‘మలిసంజ కెంజాయ!’ – కొత్త ధారావాహిక – త్వరలో – ప్రకటన

1
11

~

అసలు కథ ఇప్పుడే మొదలు

ఆరు పదుల జీవిత సారం

అనుభవాల హరివిల్లు..

‘మలిసంజ కెంజాయ!’

నవల – సంచికలో ధారావాహికగా.. త్వరలో..

ఆహ్లాద రచయిత్రి, తనదైన శైలిలో

సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి కలం నుంచి.

***

“ఎవరైనా బయట వాళ్ళు బాధ పెడితే, వాళ్ళకీ వీళ్లకీ చెప్పుకుంటాం. సానుభూతి పొందుతాం. మన పిల్లల మీద ఎవరికైనా ఏం చెప్పుకుంటాం చెప్పు! ఆ విషయం తెలిస్తే నా కూతురికీ, అల్లుడికీ కోపం రాదా? మళ్ళీ అదో తప్పవుతుందే తల్లీ! ఈ మాటలు ఎవరితో అనకు. లేనిపోని గొడవలు. ఏమోనే! ఏం చెప్పమంటావే? కూతురు వచ్చిందన్న ఆనందమే పోయింది. ఇంకా అది పెద్దది అయ్యింది కాబట్టి అన్నీ సర్దుకుంటుంది. నాకు కూడా సాయం చేస్తుంది. ఎప్పుడైనా ఆరోగ్యం బాగా లేకపోతే దాని దగ్గరికి  వెళితే చూసుకుంటుంది. అని ఆశ పడ్డానే! రాత్రి పడుకుంటే నిద్ర పట్టట్లేదు” అందామె దుఃఖంతో గొంతు పూడుకుపోగా.

“నువ్వలా బాధపడకక్కా! అది ఇంకా చిన్న పిల్లలే! దానికి తెలియట్లేదు తను పెద్దదయిందనీ తల్లితండ్రుల్ని దయగా, ప్రేమగా చూడాలనీ. ఎక్కువ ఆలోచించకు. అది మన పిల్లే కదా నచ్చచెప్పుకుందాంలే!” ఓదార్పుగా అంది వసంత.

***

వచ్చే వారం నుంచి.. సంచికలో.. చదవండి.. చదివించండి.

‘మలిసంజ కెంజాయ!’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here