మాటరాని మౌనమిది

0
6

[dropcap]ని[/dropcap]న్నటి సాయంత్ర మేదో
పూనకమొచ్చినట్లు
ఆకసమొక సంద్రమై
ఏడ్చేసిందిందుకేనా

కిలకిలారావాలాపి
పక్షులన్నీ ఓ చెట్టుమీదకు చేరి
మ్రాన్పడి పోయాయిందుకేనా
శ్వాసను ధ్యాసను
పాటలను చేసి
ఓలలాడించిన తమ చెలికాని
అకాల పయనానికి
వీడ్కోలు చెప్పలేని
నిస్సహాయత కేనా

పల్లవించే పాటగా నీవెపుడూ ఓ అద్భుతం
నిత్య సంగీత చరణానివైన నీ గమనం ఓ ఆపాత మధురం
భావబంధుర గీతమై
దివ్యలోకాల తిరుగాడుతూ
మా మధ్య జాలువారిన గానామృత సింధువా
మోహన రాగాల నవ్వుల బంధువా
నిరంతర గాన లోక విహారీ
వయసెరుగని బాలుడా
నీకిది మా మౌనవీణ గానం!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here