మహా భారతములో భీముడు

2
11

[box type=’note’ fontsize=’16’] ‘మహా భారతములో భీముడు’ అనే ఈ వ్యాసంలో భీముడి త్యాగ గుణం, వీరత్వం, అభిమానధనం గురించిన అందిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు. [/box]

[dropcap]పాం[/dropcap]డవులలో ధర్మరాజు తరువాతి వాడు భీముడు. భీముడు అత్యంత బలశాలిగా పేరుపొందాడు. భీముడు వాయుదేవుని వరము వల్ల కుంతీకి జన్మించాడు.

చిన్నప్పటినుండి కౌరవులు కుట్రలతో భీముని చంపాలని చూసినా అవి ఏవీ పనిచేయవు. భీముని చేత సర్పరాజైన వాసుకి విషము త్రాగనిచ్చి సముద్రములో పడవేసినా పాతాళ లోకము చేరి వరాలతో తిరిగివస్తాడు. భీమునికి 10,000 ఏనుగుల బలము ఉన్నట్లుగా భారతములో వర్ణిస్తారు. చిన్నపటినుండి కౌరవులకు భీమునికి వైరము కొనసాగుతుంది. ముఖ్యముగా భీమునికి దుర్యోధనునికి ఒక్క క్షణము కూడా పడేది కాదు. గురువు ద్రోణుడి దగ్గర విద్య నభ్యసించేటప్పటి నుండి దుర్యోధనుడు భీమునిపై ఈర్ష్య పెంచుకున్నాడు. ఇద్దరు గదా యుద్ధములో ప్రావీణ్యులే.

భీముని వృకోదరుడు అని పిలుస్తారు. భీముని పొట్ట తోడేలు పొట్టలాగా ఎంత తిన్న పైకి లేవదు. అరణ్యవాసములో ఉన్నప్పుడు బకాసురుని చంపటానికి వెళ్ళేటప్పుడు అతనికి పంపిన ఆహారాన్ని మొత్తము సుష్ఠుగా తింటాడు.

మహాభారతములో భీముడు బకాసురుడనే కాకుండా అజ్ఞాతవాసములో జీమూత వాహనుడిని, కీచకుని; అరణ్యవాసములో హిదంబాసురుడిని, జరాసంధుడిని ఏ ఆయుధములు లేకుండా ఒట్టి చేతులతోనే చంపిన బలశాలి భీముడు. కృష్ణుడు, అర్జునుడితో పాటు గాండీవాన్ని ఎత్తగలిగిన బలశాలి భీముడే. కానీ ఇంత బలవంతుడికి హనుమంతుని చేతిలో గర్వభంగము అవుతుంది. ద్రౌపది కోరికపై సౌగంధికా పుష్పాలను తీసుకురావటానికి వెళ్లే దారిలో హనుమంతుడు ఒక ముసలి కోతి రూపములో ఉండి దారికి అడ్డముగా తన తోకను ఉంచుతాడు. అ తోకను తొలగించుకొని వెళ్ళమని హనుమంతుడు చెపుతాడు. కానీ భీముడు ఆ తోకను ఎత్తలేకపోతాడు. అప్పుడు నిజము తెలుసుకొని హనుమంతుని ప్రార్ధించి ప్రసన్నుడిని చేసుకుంటాడు. అందుకే భీముని రథముపై గల జెండాపై హనుమంతుడు ఉంటాడు. సౌగంధిక పుష్పము తెచ్చుకొనే ప్రయత్నములో భీముడు యక్ష గంధర్వులను జయిస్తాడు. భీముడి ఆయుధము గద.

భీముడు బలశాలి మాత్రమే కాదు. అత్యంత ధైర్యసాహసాలు ఉన్నవాడు. పాండవులను సంహరించటానికి అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు భీముడు తల ఒంచటానికి నిరాకరిస్తాడు కానీ కృష్ణుని మాయ వల్ల పాండవులు అందరు ఆ నారాయణాస్త్రము నుండి రక్షింపబడతారు. బాల్యము నుండి భీముడు తన బలముతో కౌరవులను ఏడిపిస్తూ ఉండేవాడు. అందుచేతనే కౌరవులు భీమునిపై ద్వేషము పెంచుకున్నారు. కౌరవులు పాండవులను లక్క గృహములో సజీవ దహనానికి ప్రయత్నించినప్పుడు కృష్ణుని సలహాతో పాండవులను తల్లిని లక్క గృహమునుండి కాపాడుతాడు. అలాగే అడవిలో పాండవులు తల్లి నిద్రిస్తున్నప్పుడు హిడింబాసురుడు వచ్చినప్పుడు పోరాడి సంహరిస్తాడు. ఆ సందర్భములోనే తల్లి కుంతీ సలహా మేరకు హిడింబిని వివాహమాడుతాడు.

బీముడు వట్టి చేతులతో తన శత్రువులను చంపగలడని శ్రీకృష్ణుడు ఒకసారి కుంతితో అంటాడు. కురుక్షేత్ర యద్దములో భీముడు ఒక్కడే మూడు అక్షౌణిల కురవ సైనాన్ని చంపుతాడు. ఇంత బలవంతుడైన భీముడు ఒకసారి నహుషడు అనే సర్పము చేత చిక్కి విడిపించుకోలేకపోతాడు అప్పుడు ధర్మరాజు విడిపిస్తాడు. అలాగే భీముడు గజ బలగాలతో తలపడినప్పుడు భగదత్తుని సౌప్రతిక అనే ఏనుగును జయించలేక వెనుతిరుగుతాడు., ఇటువంటి చిన్న చిన్న అపజయాలు యుద్ధాలలో వీరులకు సహజము. కురుక్షేత్ర యద్దములో భీముడు కర్ణుని చంపే అవకాశము వచ్చినా; అర్జుని శపథము నెరవేరటానికి వదిలివేస్తాడు. ధర్మరాజు రాజసూయ యాగము చేస్తున్నప్పుడు అంగరాజు అయినా కర్ణుని జయిస్తాడు. అర్జునుడు కూడా భీముని గౌరవిస్తాడు. అర్జునుని మాటల్లో తనను తిట్టే అధికారము భీమునికి ఉన్నదని చెపుతాడు.

వందమంది కౌరవులను చంపిన ఘనత భీమునిదే. అందుచేతనే కురుక్షేత్ర యుద్ధము అనంతరము పాండవులు ధృతరాష్ట్రుని కలిసినప్పుడు దృతరాష్ట్రుడు భీమునిపై కపట ప్రేమ చూపించి కౌగిలిలో పిండి చేయాలని చూస్తాడు కానీ అన్ని తెలిసిన శ్రీకృష్ణ పరమాత్ముడు భీమునికి బదులుగా ఒక లోహపు విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందు పెడితే తన కౌగిలిలో పిండిచేస్తాడు అందుకే నాశనము చేసే కౌగిలిని దృతరాష్ట్ర కౌగిలి అంటారు.

భీముడు సోదర పాండవులను తల్లిని అహర్నిశలు కాపాడుతూ ఉండేవాడు. అందుచేతనే సగము ఆహారము తన వంతుగా తినేవాడు. భీముడు అశ్వత్థామతో పోరాడేటప్పుడు ఆపటానికి శ్రీ కృష్ణునికి అర్జునికి సాధ్యము కాలేదు. అటువంటి భీముని ప్రాణము కర్ణుని చేతిలో హరించబడలేదు. కారణము భీముడు యుద్దములో చెలరేగినప్పుడు దుర్యోధనుడు కర్ణుని భీముడిని చంపమని అంటాడు కానీ కర్ణుడు కుంతికి ఇచ్చిన మాట ప్రకారము భీముడిని చంపడు కర్ణుడు. భీముడిని చంపి ఉంటే భారతము కదా మరో విధముగా వుండేది. ఆ తరువాత యుద్దములో భీముడు కర్ణుడిని యుద్ధరంగమునుండి పారిపోయేటట్లు చేస్తాడు

మత్స్య యంత్రాన్ని ఛేదించి అర్జునుడు ద్రౌపది మనసు గెలుచుకుంటాడు. కానీ తల్లి ఆనతి ప్రకారము ద్రౌపది వరము ప్రభావము వల్ల ద్రౌపది పాండవులు ఐదుగురిని వివాహమాడింది కానీ మనస్సులో అర్జునుడు అంటే కొంత ప్రేమ యెక్కువ కానీ ద్రౌపదిని అధికముగా ప్రేమించి అన్ని సందర్భాలలో ద్రౌపది గౌరవాన్ని కాపాడటానికి కృషి చేసిన వాడు పోరాడినవాడు భీముడే మొదటివాడు. కౌరవ సభలో మాయ జూదములో ధర్మరాజు ద్రౌపదిని పణముగా పెట్టి ఓడిపోయినప్పుడు ఏకవస్త్ర అయినా ద్రౌపదిని దుశ్శాసనుడు సభలో ఈడ్చుకు వచ్చినప్పుడు భీముడు దుశ్శాసనుడిని చంపి ఆ రక్తముతో ద్రౌపది శిరోజాలను ముడి వేయిస్తానని నిండు సభలో ప్రతిజ్ఞ చేసి యుద్దములో నెరవేర్చుకుంటాడు. అలాగే ద్రౌపదిని తన తొడపై కూర్చోమని సభలో ఆహ్వానించిన దుర్యోధనుడి తొడలను తన గదతో పగలగొడతాడు. వందమంది కౌరవులను చంపిన ఘనత కూడా భీముడిదే. అరణ్యవాసములో ద్రౌపది నడవలేని స్థితిలో భీముడు ద్రౌపదిని ఎత్తుకొని అడవుల్లో నడుస్తాడు. అలాగే అరణ్యవాసములో ఉన్నప్పుడు ద్రౌపది సౌగంధిక పుష్పాలను అడిగినప్పుడు యక్షులు గంధర్వులతో పోరాడి కుబేరుని వనము నుండి ఆ పుష్పాలను తెచ్చి ద్రౌపదిని సంతృప్త పరుస్తాడు. అరణ్యవాసములోనే జయద్రదుడు (దుస్సల భర్త) ద్రౌపదిని మోహించి తీసుకువెళితే భీముడు వెళ్లి విడిపించి జయద్రదుడిని బంధీగా తెచ్చి చంపుతాను అంటాడు కానీ ధర్మరాజు మన ఇంటి ఆడపడుచు దుస్సల కాబట్టి దుస్సల భర్త చంపకుండా వదిలేయమంటే అప్పుడు భీముడు గుండు గీసి పంపుతాడు.

అలాగే అజ్ఞాతవాసములో ద్రౌపది విరాటుని కొలువులో రాణి సుధేష్ణ వద్ద సైరంధ్రిగా ఉండలను కోవటాన్ని తీవ్రముగా ప్రతిఘటిస్తాడు. భీముడు వలలుడు పేరుతొ వంటవాడుగా ఉన్నప్పుడు ద్రౌపదిని మోహించిన కీచకుని ధర్మరాజు వారిస్తున్నా అర్ధరాత్రి నర్తనశాలలో భీకరముగా చంపుతాడు. ఆ తరువాత ద్రౌపదిని చంపాలని చూసిన కీచకుని సోదరులను కూడా చంపుతాడు. ఈ విధముగా ద్రౌపది గౌరవానికి భంగము వాటిల్లే సందర్భాలలో ఆదుకున్న మొదటివాడు భీముడే. కానీ ద్రౌపది అధికముగా ప్రేమించే అర్జునుడు సుభద్ర, ఉలూపి,చిత్రాంగద వంటి వారిని వివాహమాడి వారితో ఆనందంగా ఉంటాడు. భీముడు అరణ్యవాసములో వివాహమాడిన రాక్షస కన్య హిడింబాను తల్లి ఆనతి మేరకు వివాహమాడినప్పటికీ అరణ్యములోని వదిలివస్తాడు. ద్రౌపది తనను ఎక్కువగా ప్రేమించే భీముడిని కొద్దిగా అలక్ష్యము చేస్తుంది. హిడింబా కుమారుడు ఘటోత్కచుడు కూడా పాండవులకు సహాయముగా కురుక్షేత్ర యుద్దములో పాల్గొని కౌరవులకు చెమటలు పట్టించి అర్జునుడిని చంపటానికి కర్ణుడు దాచిన నారాయణ అస్త్ర ప్రయోగానికి బలి అవుతాడు.

కురుక్షేత్ర యుద్ధము అనంతరము పాండవులు ద్రౌపది స్వర్గారోహణలో ఉన్నప్పుడు మొదట ద్రౌపది పడిపోతుంది. అప్పుడు భీముడు ద్రౌపదిని రక్షించలేకపోయినందుకు చాలా భాధపడుతాడు. అప్పుడు ద్రౌపది భీముని ఓదారిస్తుంది భీముని ఒడిలోనే ప్రాణాలు విడుస్తుంది. భీముడు స్వర్గారోహణలో ధర్మరాజుతో ఉండి ధర్మరాజు కన్నా ముందు నేల కొరుగుతాడు. కారణము భీమునికి తానూ అత్యంత బలవంతుడికి అన్న గర్వము ఈ విధముగా భీముని కధ ముగుస్తుంది. నాటికి నేటికీ అత్యంత బలవంతుల జాబితాలో ముందు ఉండేది భీముడే. అతని బలమే ధృతరాష్ట్రుని వంటి వారి ఈర్ష్యకు కారణము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here