మార్గ కిరణం.. అబ్దుల్ కలామ్

0
8

‌[box type=’note’ fontsize=’16’] అక్టోబర్ 15, 2020 న మాజీ రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా ఈ కవిత అందిస్తున్నారు లిఖిత్ కుమార్ గోదా. [/box]

[dropcap]ఆ[/dropcap]యనో గొప్ప “జ్ఞాన కిరణం”,
ఆయనే భారతదేశపు “మార్గ కిరణం”,
ఆయని మాటే వినసొంపు “చరణం”,
కష్టపడటమే ఆయన నోట “స్మరణం”,
ఆయన విజయకాంక్షకు పునాదులు వేసినవి
కోరిక,నమ్మకం,ఆశ పెట్టుకోవడమే కా”రణం”,
ఆయన శరీరమంతా
విద్య, క్రమశిక్షణ తో నిండిన “కణం”;
శాంతిని ఆచరించడం, మంచిని గౌరవించడం
ఎల్లప్పుడూ కృషి చేయడం,
క్రమశిక్షణ అలవడి మెలగడం,
గొప్ప రచనలు చేయడం,
ఇవే ఆయన గడిపిన “తరుణం”,
ఆయన ముఖానిది,
భ్రాంతి లేని క్రాంతి “గుణం”,
రాష్ట్రపతిగా జనాన్ని ,యువతను
ఉత్తేజ పరిచింది ఆయన “ఆచరణం”,
ప్రజలపై ఆయన చూపినది “ప్రజోపకారణం”,
రాష్ట్రపతి పదవిని విడిచాక
ఆయన విద్యార్థులకు చూపింది “గురు చరణం”,
క్రమశిక్షణే ఆయన నుండి
భారతీయులు నేర్చిన “ఉదాహరణం”,
దేశ భవితకై, పురోగతికై
ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే
బాధ్యతలు తను చేపట్టి
అపజయం తనను తొలిసారి పలకరించినా,
ఆనందం శాంతత్వం ఆయన ధరించిన “ధారణం”,
ఆయన రచనలవన్నీ,
యువతకు సందేశానిచ్చే “గుణం”,
అసలు విజయం ఆయన ఇంటి “తోరణం”,
ఆయన దేశ అభివృద్ధికై,
ప్రజలని మేల్కొల్పడానికి,
రామేశ్వరంలో జన్మించిన ఓ “సూర్యకిరణం”,
ఆ భారతరత్న పుట్టి
తెచ్చాడు భారత దేశానికి “గర్వకారణం”,
ఆయన పుట్టిన సస్యశ్యామల దేశంలో
నేను పుట్టినందుకు నాకెంతో “గర్వకారణం”,
ఆయన ఓ “అమర కిరణం”,
ఆయన సేవని నిత్యం
మనందరం చేద్దాం “స్మరణం”.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here