాను.

….. నాన్న కాళ్ళ దగ్గరకెళ్ళాను. టేబుల్‍పై నిలువు గళ్ళ నిక్కరుతో పడుకోబెట్టున్నారు. నాన్న (శవం) తల వద్ద అమ్మను కూర్చోపెట్టి మహిళలు విలపిస్తున్నారు.

“…..రాత్రి బండారుపల్లెలో రోశయ్య ధాన్యం కళ్ళంలో వుంది. ఓబులేసు, వెంకటయ్య కాపలాకు రమ్మని నాన్నను పిలిచారట. పాముపై అడుగేశాడు…. నాగుపాము….” ముగించాడు ‘రాజా’ చెప్పడం.

~

ఇక్కడే బాగుంది – వాణిశ్రీ

ఫస్ట్ ర్యాంకు వచ్చిన వాడు గ్రేట్, మిగిలినవాళ్ళు తక్కువ అనుకోవడం మూర్ఖత్వం.

పిల్లల్ని కిడ్నాప్ చేసి అరబ్ దేశాలకు అమ్ముతారని, అక్కడ పిల్లల్ని ఒంటెల పందాల్లో వినియోగిస్తారనీ, మగపిల్లల్ని నపుంసకులుగా చేస్తారనీ, బెగ్గర్స్‌గా పంపిస్తారనీ కథనాలు చదివాడు.

“వీళ్ళు పెద్ద ముదుర్లు. అయ్యా బాబు అంటే నెత్తికెక్కుతారు. కరవకపోయినా బుసకొట్టాలి, భయపెట్టాలి” అని నవ్వాడు నాగిరెడ్డి భాస్కర్ రావుతో అంటూ.

స్కూలు, పాఠాలు, హోం వర్కులు ఒత్తిడితో ఆడుకోవడానికి అవకాశం లేని నిర్భంధ జీవితం అనుభవించిన నిఖిల్‍కి మురికివాడల పిల్లలు స్వేచ్ఛా జీవితం ఆకర్షణీయంగా తోచిందని అవగతమైంది తండ్రి భాస్కర్ రావుకి.

“….. రాజాగాడు ఫస్ట్ ర్యాంకు సాధించాడు, వాడి కాళ్ళమీద పడి మొక్కురా అని వాడి కాళ్ళమీద పడేసింది నన్ను మమ్మీ. నీకు చదువురాదురా, అడుక్కోడానికి పనికొస్తావు, బొచ్చె తీసుకుని పో అని కొట్టింది డాడీ!” నిఖిల్ జరిగిన విషయాల్ని చెప్తూంటే భార్య మీద రగిలింది భాస్కర్‍రావుకు… పిల్లవాడు ఇంట్లోంచి పారిపోవడానికి కారణం భార్యనే అయినందున.

~

ఇక్కడే – రామాచంద్రమౌళి

కొత్త మట్టి నీరు, కొత్త వర్షపు గాలులు…. బస్తర్ యొక్క దండకారణ్యం పరిమళాలు…..

అదిలాబాద్…. జగదల్‍పూర్…. చిత్రకూట్ జలపాతం. ఆత్మ – తన పసికూనలున్న గూటిలోకి తల్లి పక్షి అప్పుడే ఎగిరివచ్చి వాలినట్టు…

ఆదిమానవుడు ఆధునిక మానవునిగా… మంచు తుఫాన్లు, ఎడారి వుప్పెనలు… వలసలు, యుద్ధాలు, ఆక్రమణలు, ఊచకోతలు, నాగరికతలు, సంస్కృతులు… గణరాజ్యాలు, ఆయుధనిర్మాణాలు, రాతియుగాలు, లోహావిర్భావం, నిప్పు సృష్టి…. అంతిమంగా అంతులేని అశాంతి…. ప్రశాంతత కోసం అనంతాన్వేషణ….

మనిషికి ఏమి కావాలో తెల్సుకోవడం కంటే, ఏమి వద్దో తెల్సుకోవడమే నిజమైన ‘ఎరుక’ అని గ్రహించి, ప్రొఫెసర్ ఉష 35 సంవత్సరాలుగా 150 లోతట్టు గిరిజన, పర్వతవాసుల గ్రామాల్లో, ‘విద్యాదీపం’ వెలిగించి, వేలమందిని కరదీపాలుగా, ఒక దీపం నుండి యింకో దీపం సిద్ధాంతంతో తన జీవితాన్ని అర్థవంతం చేసుకుంది….

ఆకాశం దట్టమైన మేఘాలతో తనను తాను అలంకరించుకుంటూ వర్షానికి సంసిద్ధమౌతోంది.

ప్రొ. ఉష భారంగా… తల్లిని విడిచి వెళ్తున్న పసిపిల్లలా ఒక్కో అడుగు వేసుకుంటూ కదిలింది అక్కడినుండి.

~

‘ఉత్తరం – 18’  – చలసాని వసుమతి

నవ్వుల పువ్వై పెదవులపై వికసించింది ఆమె ఎదలోని ఆనందం….. తుఫాను మేఘాల్లా దుఃఖం ఆమెను కమ్ముకుంది.

పిరికివాళ్ళు ప్రేమించడానికి అర్హులు కారు.

అప్పటికే భాస్కర్రావు యింట్లో ఒక అస్తమయం జరిగిపోయింది.

~

ఎందుకమ్మా?….. ఎందుకూ?…. – పివిఆర్ శివకుమార్

అంబుజం వస్తొందంటే తుఫాను వస్తున్నట్టే.

నా తిట్ల తీవ్రత మండుటెండ స్థాయి నుంచి పండువెన్నెల హాయికి దిగిపోయింది.

“ఏమిటంటున్నావే…. నువ్వు (అంబుజం – పనిపిల్ల) వాడింది నాకు తెచ్చియిస్తావా?” (యింటి యజమానురాలు)

“వొటెల్లో అందరికోసం వాడిన యేగా మీరెల్లినప్పుడు తినేది” అంబుజం.

“….పంచుకోటం తప్ప ఎత్తిచూపెట్టడం కుదరదమ్మ. నాకున్న దాన్లోనే ఎవులకైనా పానాల మీదికొత్తే కొంత సదిరిపెడతాను. అదో నెక్కకాదు” అంబుజం.

“….. మాకు మించిన జాగా మాకెందుకు? ఈల్లందరికీ అవుసురానికి పనికొత్తందిగా” అంబుజం.

~

కస్తూరి మృగం – వియోగి

సూపర్‍వైజర్ సుబ్బరాజు పోతూపోతూ ఫైల్స్ లో తాబేలులా తలదూర్చి పనిచేసుకుపోయే కప్పారావుకు మేలుకొల్పు పాడతాడు. ఇది దినచర్య.

“చూడు కప్పా (కస్తూరి అప్పారావు), ఇటువంటి పిచ్చి ఆలోచనలు రాకుండా వుండాలంటే పెళ్ళి చేసుకోవాలి.”

కిశోర్ : ఓ కోతి మెళ్ళో తాళి కట్టాను. అప్పటినుండి నా బ్రతుకు ఎగతాళి అయిపోయింది. అందాన్ని భరించడం చాలా కష్టంరా.

అప్పారావు : అదేంటిరా ఇంద్రుడంతటివాడు రంభా మేనకల వెంటబడకుండా అహల్య అందం కోసం వెంపర్లాడాడు.

కిషోర్ : ఏం చెప్పనులే గురూ! ఎవడు ఎప్పుడు ఎక్కడ మా ఆవిడకు లైనేస్తాడు. ఎవడు కన్నుగొడుతాడు, కొత్త కొత్త వాళ్ళు నాతో ఎందుకు స్నేహం చేస్తారో” వగచాడు.

కిషోర్ – సంపంగిల పెళ్ళై పదేళ్ళయింది. యింకా పిల్లలు కలగలేదు. దాంతో వాళ్ళు రతీ మన్మథుల్లా విహరిస్తుంటే చూసేవారికి కంటకింపుగా, కడుపుమంటగా…

తన తల్లిదండ్రులు జీవితాంతం కొట్లాడుకుంటూంటూనే బ్రతికారు. వాళ్ళను చూసే తాను (అప్పారావు) పెళ్ళిచేసుకోదలచుకోలేదు.

“రాయలసీమలో నీళ్ళు కరువు పోతుందేమోగానీ, నాకు పెళ్ళి కాదు!” చెప్పాడు ధైర్యంగా అప్పారావు.

…. వసుదేవుడంతటివాడు గాడిద కాళ్ళు పట్టుకోగా నేను నీ చేతులు పట్టుకోవడంలో తప్పులేదు (రూ.500/- అప్పుకొరకు) అన్నాడు సుధాకర్ అప్పారావుతో.

బార్‍లో సుధాకర్ తన కష్టాలు చెప్పుకొచ్చాడు అప్పారావుతో. తన తల్లికి, భార్యకు ఎన్ని విభేదాలు… వారిద్దరి మధ్య తను మద్దెలలా… అప్పారావు అన్నీ వింటూ కూలుగా కూర్చుని కూల్‍డ్రింక్ తాగాడు. చచ్చే చావయింది.

“…. ఆమాట చెప్పడానికి నువ్వెవతివే! ఈ ఇల్లు వాడిది. వాడు మొగాడు. తాగుతాడు, తందనాలాడతాడు. అంతమాత్రాన ఇంటికి రావద్దంటావా? ఎంత తలపొగరు!” లోపల్నించి సుధాకర్ తల్లి అందుకుంది కోడల్ని.

“…..చిరంజీవి! సన్యాసం నీవనుకున్నంత ఆనందంగా లేదు. పిడికెడు బియ్యం పెట్టాలంటే బారెడు తిట్లు తిడతారు…”

….జాబిల్లిలా కన్పించింది జానకి కొంచెం దూరంలో. అప్పారావు గుండె దడదడలాడింది. తను కాలదన్నుకున్న ఆనందం.

“…..ఏముంది! నా జీవితంలో ఆనందమే లేదు. ఎప్పుడైతే మా తల్లిదండ్రులు నిన్ను చేసుకుంటే (కులాలు వేరని) ఆత్మహత్య చేసుకుంటామన్నారో, వారికోసం నిన్ను వదులుకున్నానో ఆ క్షణం నుండి నా జీవితంలో దుఃఖం తప్ప ఆనందం లేదు.” అప్పారావు.

“….నిన్ను కాదన్నానని నీవు ఆత్మహత్యాయత్నం చేశావు, ఆసుపత్రి పాలయ్యావు. రెండు సంవత్సరాల తర్వాత నీ పెండ్లి జరిగిపోయిందని తెల్సింది” అప్పారావు.

కాలేజీ ప్రేమ! మనసు విహంగం లాంటిది. ఎక్కడికైనా ఎగిరిపోగలదు, ఎవరిపైనైనా వాలగలదు. వివాహం ప్రసక్తి వచ్చేసరికి అన్నీ సమాజపు అడ్డు యినుపగోడలే. వారు తన ప్రేమ పెండ్లిని అడ్డుకున్నారు. వారికి శిక్షగా బ్రహ్మచారిగా వుండిపోయాడు. వాళ్ళు ఎంత బ్రతిమాలినా తను పెండ్లి చేసుకోలేదు. జీవితం అంటే విరక్తి. ఆనందం కోసం అర్రులు చాస్తూ…. దొరకడం లేదు. ఎండమావులైపోయింది. ఒక పెద్దాయన చంకలో కర్రతో, నెరిసిన తల, మొహంలో ఏ కోశానా కళ లేదు. పోలియో వలన ఓ కాలు, చేయి, బాగా వంకరపోయాయి.

“అప్పారావూ! ఈయన మా వారు సాంబయ్య” పరిచయం చేసింది జానకి. కాకి ముక్కుకు దొండపండు. అతన్ని చూడగానే అప్పారావుకు అసహ్యం కలుగుతున్నది. దేవుడి మీద కోపం వస్తున్నది.

“సారీ అప్పారావు! నీ తల్లిదండ్రులు ఎక్కడున్నారో గానీ వారికి నేను రుణపడి వున్నాను. వారి మూలంగా నాకు యింతటి అపురూపమైన  భార్య లభించింది” బోళాగా నవ్వుతూ అన్నాడు సాంబయ్య. జానకి కూడా పడి పడి నవ్వి “నాకు యింతటి మంచి భర్త లభించాడు. బ్యాంకు ఆఫీసరు. నన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాడు” జానకి.

“జానకీ! మీరు యింత ఆనందంగా ఎలా వుండగలుగుతున్నారు? నేను ఎక్కడెక్కడ ప్రయత్నించినా అందుకోలేకపోతున్నాను” అడిగాడు అప్పారావు.

“కస్తూరి మృగం చుట్టూత పరిమళం వ్యాపించి వుంటుంది. ఆ మృగం ఆ సుగంధం ఎక్కడ్నించి వస్తున్నదని అన్వేషిస్తుంది, కానీ కనుక్కోలేదు. ఎందుకంటే అది దాని నాభి నుండే వెలువడుతూంటుంది. అలాగే మనిషి ఆనందం ఎక్కడో లేదు. అతనిలోనే వుంది. అప్పారావులాటి వారు కనుక్కోలేక నిరర్థకంగా జీవిస్తారు” నవ్వుతూ చెప్పింది జానకి.

“మనసు అంతర్గతమైతే ఆనందం, బహిర్గతమైతే బాధలు. నీకేది కావాలో నువ్వే నిర్ణయించుకో” అంది జానకి.

~

కార్తీక్ అనే నేను – జి. మేరీ కృపాబాయి

గొంగళి పురుగు ఎప్పుడూ అలాగే వుండదు. సీతాకోకచిలుకలాగా రూపాంతరం చెందుతుంది. శిశిరం తర్వాత వసంతం. మనిషీ అంతే. తన ఆలోచనలు మార్చుకుని, అవకాశాలు అంది పుచ్చుకుని, స్వభావం, స్వరూపం మార్చుకుని ఆకాశహర్మ్యం అధిరోహిస్తాడు.

~

కొడుకా! కట్ట తెగనీయొద్దు – ఆర్. సి. కృష్ణ స్వామిరాజు

తుకారాముడు నక్కతోక తొక్కాడు, అందుకే చూపులకు సుందరాంగి కనకలక్ష్మి దొరికింది…. నరదిష్టి మహానష్టదాయకమని తుకారాముడి తల్లి అలగమ్మ పాదిరి కుప్పం పద్మావతక్క దగ్గర దిష్టి తీయించింది.

పెళ్ళయిన మూడోరోజే కొత్త పెళ్ళికూతురు తల్లిగారింటికి పోయింది. పెళ్ళాం పోయిన గంటకే తుకారాముడు ఎండిపోయిన చెరువులా తయారైనాడు. చిత్తకార్తె కుక్కలాగా చుట్టకలాడినాడు. తుకారాముడు నాయన మాట తోయలేక, పెళ్ళాన్ని చూడకుండా వుండలేక దిగులు పెట్టుకున్నాడు. బాగా తయారై బయల్దేరాడు అత్తగారింటికి. డేరా కండ్రిగ వూరికి.

“ఒరేయ్ తుకారామా! అత్తగారింట్ల సుఖం మోచేతి మీది దెబ్బ అనే సామెతరా! ఏమో లక్కులక్కుమని గుర్రం లెఖ్ఖన పురుగులు తీస్తా వుండావు. ఈనిన మేకలాగా అల్లాడతా వుండావు. కట్ట తెగేంతవరకూ అక్కడ వుండద్దు” అన్నాడు తుకారాముడి నాయన లోకరాజు. తుకారాముడు తను అలిగి అత్తగారింటికి, చెడి చెల్లెలింటికి పోగూడదని విన్నాడుగానీ కట్ట విషయం ఎప్పుడూ విన్లేదు. అత్తగారింటికి పోయివస్తే కట్ట విషయం తెల్సి వస్తుంది గదా అనుకున్నాడు.

అత్తగారి వూరికి ఎగువన, దిగువన కట్టలేవీ కన్పించలేదు. అత్త అలివేలమ్మ అల్లుడు ముఖం కడుక్కోడానికి ఆప్కోవారి తెల్లతువ్వాలు, మైసూర్ శాండిల్ సోపు అందించింది. భార్య కనకలక్ష్మి మొగుడ్ని చూసి మురిసిపోయింది. మామ మునివేలు గబగబా ఖలీలు సాయిబు దగ్గరికి పోయి కేజీ మటన్ కొట్టుకచ్చినాడు. మామగారి యిల్లు స్వర్గానికి ద్వార మందిరం కదా అని పొంగిపోయినాడు తుకారాముడు.

రెండవరోజు – “కాఫీ, గీఫీ, తాగరికూడ. డైరెక్టుగా భోజనమే” అని చెప్పి బావి నీళ్ళకని బిందె ఎత్తుకొని బిరబిర పోయింది భార్య.

చేపల పులుసో, కోడిగుడ్డు పులుసో చేసి వుంటుందని గబగబా కాళ్ళు చేతులు కడుక్కుని పీటమీద చక్కా ముక్కా వేసుకుని కూర్చుంటే భార్య వయ్యారంగా నడుస్తూ వచ్చింది. మజ్జిగ పులుసు తెచ్చి పెట్టింది.

మూడోరోజు – అత్త “ఇక్కడేమి పాసిపోతా వుందని ఇంకా పొద్దుగుక్కముందే ఆవుల్ని తోలుకొచ్చినావు” అని నిష్ఠూరమాడింది. భార్య సత్తు తట్టలో సంగటి పెట్టి దాంట్లోకి గోవాకు ఊరిబిండి కొంచెం పెట్టింది. పగలు తిండే లేదు.

నాలుగవరోజు పొద్దున్నే భార్య చిన్నచిన్నగా తుకారాముడిని తట్టిలేపింది. “ఈ రోజు కటవకాడ కట్టెలు కొట్టేదానికి పోతున్నాం. నలుగురు కూలోల్లని కూడా పెట్టినాం. ఈరోజు మామూలు భోజనం కాదు. స్పెషల్. కరవేడు పులుసు.” అని వంద వయ్యారాలు పోతూ లేపింది.

మధ్యాహ్నం మూడు గంటలకు వడ్డన ప్రారంభమైంది. కరవేడు పులుసు అని పేరేగానీ, అత్త పోసే పులుసులో కరవేడు ఎక్కడా కన్పించలేదు. అంతా నీళ్ళ పులుసే. అల్లుడికి పులుసు పోసిందో లేదో సంగటి ముద్దలో వున్న గుంతనుండి పులుసు కట్టలు తెంచుకుని బయటకు వచ్చింది. తనకి తెలియకనే “నాయనా, కట్ట తెగింది నాయనా” అని గట్టిగా అరిచాడు. ఇంతలో రెండు అడవికోళ్ళు ‘కుక్‍కుక్’ అంటూ కొత్త అల్లుడిని చూసిపోదామన్నట్లుగా తుకారాముడి ముందర వచ్చి నిలబడ్డాయి. “అల్లుడికే నెయ్య లేదు, అల్లుడిని చూడను వచ్చినవాళ్లకు నూనె ఎక్కడి నుంచి వస్తుంది? నాకే లేదు నాకుడు బెల్లం, మీకు ఎక్కడి నుండి తెచ్చియిచ్చేది గోకుడు బెల్లం?” తుకారాముడు.

‘నా మొగుడికి ముక్కు మీదనే వుంటుంది కదా కోపం’ అని దవడ కింద చేయిపెట్టుకొని లక్ష్మి, మొగుడు తన వూరికి పరుగు లంకించుకున్న వేపే చూడసాగింది.

~

గానుగెద్దు – గన్నవరపు నరసింహమూర్తి

“….వాస్కోడిగామా, థామస్ ఎడిసన్, న్యూటన్, ఐన్‍స్టీన్, పాశ్చర్, వాట్స్, రైట్స్ బ్రదర్స్, మార్కొనీ… టీవీలు, కంప్యూటర్లు… అన్నీ యూరోపియన్లు కనుగొన్నారు. ఒక్కటి కూడా మనవాళ్ళు ఎందుకు కనుక్కోలేకపోయారు?” శ్రీహర్ష ప్రశ్నలకు నా దగ్గర సమాధానం వుండేది కాదు. శ్రీహర్ష ఒక పురోహితుడి కొడుకు.

“మనవాళ్ళది ఆధ్యాత్మిక వాదం. మూఢ విశ్వాసాలు మనం ఎదగాలి. అలాగని నాకు మనదేశం అంటే ప్రేమలేదనుకోకు…” శ్రీహర్ష.

“….కష్టాలు పడ్డాను. హైద్రాబాద్ వెళ్ళి కొన్నాళ్ళు హోటల్లో పనిచేశాను. రాత్రి కాలేజీలో ‘బిఎస్సీ’ చదివాను. సివిల్స్‌లో (100)లోపు ర్యాంకు సాధించాను. అవినీతిమయమైన మన దేశంలో IAS అయినా పేదలకు ఒరిగేదేమీ వుండదు, ఏ సహాయం చేయలేనని ఓ కంపెనీ సహాయంతో అమెరికా వెళ్ళాను. స్కాలర్‍షిప్‍తో కెమిస్ట్రీలో ఎమ్మెస్ చేశాను. కొన్నాళ్ళు సైంటిస్ట్‌గా చేశాను. తర్వాత స్వంతంగా లాబొరేటరీ పెట్టాను. మూడు సంవత్సరాల కాలంలో యాభై రకాల కొత్త మందుల్ని కనుగొన్నాను. ఇప్పుడు దాని విలువ ఇరవై వేల కోట్ల రూపాయలు. ఇప్పుడు నా దగ్గర వెయ్యిమంది పనిచేస్తున్నారు. నేను కనుగొన్న ఓ ఔషధ ప్రయోగానికి ‘నోబుల్ బహుమతి’ దక్కింది…. నేను నీ పేరిట రెండువందల కోట్ల రూపాయలు పంపిస్తున్నాను. దాంతో మనవూరికి కావాల్సిన వసతులున్నీ చేకూర్చే ఏర్పాట్లు చేశాను” అన్నాడు శ్రీహర్ష.

ఏటిమీద వంతెన, వూరికి నీటి కుళాయిల ఏర్పాటు, వాటర్ ట్యాంక్, రోడ్లు, పొలాలకు కాలువలు. ఇవన్నీ శ్రీహర్ష చలవే. టాటాలు, అంబానీలు కూడా యిటువంటి పనులు చేయడం లేదు.

కడుపులోని చల్ల కదలకుండా జీవితాన్ని గడపడం వల్ల నేను ఏమీ సాధించలేకపోయాను. గానుగెద్దులెప్పుడూ ముందుకెళ్ళలేవు.

~

గ్రాండ్ వైఫ్ కథ – ఐ ఎస్ టి శాయి

సన్యాసిరావు భార్య పంకజాన్ని పిల్చి చీవాట్లు పెట్టాడు. “నీ గ్రాండ్ దుంపదెగ. స్కూటర్ కింద కాలి వేలు నలిగితే గ్రాండ్‍గా వుండాలని కారు కిందపడ్డానని చెప్తావా?” అని.

~

డాబా వారి యిల్లు – వడలి రాధాకృష్ణ

ఊరంతా ముసురు ముసుగులో చిత్తడి చిత్తడిగా మారిపోయింది.

దుర్బేధ్యమైన ఒకానొక జ్ఞాపకాల జడి నన్ను నిలువుగా కమ్మేసినట్లైంది. ఊరు తాలూకు మహత్తర పరిమళం నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నది.

~

తీసివేత – కొత్తపల్లి ఉదయ బాబు

తమలపాకు లాంటి నా చేతిలో బచ్చలిఆకు లాంటి తన చెయ్యి వేసి మృదువుగా నొక్కాడు.

మా మామగారి చెల్లెలు నేను కాపరానికి వచ్చానని తెల్సి చూడడానికి వచ్చి “మీ నాన్నకసలు బుద్ధి వుందా? పట్టుమని వాడికి (17) ఏళ్ళు లేవా? ఉద్యోగం, సద్యోగం, చేస్తాడో లేదో తెలియదా? అలాంటి బొడ్డూడని వెధవని ముక్కుపచ్చలారని (12 ఏండ్ల) బంగారం లాంటి పిల్లని నిన్ను యివ్వడానికి మీ నాన్నకి మనసెలా ఒప్పింది?” అని నాన్నని తిట్టి పోస్తుంటే భయపడుతూ అడిగాను. “మా నాన్న మీకు తెల్సాండీ?” అని. ఈవిడ కూడా నా తలమీద చిన్నగా మొట్టి పకపకా నవ్వేసింది. ఆవిడ సిగ్గుపడుతూ అంది “మీ నాన్న వెంట్రుకవాసిలో తప్పిపోయిన సంబంధం” (ఆమె పేరు బాలా త్రిపుర సుందరి) “ఇక్కడ నిన్ను చూస్తే అమాయకురాలిలా వున్నావు మీ ఆయనేమో పెరటిచెట్టు లాంటివాడు. ఊరంతటికే గానీ యింటికి మాత్రం ఉపయోగపడడు. వాడిని లైన్‍లో నేను పెడతానుగా”

“మా అత్తగారిని అడిగాను, ‘లంచం’ అంటే ఏమిటి అత్తయ్యా” అని.

“అదో బహుమతి లాంటిది. బహుమతి ఇస్తే మీ ఆయనకు వుద్యోగం యిస్తారు” అంది గొంతు తగ్గించి.

“మీ అబ్బాయి రోజూ బయటికి వెళ్ళేప్పుడు ‘ముద్దు’ బహుమతిగా అడుగుతాడు…..”

“…నీకు ఉద్యోగం యిచ్చే ఆయనకీ మీ అత్తయ్య ‘బహుమతి’ ఇస్తుందట. యాక్…. బయటవాళ్ళకి అలా ఎలా యిస్తారు బావా అసహ్యంగా?” (బహుమతి అంటే ముద్దు)

మా పెద్దాడు పదవతరగతిలో వుండగా మా అత్తగారికి, మామగారికి ఏదో విషయంలో గొడవ వచ్చిందట “ఇంట్లోంచి వెళ్ళిపో, ఎక్కడికి పోతావో పో” అని ఆమెని ఆ వయసులో వీధిలో వాళ్ళంతా చూస్తుండగా బయటకు గెంటేశారట. ఆవిడ ఏడుస్తూ కూర్చోలేదు. ఎదురింటి వాళ్ళ ఇంట్లో కూర్చుని ఆ యింటావిడ చేత నాల్గు చీరెలూ, రైకలూ సంచిలో పెట్టి తెప్పించుకుని పుట్టింటికి వెళ్ళడానికి దారి ఖర్చులు ఇస్తే కాని కదలనని భీష్మించుకుందట. దాంతో ఆయన యాభైరూపాయలిస్తే ఆవిడ నేరుగా పోస్టాఫీసుకు వెళ్ళి కొడుక్కి ఫోను చేయించింది. “ఒరేయ్ పెద్దోడా! మీ నాన్న ఈ వయసులో నన్ను ఇంట్లోంచి గెంటేశార్రా! నీ దగ్గరే వుంటాను” అని ఏడుస్తూ చెప్పిందట…. ఆవిడ వస్తూనే నన్ను పిలిచి “ఒసేవ్ అమ్మాయీ! ముసలమ్మగారు (ఆవిడ అత్తగారు) ఉన్నప్పుడు నేను నిన్ను ఎన్నో సార్లు ఆవిడ నుంచి కాపాడాను. దానికి కృతజ్ఞతగా నన్ను మర్యాదగా చూడాలమ్మాయ్! ఈ వయసులో మొగుడు వదిలేశాడు గదా అని, మేమే దిక్కు అన్నట్లుగా చూస్తే మాత్రం ఒక్కక్షణం కూడా నీ యింట్లో వుండను తెల్సిందా?” అని నాకు నియమం పెట్టి మరీ లోపలకు వచ్చిందావిడ. గడబద్దలా వచ్చి నున్నగా చెరుకుగడలా తయారైనా ఆమె బ్రతుకు కూడా మొదటినుండీ ‘తీసి పడేయడమే’గా అన్న రీతిగానే సాగింది. (‘తీసి-వేయడం’కు వ్యతిరేకం ‘తీసిపడేయడం’) అప్పట్లో నాకే బాధ కలిగినా ఆమె అత్తగారి నుంచి మా అత్తగారు నన్ను బిడ్డలా రక్షించింది. ఎన్నోమార్లు నా తప్పుల్ని తనమీద వేసుకుని కాపాడింది. ఆ కృతజ్ఞత నాలో నరనరాన జీర్ణించుకుని వుండడంతో ఆమెను ఆ ఆరునెల్లు నేను తల్లిలా సాకాను. ఆరునెల్ల తర్వాత జీవితంలో మొదటిసారి మా మామగారు తన పెళ్ళాన్ని తీసుకు వెళ్ళడానికి మా యింటికి వచ్చారు. ఆమె చిలకలా కులుకుతూ భర్త వెంట తిరిగి వెళ్ళింది.

ఏనాడూ నా మాట ప్రకారమే జరగాలి అని నేను అనుకోలేదు. పిల్లలకు ఎవరిదో ఒక భయం వుండాలి కాబట్టి వాళ్ళు ఏమి అడిగినా “నాన్నగారిని అడగండి” అని చెప్పేదాన్ని. దాంతో వాళ్ళలో తండ్రి అంటే పైకి భయంతో కూడిన గౌరవం, అంతర్లీనంగా భక్తితో నిండిన ప్రేమ వుండేవి. ఏ విషయంలోనైనా బావ నన్ను ‘తీసి – పడేస్తుంటే’ “అదేంటి నాన్నగారూ! అమ్మకీ యిష్టాయిష్టాలు వుంటాయికదా. ఈ వయసులో తీర్చకపోవడం మాకైతే చాలా బాధగా వుందండీ” అని పిల్లలు అనడంతో బావ యిప్పుడు ప్రతీదానికీ నన్ను ‘కూడిక’ (తీసి-వేయడం కాదు) చేస్తున్నాడు. నా విలువ పెరిగింది.

ఒకరోజు మధ్యాహ్నం అప్పుడే భోజనం చేసి నడుం వాల్చే సరికి మనవలు, మనవరాండ్రు అందరూ వచ్చి నా పందిరి మంచం చుట్టూ చేరారు.

“నానమ్మా! నీ హాపీ బర్త్ డే అంట కదా?” అడిగింది రెండో అబ్బాయి కూతురు.

“ఎప్పుడో నీకు డేట్ తెల్సా నానమ్మా?” అడిగాడు పెద్ద మనవడు. “నానమ్మకు తెలీదురా! నానమ్మ చదువుకోలేదట!” అన్నాడు చిన్న మనవడు.

“నేను చదువుకోకపోవడం ఏమిటి? ఐదవక్లాసు వరకు చదువుకున్నాను” అన్నాను. పిల్లలందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకొని నోటికి చేతులు అడ్డుపెట్టుకుని చిలకల్లా నవ్వేశారు. నాకు ఆనందంతో పాటు ఉక్రోషం కూడా వచ్చింది.

“…..ఇంగ్లీషులో నాలుగు బరులూ వచ్చు. మీకేమైనా వచ్చా?” అడిగాను.

“ఒరేయ్! శతకం అంటే ఏమిటి? ఎక్కం అంటే ఏంటి? బరి అంటే ఏంటి నాన్నమ్మా?”

“ఒరేయ్! నాన్నమ్మ పైకి అమాయకురాలిలా కన్పిస్తుంది గానీ పెద్ద ఎన్‍సైక్లోపిడియారా! ఆటలాడుకున్న తర్వాత మళ్ళీ వద్దాం పదండీ” అని అందరూ వెళ్ళిపోయారు, చిలుకలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయినట్లుగా.

మరునాటినుండి ఇంటికి బంధువులంతా రావడం మొదలుపెట్టారు. నా అక్కా, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, పెత్తల్లి బిడ్డలు పిల్లలతో పెద్దలతో ఇల్లంతా పక్షులన్నీ వాలే చెట్టులా అయిపోయింది.

నా షష్టిపూర్తి ఉత్సవాలు : మొదటిరోజు కలశస్థాపన, రెండో రోజు ఉగ్రరథ శాంతి, మూడవరోజు అవపురుధ స్నానం. మూడవరోజు రాత్రి బావను, నన్ను మొదటి రాత్రి గదిలోకి పంపినట్లు పంపారు…..

~

తెర – సలీం

“నువ్వు కూడా ముస్లిం మగాడివేగా. ఆడపిల్లలకు ఆత్మాభిమానం వుంటే తట్టుకోలేని జాతి” అంటూ ఒంటికాలు మీద కస్సుమని లేస్తుంది ఆఫ్రీన్. అద్భుతమైన అందం ఆమెది. తేటనీటి తటకాల్లా విశాలమైన కనుదోయి… నాజూకైన పాలరాతి శిల్పంలా.

ఆఫ్రీన్‍కు బురఖా వేసుకోవడం ఇష్టం వుండదు. ముస్లిం యువకుల్లో చాలామందికి నచ్చని విషయం ఇదే. దీంతో పెళ్ళి సంబంధాలన్నీ వదులుకుని పోయారు. బురఖా వేసుకోవాలన్నది వాళ్ళ నియమం.

“నాకు నచ్చే బట్టలు వేసుకోవడం నా హక్కు. దాన్ని నియంత్రించే అధికారం ఎవ్వరికీ లేదు. ఈ మత పెద్దలకు అస్సలు లేదు” అంది ఆవేశంగా. పెద్ద చదువులు చదివిన యువకులు కూడా 99% మంది మత ఛాందసాల్ని పట్టుకుని వేలాడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని అన్ని సుఖ సౌకర్యాలూ కావాలి కానీ, భార్య విషయానికి వచ్చేప్పటికి బూజు ఆలోచనల్ని మాత్రం వదులుకోరు. నేను వెతికేది ఆ ఒక్క శాతంలో వున్న ఆధునిక భావాలు గల ముస్లిం యువకుడి గురించే” అంది.

“…..నాకు బురఖా వేసుకోవడం ఇష్టం లేకున్నా, ఎవరికోసమో వేసుకోవాల్సి వస్తే దాన్ని సర్దుకుపోవడం అనరు. అది సెల్ఫ్ డిసీట్ కాదా? నా ప్రతి కండీషన్‍కు ఒప్పుకునే సంబంధం దొరికేవరకు వేచి వుంటాను….” ఆఫ్రీన్ తన మాటల్లో నాకు అహంకారం కన్పించలేదు – ఆత్మాభిమానం తప్ప.

~

తొలి చూపులోనే – గొర్రెపాటి శ్రీను

మంచులో తడిసిన మల్లెలు వెదజల్లుతుంటే భలే ముద్దొస్తాయి. చల్లగాలి చెలికాడు ముద్దాడుతుంటే తన్మయానికి లోనైన గులాబీలు… పచ్చగా మెరుస్తూన్న గడ్డిపూలపై సన్నగా మంచు కురుస్తోంది.

~

ద్వంద్వం – అంబల్ల జనార్దన్

“….. రెండు గుండెలుండి ఆరోగ్యంగా వున్న ఏకైక వ్యక్తిగా ప్రపంచ రికార్డుల్లో కెక్కడం ఖాయం” నాకు మాత్రం ఏడవ స్వర్గంలో వున్నట్టుంది ఆ సంగతి తెలిశాక.

నేనే ఓసారి అతని ఫ్లాట్‍లో చొరవ తీసుకోబోయాను. చెలియాలి కట్ట దాటబోయే సమయానికి డోర్ బెల్ మోగింది. మేము స్పృహలోకి వచ్చాం….. స్పర్శాంబుధిలో జలకాలాడాం.

….(శృంగారపరమైన కోరికల్లో ద్వంద్వం అన్నది మానసికమైనది, మెదడుకు సంబంధించిన విషయం. రెండు గుండెలు వుండడమన్నది భౌతికమైన విషయం. ఈ రెండు గుండెలు ‘ద్వంద్వం’ ఆ శృంగారపరమైన ‘ద్వంద్వం’కు కారణ భూతం కాదు. – నల్లభూమయ్య)

నా అదనపు గుండెను దానం చేయడానికి హాస్పిటల్లో చేరాను. నా ఎదపై కుట్లు పడ్డాయి. కానీ నా మనసుపై పడ్డ గాట్ల కంటే అవి ఎంతో నయం.

~

దెబ్బే గురువు – కల్లు రాఘవేంద్రరావు

ఆ వూరి కోళ్ళకింకా తెల్లారినట్టు లేదు. అవి జాము కోళ్ళు కావు, ఫారంకోళ్ళు, కూతపెట్టవు. గుడ్లు పెడతాయి.

ఆ గుడి వెనకాల జరిగేవన్నీ చెప్పరానివే.

ముసలయ్య మనసులోనే తిట్టుకుంటూ గతం అనే గునపంతో మనసును తోడడం మొదలుపెట్టాడు.

“కాన్పు కష్టమైందయ్యా” అక్కడున్న మరో స్త్రీ ఏడుస్తూ చెప్పింది.

“రాజీ” అంటూ దిక్కులు పిక్కుటిల్లేలా ఏడ్చాడు ముసలయ్య.

మంచంమీద రాజమ్మ నిర్జీవంగా పడివుంది. ప్రక్కనే మగబిడ్డ ముఖం చూశాడు. చలనం లేదు. శిశువు బలంగా కాళ్ళు మాత్రం బలహీనంగా పుల్లల్లా వున్నాయి. ఆ బిడ్డ తొలి ఏడ్పు ఏడ్చిందో లేదో గానీ ముసలయ్య మాత్రం జీవితంలో ఎన్నడూ ఏడ్వనంత గట్టిగా ఏడ్చాడు.

ఆ తొలిచూపులు బీడువారిన ముసలయ్య హృదయ క్షేత్రాన ఆశాజల్లులు కురిపించాయి. ఎండిపోతున్న చెట్టుకు నీరందించినట్లైంది. బీడువారిన ముసలయ్య మనసులో గంగ గలగలమని పారింది.

~

నియంత్రిణి – చంద్రప్రతాప్

హమ్మయ్య అపార్థం చేసుకోకండి. అనుష్క అంటే ‘శర్మా’ లేక ‘షెట్టి’ నా అనేదికూడా మనకు తెలియదు. భార్యని ఆమెలా ఆమెని అందంగా వూహించుకుంటూ ఆ పేరు పెట్టుకొన్నాడు.

పదేళ్ల క్రితం ఆమె పేరు శ్రీదేవి, ఇరవై ఏళ్ళక్రితం ఆమె పేరు మాధురీ దీక్షిత్, ముప్పదిఏళ్ళ క్రితం ఆమె పేరు కే ఆర్ విజయ. అంతకుముందు కృష్ణకుమారి. ఆమె అసలుపేరు ఆండాళ్ళు.

“కుంభానికి కొంపకి తగలడుతారా లేక యిక రాత్రికేనా దర్శనం?” వ్యంగ్యంలో అనుష్కకు ఎవరూ సాటిరారు.

కృష్ణుడి పాత్రలో పెద్ద యన్.టి.ఆర్‍లా చిరునవ్వు నవ్వి, “ఏం తమాషా చేస్తున్నావా?” అని చంద్రబాబులా కసిరాడు.

“మరి అంత డిమాండు వుంటే పదివేలకు రెండు యిచ్చే ఆఫర్ దేనికి?”

“ఆపద్భాందవుడు” సినిమాలో చిరంజీవి మీనాక్షి శేషాద్రిని చూసినట్టు జాలిగా మిత్రుడి వంక చూశాడు కుటుంబం.

“కామూ! అటు చూడు. మూడుపదులు దాటని వాళ్ళు కూడా వీటికోసం లైన్లో నిలబడ్డారు. అంత చిన్న వయసువాళ్లకు కూడా వాటి అవసరం వుందంటావా?” అడిగాడు కుటుంబం.

ఆ కౌంటర్‍లో వ్యక్తి నానాపటేకర్‍లా సీరియస్‍గా వున్నాడు.

“…..కానీ, అనుష్క శరీరం మీద కానీ, డ్రెస్సులో గానీ ఆ చిప్ అమర్చడం ఎట్టారా? అదసలే రాకాసి!!” కుటుంబం.

“ఓ ఐడియా… చిప్ నీ జేబులోనే వుంచుకో. ఆవిడ మాట్లాడేటప్పుడు వినపడని మోడ్‍కు వెళ్ళిపో. ఆవిడ దుశ్చర్యల్ని చూడొద్దు అనుకున్నప్పుడు బ్లైండ్ మోడ్‍కు వెళ్ళిపో. ఆవిడతో మాట్లాడకూడదు అనుకున్నప్పుడు మౌత్‍లాక్ మోడ్ వుండగానే వుంది. ఎలావుంది నా ఐడియా?” కాముడు.

“నీ పిండాకూడులా వుందిరా. ఈ రిమోట్ కొనకముందు (లంప్కిన్ కంపనీ వాళ్ళ ‘పెళ్ళాన్ని కంట్రోల్ చేసే రిమోట్’ రూ. 5000/-కు) ఇన్నేళ్ళపాటు నేను చేసింది అదేగదరా!” కుటుంబం.

~

పంచుకున్నారా? – డా. ప్రభాకర్ జైనీ

నా కోపం తాటాకు మంటలాంటిది. ఉవ్వెత్తున లేచినా వెంటనే చల్లారిపోతుంది.

ప్యూపాదశలోని సీతాకోకచిలుక మాదిరిగా నేను ఒక షెల్ లోకి దూరిపోయి ప్రపంచంతో సంబంధాలను తెంపేసుకున్నాను. తల్లి మరణం, భార్య విడాకులు ప్రపోజల్ వల్ల వాడు (కొడుకు) ఎంత నలిగిపోయాడో, వెలగని దీపస్తంభంలా వున్నవాణ్ణి చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు వాడు కరగని మేఘంలా వున్నాడు. ఈ కాలం పిల్లలు చిన్న చిన్న కారణాలతోనే విడాకుల వరకూ వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ సమస్యలు కూడా తాటాకు మంటలాంటివే….

Love only by Sharing అని Brain Tray అని మహానుభావుడు అన్నాడు.

~

పిచ్చుకలూరు – ఉండవల్లి. యమ్.

మగ పిచ్చుకకి జోడు కుదరాలంటే గూడుకట్టడం బాగా వస్తేనే ఆడపిచ్చుక జత కట్టుద్ది.

చంద్రశేఖరం గారి పెద్దమనవడు పిట్టలకర్ర (catapult) తో వచ్చి గులకరాయిని దానిలో పెట్టి గురిచూసి ఆడపిచ్చుకని కొట్టాడు. అది అక్కడికక్కడే ప్రాణాలొదిలింది. చంద్రశేఖరం గారు నొచ్చుకుని “అవేం పిచ్చిపనులు? జీవాల్ని అలా చంపుతారా?” అని కేకలేసి పిట్టలకర్ర తీసుకుని అవతలకు విసిరేశాడు. మగ పిచ్చుక దాని చుట్టూ చేరి ముక్కుతో ఆడపిచ్చుక కళేబరాన్ని ఎగేస్తోంది కిచకిచమంటూ.

“అదేం పనిరా?” అంది రత్నవతి.

కోడలు సౌభాగ్య “పిచ్చుకే గదా అది. దానికెందుకు కోప్పడిపోతారు? పదరా లోపలికి” అంటూ పిల్లవాడ్ని లోపలకు తీసుకుపోయింది. అరుగు బయట రోజూ వచ్చే కుక్కలకు అన్నంపెట్టి నలతగా పడుకుంది రత్నవతి.

“అన్ని జరుగుబాట్లు ఉన్నప్పుడు ఆస్తులను అమ్ముకోవాల్సిన పనిలేదు. అన్నీ అమ్మేసి ఉనికి లేకుండా ఎలా అయిపోతాం?” కఠినంగా చెప్పేశారు చంద్రశేఖరం కొడుక్కి. చైనాలో పిచ్చుకల్ని చంపేస్తే కరువుబారిన పడి నాలుగుకోట్లమంది చనిపోయాక ప్రభుత్వానికి తెలిసొచ్చింది.

“….. మన సమూహాల్లోకి కొత్తవాళ్ళు వచ్చినప్పుడు అల్లకల్లోల్లాలు సహజం. మనం దేనికీ బెంగపడకూడదు. కాలంతో అన్నీ సర్దుకుంటాయి. మన తప్పుంటే బాధపడాలి. అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి ఆలోచించడం అనర్థం” చంద్రశేఖరం రత్నవతిని వూరడించాడు.

ఆడపిచ్చుక చనిపోయిం తర్వాత మగపిచ్చుక సరిగ తినడం లేదు.

“పేగు బంధాల్ని మనం పెనవేసుకుపోతాం. పైసలతో వాళ్ళు యాంత్రికమైపోతారు. కాలమే అన్నిటినీ సమాధానపరుస్తుంది.” చంద్రశేఖరం రత్నవతిని ఊరడించాడు. చంద్రశేఖరం పిచ్చుకల సంఖ్య వృద్ధిచెందే చర్యలన్నీ చేపట్టాడు.

పిచ్చుకలు పొలాల్లో కీటకాలను తిని రైతులకు మేలు చేస్తాయి.

“….ఇదివరకు కీటక నాశినిని ఎక్కువ వాడేవాళ్ళం. ఇప్పుడు దాని వాడకం తగ్గి దిగుబడి పెరిగింది” – పక్షుల మూలంగా. కారణం చంద్రశేఖరం.

చంద్రశేఖరం తన పద్దెనిమిది ఎకరాల్లో నాల్గు ఎకరాలు పక్షులు కొరకు రాసిచ్చాడు.

~

పొలిమేరలు దాటిన న్యాయం – బత్తుల వెంకట రమణమూర్తి

గాడిదకొడుకు ఆ పుల్లిరుపు నాయాలు – వీరేశుగాడు పెద్ద ఫిటింగే పెట్టాడు.

“ఎవడికో ఏటిరా, మూడేది నీకే. రాత్రి నువ్వు పెంటమ్మ ఇంటి దడి దాటావుకదా! అది కాస్తా దాని మొగుడికి చెప్పాను. ఆడు పోలీసులను రప్పించినట్టున్నాడు. నీ మీద రేప్ కేసు ఖాయం. ఇంక నీకు ఇత్తడే ఎల్లిరా” అదే ఎటకారంతో సమాధానమిచ్చాడు వీరేశు జోజికి. (జోడెద్దుల జియ్యన్న) ఉలిక్కిపడ్డాడు జోజి. ‘అమ్మ నా కొడుకా ఈడెప్పుడు చూశాడు. దాని మొగుడికి నిజంగా తెల్సిందా, తెలిస్తే ముందు నా మక్కెలిరిసేస్తాడు. కొంపదీసి వీరేసుగాడు ఆడిపేరున పోలీసులకు చెప్పాడా? గాడిదకొడుకు. అసలే ఈడి నోట్లో నువ్వుగింజ ఇమడదు. అనవసరంగా కెలికినట్టున్నాను. ఇప్పుడేటి సెయ్యాలి…’

జోజి ఆక్రోశంతో వీరేశును తిట్ల దండకం అందుకున్నాడు.

…. నెల తక్కువనాయాలు….

వీరేశు “అదిగో, పెంటమ్మ మొగుడు ఇటే వస్తున్నాడు, నీకు బడితెపూజ ఖాయం” అన్నాడు జోజితో.

వీరేశు జోజివైపు చిరాగ్గా చూశాడు “ఊరుకో లమ్డీకే మీ చీకటి బాగోతాలు ఎవడికి తెలీవురా. నువ్వు పిత్త పరిగివేరా. వూర్లో తిమింగలాలున్నాయి. వాటిని వదిలేసి నీ జోలికెవడు వస్తాడు. పోరా నాయాలా” అంటూ కసురుకున్నాడు వీరేశు. జోజి బతుకు జీవుడా అంటూ సైకిలెక్కి పారిపోయాడు.

పంచాయితీ సర్పంచుగా వున్నా లేకపోయినా వూర్లో పెద్దరికం పులిరాజుదీ, అతని అనుచరులదే. కులం కన్నా డబ్బే అక్కడ ప్రాతిపదిక. గంజాయి సాగు, కలప, ఆటవీ ఉత్పత్తులు, అక్రమ వ్యాపారం. ఈ విషయాలు బాహ్య ప్రపంచానికి తెలియకూడదంటే, కొండవాలు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఎన్నోమార్లు వచ్చినా దాన్ని అడ్డుకున్నారు.

ముప్పది ఏళ్లక్రితం : పెళ్ళి పేరుతో తల్లిని లొంగదీసుకున్న ఓ పెద్దమనిషి, ఆమె గర్భవతయ్యాక రచ్చబండ వద్ద డబ్బు చెల్లించి తన తప్పును ఒప్పుచేసుకున్నాడు. కానీ వాడి పాపభారాన్ని తన తల్లి (వీరేశు తల్లి) మోయాల్సి వచ్చింది. మాతృప్రేమను చంపుకోలేని తల్లి దయ వల్ల తానూ, తన అక్క ఒకేసారి ఘడియ తేడాతో భూమ్మీద పడ్డారు. అక్కకు వయసు రాకముందే తమ తల్లి ఊరు దాటించింది. తమ పెద్దమ్మ మంచి మనిషి పెంపకంలో అక్క జీవితం సాఫీగా సాగిపోతుందటం వీరేశు జీవితంలో ఏకైక ఆనందం. ఊరి పెద్దల దాష్టీకానికి తమ్ముడు బలైపోతాడేమో అని ఆమె భయాందోళనలు.

అక్కడ పంచాయితీల్లో ప్రశ్నలు, సమాధానాలన్నీ కేవలం వూరి వాళ్ళను సమాధానపర్చడం కోసమే. బాధితులకు న్యాయం చేసేందుకు కాదు. తమను కాదని పోలీసు స్టేషనుకు వెళ్ళినా ఒరిగేదేమీ వుండదన్న పరోక్ష హెచ్చరికలు.

కోటేసు కొడుకు సోకుల్రాజు. కోక కనబడితే తోకూపుతూ తిరిగే చిత్తకార్తెనాయాల. వావివరుస, వయసు తారతమ్యాలు పాటించకుండా మాయమాటల్తో ఆడదాన్ని లొంగదీసుకుని అనుభవించడం వాడి వ్యసనం. నోరు మెదపకపోతే అక్కడే డబ్బిస్తాడు, నోరు తెరిస్తే పంచాయితీలో రేటు కట్టి తప్పించుకుంటాడు. తండ్రి వయసులో వున్నప్పుడు ఇంకా ఎక్కువే చేశాడు. రెండొందల గడపగల వూర్లో సోమేసు లాంటివాళ్ళు మరో పదిమందివరకు వున్నా, వీడికి వాళ్ళు అనుచరులైతే అందరూ కల్సి చేసే పాపాలకు వీడు నాయకుడు.

సత్తేలు కూతురు సుజాతను మాయజేసి కడుపుజేశాడు సోమేసు. వీరేశు ఉగ్రనరసింహుడయ్యాడు. ఊరిజనం వాళ్ళకు భయపడుతున్నంత కాలం తన ఒక్కడివల్ల అది సాధ్యం కాదని తెల్సు. వీరేశుకు జైల్లో పరిచయమైన ఎర్రజెండా పార్టీ పెద్దమనిషి మాటలు గుర్తుకువచ్చాయి. “ప్రశ్నించడానికి ధైర్యముంటే చాలు. మేధావితనం అక్కర్లేదు. నాగరిక ప్రపంచంలో బ్రతుకుతున్న అనాగరిక జీవులు వీళ్ళు….” అతని ప్రమేయంతో సోమేసు – సుజాతల పెళ్ళి రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగిపోయింది.

జీవితాంతం భయపడుతూ బ్రతికే కంటే ఒక్కసారైనా తెగిస్తే వూరు బాగుపడుతుందని అనుకున్నారు అంతా. వీరేశును అంతా అభినందనల్తో ముంచెత్తారు.

అక్కడికి నెలరోజుల తర్వాత నదిలో పడవ బోల్తాపడి ఈత రాని వీరేశు చనిపోయాడు. మిగిలినవాళ్ళంతా ఈత వచ్చినవాళ్ళు బ్రతికిపోయారు. ఆ పడవలో వున్నదంతా పులిరాజు మనుషులు, వీరేశు మాత్రమేనని ఎవరికీ తెలియదు.

“ఊరి పెద్దలను ఎదిరించిన వ్యక్తి నదిలో శవమై తేలాడు” అని మరునాడు పేపర్లో వస్తున్న విషయం…. ఆ వార్త ఎవరిని ఎక్కడకు తీసుకు వెళుతుందో కాలమే నిర్ణయిస్తుంది….

~

ఫార్మాలిటీ – మొగిలి అనిల్‍కుమార్ రెడ్డి

నేను ఉద్యోగంలో చేరిన మొదటిరోజున నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి “బాబూ! నీ ఉద్యోగ జీవితం పూలబాటలా వుండేలా చూసుకో. మధ్యలో రాళ్ళు, ముళ్ళు, బురద ఎదురైతే పక్కకి తప్పుకో. ఒకసారి బురద అంటితే పోదు.”

మా సూపరింటెండెంట్ గారికి మంచివాడన్న పేరుంది. కానీ ఆయన కూడా ‘ఫార్మాలిటీస్’కి అతీతుడు కాదా? ఉదయం కాంట్రాక్టరు అన్న ‘ఫార్మాలిటీస్’ గురించి ఆయనకు చెప్పాను. ఆయన అన్నాడు “దాన్ని ‘లంచం’ అని  ఎందుకనుకుంటున్నావు? అది జస్ట్ ఫార్మాలిటీ. గిఫ్ట్ అనుకో.”

“మరి లంచం అంటే ఏంటి సార్?” అడిగాను.

“నువ్వు ముందే డబ్బులు డిమాండు చేసి డబ్బులు యిచ్చాకే సంతకం పెడతానంటే అది లంచం” అన్నాడు. ఆయన డెఫినేషన్ నాకు నచ్చలేదు.

“సరే. నువ్వు తీసికోకపోతే బిల్ ఏమీ ఆగదు” అంటూ ముగించాడు సూపరింటెండెంట్.

నా ఆప్తమిత్రుడు శ్రీనివాస్‍కి ఫోన్ చేసి సలహా అడిగాను. వాడు కూడా “అరేయ్! ఇది సింపుల్ విషయం. ఇష్యూ చెయ్యకుండా కామ్‍గా ఆక్సెప్ట్ చెయ్” అన్నాడు.

నా అర్ధాంగి సీత “లక్ష రూపాయలా! అమ్మో….” స్త్రీ సహజమైన ఆశతో, “మీరు అడగకుండానే అతను యిస్తే తీసుకుంటే తప్పేముంది?….  ఈ తులంతాడు తప్ప లేదు నా మెళ్ళో…. అయినా జాగ్రత్త…” అంది సంశయపూరితంగా.

ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసికోవాలి అనే గజిబిజి ఆలోచనలతో నిద్రకుపక్రమించాను.

కలలో కంట్రాక్టరే నన్ను ఏసిబీకి పట్టించాడు. అది కలే అయినందున, నాన్న మాటలు గుర్తుకొచ్చి ఇప్పుడు ఆందోళన, అలజడి పోయి మనసుకు హాయిగా వుంది.

~

బావగారికి లేఖ – కె.వి లక్ష్మణరావు

కోపం వస్తే పద్యం చదువుకోమని నాకు సలహా యిచ్చారు. కానీ, అదే సలహాను మీరు పాటించకపోవడం నాకు ఆశ్చర్యంగా వుంది బావగారూ!

ఒకరి ఉత్తరం మరొకరు చదవడం తప్పే. కానీ, దారి తెల్సుకోవడానికి దిక్సూచిలా ఉపయోగపడుతుందనుకున్నప్పుడు తప్పుకాదు.

~
భోక్తలు – పాణ్యం దత్తశర్మ

కొన్ని గారెలు లేత పాకంతీసి పెరుగులో వేసి పోపు పెట్టింది. అరటిదూట పెరుగుపచ్చడి….

మంత్రం, మార్తాండం గారే. బ్రాహ్మలు యిద్దరే అదోలా వున్నారు. మధ్యలో ఒకడు సిగరెట్ కాల్చి వచ్చాడు, ఒకడు సెల్‍ఫోన్‍లో గేమ్స్ ఆడుకుంటున్నాడు.

గారెలు పకోడీలంత వున్నాయి. అంత చిన్న గారెలు చిల్లుతో చేయడం నేర్పే! రవ్వలడ్లు ద్రాక్ష పళ్ళంత….

“మీరు భోజనాల్ని గబగబా ముగించాలి. మాకు వెంటనే మరొక తద్దినం కార్యక్రమం వుంది యిక్కడే. కానివ్వండి త్వరగా” అని కేకలు వేశాడు ఒకాయన.

“వాళ్ళ వ్యాపారం అది” అన్నాడు దత్తాత్రేయ.

భార్యాభర్తలు హిరణ్మయి – దత్తాత్రేయులకు ఇద్దరికీ మనసులో శూన్యంగా వుంది ఈ తద్దినం పెట్టించిన తంతుతో.

“శ్రద్ధగా చేసేదే శ్రాద్ధమన్నారు. ‘బ్రాహ్మలు’ అని ఎక్కడా అన్లేదే. ‘భోక్తలు’ అన్నారు. అంటే తినేవారు ఆకలితో తినేవారన్నమాట. ఆ పేద వాళ్ల కడుపు నింపినపుడు మనకు కలిగిన ఆనందం శాస్త్రోక్తంగా మనం జరిపించిన తద్దినాల్లో కలిగిందా? వాళ్లది ఎంత నిర్లక్ష్యం, ఎంతటి వృథా, ఎంతటి వ్యాపారం” అన్నాడు దత్తాత్రేయ భార్యతో.

~

మనసుకు చికిత్స – డా. లక్ష్మీరాఘవ

“నాకేమో పొద్దున్నే ఐదుగంటలకు లేవడం, వెంటనే కాఫీ తాగే అలవాటు. వాళ్ళేమో ఏడుగంటలకు తీరికగా కాఫీ యిస్తే ప్రాణం వుసూరుమంటుంది. నేనే కాఫీ పెట్టుకుంటానంటే ‘గ్యాస్’ తో మీరేమీ వెలిగించొద్దు’ అన్న కోడలు ఆంక్షలు. నేను బాత్‍రూంకి వెళ్ళి వస్తే మీరు వెళ్ళి వచ్చినాక వాసన వేస్తుంది అని మరిన్ని నీళ్ళు పోస్తుంది. ఇక వాళ్ళ కొడుకూ, కోడలూ వూరినుండి రాగానే నన్ను రూం ఖాళీ చేయించి బాల్కనీలోకి మారుస్తారు. భోజనం కూడా అన్నీ హోటల్స్‌లో లాగా ప్లేట్లలో, గిన్నెల్లో పెడుతుంది మళ్ళీ అడిగే పనిలేకుండా. నా సంగీతాన్ని, పాటలను ‘గోల’ అని అంటే మానేశాను. ఎప్పుడన్నా పెళ్ళాం లేని రోజు “అమ్మా! మిరపకాయ బజ్జీలు తింటావా? ఇంకేమైనా  కావాలా అని అడిగి తెచ్చిస్తాడు. అదే ఆవిడ వుంటే మాటా పలుకూ వుండదు. పెళ్ళాం ముందు పిల్లి….” చెప్పుకుపోతోంది అక్క భారతి తమ్ముడు మూర్తికి.

“…దేనికైనా కొన్నిసార్లు ఎదుటివారితో చెప్పుకుంటే కొన్ని పరిష్కారాలు స్ఫురిస్తాయి. అర్థం చేసుకునేవారు లేక, బయటకు చెప్పుకోలేక కుమిలిపోయిన క్షణాలు ప్రతి ఒక్కరి జీవితంలో వుంటాయి. తెలియజెపితే అర్థం చేసుకునే కొందరు తారసపడతారు రాజారావుగారూ!….’ అన్నాడు మూర్తి. రాజారావు మూర్తి సబార్డినేటు.

“…..నాకు హార్టులో నాలుగు బ్లాక్స్ వున్నాయి. హార్ట్ అటాక్ వస్తే తెల్సింది. అలాగే మనస్సుకు కూడా చికిత్స అవసరం….” మూర్తి అన్నాడు రాజారావుతో.

“సార్, మా అమ్మకు పక్షవాతం, పూర్తిగా బెడ్‍లోనే. నేను ఒక్కడ్నే కొడుకును. ఆమెను చూసుకోవడం నా భార్యకు కష్టమన్పించి ఎదురింటివాడితో లేచిపోయింది. అందరూ నన్ను చేతగాని వాడివన్నారు. నేను చలించలేదు. నాకు ఇంటిపని ఎక్కువై ఆఫీసుకు ఆలస్యంగా రావటం జరిగేది. కొంతమంది ఆఫీసర్లు ఎన్నో బాధలు పెట్టారు. పనిలో తేడా రానిచ్చేవాడ్ని కాదు. దాన్ని వారు గుర్తించలేదు. నా భార్య మళ్ళీ తిరిగొచ్చింది ఏడాది బిడ్డతో. వాడు రెండేళ్ళకే వదిలేశాడు. ‘తప్పు చేశాను క్షమించండి’ అన్న ఆవిడను నేను తరిమెయ్యలేకపోయాను. కానీ అమ్మ నా భార్యను క్షమించలేదు. దగ్గరకు చేరనీయలేదు. రోజూ వీళ్ళతో తలనొప్పి. ఉద్యోగం వదులుకోలేను…” అన్నాడు రాజారావు మూర్తితో.

“….మీ ప్రతీ సమస్యకూ మీరే సమాధానం యిచ్చుకున్నారు. మీరు చాలా గొప్పవారు. ఎప్పుడూ మన సమస్యలనే భూతద్దంలో చూడొద్దు. ఎదుటివారికి గూడా సమస్యలుంటాయి. ఎవ్వరిదీ సుఖమయ జీవితం కాదు. ఇతరుల జీవితాలకు మనం జడ్జిమెంట్ ఇవ్వలేం. ఎవరైనా లేచిపోయి తిరిగివచ్చిన భార్యకు ఆశ్రయం ఇస్తారా? మీరు ఎంతో ఎత్తులో వున్నారు….” అన్నారు మూర్తి రాజారావుతో.

“నీవు చెప్పిన విషయాలను బట్టి నీవు నీ కోణంలోనే ఆలోచిస్తున్నావు. నీ కోడలు నీచేత ఇంటిపని చేయిస్తుందా?” అడిగాడు మూర్తి అక్క భారతిని.

“లేదు… లేదు” భారతి.

“సరియైన టైంకి టిఫిన్, భోజనం పెడుతుందా?” మూర్తి.

“పెడుతుంది టైంకు కరెక్టుగా” భారతి.

“…. నీవు భగవద్గీత చదువుకో, జపమాల పెట్టుకో. సాయంత్రాలు గుడికి వెళ్ళు. ఇంట్లో పాడితే వద్దు అనడం వల్ల దేవుడు నీ పాట కోసం వేచి వుంటాడు. కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, కాలక్షేపం. ఇంతకంటే మంచి లైఫ్ ఎవరికుంటుంది? కోడలు నీతో ఎలా వుంటున్నది అని చూడవచ్చు. పెదవాళ్ళను ఆశ్రమాలలో చేర్పిస్తూన్న ఈ రోజుల్లో నిన్ను అంతమాత్రం చూసుకుంటోందని సంతోషపడాలి గానీ ఆవిడలో లోపాలు వెతకద్దు…” అన్నాడు మూర్తి అక్క భారతికి హితోపదేశం చేస్తూ.

~

మనసుకు అంటిన మైల – కూర చిదంబరం

చనిపోయిన నాయన ఆత్మశాంతికన్నా బ్రతికి ఉన్న అమ్మకు మనఃశాంతి కలిగించడం ముఖ్యం.

చిన్నపిల్లల్ని అదుపులో పెట్టడం కష్టం అవుతోంది. ఆ వంటకాలకు పెద్దవాళ్ళే ప్రలోభపడుతుంటే పిల్లల సంగతి చెప్పాలా!

తన అప్రయోజకత్వం కంటే మా నాయన చేసిన అన్యాయమే మా చిన్నాయనకు భూతద్దంలో కనబడేది.

అన్నయ్య చేతులు విడిపించుకుంటూ “ఒరేయ్, పెదకాపులు పరాయియిళ్ళలో చావుకూడు తినరు” అన్నాడు ఎటో చూస్తూ. అన్నయ్య చిన్నాయన చేతులు పట్టుకుని మళ్ళీ “చిన్నాయనా! ఇది మీరు పుట్టి పెరిగిన ఇల్లు. స్వయాన మీ అన్నయ్య దినాలు. ఇది మీకు పరాయి యిల్లు కాదు” అన్నాడు.

“కుండవేరయింది గనుక యిది మాకు పరాయి యిల్లే” అన్నాడు.

‘పారిను ముందు’ రుచి అవకాశం తప్పిపోతుందని చిన్నాయన ఇద్దరు కొడుకులు ఆయన్ను చాటుకు పిల్చి కోపంగా మందలించారు, నిలదీశారు. అనుకోని సంకటంలో ఇరుకున్నట్లుగా ఆయన ముఖం నల్లబడింది…. మా చిన్నాయన కుటుంబం ఆయనతో సహా తృప్తిగా ఆరగించింది.

~

మనసు పలికే ప్రణయగీతం – రవళి

“ఏ వయసుకావయసు కోరికలు తీరవల్సిందే, ఇప్పుడున్న ఆదర్శం అటు తర్వాత నడవదు. క్రమంగా మాసిపోతుంది” అన్నాడు తండ్రి ప్రసాదరావు కిషోర్‍తో.

“శారీరకంగా లేని ఆకర్షణ ఇతర అంశాలమీద పెంచుకుంటే అది ఎంతకాలం వుండగలదు? రేపు మా అవిటి అమ్మాయి ఏమౌతుంది?” అన్నాడు వికలాంగురాలైన శారద తండ్రి రామరాజు ప్రసాద్‍తో.

…అప్పటి ఆపరేషన్‍లో తెలియక తనవల్ల జరిగిన తప్పుకు ఫలితం శారదకు అవిటితనం. శారద తన కోడలిగా రావాలి. ఇప్పుడు ఆ తప్పును సరిచేసుకునే అవకాశం యిదే…..

~

మనం ఇద్దరం ఒకటి కాదా – పోరండ్ల సుధాకర్

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ తమకంటే పై మెట్టుపై వుండాలని ఆశించడం సహజం.

…..ఈ కథ వాస్తవం. మహర్షికి కాలు చేయి పడిపోయి మాట సరిగ్గా రాకపోవడం, భార్య శైలజ అతడ్ని కంటికి రెప్పలా చూసుకోవడం వాస్తవం. ఆ తల్లికి (శైలజకు) నా మనస్సుమాంజలి – పోరండ్ల సుధాకర్

~

మనిషే కాటేశాడు – నల్ల భూమయ్య

…అలాంటి ప్రసాద్‍కు చావు అన్నది రమ్మన్నా కూడా భయపడి పారిపోదా – పహిల్వాన్ను చూసిన పోలీసువాడిలాగా.

సంతోషం సగం బలం, డబ్బు పూర్తి బలం. అన్నీ వున్నవాడు ప్రసాద్. అకాల మరణం అన్నది ప్రసాద్ విషయంలో కల్ల. చెరువు తరంగాలపై తేలుతున్న చిన్న కర్రముక్క అక్కడే తేలియాడుతుంటుంది. తరంగాలతో పాటు ప్రయాణిస్తున్నట్లు అగుపడుతుంది. కానీ కదలదు. అలాగే ప్రసాద్ ఆయువు కాలంలో తీరం చేరదు. ఆయనకు పగవాళ్ళే లేరు. తీవ్రవాదుల నుండి కూడా అతడికి ముప్పులేదు. వాళ్ళు అడిగితే చందాలు యిస్తాడు.

ఫ్రాయిడ్ ప్రకారం ‘కల’ అంటే అది పూర్తిగా అబద్ధం కాదు, పూర్తిగా నిజం కాదు. సత్యాసత్యాల మిశ్రమం. ‘కల’ నిజం కావచ్చు, కాకపోవచ్చు. నా ‘కలలు’ ‘కల్లల్లు’ కాని ఉదాహరణలున్నాయి. నా కలల్లో ఒక సంఘటన ఎవరి పట్లనైనా జరిగితే అది నిజంలో కూడా సంభవించేది, కానీ వ్యక్తులు మారేవారు. ప్రసాద్ చనిపోయినట్లు నాకు కల వచ్చినా ఆయన స్థానంలో అంతటి కావాల్సిన వాళ్ళు ఎవరో చనిపోతారేమో అన్న దిగులు పట్టుకుంది నాకు.

చిన్నతనంలో ప్రసాద్ రాని కోపాన్ని తెచ్చుకుని తనను గేలిచేస్తున్న ఆకతాయి వాళ్ళను భయపెడ్తున్నట్లు చూసేవాడు, విషం వూరని నాగుపాములా! బుస్ బుస్ మనుడే కానీ కాటేసింది మాత్రం లేదు. ప్రసాద్‍లోని శ్రమ, పట్టుదల, పరోపకారతత్త్వం అతన్ని ఉన్నత శిఖరాలకు చేర్చింది. అతడు స్టార్ హోటల్లోనైనా, చాయ్ గుడిసెల్లోనైనా యిమిడిపోతాడు. స్థితప్రజ్ఞుడివంటివాడు ప్రసాద్. ప్రసాద్ డెవలప్‍మెంట్ ఆఫీసరుగా, అతని దగ్గర ఎంతోమంది ఏజెంట్లు వుండేవాళ్ళు. ఆ ఏజెంట్లలో ఒకడు – తర్వాత కాలంలో రాష్ట్రమంత్రి స్థాయికి ఎదిగాడు. ప్రసాద్ ఎందరో ఏజెంట్లకు ఆప్తుడు, ఎందరో పాలసీదార్లకు దైవసముడు. ప్రాణం పోయినా సరేగానీ మానం పోగూడదన్న తత్త్వం వున్నవాడు ప్రసాద్.

….అప్పట్లో నాకు వచ్చి, ఆ తర్వాత కాలంలో మరుగున పడిపోయిన కల – ఇప్పుడు స్పురణకు వచ్చింది. గ్లోబల్ మనిషి విషపు కాటుకు గురియై ప్రసాద్ అకాలంలోనే అదృశ్యమయ్యాడు.

~

మూడో కన్ను – గండ్రకోట సూర్యనారాయణశర్మ

ఆవిడ పర్సు ఎప్పుడూ రాణిగారి అంతఃపురంలా కళకళలాడుతూండేది.

మార్చూరీ అటెండర్ శంకరయ్య చేయి తడపనిదే రోగుల తాలూకు వారి రోగం కుదిరేది కాదు. అతని అదృష్టం కొద్దీ అందమూ, అణకువా రెండూ కలిగిన భార్య దొరికింది….. తన దగ్గర కావాల్సినంత డబ్బుండీ భార్యను దక్కించుకోలేకపోయినందుకు కుమిలిపోయాడు శంకరయ్య. అడవిలో తిరిగే క్రూరమైన పులిలాంటి వాడు అమాంతంగా ముసలి సర్కస్ పులిలా మారిపోయాడు.

“అమ్మ యిప్పుడిక్కడ డాక్టరు కాదు. పేషెంటు. ఐసియులో వుంది…” గులాబీరంగు దేహంతో సినిమా హీరోయిన్‍లా వుండే ఆమె యిప్పుడు ముఖమంతా పీక్కుపోయి, బెడ్‍కు అతుక్కుపోయి శవంలా ఉంది.

“గత ఆరునెలల్లో నన్ను చూడటానికి వచ్చింది నువ్వొక్కడివే” అంది అప్పటి డాక్టరు – యిప్పటి పేషంటు శంకరయ్యతో.

“మూడో కన్ను ఆ శివుడికే కాదు, ప్రతి మనిషికీ వుంటుంది. అది తెరుచుకోవడమంటే జ్ఞానోదయానికి, చైతన్యానికి సూచిక” అన్నాడు స్వామీజీ శంకరయ్య కొడుకుతో.

~

యుద్ధం – డా. ఆలూరి విజయలక్ష్మి

“కరోనాతో యింట్లోంచి కదలడం లేదు గదా టి.వి చాలా తక్కువగా చూడు. మంచి సంగీతం విను. మంచి పుస్తకాలు చదువు” అంది డాక్టరు గర్భవతియైన పేషంటుతో.

“యుద్ధ సమయంలో పారిపోయి నా ప్రాణాల్ని కాపాడుకోవాలా? ఊపిరున్నంత వరకూ పోరాడే సైనికుడి ధర్మం, నా ధర్మం ఒకటికాదా అనిపిస్తుంది” అంది డాక్టరు తన కొడుకూ, కూతురితో.

~

వందకోట్లు – పి. చంద్రశేఖర్ ఆజాద్

“అందరూ నీ గురించి మాట్లాడుకున్నారు. చదువుకోకపోయినా నువ్వు వందకోట్లు సంపాదించావని” అన్నాను రాఘవతో.

“చదువు ఎందుకురా. చదువుకున్నవాళ్ళు మన దగ్గర పనిచేస్తున్నారు” అన్నాడు గర్వంగా రాఘవ.

“నన్ను కూడా పెద్ద చదువు చదవకపోయినా పేరు తెచ్చుకున్నావు కథలు రాసి అన్నారు” అన్నాను.

“మనం హీరోలంరా” అన్నాడు రాఘవ.

…..ఆత్మలున్నాయో లేదో నాకు తెలియదు. ఉంటే మాత్రం రాఘవ ఆత్మ కరోనా చుట్టూ తిరుగుతోంది. రాఘవ సంపాదించిన వందకోట్ల రూపాయలు అతడ్ని అకాలమృత్యువు నుండి కాపాడలేకపోయాయి.

~

వాక్యం ఒక్కటే – విహారి

పడగమీద దెబ్బపడిన పామునైపోయాను…. బుస…

“మనవడి మీద ఎంత ప్రేమ కారిపోతున్నా వాడిమీద అధికారం లేదు మీకు” అంది శర్వాణి నన్ను దులిపేస్తూ…. నా మొహాన చలిపిడుగు పడినట్లయింది.

మొహాల్లో ముసురు. అయినా మళ్ళీ మాటల జల్లు మొదలైంది. చినికి చినికి వడగళ్ళు రాలాయి.

సర్కస్‍లో ప్రేక్షకుడిలా మొహంలో రంగులు మార్చుకుంటూ చూపుల్లో బెరుకుని నింపుకుని కూర్చున్నాడు చంద్రం.

~

స్వాములొచ్చారు – శ్రీనివాసమూర్తి

ఆనాడు తనున్న జీవిత వాస్తవాన్ని కాదని ఏ రచయితా రచన చేయలేడు కదా.

పాతకాలపు అరవ జడ్జీ లాగ నెత్తిగోక్కుంటూ విసుక్కున్నాడు.

“అడివన్నాక ఏనుగులు రాక ఎలుకలొస్తాయా?”

“ఒకే ప్రభుత్వంలో వున్న యిద్దరు అధికారులు ఒకరు అడివే లేదంటే మరొకరు ఏనుగుల రాక సహజం అంటారు” జడ్జీ.

గాలికి వెన్నులూపుతున్న పంట.

“ఏనుగు తన పిల్లను ఇరవై రెండు నెలలు కడుపులో మోస్తుంది. తొమ్మిదినెల్లు మోసే మనకే యింత మమకారముంటే దానికెంత నెనెరుండాలి?”

“నలభైమంది మనుషులు చనిపోతే పట్టించుకోలేదుగానీ ఒక్క ఏనుగు చచ్చిందని నా కొడుకును జైల్లో వేశారు.”

“….ఒక్కో ఏనుగుకు రోజుకు 300 కిలోల మేత కావాలి. ఒక్క ఏడాదికి ఒక్క ఏనుగుకే 25 ఎకరాల చిక్కని అడవి కావాలి. ఏనుగులు రోజూ 50, 60 చ.కిమీ.లో విహరిస్తాయి. అంతటి అడవి అవసరం…. కలప కోసం అడవి, బాక్సైటు, యురేనియం, ఇనుప ఖనిజాల కోసం అడవి, ప్రాజెక్టుల కోసం అడవి… రోడ్లు వేసి అడవిని విఛ్ఛిన్నం చేశారు. ఏనుగులకు తగినంత తిండి, స్థలమూ లేకుండా చేశారు. వాటి ‘నివాసం’లోకి మనం చొరబడినప్పుడు మన ఆవాసాల్లోకి వాటిని రాకుండా ఆపతరమా? మొన్నటికి మొన్న హరిబాబునాయుడికి బాబు ప్రభుత్వం వెంకటగిరికోట అడవుల్లో ఏటా లక్షా యాభైవేలు గ్రానైట్ రాయి తవ్వకానికి అనుమతినిచ్చింది. ప్రభుత్వాలు ఇంతటి విధ్వంసాలకు దారులు తెరిచి బాధ్యతల నుండి తప్పుకోవాలా….”

భూ నభోంతరాలలో పిపీలకా మాత్రమైన అత్యల్పప్రాణి మానవుడు. పరమపిరికి – అత్యంతసాహసి, మహాలోభి – భూరిదాత, జ్ఞాని – మూర్ఖుడు, క్రూరుడు – కరుణామయుడు, ఒక నాణెం – రెండు ముఖాలు.

కోల్పోయినదేదో దొరికినంత సంబరం కన్పించింది ఆయన ముఖంలో.

పంటలో పవళించు పచ్చపరుపు, మేఘాలు చిలికేటి చెరుకు తీపి, బరువయ్యి మట్టిని ముద్దాడు కంకులు….

***

రచయితల సంక్షిప్త సాహితీపరిచయాలు

  1. కూతురు రాంరెడ్డి : రచనా వ్యాసంగం 1917 నుండి (100) కు పైగా కథలు అన్ని పత్రికల్లో ప్రచురితం.
  2. అభిమన్యు : (85) కథలు ప్రచురితం.
  3. సింహప్రసాద్ : నాలుగువందల కథల్లో 100 కథలకు బహుమతులు. 66 నవలల్లో (18) నవలలకు బహుమతులు. కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి కథలు కొన్ని అనువదింపబడ్డాయి. ఆయన రచనల మీద విద్యార్థులు Phd పొందారు.
  4. డా. తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం : 1963 నుండి రచనా వ్యాసంగం. రెండువందల కథలు ప్రచురితం. 4 నవలలు వచ్చాయి.
  5. వాణిశ్రీ ( శివరామప్రసాద్) : 1956 నుండి రచనా వ్యాసంగం. (1000) కథలు రాసి ‘సహస్రకథానిధి’ బిరుదాంకితులు. (20) నవలలు పత్రికల్లో వచ్చాయి. కథావార్షికల్ని ‘మా కథలు – 2012’ ఆదిగా అవిచ్ఛిన్నంగా సంకలనాల్ని వెలువరిస్తున్నారు. ‘మా సీనియర్ సిటిజన్స్ కథలు’ సంకలనాల్ని వెలువరించారు. అనేక కథలకు బహుమతులు పొందారు. కొన్ని కథలు కన్నడ, తమిళ, హిందీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదింపబడ్డాయి.
  6. రామా చంద్రమౌళి : సాహిత్యంలో అంతర్జాతీయంగా కూడా పురస్కారాలు, ప్రఖ్యాతిని పొందారు. 350 కథలు, ముప్పదికిపైగా నవలలు, పదికి పైగా కవిత్వసంపుటాలు, కొన్ని నాటకాలు, విమర్శాగ్రంథాలను వెలువరించారు. ఇతని రచనలు అనేకం పంజాబి, తమిళ, కన్నడ, బెంగాళీ, హిందీ భాషల్లోకి అనువదింపబడ్డాయి ఎన్నో పురస్కారాలు పొందారు.
  7. పి.వి శివకుమార్ : 55 ఏండ్ల సాహితీ ప్రస్థానం. 250 కథలు. సుమారు (10) నవలలు ప్రచురితం. కొన్ని రచనలకు బహుమతులు వచ్చాయి. కొన్ని రచనలు యితర భాషల్లోకి అనువదింపబడ్డాయి.
  8. వియోగి : 300 కథలు, 75 నాటికలు. సుమారుగా 10 నవలలు రాశారు. ఎన్నో అవార్డులను పొందారు.
  9. జి. మేరీ కృపాబాయి : (400) కథలు ప్రచురితం.
  10. బి.యస్. రాములు : 1964 నుండి రచనా వ్యాసంగం. (175) కథలు, (13) నవలలు రాశారు. మొత్తం 97 పుస్తకాలు ప్రచురించారు. కథా చక్రవర్తి, కథ దీపదారి బిరుదాంకితులు.
  11. ఆర్ సి కృష్ణస్వామిరాజు : (300) కథలు ప్రచురితం. కొన్ని అవార్డులు పొందారు.
  12. గన్నవరపు నరసింహమూర్తి : 230 కథలు, (4) నవలలు రాశారు.
  13. వడలి రాధాకృష్ణ : కొన్ని వందల కథలు అన్ని పత్రికల్లో ప్రచురితం. ఆయన రచనలపై కొందరు విద్యార్థులు phil, phd పొందారు. వీరి అనేక కథలకు బహుమతులు వచ్చాయి.
  14. సలీం : 170 కథలు రాశారు. అనేక కథలు కన్నడం, హిందీ, మరాఠీ, ఇంగ్లీషులోకి అనువదింపబడ్డాయి. ‘కాలుతున్న పూలతోట’ నవలకు (2010) కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ నవల హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లోకి అనువదింపబడ్డది. వీరు (18) నవలలు రాశారు. ఎన్నో బహుమతులు అందుకున్నారు. వీరి రచనలపై (7)గురు విద్యార్థులు Phil, Phd చేశారు.
  15. అంబల్ల జనార్దన్ : వీరి కొన్నికథలు మహారాష్ట్ర ప్రభుత్వంచే తెలుగు మరియు మరాఠీ స్కూలు పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశాలుగా చేర్చబడ్డాయి. ఒక విద్యార్థి ఇతని రచనలపై Phil పొందారు. వీరు ఎన్నో పురస్కారాలు పొందారు. కథా సంపుటాలు వెలువరించారు.
  16. చంద్రప్రతాప్ : పాత్రికేయులు, విపుల, చతుర పత్రికలకు సంపాదకులుగా చేశారు. కథలు, కవితలు, శతకాలు వెలువరించారు.
  17. కల్లూరి రాఘవేంద్రరావు : కన్నడ నుండి పెక్కు కథలను తెలుగులోనికి అనువదించారు. ఇతని కథలు కొన్ని కన్నడ, ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువాదితం. కొన్ని పురష్కారాలు పొందారు.
  18. డా. ప్రభాకర్ జైనీ : అనేక నవలలు పత్రికల్లో సీరియల్స్‌గా వచ్చాయి. రచనలు తమిళం, కన్నడం, ఇంగ్లీషు భాషల్లోకి అనువాదం పొందాయి.
  19. ఉండవల్లి. యమ్ : (100) కు పైగా కథలు, మూడు సీరియల్స్. (300) పైగా కవితలు ప్రచురింపబడ్డాయి.
  20. బత్తుల వెంకట రమణమూర్తి : ఇప్పటివరకు (20) కథలు వివిధ పోటీలకు, ప్రచురణకు ఎంపికయ్యాయి.
  21. ఎం.ఆర్. వి. సత్యనారాయణ మూర్తి : వీరి కవితలు ఆంగ్లం, ఉర్దూ, కన్నడంలోకి, కథలు కన్నడంలోకి అనువాదమయ్యాయి. తెలుగు కథానిక – 2014, 15, 16, 17, 18లకు ఈయన సంపాదకత్వం వహించారు.
  22. కె.వి లక్ష్మణరావు : 100 బాలల కథలు రాశారు. అనేక బాలల కథలకు బహుమతులు లభించాయి.
  23. పాణ్యం దత్తశర్మ : కొన్ని కథలు, కవితలు పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. కొన్ని పోటీల్లో బహుమతులు పొందాయి.
  24. మేడా మస్తాన్ రెడ్డి : (50) కథలు రాశారు. (6) పుస్తకాలు వెలువరించారు.
  25. డా. లక్ష్మీరాఘవ : (150) కి పైగా కథలు రాశారు. (6) కథా సంపుటాలు వెలువరించారు. అవార్డులు వచ్చాయి. కొన్ని రచనలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి.
  26. కూర చిదంబరం : (300) లకు పైగా సమీక్షలు రాశారు. (100)కు పైగా కథలు, (500) వ్యాసాలు అన్ని పత్రికల్లో ప్రచురితం. కథా సంపుటాలు వెలువరించారు. పత్రికా సంపాదకత్వం వహించారు.
  27. రవళి : 55 కథలు, వేలల్లో కవితలు రాశారు. కొన్ని బహుమతులు పొందారు.
  28. పోరండ్ల సుధాకర్ : (50) కథలు ప్రచురితం.
  29. నల్ల భూమయ్య : వందకు పైగా కథలు, రెండు నవలలు రాశారు. రెండు కథా సంపుటాలు వెలువరించారు. కొన్ని కథలకు, వచన కవితలకు పురస్కారాలు లభించాయి. ‘మా కథలు – 2013’ ఆదిగా అన్ని ‘మా కథా’ సంకలనాల్లో’, ‘మా సీనియర్ సిటిజన్స్ కథా’ సంకలనాల్లో కథలు ప్రచురితం. OU, KU విద్యార్థులు తమ పరిశోధనాంశాల్లో కథలను స్వీకరించారు.
  30. గండ్రకోట సూర్యనారాయణ శర్మ : మొదటి కథ 1979లో ప్రచురితం. వివిధ పత్రికల్లో పాతిక కథలు ప్రచురితం. కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి. ఒక నవల అనుబంధంగా ప్రచురితం.
  31. డా. ఆలూరి విజయలక్ష్మి : (150) కథలు ప్రచురితం. అనేక సాహిత్య పురస్కారాలు పొందారు. వైద్యవిజ్ఞాన గ్రంథాలు, వ్యాసాలు విశ్వవిద్యాలయ విద్యార్థులకు పాఠ్యాంశంగా నియమితం. (4) నవలలు, కొన్ని కవితలు ప్రచురితం. కథా సంపుటాలు వెలువరించారు.
  32. పి. చంద్రశేఖర్ ఆజాద్ : కథ, నవల, కవిత్వం, కాలమ్, వ్యాసాలు, నాటికలు ఇలా అనేకానేక ప్రక్రియల్లో రచనలు. రేడియో, టి.వి, సినిమాలకు రచించారు.
  33. విహారి : తెలుగులోని అన్నిపత్రికల్లో (400) కథలు, కవితలు, నాటికలు, వ్యాసాలు, సమీక్షలు వెలువరించారు. అనేక పత్రికల్లో బహుమతులు పొందారు. ఒక కథాసంపుటికి రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య అకాడమీ అవార్డు 1977లో పొందారు. వీరి రచనలపై phil, Ph.dకి పరిశోధనలు జరిగాయి. (12) కథా సంపుటాలు, (2) పద్యకావ్యాలు వెలువరించారు.
  34. డా.వి. నాగరాజ్యలక్ష్మి : తెలుగు Ph.d, Ph.d పర్యవేక్షకురాలిగా సేవలందించారు. సాహిత్య పురస్కారాలు పొందారు.
  35. బండికల్లు జమదగ్ని : ఇతని కార్టూన్లు, కవితలు వివిధ పత్రికల్లో వెలువడ్డాయి. (10) కథలు వివిధ ప్రతికల్లో ప్రచురితం. కవితా సంకలనాలు, సంపుటాలు వెలువరించారు. సాహిత్య సేవ కొనసాగిస్తున్నారు.
  36. ఎలక్ట్రాన్ : రచనా వ్యాసంగం 1953, కాలేజీ రోజులనుండి, కథలు వివిధ పత్రికల్లో ప్రచురితం. 1977లో మొట్టమొదటి ‘యువ’ చక్రపాణి అవార్డు గ్రహీతలు. ఎన్నో బహుమతులు పొందారు. కథా సంపుటాలు వెలువరించారు. అసలు పేరు V Ramana Rao. ‘ఎలక్ట్రాన్’ కలం పేరు.
  37. శ్రీనివాసమూర్తి : కొన్ని పదుల కథలు రాశారు.
  38. ఆలూరి పార్థసారథి : వివిధ పత్రికల్లో (25) కథలు, ఒక నవల ప్రచురితం. కొన్ని కథలకు బహుమతులు వచ్చాయి. ఒక సీరియల్ ప్రచురితం.
  39. అంగర వెంకట శివప్రసాదరావు : మొదటి కథ 1969లో జ్యోతి (మా) లో ప్రచురితం. (70) కథలు వివిధ పత్రికల్లో ప్రచురితం. ఒక నవల, ఒక సీరియల్ ప్రచురితం.
  40. లలితా వర్మ : ఒక నవల, (30) కథలు, (20) కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితం.
  41. పి.ఎస్. ఎన్ మూర్తి, పన్నాల సాయిశ్రీ, పద్మశ్రీ : ‘అద్దం’ కథ చైతన్య మానవి, 2020లో ప్రచురితం.
  42. డా. కె. జె. రావు : అరుదుగా రాస్తున్నారు. ఈ కథ ‘జాగృతి’లో ప్రచురితం (14‌-12- 2020)
  43. పేరూరు బాలసుబ్రహ్మణ్యం : (50) కథలు రాశారు. కథా సంపుటాల్ని వెలువరించారు. కొన్ని పురస్కారాలు పొందారు.
  44. చలసాని వసుమతి (7) కథా సంపుటాల్ని వెలువరించారు. కొన్ని పురస్కారాలు పొందారు.
  45. ఐ.ఎస్.టి. శాయి : వివిధ పత్రికల్లో (10) కథలు ప్రచురితం. ఇప్పుడే రచనలు ప్రారంభించారు.
  46. మువ్వల జ్యోతి : (6) కథలు (30) చిన్నకథలు, (300) కవితలు రాశారు. వివిధ పత్రికల్లో ప్రచురితం.
  47. కొత్తపల్లి ఉదయబాబు : ‘తీసివేత’ కథ ‘జాగృతి’ వారపత్రిక 31‌-8-2020లో ప్రచురితం.
  48. గొర్రెపాటి శ్రీను : ఇప్పుడిప్పుడే కథా రచన చేస్తున్నారు. ఒక కథా సంపుటి, ఒక కవితా సంపుటి వెలువరించారు.
  49. మొగిలి అనిల్ కుమార్ రెడ్డి : ఇప్పుడిప్పుడే రచనలు ఆరంభించారు. కొన్ని కథలు పత్రికల్లో ప్రచురితం.

***

మా కథలు -2020 (కథా సంకలనం)
సంపాదకులు: వాణిశ్రీ (సిహెచ్. శివరామ ప్రసాద్)
ప్రచురణ: తెలుగు కథ రచయితల వేదిక, హైదరాబాద్
పేజీలు: 392
వెల: ₹ 99/-
లభ్యత:
హైదరాబాదులో:
నవోదయ బుక్ హౌజ్
నవచేతన బుక్ హౌజ్
నవ తెలంగాణా బుక్ హౌజ్
విజయవాడలో:
విశాలాంధ్ర బుక్ హౌజ్, ప్రజాశక్తి బుక్ హౌజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here