‘మా మంచి మాస్టారు’ – వ్యాస రచన పోటీ- ప్రకటన

0
13

👍 రాయల్ సాఫ్ట్ స్కిల్స్ – సంచిక వెబ్ మాగజైన్ నిర్వహిస్తున్న ‘మా మంచి మాస్టారు’ వ్యాసరచన పోటీలలో పాల్గొనండి. 5000 రూపాయల బహుమతులు!

ఈ పోటీలో పాల్గొనడానికి వయోపరిమితి లేదు. ఎవరైనా పాల్గొనవచ్చు.

~

👍 చిన్నప్పుడు స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు మీకు పాఠాలు చెప్పిన ఒక టీచర్, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ మీపై గొప్ప ప్రభావం చూపి ఉండవచ్చు. అలా మీరు ఎంతో అభిమానించిన టీచర్, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ ఎవరైనా ఉన్నారా? ఆ గురువుగారి ద్వారా మీరు చక్కటి ప్రేరణ పొందారా?

మీ జీవితంపై గాఢమైన ప్రభావం చూపిన ఆ గురువుగారి గూర్చి మీరు ఒక చక్కటి వ్యాసం వ్రాసి సంచిక వెబ్ మాగజైన్‌కి పంపండి.

మీరు పంపే ప్రతీ వ్యాసం సంచిక వెబ్ మాగజైన్‌లో ప్రచురింపబడుతుంది.

👍 మా న్యాయ నిర్ణేతల బృందం మీ వ్యాసాన్ని పరిశీలిస్తుంది. మీ వ్యాసం బహుమతి కూడా పొందవచ్చు.

👍 35 మందికి బహుమతులు అందుకునే అవకాశం ఉంది.

ఇంకెందుకు ఆలశ్యం, మీ కీప్యాడ్ అందుకోండి ఇప్పుడే, ఆలసించిన ఆశాభంగం.

కొత్తగా రాస్తున్నవారిలో చక్కని రచయిత దాగున్నాడని సంచిక సంపాదక వర్గానికి అనిపిస్తే మీకు రచయితగా శిక్షణ తరగతులు కూడా ఉంటాయి.

~

మీ ప్రతి వ్యాసం మొదట్లో ఈ క్రింది వాక్యాలు ఖచ్చితంగా జత చేయాలి.

———-

“సంచిక వెబ్ మాగజైన్‌లో ప్రచురితం అయిన డా రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన ‘స్వాతి చినుకు’ కథ చదివి ప్రేరణ పొంది ఈ వ్యాసం వ్రాస్తున్నాను. మీరు కూడా ఆ కథ తప్పక చదవండి.

https://sanchika.com/swathi-chinuku-dr-vrp-story/ .”

——–

👍 పై వాక్యాలు వ్రాసిన తర్వాత మీ వ్యాసం మొదలుపెట్టాలి. ఇలా వ్రాయబడ్డ వ్యాసాన్ని మాత్రమే ప్రచురణకి, పోటీకి స్వీకరిస్తాము.

~

బహుమతులు:

  • 🏆 మొదటి బహుమతి: ₹ 1000/-
  • 👉 రెండవ బహుమతి: ₹500/-
  • 👉 మూడవ బహుమతి: ₹300/-
  • 🌹ఒక్కొక్కరికి వంద చొప్పున 32 ప్రోత్సాహక బహుమతులు: ₹ 3200/-

~

నియమ నిబంధనలు:

ఈ క్రింది నియమ నిబంధనలు తప్పని సరిగా పాటించాలి.

1.ఒక మంచి కథకి విస్తృతంగా ప్రచారం కల్పించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేయబడ్డ పోటీ ఇది.

2.మీ వ్యాసాన్ని యూనికోడ్ ఫాంట్లో వర్డ్ ఫైల్ లో టైప్ చేసి kmkp2025@gmail.com అనే ఈమెయిల్‍కి అటాచ్మెంట్‍గా పంపాలి. మీ స్కూలు/కాలేజీ ఫొటోలు, మీ టీచర్, లెక్చరర్ లేదా ప్రొఫెసర్ గారి ఫొటోలు కూడా పంపవచ్చు.

3.మీ వ్యాసం 500 పదాల లోపలే ఉండాలి. ఒకరు ఎన్ని వ్యాసాలైనా రాయవచ్చు.

4.అభూత కల్పనలు వ్రాయరాదు. మీ జీవితానుభవం నుంచి తీసుకుని వ్రాయాలి.

5.సంచిక మాగజైన్‌కి మీ వ్యాసం పంపిన తరువాత మీరు విధిగా ఈ కింది వాక్యాలని (ఈ వాక్యాలను మాత్రమే, మొత్తం వ్యాసం కాదు) మీ ఫేస్‌బుక్‍లో పోస్టు చేస్తూ కనీసం పది మంది మిత్రులని టాగ్ చేయాలి.

“నేను ‘మా మంచి మాష్టారు’ అన్న వ్యాస రచన పోటీలో పాల్గొన్నాను. సంచిక వెబ్ మాగజైన్‌లో ప్రచురితం అయిన డా. రాయపెద్ది వివేకానంద్ వ్రాసిన ‘స్వాతి చినుకు’ కథ చదివి ప్రేరణ పొంది ఈ వ్యాసం వ్రాశాను. మీరు కూడా ఆ కథ తప్పక చదవండి. ఆ కథ లింక్‌ని ఇక్కడ ఇస్తున్నాను.  https://sanchika.com/swathi-chinuku-dr-vrp-story/ ”.

6.మీరు కనీసం పది మంది మిత్రులని ఫేస్‌బుక్‌లో ట్యాగ్ చేయాలి. ఒక మంచి కథ, ఒక మంచి వ్యాసం పది మందికి చేర్చే ఒక ప్రయత్నం ఇది.

7.మీ మిత్రులు పది మందితో పాటు సంచిక సంపాదక వర్గానికి చెందిన శ్రీ కస్తూరి మురళీకృష్ణ, కొల్లూరి సోమ శంకర్ మరియు రాయల్ సాఫ్ట్ క్యాంపస్ లని కూడా ట్యాగ్ చేయాలి.

Kasturi Murali Krihsna Garu:

https://www.facebook.com/muralikrishna.kasturi?mibextid=ZbWKwL

Kolluri Soma Sankar Garu:

https://www.facebook.com/SSKolluri?mibextid=ZbWKwL

Royal Soft Skills Campus:

https://www.facebook.com/royalsoftskills?mibextid=ZbWKwL

8.పై నియమ నిబంధనలని పాటిస్తూ పంపబడ్డ వ్యాసాలు మాత్రమే పోటీకి అర్హము. మీ వివరాలతో పాటుగా Gpay/PhonePe వంటి ఆన్‍లైన్ చెల్లింపుల సౌకర్యం ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి.

9.ఈ పోటీకి వ్యాసాలు పంపేందుకు చివరి తేదీ 28 జనవరి 2024, సాయంత్రం 5.00 గంటలు (IST).

10బహుమతి విషయంలో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

ఈ పోటీ ఫలితాలు 04 ఫిబ్రవరి 2024 న వెలువడే సంచిక వెబ్ పత్రికలో ప్రచురితమవుతాయి. విజేతలకు బహుమతి మొత్తాన్ని రాయల్ సాఫ్ట్ స్కిల్స్ వారు పంపుతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here