మధురిమ

1
10

[dropcap]బం[/dropcap]గారిలా ఒక బంధమై
బహుమతిలా ఒక భాగ్యానివే.

గంగలా ఓ జీవనదివే
శశిలా ఓ ధవళకాంతివే.

చెట్టులా ఓ చల్లని నీడవు.
ఊహలా ఓ కమ్మని కవితవు.

ఊర్వశిలా ఓ ఊరించే ఊహవే.
ప్రేమలా ఓ మధురిమవే.

మనసు ఆకలి తేర్చే రహస్యరుచివి.
ఏ లోకంతో పనిలేని అంతరంగానివి.

గుండెలో ఆరాధించే ప్రేమదేవతవు.
మౌనంగా మాట్లాడే మహిమోన్నతావు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here