మా ఊరు

0
7

[box type=’note’ fontsize=’16’] తమ ఊరైన శ్రీకాకుళం జిల్లా మందస గురించి, ఆ ఊర్లోని వాసుదేవ పెరుమాళ్ళ ఆలయం గురించి పద్యరూపంలో వివరిస్తున్నారు మట్ట వాసుదేవమ్. [/box]

[dropcap]మం[/dropcap]దస మంజూషయన !
సంస్థానమొక్కటి వెలసెనిచ్చట!!
పంచనగమధ్యమ్మునుండిన
సింగులిచ్చట రాజులైరట!!

చుట్టు కొండల నట్టనడుమన!
కోటయొక్కటి కట్టిరిచ్చట!!
ప్రజల బిడ్డల ఓలే వారు!
రాజ్యమును పాలించిరిచ్చట!!

రాజులందున శ్రీనివాసుడు!
రత్నమై జ్వలియించెనిచ్చట!!
నూరు పులులకు నొకటి తక్కువ!
వేట చేసి మేటి యైనట!!

మందసకు వాయువ్య దిశలో
కంచమాయి కొండదిగువను
జలాశయమ్మది వెలసెనచ్చట!
గోపాల సాగరమనెడి పేరున!!

సాగునీటికి త్రాగునీటికి!
సాగరమే శరణమాయెను!!
సాగరపు దరియందు సొగసౌ!
కోటయొక్కటి కట్టబడినది!!

కోట దక్షిణ దిక్కునందున
మేటి దేవాలయము కట్టగా
మనసునందున నూహచేసి!
మంచి దేవాలయము కట్టెను!!

రాజుకట్టిన దేవలమ్మున
రాజగోపాలుండు ఇలలో
వాసుదేవుని పేర వెలసెను
వరదుడై కాపాడే ప్రజలను!!

వాసుదేవుని పదరజమ్ముల!
వాసనలు వెదజల్లెనిచ్చట!!
భక్తితో ప్రజలంత వచ్చి!
నిత్యపూజలు జరిపిరిచ్చట!!

ఇంతకింతకు ఉత్సహమ్మున!
బ్రహ్మోత్సవము జరిపించే రాజు!!
ప్రభువులంతా కలసివచ్చిరి!
వాసుదేపుని కొలుపనప్పుడు!!

రాజ్యమ్ములు అంతరించే!
రాజులే మరుగైరదిప్పుడు!!
ధూప దీపపు సేవలేక!
దుమ్ము కొట్టెను దేవళమ్ములు!!

ఏ తల్లి నోముఫలమెచట జన్మించెన్నో
మందసకు విచ్చేసే మహితాత్ముడొక్కండు!!
గురువు యానతి మీర! గురుతుగా విచ్చేసే!
జీర్ణదేవాలయము పూర్ణముగా పరికించి!!

మందస పెద్దలను తొందరగ పిలిపించి!
మంచిమాటలు చెప్పె నెంచికోవెల కట్ట!!
ప్రజలంత సంతోషమున నోలలాడంగ!
శిల్పులను రావించే నోడ్రదేశమునుండి!!

మునుపటి శైలిలో ముచ్చటగ చెక్కి యా
క్రొత్తదేవాలయము మొత్తముగ కట్టిరి!!
ధూప దీపమ్ములకు లోపమ్ము లేకుండ!
బ్రహ్మోత్సవమ్మును ఘనముగా జరిపిరి!!

జన జీవన రధసారథి!
నిరుపమ కరుణా నీరధి
అతులిత మహిమా యుతుడగు
వాసుదేవ పెరుమాళ్లను
తనివి తీర కొలువ రండు!!
సుజను లారా! భక్తులారా!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here