మైత్రీవనం

0
10

[dropcap]ప[/dropcap]లకరింపుల పరవశాలలో
కాలం గడచిపోయి
ఎంత కాలమైనా అవనీ…

ఒడిసి పట్టుకున్న నీ స్వరం మాత్రం
నా హృదిలో ఒదిగి పోయిన నాదమవుతోంది…

గుండె గూటిలో ఆరని చెమ్మ
కంటి నుండి జారిన
చివరి బొట్టుదయి ఉంటుంది…

కనిపించని కదలికల కోసం
దేహమిపుడు దేవాలయమై పోయింది
ఆరని దీపంలా కళ్ళిపుడు
నీకోసం వెతుకుతుంటే…

కుశలమేనని కాస్తయినా చెప్పు
కనురెప్పల కౌగిళ్ళలో
కలలు విశ్రాంతి తీసుకుంటాయి…

ఆలోచనల సంద్రంలో మనసిపుడు
ఎగసిపడే అలగా మారింది….
కాస్త చల్లని తెమ్మెరవై తాకి చూడు
ఒడ్డుకు చేరిన అల
నిదురోయే పసిపాపవుతుంది…

ఎన్ని జ్ఞాపకాలిపుడు గవ్వలుగా మారాలో…
లెక్కించలేని సంఖ్యగా మిగిలి పోతూ…

దారులు వేరైనా
ఊపిరి ఒకటైన స్నేహం కదా….

నమ్మకం పునాదిపై నిర్మించుకున్న
మైత్రీవనంలా

మరో జన్మ వరకూ
బతికే ఉంటుంది…!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here