మనమెక్కడ..??

0
20

[మాయా ఏంజిలో రచించిన ‘Where we belong, A duet’ అనే కవితని అనువదించి సంచిక పాఠకులకు అందిస్తున్నారు కవయిత్రి హిమజ గారు.]

(జీవితమంతా ప్రేమని పొందడానికి తపించి, ప్రేమ సాహచర్యం లభించాక తన మనోగతాన్ని, జీవితాన్ని ఎటువంటి దాపరికం లేకుండా కవయిత్రి వెల్లడించిన తీరు మనలని అబ్బురపరుస్తుంది.)

~

[dropcap]ప్ర[/dropcap]తి పట్టణంలో, ప్రతి పల్లెలో
ప్రతి నగరపు కూడళ్ళలోను
సమూహాలుగా జనులు
సంచరించే ప్రదేశాల్లోను వెతికాను
నాకంటూ ఒక ప్రేమికుడు
నా వాడైన ఒక మనిషి
కనిపిస్తాడన్న నమ్మకంతో

సుదూరాన ఉన్న నక్షత్రాలలో
నిగూఢమైన అర్థాలేవో చదివాను
పిదప
తరగతి గదుల్లో
ఈత కొలనుల్లో
మసక వెలుగుల
కాక్ టెయిల్ బార్ లలో వెతికాను

ప్రమాదాలకు ఎదురెళ్ళాను
అపరిచితులతో కలిసి తిరిగాను
వారి పేర్లయినా సరిగా గుర్తు లేవు నాకు
గాలిలో తేలే వేగంతో నేను
శృంగారపు ఆటలాడేందుకు
ఎప్పుడూ సిద్ధంగా ముందుండేదాన్ని

ఎంతో మందితో కలిసి
పలురకాల మధువు సేవించాను
దేశవిదేశాల రుచులు చవిచూసాను
కిక్కిరిసిన నృత్యశాలల్లో
ప్రదర్శనకేంద్రాల్లో నర్తించాను
ఒంటరి హృదయవీధులలో
పదే పదే ప్రేమ కోసం పరితపించాను
ప్రతి యేడూ ఓ ఇద్దరినైనా
మనసుకు నచ్చినవారిని
మధురంగా పిలిచాను, వలచాను
పూర్తిగా, వారిదాని వలె మసులుకున్నాను
అయినా వాళ్ళెప్పుడూ
నన్ను వదిలించుకోవాలనే చూసారు
ఇంతటి భావోద్వేగమూ
ఎంతో సున్నితత్త్వమూ ఉన్న
నీ చేతుల్లో మేము ఇమిడి ఉండలేమని
వారంతా నన్ను తిరస్కరించారు
ఆకర్షణీయ అందచందాలు లేవని
మరల మరల కలిసేందుకేమీ లేదని
వారు నాకు వీడ్కోలు పలికారు

సరిగ్గా అప్పుడు
నా జీవితంలోకి వచ్చావు నువ్వు
ప్రతి పొద్దు సూర్యోదయపు హామీలా
నీ కన్నుల్లో వెలిగే కాంతులతో
నా రోజుల్ని వెలిగించావు
నిజంగా
ఇప్పుడున్నంత దృఢంగా
నేనిదివరకెప్పుడూ లేను!!

~

మూలం: మాయా ఏంజిలో

అనువాదం: హిమజ


మాయా – కాలిఫోర్నియా, కైరో, ఘనా, నార్త్ కరోలినా, న్యూయార్క్ లలో ఎక్కడ నివసించినా అవన్నీ తన విస్తరించిన కుటుంబాలే (extended family) అని చెప్పుకునేది.

Harlerm Writers Guild ప్రాచీన ఆఫ్రికన్ అమెరికన్ రచయితల సంస్థ. మొదట Harleem Club గా మొదలై వేలమంది సృజనకారులు, స్క్రిప్ట్ రైటర్స్, ఫీచర్ రైటర్స్, న్యూస్ ప్రోగ్రాంస్, కంటెంట్ రైటర్స్, కవులు, కథకులతో కూడిన లేబర్ యూనియన్ 1933లో నెలకొల్పబడింది. అక్కడ చేరిన ప్రతివారు తమలోని టాలెంట్స్‌కి పదును పెట్టుకునేవారు. స్థానికులు, బయటి నుంచి వచ్చేవారితో Harleem ప్రాంతం ఎప్పుడూ సందడిగా విభిన్నంగా ఉండేది.

డచ్, ఐరిష్ జర్మన్. ఇటాలియన్, జుయిష్ ఇలా ప్రపంచం లోని ఎన్నో జాతులకు తెగలకు Harleem ఒక మాతృభూమిగా మారిపోయింది. పౌరహక్కుల పోరాటానికి, నల్లజాతిపై వివక్షని ఎదుర్కోవడంలో ప్రధానంగా పని చేసేది. రుచికరమైన ఆహారం, వీనులవిందైన సంగీతం, heritage buildings, అక్కడి night life పర్యాటకులను విపరీతంగా అలరించేవి. Harleem కమ్యూనిటీని, సంస్కృతిని most influential neighbourhood గా వారు అభివర్ణించేవారు. అలాంటి గొప్ప చరిత్ర కలిగిన Harleem Writer’s Guild లో చేరిన మాయా భవిష్యత్తులో తానో best selling రచనలు చేస్తానని ఆ రోజుల్లో ఊహించలేదు. తాను గడిపిన వివక్షాపూరితమైన జీవితం, చిన్ననాటి చేదు అనుభవాలతో పాటు Writer’s Guild అత్యంత ప్రభావితం చేసి, మాయాలో ఉన్న రచనా నైపుణ్యాలను బయటకు తీసి తానో  గొప్ప మానవీయ కవయిత్రిగా రూపొందడానికి తోడ్పడింది.

మాయా writer’s Guild లో చేరిన రోజుల్లోనే 20వ శతాబ్దపు ప్రఖ్యాత రచయిత, నాటకకర్త అయిన James  Baldwin మరికొందరు ప్రముఖ రచయితలతో మంచి స్నేహం బలపడింది. ఆ రోజుల్లోనే civil rights leader అయిన Martin Luther King సందేశానికి ఉత్తేజితురాలైన మాయా civil rights movement లో చేరాలని బలంగా నిర్ణయించుకుంది. కింగ్‌కి అన్నిరకాలుగా సహాయపడేందుకుగాను, నిధులు సమకూర్చేందుకు  గాను for freedom to benefit అనే నినాదంతో  The Legendary అనే షోని నిర్వహించింది. Civil rights organaisation లో బాధ్యతాయుతంగా వ్యవహరించి coordinator గా ఎదిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here